ఇందిరమ్మ ఇల్లు పేదోడి ఆత్మగౌరవానికి ప్రతీక…

ఇందిరమ్మ ఇల్లు పేదోడి ఆత్మగౌరవానికి ప్రతీక

* చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్

చేవెళ్ల, నేటిధాత్రి :

ఇందిరమ్మ ఇల్లు పేదోడి ఆత్మగౌరవానికి ప్రతీక అని చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ అన్నారు. బుధవారం చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలకేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకయ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి చేవెళ్ళ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఆయన లబ్ధిదారుల కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మెచ్చి, ఆశీర్వదించిన ప్రజా ప్రభుత్వంలోనే ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటను అమలుచేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రజలు ఎల్లప్పుడూ సేవ చేసే నేతలకు,ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటూ రానున్న ఎన్నికల్లో కూడ ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు నిరంతరం ఏళ్లవేళలా ప్రజల క్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి కృషి చేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నవాబ్ పెట్ మండలం అధ్యక్షులు వెంకటయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సామ వెంకట్ రెడ్డి , బి బ్లాక్ అధ్యక్షులు పోలీస్ మధుసూదన్ రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి , నవాబ్ పేట సర్పంచ్ నరసింహ రెడ్డి , యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ , యూత్ కాంగ్రెస్ నాయకులు ఉపేందర్ రెడ్డి , మండల అధ్యకులు శేఖర్ , యాదయ్య , యావాపూర్ సర్పంచ్ లక్ష్మణ్ , పులుమామిడి సర్పంచ్ నరసింహులు, చించల్ పెట్ సర్పంచ్ అనంత రాములు , పాండు రంగా రెడ్డి , మాదిరెడ్డి పల్లి రాజు , మాజీ ఉప సర్పంచ్ సంగారెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ మెంబెర్స్ సీనియర్ నాయకులు , స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చేవెళ్లలో కాంగ్రెస్ నామినేషన్ల హోరాహోరీ

చేవెళ్లలో హాట్టహాసంగా కాంగ్రెస్ నామినేషన్లు

* భారీ ర్యాలీతో చేవెళ్ల కాంగ్రెస్ లో నయా జోష్.
* మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం
. :దేవర సమతావెంకట్ రెడ్డి
* చేవెళ్లలో కాంగ్రెస్ భారీ ర్యాలీతో నామినేషన్లు
* కాంగ్రెస్ ను భారీ మెజారుటీతో గెలిపించండి
* చివరి రోజు మొత్తం 71 నామినేషన్లు

చేవెళ్ల, నేటిధాత్రి:

 

చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని చేవెళ్ల మున్సిపల్ కాంగ్రెస్ చైర్ పర్సన్ ఆభర్థి 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దేవర సమతవెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం నామినేషన్ చివరి రోజు కావటంతో మున్సిపల్ పరిధిలోని 15 వార్డులో పోటీ చేస్తున్న చేవెళ్ల మాజీ సర్పంచ్ బండారి శైలజా ఆగిరెడ్డి, 18 వార్డులలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ రెండవ సెట్టు దాఖలు చేశారు. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే కాలేయయ్య, డిసీసీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, ముడిమ్యాల పిఏ సి ఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోలిపురం బలవంత్ రెడ్డి, మల్కాపురం వార్డు బక్కని యాదిరెడ్డి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అక్కడి నుండి వందలమంది అభిమానులు,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలివెళ్ళి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

* గజమాలతో అభిమానుల ఘన స్వాగతం.

చేవెళ్ల మున్సిపల్ కాంగ్రెస్ చైర్ పర్సన్ అభ్యర్థి దేవర సమతవెంకట్ రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. నామినేషన్ దాఖాలుకు వెల్తున్న దేవర సమతకు పట్టాణకేంద్రంలోని అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో అభిమానులు గజమాలతో వారి అభిమాన నేతకు ఘనంగా స్వాగతం పలికి మద్దతు తెలియజేశారు. చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ సమతావెంకట్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. అనంతరం మహనీయుల విగ్రహాలకు నివాళిలు అర్పించారు. చేవెళ్ల మున్సిపల్ పట్టణకేంద్రంలోని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, పూలె విగ్రహాలకు ఎమ్మెల్యేతో కలిసి పూలమాలలు వేసి నివాళిలు అర్పించారు.

* చేవెళ్ల మున్సిపల్ అభివృద్దే నా లక్ష్యం

నామినేషన్ దాఖలు చేసిన తరువాత సమతా రెడ్డి,
చేవేళ్ల మాజీ సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి, వార్డు అభ్యర్థులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.. చేవెళ్లకు సేవచేసే అవకాశం ఇవ్వాలని ఆమె ఈ సందర్బంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని,
చేవెళ్లను అభివృద్ధిలో ఆదర్శ పురపాలక కేంద్రంగా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. గతంలో గ్రామంలో స్వంత నిధులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, ఇప్పుడు ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. చేవెళ్లలో కాంగ్రెస్ బలంగా ఉందని తప్పక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలు అందేవిదంగా కృషి చేస్తానన్నారు.

* బండారి శైలజ ఆగి రెడ్డి

చేవెళ్ల సర్పంచ్ గా సేవలందించిన బండారి శైలజ ఆగి రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారు మాట్లాడుతూ.. గతంలో చేవెళ్ల కు సర్పంచ్ గా ఆదరణ అభిమానంతో భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలు మళ్ళీ తనను ఆశీర్వదించి గెలిపించి వార్డు అభివృద్ధికి సేవ చేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చేవెళ్లను చేవెళ్ల జోన్ లోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. చేవెళ్ల మున్సిపల్ లోని అన్ని వార్డులలో కాంగ్రెస్ ను భారీ మెజారిటీతో గెలిపాంచాలని కోరారు.

