మల్లాపూర్ ప్రజాసాక్షి క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రజాసాక్షి దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన తహసీల్ధార్ శ్రీనివాస్
ప్రభుత్వ వైద్యురాలు వాహిని
మల్లాపూర్ ఫిబ్రవరి 03నేటి దాత్రి

 

వార్తా పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలాగ పని చేస్తాయని మండల తహసీల్ధార్ శ్రీనివాస్ అన్నారు. ఆయన మండల కేంద్రంలోని తహసీల్ధార్ కార్యాలయంలో ప్రజాసాక్షి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించి అభినంధనలు తెలియజేసారు.
మండల ప్రభుత్వ వైద్యురాలు వాహిని మాట్లాడుతూ తన ద్వార ప్రజాసాక్షి క్యాలెండర్ ఆవిష్కరించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
ఇట్టి కార్యక్రమంలో తహసీల్ధార్ శ్రీనివాస్ , ప్రభుత్వ వైద్యురాలు వాహిని, సూపర్ వైజర్ రాంమోహన్ ,హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్ , నర్సింగ్ ఆఫీసర్ ఉమాదేవి, వార్త దినపత్రిక ప్రతినిధి రాంప్రసాద్ , నేటి ధాత్రి దినపత్రిక ప్రతినిధి ఎస్ పి రమణ, అక్షర వేధం దిన పత్రిక ప్రతినిధి జరుపుల రమేష్ , కాంగ్రెస్ నాయకులు గంధం రాజేష్ , ప్రజాసాక్షి దినపత్రిక ప్రతినిధి వంగ రాజశేఖర్ పాల్గొన్నారు.

కలెక్టర్ ప్రవీణ్య తెలంగాణ వాణి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్ ప్రవీణ్య,

సమాజ శ్రేయస్సు, జాతీయవాదమే ప్రసార మాధ్యమాల పరమావధి కావాలి

ప్రజలకు,ప్రభుత్వాని కి వారధిగా నిలవాల్సిన బాధ్యత మీడియాపై ఉంది

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తెలంగాణ వాణి దిన పత్రిక క్యాలండర్ ను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ స్వీయనియంత్రణ ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవడానికి పత్రికలు ప్రయత్నించాలన్నారు.సామాజిక సమరసత, సామాన్యుల గొంతుగా నిలవడం, అక్షరాస్యతను పెంచడం,లింగ వివక్షను రూపుమాపడం,శాంతి, సామరస్యం,జాతీయ భద్రత వంటి అంశాల్లో రాజీ పడొద్దని సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్ ప్రజా ఉద్యమంగా మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, హరిత భవనాల నిర్మాణం వంటి అంశాలను కూడా ప్రజాఉద్యమాలుగా మార్చి భవిష్యత్ తరాలకు ఓ చక్కటి సమాజాన్ని అందించడంలో మీడియా మరింత చొరవ తీసుకోవాలని సూచించారు. వ్యవసాయరంగ ప్రగతి కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు చేరవేయడం, అన్నదాతల్లో నూతన పరిశోధనలపై చైతన్యం తీసుకురావడంపైనా పత్రికలు ప్రత్యేక దృష్టి సారించాలన్న,రైతుల సాధికారతకు పట్టం కడుతున్న,దినపత్రిక తెలంగాణ వాణి దినపత్రిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణి స్టాఫ్ రిపోర్టర్ డాక్టర్ ఆంజనేయులు, సంగారెడ్డి జిల్లా టి కుమార్,సంగారెడ్డి ఆర్సి ప్రభాకర్,సంగారెడ్డి టౌన్, బి నగేష్,జహీరాబాద్ ఆర్ సి ఎర్రోళ్ల శ్రీనివాస్, యాదగిరి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణలో పాలొన్న ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్…

క్యాలెండర్ ఆవిష్కరణలో పాలొన్న ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

హైద్రాబాద్ మియాపూర్ లో ఉమ్మడి పాలమూర్ ప్రజా సంఘాలు,ఉద్యోగ సంఘాల అద్యర్యము లో ముద్రనుంచి న క్యాలండర్ ఆవిష్కరణ లో వనపర్తి జిల్లా అఖిల పక్ష ఐక్యవెదక అధ్యక్షులు సతీష్ యాదవ్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వనపర్తి జిల్లా ముఖచిత్ర క్యాలెండర్ అద్భుతమైన రీతిలో ప్రింట్ చేయిస్తున్న అఖిలపక్ష ఐక్యవేదిక సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టిన అధ్యక్షుడు సతీష్ యాదవ్ ను అభినందించారు. క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. తదనంతరం డా” సతీష్ యాదవ్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో.. అధ్యక్షత వహించిన సతీష్ యాదవ్, ముఖ్య అతిథులు మాజీ సబ్ రిజిస్టర్ మల్లారెడ్డి, ఐలాండ్స్ నర్సిరెడ్డి,ఆఫీసర్ కడుకుంట్ల కురుమయ్య, గోపాల్ , కోటయ్య, అనిల్, దశరథ్ నాయక్,విశిష్ట అతిథులు కరెంట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి,పెద్దలు భాస్కర్ రెడ్డి, కాంట్రాక్టర్ జగత్ పల్లి రమేష్ యాదవ్,చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారని సతీష్ యాదవ్ ఒక ప్రకటన లో తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version