నిమ్జ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశం…

నిమ్జ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ ప్రాంతంలోని నిమ్జ్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో నిమ్జ్ తొలి దశలో స్వాధీనం చేసుకున్న భూముల సరిహద్దుల గుర్తింపు, పెంచింగ్ పనులు, సమీప రహదారుల అభివృద్ధి, నిమ్స్‌కు అనుసంధానించే ప్రధాన మార్గాల విస్తరణ వంటి అంశాలపై నిమ్జ్, టీజీఐఐసీ అధికారులు, సర్వే మరియు రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ తెలిపారు, నిమ్జ్‌లో మౌలిక వసతులు కల్పించడానికి ఎస్‌ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇప్పటివరకు సేకరించిన భూములను అప్పగించాలన్నారు.లే అవుట్ అభివృద్ధి కోసం పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలని, లే అవుట్ ప్రకారం రోడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి భూములలో హద్దురాళ్ళను వేయాలని ఆదేశించారు.

మునుపు భూములు తీసుకుని రైతులకు నష్ట పరిహారం చెల్లించగా, పని ఆలస్యంగా ప్రారంభించకపోవడం వల్ల పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఇచ్చామని కలెక్టర్ వివరించారు. ఇప్పుడు అభివృద్ధి పనులు ప్రారంభించనుండడంతో, పంటలు వేసిన ఉంటే కోతలు పూర్తయ్యే వరకు వేచి చూడాలని, తదుపరి పంటలు వేయకుండా చూడమని తెలిపారు. సర్వే శాంతియుత వాతావరణంలో, ఏ ఆటంకం లేకుండా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సర్వే సమయంలో హద్దురాళ్లను ఎవరూ తొలగించరాని విధంగా హెచ్చరించారు;ఎవరైనా చేస్తే చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీవో దేవుజా, నిమ్జ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షి, తాహిల్దార్లతో సహా సంబంధిత అధికారులు పాల్గొన్నారు.అదనంగా, సంగారెడ్డి నియోజకవర్గంలోని మున్సిపల్ పట్టణాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు కావాల్సిన పాలనాపరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు. పట్టణ పాఠశాలల వసతి గృహాల్లో సానిటేషన్, టాయిలెట్ సమస్యలపై కూడా ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు. కలెక్టర్ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పాస్టర్లపై దాడి: నిందితుడిపై కేసు నమోదుకు క్రైస్తవ సంఘాల డిమాండ్…

పాస్టర్లపై దాడి: నిందితుడిపై కేసు నమోదుకు క్రైస్తవ సంఘాల డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని అనేగుంట గ్రామంలో శనివారం నాడు పాస్టర్ సంజీవ్, పాస్టర్ సురేష్ తమ బృందంతో కలిసి బహిరంగ సువార్త ప్రకటించడానికి వెళ్లారు. సువార్త ప్రకటిస్తున్న సమయంలో, అదే గ్రామానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి దైవ దూషణ చేస్తూ, సేవకులను బూతు మాటలతో దూషిస్తూ వారిపై దాడికి దిగాడు. క్రైస్తవ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడి, అగౌరవపరిచిన రాకేష్ పై భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, మత స్వేచ్ఛ హక్కులను కాలరాస్తూ దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, తగిన శిక్ష వేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు సోమవారం నాడు జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనేగుంట గ్రామంలో పాస్టర్లపై జరిగిన ఈ దాడి అమానుషమని వారు పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version