* మొత్తం 71 నామినేషన్లు.

చేవెళ్ల మున్సిపల్ 18 వార్డులకు చివరి రోజు మొత్తం 71 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ 27, బిఆరెస్ 25,
బీజేపీ 16, సీపీఐ 1, ఇండిపెండెంట్,2 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నామినేషన్ ప్రక్రియకు చివరి రోజు కావడంతో
ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిఆర్ఎస్,బిజెపి పార్టీల అభ్యర్థులు రెండవ సెట్టు నామినేషన్ దాఖలు చేసేందుకు
పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి తరలివస్తుండటంతో చేవెళ్ల జోన్ డీసీపీ యోగేష్ గౌతమ్, ఏసిపి కిషన్ గౌడ్ తో కలిసి భద్రతఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
చేవెళ్ల జోన్ లో జరుగుతున్న మొయినాబాద్ చేవెళ్ల శంకర్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో 59 వార్డులు, 120 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో కట్టుదిట్టమైన బద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఏ చైర్మన్లు దేవర వెంకటరెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, వివిధ వార్డులలో పోటీ చేస్తున్న అభ్యర్థులు చేవెళ్ల మాజీ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు బండారి ఆగి రెడ్డి, బల్వంత్ రెడ్డి, జుకన్నగారి శ్రీకాంత్ రెడ్డి, దావల్గరి గోపాల్ రెడ్డి,. మధుసూదన్ గుప్తా, మద్దెల శ్రీనివాస్, గంగి యాదయ్య, మల్గారి మల్లారెడ్డి, బక్కని యాదిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, 10 వార్డు శంకర్, ఎండి ఫరూక్, అశోక్, క్రిష్ణ నాయక్,
కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సీతారాంపూర్ గ్రామానికి చెందిన వృద్ధుడు అదృశ్యం

వ్యక్తి అదృశ్యం

* సీతారాంపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యంచేవెళ్ల,

 

ఇంట్లో నుంచి బయటకువెళ్లిన వ్యక్తి అదృష్యమైన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన చించేటి బాలయ్య వయస్సు ( 73) అనే వ్యక్తి గతనెలా డిసెంబర్ 30న ఉదయం 6గంటల సమయంలో ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. 24గంటలు గడిచినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్ద, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేదు. దీంతో కనిపించకుండా పోయిన తన తండ్రి ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ ఆయన కుమారుడు చించేటి గణేష్ జనవరి 1న షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఆచూకీ తెలియకపోవటంతో మరోసారి ఈ నెల 8న చేవెళ్ల పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. బాలయ్య ఆచూకీ తెలిసినవాళ్ళు తమకు సమాచారం తెలపాలని కుటుంబసభ్యులు కోరారు. మొబైల్ నెంబర్: 9000692257,9133445503.

ఒక్క అవకాశం ఇస్తే గ్రామానికి సేవ చేస్తా..

ఒక్క అవకాశం ఇస్తే గ్రామానికి సేవ చేస్తా

* సీతారాంపూర్ సర్పంచ్ అభ్యర్థి డప్పు స్వరూప శ్రీనివాస్
* గ్రామానికి గ్రంధాలయం ఏర్పాటు చేస్తాను
* గ్రామంలో యువతకు,మహిళాలకు ఉపాధికి కృషి చేస్తా

చేవెళ్ల,నేటిధాత్రి :

 

 

 

అవకాశం ఇస్తే సర్పంచిగా గ్రామానికి సేవ చేస్తా,గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని సీతారాంపుర్ గ్రామ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి డప్పు స్వరూప శ్రీనివాస్ గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి గ్రామప్రజల మద్దతుతో ప్రచార హోరు కొనసాగిస్తున్నారు. గ్రామప్రజలు తనను సర్పంచిగా ఆశీర్వదిస్తే గ్రామంలో గ్రంధాలయం ఏర్పాటు, యువతకు, మహిళలకు ఉపాధి కల్పించే విదంగా కృషి చేస్తానని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు కోల్పోయిన వారికీ ప్రభుత్వం కేటించిన ఇంటి స్థలాలు ఇప్పటివరకు గ్రామంలో ఎవ్వరికి ఇవ్వలేదు. నేను సర్పంచిగా ఎన్నికైన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి మీలో ఒకరిగా ఉండి భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ప్లాట్స్ వచ్చే విదంగా కృషి చేస్తానని తెలిపారు.

* గతంలో సర్పంచిగా డప్పు వారి కుటుంబం :

గతంలో డప్పు వారి కుటుంబం సర్పంచిగా గ్రామ అభివృద్ధికి, గ్రామానికి సేవ చేశారని,ఇప్పుడు గ్రామప్రజలు తనకు సేవచేసే అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మీడియతో మాట్లాడుతూ గతంలో తనకుటుంబం సర్పంచిగా గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, మరుగుదొడ్లు వంటి ప్రభుత్వ అభివృద్ధి పనులు చేశారని, పేదప్రజలకు పెన్షన్లు, రేషన్ కార్డులు వంటి సహాయాసహకారాలు అందించడం జరిందని తెలిపారు. సర్పంచిగా ఎన్నికైన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని తెలిపారు. గ్రామ ప్రజల మద్దతు తనకే ఉందని ఖచ్చితంగా సర్పంచిగా గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version