అకాల వర్షాల్లో రామాయంపేట పోలీసులు ప్రజలను రక్షించారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T163411.207.wav?_=1

సలాం పోలీస్‌..

అకాల వర్షాల్లో ప్రజలకు అండగా రామాయంపేట పోలీసులు..

పోలీసులపై నేటి ధాత్రి ప్రత్యేక కథనం..

రామాయంపేట సెప్టెంబర్ 3 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట పట్టణంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు నగర జీవనాన్ని అతలాకుతలం చేశాయి. కాలువలు పొంగిపొర్లడంతో తక్కువ ఎత్తున్న కాలనీలు మునిగిపోయి వందలాది కుటుంబాలు ప్రాణభయంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు వచ్చి ప్రజల ప్రాణాలను కాపాడిన వారు పోలీసులు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్, ఎస్‌.ఐ బాలరాజు తమ సిబ్బందిని ముందుండి నడిపిస్తూ పగలు–రాత్రి తేడా లేకుండా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

రిస్క్ తీసుకుని ప్రాణరక్షణ

నీటి మునిగిన వీధుల్లోకి ప్రవేశించి వృద్ధులను, మహిళలను, చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాఠశాలలో చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసుకొచ్చి తల్లిదండ్రుల ఆందోళన తొలగించారు. వర్షాల మధ్య ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా పోలీసులు సేవలందించడం ప్రజల హృదయాలను తాకింది.

ప్రజల కృతజ్ఞత..

“పోలీసులు లేకపోతే మా కుటుంబం బతికేది కాదు. మమ్మల్ని ప్రాణాలకు భయపడకుండా రక్షించారు. ఈ ఋణం మాకు ఎప్పటికీ మరవలేనిది” అని బస్తీ వాసులు కన్నీటి కళ్ళతో చెప్పారు.

“మా పిల్లలు స్కూల్లో చిక్కుకుపోయారు.

వెంటనే పోలీసులు వచ్చి వారిని రక్షించారు. మా కోసం వారు ప్రాణరక్షకులుగా నిలిచారు” అని స్థానిక పిల్లల తల్లులు భావోద్వేగంతో అన్నారు.

అధికారుల ప్రశంసలు

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – “ప్రజల ప్రాణాలను కాపాడడంలో రామాయంపేట పోలీసులు చూపిన ధైర్యం నిజంగా ప్రశంసనీయమైంది. ఇతరులకు ఆదర్శం.” అని అభినందించారు.

హనుమంతరావు మాజీ ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ దంతపల్లి.

“ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు చూపిన స్పందన సమాజానికి స్ఫూర్తిదాయకం. వారు కేవలం చట్టం అమలులోనే కాకుండా, ప్రాణరక్షకులుగా నిలుస్తున్నారు.” అని అన్నారు.

 

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. మల్లన్న గారి నాగులు ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ. తోని గండ్ల.

అకాల వర్షాల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు అండగా నిలిచిన రామాయంపేట పోలీసులు చూపిన త్యాగం, సేవలు ఎన్నటికీ మరువలేనివి. వారి కృషి రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల పాత్రకు ఒక నిదర్శనంగా నిలిచింది.

కోనాపూర్‌లో దివంగత కుటుంబానికి లీలా గ్రూప్ చైర్మన్ సాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T144903.648-1.wav?_=2

కోనాపూర్ గ్రామంలో దివంగత కుటుంబానికి లీలా గ్రూప్ చైర్మన్ మోహన్ నాయక్ పరామర్శ..

రామాయంపేట సెప్టెంబర్ 3 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గారు దివంగత కరికి బాబు కుటుంబాన్ని ఈరోజు పరామర్శించారు. ఇటీవల మరణించిన కరికి బాబు కుటుంబానికి ఆయన ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా రూ.5,000 నగదు, 25 కిలోల బియ్యం అందజేసి వారి కుటుంబానికి అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు చింతాల స్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు విద్యాసాగర్, మండల నాయకులు మామిడి సిద్ధిరాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుల అంజయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం సురేష్, యూత్ అధ్యక్షులు మామిడి సతీష్, ప్రధాన కార్యదర్శి కరికి రాజు, చాకలి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-02T122515.833-1.wav?_=3

కాట్రియాల గ్రామంలో శ్రావణ్ కుమార్ మృతి..

