సాంస్కృతక దృశ్య రూపం ఫోటోగ్రఫీ

, సాంస్కృతక దృశ్య రూపం ఫోటోగ్రఫీ.

మొగుళ్లపల్లి: నేటి దాత్రి

 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మండల ఫొటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో మంగళవారం ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్‌ డాగురె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.మండల అధ్యక్షుడు నాసాని విద్యాసాగర్ మాట్లాడుతూ ఒక్క ఫోటో వేల పదాలకు సమాధానం కొన్ని క్షణాల్లో చిత్రీకరణ ఫోటోలు జీవితాంతం గుర్తుండి పోయేఉండే జ్ఞాపకాలుగా మారుతాయని ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలోఉపాధ్యక్షులు బాలవీణ వీరస్వామి కోశాధికారి మాచర్ల వెంకట్ గౌరవాధ్యక్షులు పెండెం రాజేందర్ నాగపురి శ్రీనివాస్ మహేందర్ అశోక్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

చరిత్రకు సజీవ సాక్ష్యం ఛాయాచిత్రం..

చరిత్రకు సజీవ సాక్ష్యం ఛాయాచిత్రం..

రామాయంపేట ఆగస్టు 19 నేటి ధాత్రి (మెదక్)

 

 

ఒక్క ఫొటోలో ఎన్నో మధుర జ్ఞాపకాలు.

ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని, ఆవేశాన్ని, ఆలోచనను పలికించేది..

మొత్తం ఇతివృత్తాన్ని ఆవిష్కరించేదే ఫొటో

గత స్మృతులను వర్తమానానికి తెలియజెప్పే సాధనం

ఉద్యమాలకు ఊపిరి పోసేది.. ఆధ్యాత్మిక భావాలను పలికించేది

మధుర స్మృతులను నెమరేసుకునేదే చిత్రం..

ఒక్కఫొటో ఎన్నో హావభావాలకు నిదర్శనం

కరిగిపోయే కాలానికి చెరిగిపోని ఛాయాచిత్రం.
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నట్టు.. ఒక్క ఫొటో ఏళ్ల సజీవ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు. ఒక చిత్రం ఎన్నో హావ భావాలను పలికిస్తూ గత స్మృతులను వర్తమానానికి తెలియజెప్పే సాధనంగా నిత్యనూతనంగా విరాజిల్లేది ఫొటో. మధుర జ్ఞాపకాలను పదికాలాల పాటు పదిలంగా ఉంచేది ఫొటో అంటే అతిశయోక్తి కాదు. గంట పాటు చదివే సమాచారాన్ని, కేవలం ఒకే ఒక్క ఫొటో.. క్షణాల్లో విశదీకరిస్తున్నదని పలువురు తమ అభిప్రాయాలను సైతం వ్యక్తం చేసారు. ఉద్యమమయినా, ఆధ్యాత్మికమైనా, ఆపదైనా, సంపదైనా, యుద్ధమైనా, శాంతి అయినా ఒక్క క్లిక్ తోనే ఒడిసిపట్టి చరిత్ర పుటల్లోకి చేరవేసే సాధనం ఒక్క ఫొటోగ్రాఫర్ మాత్రమే అని చెప్పాలి. ప్రపంచ పాటోగపీ దినోత్సవం సందరంగా నేటి ధాత్రి పత్యేక కథనం.

 

రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడు బన్సీ నాయక్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు ఎంతో నైపుణ్యంతో వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నప్పటికీ ప్రోత్సాహకాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సెల్ ఫోన్ల ప్రాచుర్యం కారణంగా వృత్తి క్షీణిస్తోందని, లక్షల రూపాయలు పెట్టి కొత్త టెక్నాలజీ కెమెరాలు కొనుగోలు చేసే స్తోమత లేక ఫోటోగ్రాఫర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక వేదికను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు రొయ్యల హరి ప్రసాద్, సంతోష్ రెడ్డి, రామకృష్ణ, నాని రాజ్ కుమార్, బన్సీ నాయక్, సర్దార్ నాయక్, స్వామి, బాబు, రాజ్ కుమార్, సాయిరాం, సాయిరాం గౌడ్, శ్రీకాంత్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version