సావిత్రిబాయి పూలే జయంతి.. ఆకట్టుకున్న చిన్నారుల వేషధారణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే నేటితరం ఉపాధ్యాయులకు, మహిళలకు ఆదర్శప్రాయమని, ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని ఝరాసంగం ఎంపీడీవో మంజుల, ఎంపీవో స్వాతి, జ్యోతిబా పూలే కళాశాల, ఆదర్శ కళాశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు ప్రిసిల్లా, తేనవతి, నిర్మల పేర్కొన్నారు. శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సావిత్రి బాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
