టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ హఠాన్మరణం బాధాకరం..

టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ హఠాన్మరణం బాధాకరం

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టివి9 రిపోర్టర్‌‌ ప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు… ప్రసాద్‌‌ మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటని, చిన్న వయస్సులో మరణించడం బాధాకరమన్నారు.వారు మీడియా రంగంలో పనిచేస్తూ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ప్రజా సమస్యలను మీడియాతో పరిష్కరిస్తూ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,
ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
సిరిసిల్ల ఎమ్మెల్యే కెటీఆర్ కూడా టీవీ9 రిపోర్టర్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని సంతాపం తెలియజేశారు. మరియు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ మిత్రులు కూడా సంతాపం తెలియజేయడం జరిగినది.

రిపోర్టర్ పై దాడులు చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలి

రిపోర్టర్ పై దాడులు చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలి

ప్రశ్నిస్తే దాడుల
జర్నలిస్ట్ పై దాడిని ఖండిస్తున్నాం

గండ్ర యువసేన అధ్యక్షుడు, గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం ములుగు జిల్లా తాడ్వాయి మండలం లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గండ్ర యువసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.మండల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, తదితర విషయాలలో జరిగిన అవినీతి గురించి పత్రికల్లో వార్తలు రాశాడని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తే దాడులు చేయడం మానుకోవాలని , దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష్య సాధింపు చర్యలు మానుకొని, ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని , ప్రశ్నిస్తే దాడులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు

పత్రికా వేలేఖరి తల్లీ పార్థివదేహానికి చిలువేరు సమ్మి గౌడ్.

పత్రికా వేలేఖరి తల్లీ పార్థివదేహానికి చిలువేరు సమ్మి గౌడ్ నివాళులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కూన శ్రీను, సతీష్ ల మాతృమూర్తి సరోజన మరణించగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఘన నివాళులర్పించారు.సమ్మి గౌడ్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ మండల నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి వారిని ఓదార్చి మనో ధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో కొండేటి కళాధర్,ఎసల్ల సత్యనారాయణ, మోరపాక జగన్, చంద్రగిరి వంశీకృష్ణ, గాజుల రవి, కమటం స్వామి కొంతం రవి తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version