చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదేలేదు
జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు
జైపూర్,నేటి ధాత్రి:
రామగుండం సిపి,డిసిపి ఆదేశాల ప్రకారం రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ జైపూర్ సబ్ డివిజన్ లోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్లు పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.ఏదైనా సమస్య విషయంలో డయల్ 100 కాల్ కాని,స్థానిక పోలీసు వారికి సమస్య తెలిపినప్పుడు,సమాచారం అందించినప్పుడు జైపూర్ పోలీస్ వారు ఎలా ప్రతిస్పందిస్తున్నారని,భద్రత పరమైన విషయాలపై,పోలీసుల పనితీరుపై అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు.ఈ ప్రాంతంలోని రౌడీషీటర్స్,సస్పెక్ట్ షీట్స్ లకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రస్తుత పరిస్థితి,జీవన విధానం ను అడిగి తెలుసుకుని ప్రజా జీవనానికి భంగం కలిగించిన,చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరమైన కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.గంజాయి అక్రమ రవాణా,నిల్వ,సరఫరా పై నిఘా,నియంత్రణలో భాగంగా ఇందారం లోని అనుమానస్పద ప్రాంతాలను మరియు ఇండ్లను,ఇంటి పరిసరాలను నార్కోటిక్ డాగ్ తో క్షుణ్ణంగా పరిశీలించారు.వాహనాల తనిఖీ నిర్వహించి 70 మోటార్ సైకిళ్లకు,05 ఆటోలకు,ఇతర వాహనాలకు ధ్రువపత్రాలను చెక్ చేసి సరైన వాహన పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు.టూ వీలర్ వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.
ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ..చట్ట ప్రకారం ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవించే ప్రజలకు పోలీస్ వ్యవస్థ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.వారికీ సహాయ సహకారం అందిస్తాం వారికీ అండగా ఉంటాం అన్నారు.అదేవిదంగా చట్ట విరుద్ధంగా ఎవరు పనిచేసిన ఎవరిని వదిలి పెట్టేది,ఉపేక్షించేది లేదు అని అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిని తప్పకుండా జైలుకు పంపిస్తామని ఏసిపి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసిపి ఏ.వెంకటెశ్వర్లు,శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు చందర్,జైపూర్ ఎస్సై శ్రీధర్,శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్,టీఎస్ఎస్పి పోలీస్,సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.