యూత్ కాంగ్రెస్ నేత రమేష్ చారి పరామర్శ..

రామాయంపేట సెప్టెంబర్ 2 నేటి ధాత్రి (మెదక్)

కాట్రియాల గ్రామానికి చెందిన కట్ట శ్రావణ్ కుమార్ (25) అనారోగ్యంతో నాలుగు నెలలుగా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో మృతి చెందాడు. గతంలోనే తండ్రి మరణించడంతో తల్లి నర్సవ్వ, తమ్ముడు శివతో కలిసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం తీవ్ర కష్టాలు ఎదుర్కొంటోంది.
శ్రావణ్ అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్న నాలుగు నెలల కాలంలో తల్లి అప్పులు చేసి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్మరి రమేష్ చారి గ్రామానికి వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి సొంతంగా 50 కిలోల బియ్యం అందజేసి, వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కట్ట చంద్రం, కిష్టయ్య, గ్రామ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గొల్ల నరేష్, నవీన్, రాజు, విజయ్, నరేష్, నిఖిల్, కమల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

చిత్తారమ్మ దేవాలయంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T154736.629.wav?_=4

 

చిత్తారమ్మ దేవాలయంలో వినాయక విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు..

రామాయంపేట ఆగస్టు 29 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట పట్టణంలోని చిత్తారమ్మ దేవాలయంలో భక్తి శ్రద్ధల మధ్య వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మర్కు బాలరాజు దంపతులు తమ కుటుంబ తరపున వినాయక విగ్రహాన్ని ఆలయానికి అందజేశారు. అనంతరం పురోహితుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించబడ్డాయి. ఆలయంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.
ప్రతిష్ఠ అనంతరం వినాయకునికి అర్చనలు, అష్టోత్తర శతనామ పూజలు, హారతులు నిర్వహించగా, తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడి, మంగళవాయిద్యాలతో కేరింతలు కొట్టింది.
ఈ సందర్భంగా మర్కు బాలరాజు దంపతులు మాట్లాడుతూ.. “గణపతి బాప్పా ఆరాధనతో అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. కుటుంబానికి, సమాజానికి శాంతి, ఐశ్వర్యం కలుగుతుందని విశ్వసిస్తున్నాం” అని తెలిపారు. ఆలయ కమిటీ సగర సంగం సభ్యులు, పట్టణ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కోనాపూర్‌లో యూరియా కొరతపై రైతుల ధర్నా…

కోనాపూర్‌లో యూరియా లభ్యం లేక రైతుల రోడ్డుపై ధర్నా..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలం నుండి
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామంలో యూరియా లభ్యం కాక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం గ్రామంలోని వందలాది మంది రైతులు కలిసి గ్రామ ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయి, ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు, రెండు చక్రాల వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఆకస్మికంగా ఏర్పడిన ఈ పరిస్థితితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Farmers Protest Over Urea Shortage in Konapur

రైతులు మాట్లాడుతూ—వర్షాకాలంలో పంటల సాగు ఉధృతంగా సాగుతున్న తరుణంలో యూరియా అందకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, పంటలపై పెట్టిన ఖర్చు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా యూరియా కోసం సహకార సంఘం, మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఒక్క బస్తా కూడా అందలేదని, ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రైతులు మాట్లాడుతూ, “ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమవుతోంది. రైతులకు ఎరువులు అందించడం లో విఫలమవుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే పంటలన్నీ నాశనం అవుతాయి. మా జీవితాలు ప్రమాదంలో పడతాయి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్నా విషయం తెలిసి పోలీసులు అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. అధికారులు త్వరలోనే యూరియా సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అయితే హామీలు కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
స్థానికులు కూడా ఈ సందర్భంలో మాట్లాడుతూ—గ్రామంలో యూరియా కొరత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

రామాయంపేటలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-92-1.wav?_=5

రామాయంపేటలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..

రామాయంపేట ఆగస్ట్ 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వచ్చిన 400 మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ ఎం. దేవేందర్ గారు పంపిణీ ప్రారంభించారు.

