‘రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ’

‘రైతులకు ట్రాన్స్ ఫార్మర్ల పంపిణీ’

దేవరకద్ర /నేటి ధాత్రి :

 

 

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలోని జానంపేట గ్రామంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మంగళవారం అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్ మండలాలకు చెందిన 67 మంది రైతులకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి లో వోల్టేజీ సమస్యను తీర్చలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్లను అందజేస్తున్నమన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఏ ఒక్క రైతుకు లో వోల్టేజీ సమస్యతో బాధపడకుండా.. పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

‘తడిసిన ధాన్యం.. ఇబ్బందుల్లో రైతులు’

‘తడిసిన ధాన్యం.. ఇబ్బందుల్లో రైతులు’ 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరి, చిన్నరేవల్లి, మోదంపల్లి, హేమాజీ పూర్ తదితర గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పెద్దరేవల్లి రైతు వేదిక వద్ద ఈదురు గాలులకు ఆరబెట్టిన ధాన్యం స్వల్పంగా తడిసింది. ఈదురు గాలులకు కుప్పలపై కప్పిన టార్పలిన్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిందని రైతులన్నారు. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ సైతం కూలిపోయిందన్నారు.

రైతులు తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చు.!

ఫామ్ ఆయిల్ తోటలతో రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు

రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామములో రైతు బోయినీ.వాసు 4ఎకరాలతో సాగు చేస్తున్న ఫామ్ ఆయిల్ తోటను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు భవిష్యత్తు ప్రయోజనాల కోసం తాను మంత్రిగా ఉన్నప్పుడు ఫామ్ ఆయిల్ తోటలు పట్ల రైతులకు అవగాహన కల్పించి సాగు దిశగా ప్రోత్సహించామని నిరంజన్ రెడ్డి అన్నారు.ఫామ్ ఆయిల్ తోటల వల్ల రైతులు దీర్ఘకాల ఆదాయం లాబాలు పొందుతూ అదేవిధంగా అంతర్గత కొత్త రాకాల పంటల వేసుకొని జీవనోపాధి పొందవచ్చని అన్నారు.మార్కెట్లో ఫామ్ ఆయిల్ మంచి గిరాకీ ఉన్నదని భవిష్యత్తు మొత్తం ఫాం ఆయిల్ తోటలది మాజీ మంత్రి అన్నారు. పంట సాగు చేస్తున్న వాసుకు సూచనలు చేసి అభినందించారు. మాజీ మంత్రి
నిరంజన్ రెడ్డి వెంట మాజీ సర్పంచ్ శారద ఆశన్న నాయుడు, చిట్యాల.రాము,నరసింహ,బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు ఉన్నారని మీడియా ఇంచార్జి నందిమల్ల అశోక్ తెలిపారు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమo .!

పిజేటిఏయూ వారి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమo

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గల వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో రైతులకు మేలైన సాగు పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు, వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు వ్యవసాయ శాఖతో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే వినూత్న కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా రామడుగు మండలo దేశరాజుపల్లి గ్రామంలోని రైతువేదిక నందు నిర్వహించడం జరిగినది. వ్యవసాయ పరిశోధన స్థానం, శాస్త్రవేత్త మరియు అధిపతి డా.ఉషారాణి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంతో పాటు ముఖ్యమైన అంశాలైన తక్కువ యూరియా వాడండి, సాగు ఖర్చుని తగ్గించండి, అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి, రశీదులను భద్రపరచండి, కష్టకాలంలో నష్ట పరిహారాన్ని పొందండి అని తెలిపారు. ఈకార్యమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఎంసి చైర్మన్ బొమ్మరవేణి తిరుమల మరియు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ రైతులందరూ యూరియ వాడకాన్ని తగ్గించి, చెట్లని పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. నెల రోజుల పాటు జిల్లాలో వివిధ గ్రామాలలో జరిగే ఈరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ శాస్త్రవేత్త డా . ఏ.విజయభాస్కర్ సాగు నీటిని ఆదా చేయండి, భావి తరాలకు అందించండి, పంట మార్పిడి పాటించండి, సుస్థిర ఆదాయాన్ని పొందండి, చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అనే విషయాలు రైతులకు తెలిపారు. జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్ రావు రైతులను ఉద్దేశిస్తూ మామిడి, కూరగాయ, ఆయిల్ పామ్ సాగు వివరాలు తెలిపారు. అనంతరం టిఎస్ఎస్డిసి రీజినల్ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతు నాణ్యమైన విత్తన లభ్యత మరియు ధరల వివరాలను వివరించారు. ఈకార్యక్రమంలో చొప్పదండి సహ సంచాలకులు ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, సీడ్ ఆఫీసర్ మౌనిక , ఉద్యాన శాఖ ఆఫీసర్ రోహిత్, విఏఎస్ మనోహర్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు రమేష్, సంపత్, గోవర్ధన్ సుమారు నూటా యాభై ఏడు మంది రైతులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట.

