జర్నలిస్ట్ రాజేందర్ పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలి
దళితుడని రాజేందర్ పై కుట్రలు
ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లాలో ఇటీవల సీనియర్ జర్నలిస్టు దామెర రాజేందర్ పై ఐనవోలు పోలీసులు పెట్టిన తప్పుడు కేసును వెంటనే ఎత్తివేయాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు.జర్నలిస్టు దామెర రాజేందర్ పై ఐనవోలు పోలీసులు బనాయించిన తప్పుడు కేసు పై మాట్లాడుతూ రాజేందర్ గతంలో దాదాపు పదేండ్లు వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా పనిచేశారని,ప్రస్తుతం సొంత పత్రికను నడుపుతున్నారని,ఐనవోలు తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై రాజేం దర్ పత్రికలో వరుస కథనాలు ప్రచురించారని తెలిపారు.దీనిని మనసులో పెట్టుకున్న ఐనవోలు తహశీల్దార్ రాజేందర్ పై కుట్రపన్ని పథకం ప్రకారం యూట్యూబర్ సహాయంతో పోలీసులతో కుమ్ముక్కై కావాలని తప్పుడు కేసు నమోదు చేయించి జైలుకు పంపించారని ఆరోపించారు. నీతి,నిజాయితీతో వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం సరైంది కాదని అన్నారు.కావాలని ఒకరిద్దరు రాజేందర్ పై సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని,తప్పుడు ప్రచారాలు చేస్తున్న యూట్యూబర్ ను వదిలేసి ఏ తప్పు చేయని జర్నలిస్టు రాజేందర్ పోలీసులు అక్రమంగా కేసు బనాయించి వేధిస్తున్నారని అన్నారు.ఈ కుట్రపూరిత అక్రమ కేసు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.జర్నలిస్టు రాజేందర్ పై పోలీసులు పెట్టిన కేసును ఉపసంహరింపజేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ఐనవోలు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన భూములు,ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్ లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.జర్నలిస్టులపై పోలీసులు పెట్టిన ఆ మ కేసులకు బాధ్యులైన ఐనవోలు తహశీల్దార్,ఎస్ ఐలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్. చేశారు.ఈ విషయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జర్నలిస్టు దామెర రాజేందర్ పై అక్రమ కేసు తొలగించక పోతే మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయాల్సి వస్తుందని మైస ఉపేందర్ మాదిగ హెచ్చరించారు.