Clay Ganesha Distribution

ప్రజలు పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా మట్టి విగ్రహాలను అందజేస్తోందని కమిషనర్ తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల జల కాలుష్యం పెరుగుతుందని, మట్టి విగ్రహాల వలన పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తదనంతరం మిగిలిన విగ్రహాలను మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులకు వార్డు అధికారులు, మహిళా రిసోర్స్ పర్సన్‌ల సమక్షంలో పంపిణీ పూర్తి చేశారు. ప్రజలు అధిక సంఖ్యలో మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు.

రామాయంపేట జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-91.wav?_=6

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ సందడి..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులను స్వాగతించేందుకు సీనియర్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉత్సాహభరిత వాతావరణంగా మారింది.
కార్యక్రమానికి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నృత్యాలు, పాటలు, నాటికలు, వినోదాత్మక ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఫ్రెషర్స్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Freshers Party at Ramayampet Junior College.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మల్లేశం మాట్లాడుతూ –
“కళాశాలలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విద్యతో పాటు సామాజిక సేవా భావనను పెంపొందించుకోవాలని” సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలిచి ఎల్లప్పుడూ సహకారం అందిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో అధ్యాపకులు మాట్లాడుతూ, ఫ్రెషర్స్ పార్టీ విద్యార్థుల మధ్య ఆత్మీయత పెంపొందించేందుకు, ప్రతిభ ప్రదర్శనకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కళాశాలలో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్లు ఫ్రెషర్స్ విద్యార్థులకు పుస్తకాలు బహుమతులుగా అందజేశారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు ఆనందంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహాన్ని పంచుకున్నారు.

మూడవ వార్డులో మురుగు సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-74-1.wav?_=7

రామాయంపేట మూడవ వార్డులో మురుగు సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి..

రామాయంపేట ఆగస్టు 25 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట పట్టణ మూడవ వార్డులోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి శారద ఫంక్షన్ హాల్ వరకు మురుగు నీరు పారడానికి తగిన మోరీలు,సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గతంలో కొద్ది ఇండ్లు మాత్రమే ఉండడంతో చిన్న చిన్న మోరీలు నిర్మించగా,ప్రస్తుతం ఈ ప్రాంతంలో గృహ నిర్మాణాలు భారీగా పెరగడంతో పాత మోరీలు సరిపోవడం లేదు.దీంతో మురికి నీరు వీధుల్లో నిల్వ అవుతూ దోమల వృద్ధి,దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Sharada function hall.

అదనంగా రాత్రిపూట లైట్లు లేకపోవడం,చెత్త బండి ప్రతి రోజు రాకపోవడం వల్ల చెత్త పేరుకుపోతూ సమస్య మరింత తీవ్రంగా మారింది.ఈ పరిస్థితిని తక్షణమే అధికారులు గమనించి మురుగు నీటి పారుదల సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో హస్నోద్దీన్, జమీర్,సల్మాన్,ఆరిఫ్, సయ్యద్,మొయిన్ తదితరులు పాల్గొన్నారు.

మై భారత్ మేరా భారత్ ఏక్ పెడ్ కార్యక్రమం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-71-1.wav?_=8

మై భారత్ మేరా భారత్ ఏక్ పెడ్ కార్యక్రమం..

రామాయంపేట నేటి ధాత్రి (మెదక్)

 

లో భాగంగా రామాయంపేట యువ జ్యోతి స్పోర్ట్స్ క్లబ్ నెహ్రూ యువ కేంద్ర సిద్దిపేట సహా కారంతో ఏక్ పెడ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని హై స్కూల్ ఆవరణంలో విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయురాలు

 

నిర్మల విజయ మొక్కలు నాటారు ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో వృక్షాల అవసరం ఎంతైనా ఉందని ప్రాణవాయువు విడుదలకు మొక్కలు ఆమె కోరారు ఈ కార్యక్రమంలో యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ కోఆర్డినేటర్ సత్యనారాయణ వ్యాధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సీఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/congress.wav?_=9

సీఎం ఆర్ ఎఫ్ చెక్కు అందజేత..

