అక్రమంగా కే ఎల్ ఐ మట్టి రాళ్లు తరలింపు.
కల్వకుర్తి / నేటి ధాత్రి :
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని కురుమిద్ద గ్రామ శివారులో గల కె.ఎల్.ఐ కాల్వ పక్కన ఉన్న రాళ్లను ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు బడా బాబుల అండదండలతో బయటకు టిప్పర్ల ద్వారా విక్రయించడంతో గ్రామస్తులు యువకులు టిప్పర్లను అడ్డగించి కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో టిప్పర్లను పోలీస్ స్టేషన్ ముందు ఉంచారు కానీ సంబంధిత అధికారులు మాత్రం స్పందించలేదు గ్రామస్తులు చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో మాకు ఏం తెలియదు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు ఏది ఏమైనా సరే టిప్పర్లను సీజ్ చేయాలని గ్రామస్తులు కల్వకుర్తి ఎస్ఐ కి ఫిర్యాదు చేశారు. కే ఎల్ ఐ కాల్వ పక్కన ఉన్న రాళ్లను మట్టిని బయటికి తరలిస్తే భవిష్యత్తులో ఏమైనా వరదలు వచ్చి పంట పొలాలు గ్రామంలోని గృహాలు మునిగిపోయి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కనుక సంబంధిత అధికారులు ఇప్పటికైనా ఈ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.