నాగర్ కర్నూల్  నేటి దాత్రి:

నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో మండలానికి సంభందించిన రైతులకు శనివారం రోజున ప్రభుత్వ సబ్సిడీ కింద మంజూరు అయిన స్ప్రింక్లర్లను ఎమ్మేల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతాంగానికి పెద్ద పీట వేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ కింద 24 వేల కోట్ల రూపాయలు వెచ్చించిందని, సన్న వడ్లకు బోనస్ ఇచ్చిందని, ఎలాంటి షరతులు లేకుండా రైతుల నుండి ధాన్యం కోనుగులు చేసిందని, వ్యవసాయ యాంత్రీకరణను రైతాంగానికి మరింత దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుందని,. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రజా ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని ఎమ్మేల్యే అన్నారు.ఇట్టి కార్యక్రమంలో సంబధిత అధికారులు, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, మండల ప్రెసిడెంట్ కోటయ్య,మాజీ కౌన్సిలర్స్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వినోద్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, పాల్గొన్నారు.

రైతులందరు తమ వివరాలను నమోదు చేసుకోవాలి .

రైతులందరు తప్పకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలి – ఎన్.ప్రియదర్శిని

రామడుగు నేటిధాత్రి:

 

 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అమలుపరుస్తున్న విశిష్ట రైతుల గుర్తింపు కార్డుల నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట, రంగసాయిపల్లి గ్రామాల్లో సహాయక వ్యవసాయ సంచాలకులు ఎన్.ప్రియదర్శిని సందర్శించారు. ఈసందర్భంగా ఎన్.ప్రియదర్శిని మాట్లాడుతూ ఈనమోదు కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించబడుతుందని రైతులందరు తప్పకుండా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఆయా క్లస్టర్ లో ఏఈవోలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.

ఆర్డీఓని కలిసిన జిల్లా రైతు సంఘం అధ్యక్షులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ ఆర్డీవో రామ్ రెడ్డిని రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రైతుకు భూ భారతి చట్టంపై అవగాహన, ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. రైతు సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు.

రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు

రైతులకు అవగాహన కార్యక్రమం

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేతలు డా. దిలీప్ కుమార్, డా.విశ్వా తేజ్, మండల వ్యవసాయ అధికారి గంగ జమున వారి ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” రైతుల అవగా హన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .

Farmer Awareness Program.

 

రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చుల ను తగ్గించుట, అవసరం మేరకు రసాయనా లు వినియోగం, రైతు సోదరు లు కొనుగోలు చేసిన విత్తనాల మరియు పురుగుల మందుల రసీదులను భద్రపరచు కోవ డం, పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు, చెట్లను పెంచడం, సాగునీటిని ఆదా చేయడం వలన కలిగే ప్రయో జనాలు రైతులకు వివరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్, గ్రామపంచా యతీ కార్యదర్శి నాగశ్రీ, వ్యవ సాయ కళాశాల వరంగల్ విద్యార్థులు,కొత్తగట్టుసింగారం గ్రామ రైతులు పాల్గొన్నారు.

రైతులకు రుణమాఫీ చేయడములోరాష్ట్ర ప్రభుత్వం విఫలం.!

రైతులకు రుణమాఫీ చేయడములోరాష్ట్ర ప్రభుత్వం విఫలం సీపీఎం
వనపర్తి నేటిధాత్రి

 

 