రామాయంపేట,  నేటి ధాత్రి 

రామాయంపేట మున్సిపల్ పరిధిలోని 6వ వార్డుకు చెందిన బీర సత్యనారాయణకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి రూ.60,000 విలువైన చెక్కును అందజేశారు. గౌరవనీయులైన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ఈ ఆర్థిక సహాయం లభించిందని స్థానిక నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి మాట్లాడుతూ
ప్రభుత్వం అందిస్తున్న సాయం లబ్ధిదారులకు ఉపయుక్తమవుతుందని, అవసరమైన వారు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డేమే యాదగిరి. కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి వెంకట్. బిర రామచంద్రం. మంగలి సత్యం. దోనేటి గోపాల్. మంగళ్ పవన్. వివేక్ తదితరులు పాల్గొన్నారు.

చరిత్రకు సజీవ సాక్ష్యం ఛాయాచిత్రం..

చరిత్రకు సజీవ సాక్ష్యం ఛాయాచిత్రం..

రామాయంపేట ఆగస్టు 19 నేటి ధాత్రి (మెదక్)

 

 

ఒక్క ఫొటోలో ఎన్నో మధుర జ్ఞాపకాలు.

ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, ఆవేశాన్ని, ఆలోచనను పలికించేది..

మొత్తం ఇతివృత్తాన్ని ఆవిష్కరించేదే ఫొటో

గత స్మృతులను వర్తమానానికి తెలియజెప్పే సాధనం

ఉద్యమాలకు ఊపిరి పోసేది.. ఆధ్యాత్మిక భావాలను పలికించేది

మధుర స్మృతులను నెమరేసుకునేదే చిత్రం..

ఒక్కఫొటో ఎన్నో హావభావాలకు నిదర్శనం

కరిగిపోయే కాలానికి చెరిగిపోని ఛాయాచిత్రం.
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నట్టు.. ఒక్క ఫొటో ఏళ్ల సజీవ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు. ఒక చిత్రం ఎన్నో హావ భావాలను పలికిస్తూ గత స్మృతులను వర్తమానానికి తెలియజెప్పే సాధనంగా నిత్యనూతనంగా విరాజిల్లేది ఫొటో. మధుర జ్ఞాపకాలను పదికాలాల పాటు పదిలంగా ఉంచేది ఫొటో అంటే అతిశయోక్తి కాదు. గంట పాటు చదివే సమాచారాన్ని, కేవలం ఒకే ఒక్క ఫొటో.. క్షణాల్లో విశదీకరిస్తున్నదని పలువురు తమ అభిప్రాయాలను సైతం వ్యక్తం చేసారు. ఉద్యమమయినా, ఆధ్యాత్మికమైనా, ఆపదైనా, సంపదైనా, యుద్ధమైనా, శాంతి అయినా ఒక్క క్లిక్ తోనే ఒడిసిపట్టి చరిత్ర పుటల్లోకి చేరవేసే సాధనం ఒక్క ఫొటోగ్రాఫర్ మాత్రమే అని చెప్పాలి. ప్రపంచ పాటోగపీ దినోత్సవం సందరంగా నేటి ధాత్రి పత్యేక కథనం.

 

రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడు బన్సీ నాయక్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు ఎంతో నైపుణ్యంతో వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నప్పటికీ ప్రోత్సాహకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సెల్ ఫోన్ల ప్రాచుర్యం కారణంగా వృత్తి క్షీణిస్తోందని, లక్షల రూపాయలు పెట్టి కొత్త టెక్నాలజీ కెమెరాలు కొనుగోలు చేసే స్తోమత లేక ఫోటోగ్రాఫర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక వేదికను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు రొయ్యల హరి ప్రసాద్, సంతోష్ రెడ్డి, రామకృష్ణ, నాని రాజ్ కుమార్, బన్సీ నాయక్, సర్దార్ నాయక్, స్వామి, బాబు, రాజ్ కుమార్, సాయిరాం, సాయిరాం గౌడ్, శ్రీకాంత్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక మంజీర విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-41-1.wav?_=10

స్థానిక మంజీర విద్యాలయంలో శ్రీకృష్ణాష్టమి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

రామాయంపేట నేటి ధాత్రి (మెదక్)

ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణుని దివ్యచరిత్రను , శ్రీకృష్ణుడు జన్మించినప్పటి నుండి గోకులలో చేసిన చిలిపి చేష్టలను తో పాటు గోవర్ధన గోవర్ధనగిరి నెత్తి గోపులాని ఎలా కాపాడాడు కన్నుల కట్టినట్టు చూపించారు. శ్రీకృష్ణ పూజ అనంతరం మోహన్ పంతులుగారు విద్యార్థులకు శ్రీకృష్ణుని చిలిపి చేష్టలను వివరించారు.శ్రావణమాసంలో లభించే పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, మీగడ, మీగడ వంటి రుచికరమైన పదార్థాలు, వంటకాలు స్వామివారికి నైవేద్యంగా పెట్టారు.

Sri Krishna Ashtami

శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి, ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, శ్రావ్యమైన కీర్తనలు పాడారు. చిన్నారి విద్యార్థిని విద్యార్థులు గోపిక మరియు శ్రీకృష్ణ వేషాదరణలో వచ్చి చూపరులను ఆకట్టుకున్నారు.

 

అలాగే శ్రీకృష్ణ గోపికలచే ఉట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి వాసవి హెడ్మాస్టర్ సురేష్ మౌనిక మీనా సౌమ్య శ్రీనివాస్ జయప్రకాష్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

రామాయంపేటలో కోటి రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-30.wav?_=11

రామాయంపేటలో కోటి రూపాయల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన..

రామాయంపేట, నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండల కేంద్రంలోని మూడవ మరియు నాలుగవ వార్డుల్లో రోడ్ల అభివృద్ధి పనులకు రూ. 1 కోటి వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల పనులను గురువారం నాడు ప్రారంభించారు.ఈ పనులు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.వార్డుల్లో రోడ్ల పరిస్థితి గత కొంతకాలంగా తీవ్రంగా దెబ్బతినిన నేపథ్యంలో ఈ అభివృద్ధి పనులు ప్రజల్లో హర్షాతిరేకాలు నింపాయి.ఈ సందర్భంగా చౌదరి సుప్రభాత రావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే మా ప్రాధాన్యం.రోడ్డుపనుల ద్వారా ట్రాఫిక్ సౌకర్యం మెరుగవుతుంది.ఇది రామాయంపేట అభివృద్ధిలో మరో ముందడుగు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రామాయంపేటలో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నాల్గవ వార్డ్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-15-1.wav?_=12

 

రామాయంపేటలో సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నాల్గవ వార్డ్ లో ఆర్డీఓ రమాదేవి పర్యవేక్షణ..

రామాయంపేట,నేటి ధాత్రి (మెదక్)

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామాయంపేట మున్సిపల్ పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక శుభ్రత కార్యక్రమం (సానిటేషన్ స్పెషల్ డ్రైవ్) లో భాగంగా ఈరోజు నాలుగవ వార్డులో కార్యక్రమం కొనసాగింది.

Ramayampet

ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) శ్రీమతి రమాదేవి, తహసిల్దార్ టి. రజనీకుమారి, మున్సిపల్ కమిషనర్ ఎం. దేవేందర్ లు వార్డులో పర్యటించారు. వారు మురికి కాలువల శుభ్రత, మిషన్ భగీరథ నీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, దోమల నివారణకు చేపడుతున్న ఫాగింగ్ కార్యకలాపాలు, పచ్చదనం మరియు పరిశుభ్రతపై అధికారుల చర్యలను పరిశీలించారు.

పనుల్లో ఏ ఒక్కరు నిర్లక్ష్యం చూపకుండా, సమర్థవంతంగా చేపట్టాలని ఆర్డీఓ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

దేశ రక్షణలో యువత ముందుండాలి.

దేశ రక్షణలో యువత ముందుండాలి….

