రెచ్చిపోయిన కానిస్టేబుల్ దంపతులు.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
రహదారిపై క్రికెట్ ఆడితే.. తన ఇంట్లోని పిల్లలకు బంతి తగులుతుందంటూ ఒక మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కానిస్టేబుల్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేసి.. దాడి చేశారు.ఇంటి ముందు క్రికెట్ ఆడితే.. బంతి పిల్లలకు తగులుతుందంటూ మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ దంపతులు.. ఆ మహిళలపై దాడి చేశారు. దీంతో బాధితురాళ్లు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా హరినాథ్ విధులు నిర్వహిస్తున్నారు. అతడి భార్య పేరు హారిక. వీరి పిల్లలు.. రహదారిపై క్రికెట్ ఆడేందుకు యత్నించారు.
దాంతో ఏఆర్ కానిస్టేబుల్ హరినాథ్, అతడి భార్య హరికపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని పోలీసులు పరిశీలిస్తున్నారు.