పాస్టర్లపై దాడి: నిందితుడిపై కేసు నమోదుకు క్రైస్తవ సంఘాల డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని అనేగుంట గ్రామంలో శనివారం నాడు పాస్టర్ సంజీవ్, పాస్టర్ సురేష్ తమ బృందంతో కలిసి బహిరంగ సువార్త ప్రకటించడానికి వెళ్లారు. సువార్త ప్రకటిస్తున్న సమయంలో, అదే గ్రామానికి చెందిన రాకేష్ అనే వ్యక్తి దైవ దూషణ చేస్తూ, సేవకులను బూతు మాటలతో దూషిస్తూ వారిపై దాడికి దిగాడు. క్రైస్తవ సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడి, అగౌరవపరిచిన రాకేష్ పై భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, మత స్వేచ్ఛ హక్కులను కాలరాస్తూ దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, తగిన శిక్ష వేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు సోమవారం నాడు జహీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనేగుంట గ్రామంలో పాస్టర్లపై జరిగిన ఈ దాడి అమానుషమని వారు పేర్కొన్నారు.