రామాయంపేట నేటి ధాత్రి (మెదక్)

దేశ రక్షణలో యువత ముందుండాలని రామాయంపేట ఎస్సై బాలరాజు సూచించారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం యువకులు, ఆర్మీలో చేరాలని తెలిపారు. దేశ రక్షణ కోసం విరోచితంగా పోరాడి పాకిస్థాన్ కు ముచ్చమటలు పట్టించిన యుద్ధ వీరులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

 

పోరాటంలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించాలన్నారు. యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి రావాలన్నారు. దేశం కోసం ఎంతోమంది యువకులు సైన్యంలో చేరి దేశ సేవ కోసం పాటుపడుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో షానిషా ఫౌండేషన్ చైర్మన్ శివ, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ యాదగిరి ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు భాస్కర్, సత్యం, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రామయంపేటకు చేరిన సన్న బియ్యం..

రామయంపేటకు చేరిన సన్న బియ్యం..

రామాయంపేట మార్చి 29 నేటి ధాత్రి (మెదక్)

 

సన్న బియ్యం రేషన్ షాపుల్లో ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగా రామయంపేట మండలానికి సంబంధించి సన్న బియ్యం గోదాములకు రావడం జరిగింది. రామాయంపేట, నిజాంపేట, చిన్న శంకరంపేట మండలాల్లో 68 రేషన్ దుకాణాలు ఉండగా 6500 క్వింటాళ్ల సన్న బియ్యం సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

ఎట్లా ఉండే రామాయంపేట ఎట్లా అయ్యింది.

ఎట్లా ఉండే రామాయంపేట ఎట్లా అయ్యింది…

ఉమ్మడి రాష్ట్రంలో,స్వ రాష్ట్రం వచ్చిన అభివృద్ధికి దూరమయింది…

కొత్త మండలాలు సైతం వేగంగా అభివృద్ధి జరిగాయి..
కానీ రామయంపేట అందుకు నోచుకోలేదా.!

ఎవరి లోకం అనేది వారికి కచ్చితంగా తెలుసు..

పార్టీల పంతం వీధి అభివృద్ధికి నాయకులు సహకరిస్తే అన్ని సాధ్యం…

రామాయంపేట మార్చి10 నేటి ధాత్రి (మెదక్)