. సిఐటియు వనపర్తి జిల్లా కార్యాలయంలో సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశము నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సి పి ఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ మాట్లాడారు. కార్ల్ మార్క్స్ 207వ, జయంతి సందర్భంగా కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ” కారల్ మార్క్స్ 1818 లో జర్మనీలో జన్మించారని నేటికీ 207 సంవత్సరాలు అవుతుందని, ఆయన సిద్ధాంత రచన కమ్యూనిస్టు ప్రణాళిక విడుదలై 177 సంవత్సరాలు అవుతుందని అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడంతో పాటు స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. కేరళ తరహ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డుకు 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితం గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ ,జిఎస్ గోపి, బాల్ రెడ్డి ,ఏం. రాజు ,ఏ. లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు, ఆర్. ఎన్. రమేష్, బి. వెంకటేష్, బాల్య నాయక్, గుంటి వెంకటేష్ ,ఎం. పరమేశ్వరా చారి, ఎం. కృష్ణయ్య, ఎస్. రాజు, బి వెంకటేష్, ఎం. వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వానకు రాలిన మామిడి తోటలను కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ చిగురుమామిడి మండలంలో సోమవారం రాత్రి కురిసిన వడగళ్ల వర్షాలతో దెబ్బతిన్న వరి పంటలను, మామిడి ఇతర పళ్ళ తోటలను వెంటనే వ్యవసాయ అధికారులు పరిశీలించి అంచనాలు వేసి రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జైపాల్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో చాలా గ్రామాల వద్ద ఐకెపి సెంటర్ల వద్ద వరి ధాన్యం వందలాది క్వింటాల అమ్మకం కోసం ఆరబోసారని వడగళ్ల వాన వల్ల పూర్తిగా వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయన్నారు. వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలన్నారు.
రైతన్నకు చేతికి అందిన పంట వడగళ్ల వాళ్ళతో నీటిలో కలిసిపోయిందని, మామిడి ఇతర పళ్ళ తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని రైతన్న తీవ్ర ఆవేదనతో కృంగిపోతున్నాడని వెంటనే ప్రభుత్వం ప్రతి ఎకరాకు యాభై వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంట బీమా పథకాన్ని అమలు చేసి ఉంటే రైతులకు ఎంతో ఉపయోగపడేదని ప్రభుత్వ అసమర్థ విధానం వల్ల ప్రతి రైతు కూడా పరిహారాన్ని గ్యారంటీగా అందుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని లేకుంటే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని జైపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పండ్లతోటలు పరిశీలించిన వారిలో పతెం రాజేశ్వర్ రెడ్డి, తాటిపెళ్లి లింగయ్య, బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు భోజనాల ఏర్పాట్లు.

‘రైతులకు భోజనాల ఏర్పాట్లు’

ఆమనగల్ /నేటి ధాత్రి

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగలులోని మార్కెట్ చైర్మెన్ శ్రీమతి యాట గీతా నర్సింహ సొంత డబ్బుతో రైతుల కోసం బోజనాలు ఏర్పాటు చేసి మంచి మనసు చాటుకున్న మార్కెట్ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహ ముదిరాజ్ మార్కేట్ ఆవరణలోని రెైతులు బోజనాలు చేస్తూ సంతొషం వ్యక్తం చేశారు.

ఆమనగల్లు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ లో వడ్లు అమ్మటానికి వచ్చిన రైతుల కోసం సోమవారం నుండి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహ బోజనాలు, మంచి నీళ్ళ వసతులు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రెైతులు బోజనాలు చేస్తూ సంతొషం వ్యక్తం చేస్తూ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహకు ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పటి వరకు ఈ మార్కెట్ కమిటీ ఆవరణలో రైతుల కోసం ఎవ్వరూ బోజనాలు ఏర్పాటు చేయలేదు, మొదటి సారి రైతుల కోసం బోజనాలు ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీతా నర్సింహ ముదిరాజ్ గారికి మరొక్కసారి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.

అలాగే రైతుల కోసం క్వింటాల్ కి రూ 500 బోనస్ ఇస్తున్న ప్రజా ప్రభుత్వంకి ప్రత్యెక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని అన్నారు.

రైతులను ఆదుకోవాలని సంకల్పంతో రైతుల కోసం ఎన్నో చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎప్పటికి రుణపడి ఉంటాము అని పలువురు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న మంచి పనుల పై సంతొషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ వస్పుల శ్రీశైలం, తాళ్ళ రవీందర్, అజీమ్,రమేష్ గౌడ్, నరేష్ నాయక్,అంజయ్య గుప్తా, శ్యామసుందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ చేగురి వెంకటేష్, యూత్ కాంగ్రెస్ కల్వకుర్తి ఉపాధ్యక్షుడు షాబుద్దీన్ , మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వస్పుల శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డిగ్రీ కృష్ణ, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

ఆధార్ తరహాలో..రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు.

