ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సఫియ సుల్తానా…

ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సఫియ సుల్తానా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

భారతదేశ మహిళా విద్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన మహనీయురాలు చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే జయంతి ని పురస్కరించుకొని,గత సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఈ సంవత్సరం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు,ప్రతి జిల్లాలో 10 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దాంట్లో భాగంగా, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో,జిల్లాలోని 10 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ,డిఇఓ వెంకటేశ్వర్లు ,నిర్మల జగ్గారెడ్డి మరియు వివిధ సంఘాల నాయకులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా,ఎం పి పి ఎస్ రెజింతల్, న్యాల్కల్ మండల ప్రధానోపాధ్యాయులు సఫియ సుల్తానా తమ విద్యా సేవలకు గాను,జిల్లా కలెక్టర్ డిఇఓ నిర్మల జగ్గారెడ్డి మరియు వివిధ సంఘాల నాయకుల చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం జరిగింది.

భూమ నందినికి ప్రతిష్టాత్మక అవార్డు…

భూమ నందినికి ప్రతిష్టాత్మక అవార్డు

అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన భూమ సుజాత రాజయ్య కూతురు నందినికి అరుదైన అవార్డు దక్కింది. ఇటీవల యంగ్ ఛాంపియన్ అవార్డు,వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ సర్టిఫికేట్ ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ (ఎన్ఐఎఫ్ఏఏ ) నుండి అందుకున్నారు.

ఈ అవార్డులు ఈ నెల 22 న న్యూ ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన కార్యక్రమంలో నందినికి ప్రముఖులు ప్రదానం చేశారు.చిన్న వయస్సులోనే సాధించిన ఈ విజయాలు ఆమె పట్టుదల,కష్టపడి పనిచేసే నైపుణ్యం,అసాధారణ ప్రతిభకు నిదర్శనమని తన సహచరులు అభినందించారు. దేశస్థాయిలో ఇంతటి మహోన్నతమైన అవార్డును అందుకున్న నందినిని నేడు బిజెపి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ శాలువాతో సన్మానించి అభినందించారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు తను ఎదిగేలా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ భరోసా కల్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version