Ramayampet

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రామయంపేట నియోజకవర్గం, తాలుక, మండల కేంద్రం ఉండి ఎంతో కళకళలాడుతూ ఉండేది. కాలక్రమమైన నియోజకవర్గం పోవడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామయంపేట నుండి నిజాంపేట మండలం విడిపోయింది. అంతేకాకుండా కొన్ని కార్యాలయాలు తరలిపోవడం జరిగాయి. రామయంపేట ప్రధానంగా పట్టణ అభివృద్ధి రోజురోజుకు దీనస్థితిలోకి జారిపోతుంది. నిజమాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి లకు వెళ్లడానికి ఇది కేంద్ర బిందువు. నిత్యం ఎన్నో వాహనాలు ప్రయాణికులు రాకపోకలు జరిగే పట్టణం. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రధానంగా రోడ్లు, నిర్మాణం లేకపోవడం వ్యాపార వాణిజ్య సంస్థలు సైతం అభివృద్ధి లేకపోవడం వల్ల ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కనిపించడం లేదు. మండల స్థాయి నుండి జిల్లా రాష్ట్రస్థాయి వరకు ప్రధాన పార్టీల్లో ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉండి ఆయా పార్టీలకు చెందిన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధి జరగకపోవడం విడ్డూరంగా ఉంది. పదేపదే ఒకరి పార్టీని ఒకరు ఒకరి నాయకులను మరొకరు దూషించుకోవడం తప్ప అభివృద్ధి విషయంలో కలసికట్టుగా ఉంటే ఇప్పటివరకు రామాయంపేట ఎంతో అభివృద్ధి జరిగేదని ప్రజలు అంటున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల సైతం ఎంతో అభివృద్ధి చెందాయని అక్కడ అన్ని రకాల వ్యాపారాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామయంపేటకు సమీపంలో ఉన్న మండలాలు ఎంతో సుందరంగా వేగంగా అభివృద్ధి జరిగినా రామయంపేట మాత్రం అదే స్థితిలో ఉంది. పట్టణంతోపాటు మండలంలో ఎంతో అనుభవం ఉన్న నాయకులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. ఎవరి స్వార్థం వారిది, సొంత లాభం కోసం కొంతమంది. రోడ్ సైడ్ నాయకులంతా కోటీశ్వరులుగా మారి అధికార పార్టీ ఏది వచ్చిన ఉన్న పార్టీని వదిలేసి తమ సొంత పనులకోసం, సొంత అభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. కొందరు కార్యకర్తలు వారినీ అనుసరించే పార్టీలు మారడంతో ప్రజల అవసరాలు కనీస కష్టాలు పట్టించుకునే నాధుడు కరువయ్యాడు పట్టణ మధ్యలో ప్రతి గల్లి గల్లి రోడ్డు పక్కల గుంతలతో వర్షాకాలం వస్తే ఇంట్లోకి నీరు రావడం, మున్సిపాలిటీ ప్లానింగ్ కానీ టౌన్ ప్లానింగ్ కానీ ఏ మాత్రం కూడా రామాయంపేటకు మార్పు లేకపోవడం అయినప్పటికీ రామయంపేట వెనుకబడి ఉండడానికి కారణమేంటని అందరికీ తెలిసిందే. వ్యక్తిగత, మరియు పార్టీ భేదాలు విడిచిపెట్టి రామాయంపేటకు ఉపయోగపడే అభివృద్ధి గురించి సంక్షేమ పథకాలు అమలు గురించి ప్రశ్నిస్తే కచ్చితంగా ఇప్పటికైనా రామాయంపేట ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అధినాయకులు స్థానికంగా లేకపోవడం వారు తమ తమ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధిలు, ప్రణాళికలు చేస్తున్న రామాయంపేటకు ఏమాత్రం లాభం లేకుండా నష్టం జరుగుతున్న, వెంట ఉన్న నాయకులు కార్యకర్తలు గాని అధినాయకులను అడ్డగించకపోవడం పట్టణ ప్రాంతం గ్రామం పట్ల ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి కనిపించకపోవడం వల్ల కూడా రామాయంపేట పూర్తిగా రాజకీయ ప్రలోభాల నాయకుల వంచన మరియు పార్టీలు మారుతూ తమ స్వార్థం చూసుకోవడం వల్ల పూర్తిగా వెనుకబడిపోయిందని చెప్పవచ్చు నియోజకవర్గం మార్పుతో పాటు నియోజకవర్గ మారుతుందన్న అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే ఏమాత్రం కదలకపోయినా ఆమె వెంటనే అనడం వల్లనే నియోజకవర్గం మారిపోవడం ఇక్కడున్న కార్యాలయాలు అధికారులు వెళ్లిపోవడం జరిగాయని ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం ఎలుకకుర్తి రోడ్డు బైపాస్ వల్ల ఇప్పటికే నియోజకవర్గం నుంచి మండలానికి మండలం నుంచి మున్సిపాలిటీకి కుంచకపోయినా రామాయంపేట మరొక చిన్న పల్లెగా గ్రామంగా మారిపోనున్నది. బైపాస్ రోడ్ల వల్ల ఇక్కడ జనాలు రాకపోవడం రాకపోక లేకపోవడం సముద్ర గర్భంలో దీపంగా మారిపోతున్న రామాయంపేటకు వెలుగునిచ్చేది ఎప్పుడని ప్రజలు అడుగుతున్నారు. రాజకీయంగా ప్రజాసంఘాలు యువజన సంఘాలు వాణిజ్య సంఘాలు ఒక అభివృద్ధి వేదికగా మారి దీనిపై ఏదన్న ఒక కమిటీ వేసి అభివృద్ధికి ఆలోచిస్తే తప్ప రామాయంపేట అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది. మన భవిష్యత్ తరాలకు ఇప్పటి రామయంపేట ఇస్తే వారి మనసులో మనం చేసిన పొరపాటులను ఇచ్చినట్లే అవుతుంది. భవిష్యత్ తరాలకు అన్ని రంగాల్లో ఉపయోగపడే విధంగా అందరం కలిసి పనిచేద్దాం అప్పుడే అభివృద్ధి జరుగుతుందని భావన రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజలు, పార్టీల నాయకులు, అన్ని వర్గాలు, కుల సంఘాల్లో ఏకతాటి పై ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎట్లా ఉండే రామాయంపేట ఎట్లా అయ్యింది.

ఎట్లా ఉండే రామాయంపేట ఎట్లా అయ్యింది…

ఉమ్మడి రాష్ట్రంలో,స్వ రాష్ట్రం వచ్చిన అభివృద్ధికి దూరమయింది…

కొత్త మండలాలు సైతం వేగంగా అభివృద్ధి జరిగాయి..
కానీ రామయంపేట అందుకు నోచుకోలేదా.!

ఎవరి లోకం అనేది వారికి కచ్చితంగా తెలుసు..

పార్టీల పంతం వీధి అభివృద్ధికి నాయకులు సహకరిస్తే అన్ని సాధ్యం…

రామాయంపేట మార్చి10 నేటి ధాత్రి (మెదక్)

Ramayampet

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో రామయంపేట నియోజకవర్గం, తాలుక, మండల కేంద్రం ఉండి ఎంతో కళకళలాడుతూ ఉండేది. కాలక్రమమైన నియోజకవర్గం పోవడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామయంపేట నుండి నిజాంపేట మండలం విడిపోయింది. అంతేకాకుండా కొన్ని కార్యాలయాలు తరలిపోవడం జరిగాయి. రామయంపేట ప్రధానంగా పట్టణ అభివృద్ధి రోజురోజుకు దీనస్థితిలోకి జారిపోతుంది. నిజమాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి లకు వెళ్లడానికి ఇది కేంద్ర బిందువు. నిత్యం ఎన్నో వాహనాలు ప్రయాణికులు రాకపోకలు జరిగే పట్టణం. అయినప్పటికీ ఇప్పటివరకు ప్రధానంగా రోడ్లు, నిర్మాణం లేకపోవడం వ్యాపార వాణిజ్య సంస్థలు సైతం అభివృద్ధి లేకపోవడం వల్ల ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కనిపించడం లేదు. మండల స్థాయి నుండి జిల్లా రాష్ట్రస్థాయి వరకు ప్రధాన పార్టీల్లో ఎంతో అనుభవం కలిగిన నాయకులు ఉండి ఆయా పార్టీలకు చెందిన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పట్టణ అభివృద్ధి జరగకపోవడం విడ్డూరంగా ఉంది. పదేపదే ఒకరి పార్టీని ఒకరు ఒకరి నాయకులను మరొకరు దూషించుకోవడం తప్ప అభివృద్ధి విషయంలో కలసికట్టుగా ఉంటే ఇప్పటివరకు రామాయంపేట ఎంతో అభివృద్ధి జరిగేదని ప్రజలు అంటున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల సైతం ఎంతో అభివృద్ధి చెందాయని అక్కడ అన్ని రకాల వ్యాపారాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామయంపేటకు సమీపంలో ఉన్న మండలాలు ఎంతో సుందరంగా వేగంగా అభివృద్ధి జరిగినా రామయంపేట మాత్రం అదే స్థితిలో ఉంది. పట్టణంతోపాటు మండలంలో ఎంతో అనుభవం ఉన్న నాయకులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ రామయంపేట వెనుకబడి ఉండడానికి కారణమేంటని అందరికీ తెలిసిందే. వ్యక్తిగత, మరియు పార్టీ భేదాలు విడిచిపెట్టి రామాయంపేటకు ఉపయోగపడే అభివృద్ధి గురించి సంక్షేమ పథకాలు అమలు గురించి ప్రశ్నిస్తే కచ్చితంగా ఇప్పటికైనా రామాయంపేట ను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. మన భవిష్యత్ తరాలకు ఇప్పటి రామయంపేట ఇస్తే వారి మనసులో మనం చేసిన పొరపాటులను ఇచ్చినట్లే అవుతుంది. భవిష్యత్ తరాలకు అన్ని రంగాల్లో ఉపయోగపడే విధంగా అందరం కలిసి పనిచేద్దాం అప్పుడే అభివృద్ధి జరుగుతుందని భావన రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజలు, పార్టీల నాయకులు, అన్ని వర్గాలు, కుల సంఘాల్లో ఏకతాటి పై ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రామాయంపేట అభివృద్ధి జరుగుతుందా లేదా.? వేచి చూడాల్సిందే..!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version