ఆధార్ తరహాలో..రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు

రాష్ట్రంలో నేటి నుంచి నమోదు

కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికం

నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఆధార్‌ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు (ఫార్మర్‌ రిజిస్ట్రీ) ప్రాజెక్టు తెలంగాణలో ప్రారంభమైన నేపథ్యంలో మొదటగా వ్యవసాయశాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారని నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి తెలిపారు.కాగా రాష్ట్ర వ్యాప్త నమోదు కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని అని మండలాల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఏ.డీ.ఏ మాట్లాడుతూ రైతుల విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు త్వరలో మీ సేవ కేంద్రాల్లోనూ చేసుకోవచ్చని అన్నారు. ఆధార్‌ సంఖ్యతో అనుసంధానమైన, పట్టాదారు పాసుపుస్తకంలోని భూయాజమాన్య వివరాల నమోదు ద్వారా రైతుకు గుర్తింపు కార్డును కేటాయిస్తారని పేర్కొన్నారు.రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాల కల్పన సహా పలు పథకాలు అమలు చేస్తోందని వాటికి సరైన గణాంకాలు, ధ్రువీకరణలు, నమోదు వివరాలు లేక రైతులకు సకాలంలో పథకాలు అందడంలేదని కేంద్రం గుర్తించిందని ఏడీఏ వివరించారు.ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలోని భూములు,పంటల వివరాలే కేంద్రానికి అందుతున్నాయని, రైతుల వారీగా పంటల వివరాలు, ఇతరత్రా సమాచారం అందడం లేదని దీంతో వ్యవసాయ శాఖ డిజిటలీకరణకు ఇది సమస్యగా మారిందని పేర్కొన్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియను పూర్తిచేశాయి. తెలంగాణలో వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని సోమవారం నుంచి ‘అగ్రిస్టాక్‌ తెలంగాణ ఫార్మర్‌ రిజిస్ట్రీ’ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.కాగా ప్రక్రియ పట్ల మండల వ్యవసాయ అధికారులు (ఎంఏవో), వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)కు శిక్షణ ఇచ్చిందన్నారు.

విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదుకు వ్యవసాయ శాఖ..

Agriculture

 

విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కోసం భూయాజమాన్య పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్, ఫోన్‌ నంబర్‌తో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి.కాగా ఎంఏవో లేదా ఏఈవో వద్ద నమోదు చేసుకోవాలి. అనంతరం లబ్ధిదారుకు ఓటీపీ వస్తుంది. దాని ధ్రువీకరణ ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారని ఏడీఏ దామోదర్ రెడ్డి తెలిపారు.ఈ సంఖ్యను కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్‌లో తదుపరి విడత నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పథకాలకు సంబంధం లేదు..

రైతుల విశిష్ట సంఖ్యకు.. రాష్ట్రంలో అమలయ్యే రైతుభరోసా, రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫార్మర్‌ రిజిస్ట్రీలో నమోదు..రాష్ట్రంలో చట్టబద్ధ భూయాజమాన్య హక్కు కల్పించదని, రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా ఉంటాయని వ్యవసాయశాఖ పేర్కొందని నర్సంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు దామోదర్ రెడ్డి తెలియజేశారు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం.

వెంకటాపూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ముఖ్య అతిధిగా హాజరైన మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి

 

 

మండలంలో వెంకటాపురం గ్రామం లో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతుల అవగాహన కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకం,సాగుఖర్చును తగ్గించుట,అవసరం మేరకు రసాయనాలు వినియోగం,రైతు సోదరులకు రసీదులను భద్రపరుచుకోవడం,పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు,చెట్లను పెంచడం,సాగునీటిని ఆదా చేయడం వలన కలిగే ప్రయోజనాలు రైతులకు గ్రామంలోని వివిధ పంటలలో సస్యరక్షణ చర్యల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్,వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బి. రాజు,డాక్టర్ కే.స్వాతి, వ్యవసాయ విస్తరణాధికారులు కాటంరాజు,వ్యవసాయ కళాశాల వరంగల్ విద్యార్థులు, వెంకటాపూర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

రైతులకు బయోచార్ మరియు పత్తి సాగుపై శిక్షణ.!

రైతులకు బయోచార్ మరియు హెచ్ డి పి సి పత్తి సాగుపై శిక్షణ కార్యక్రమానికి పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం రైతు వేదికలో ఆరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్ ద్వారా నిర్వహించబడిన రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం స్థిరమైన వ్యవసాయ పద్ధతులు మరియు పత్తి సాగులో తాజా మార్పులపై దృష్టి సారించాలన్నారు..
ఈ సందర్భంగా అరణ్య సీఈఓ శ్రీమతి పద్మ కోప్పుల మాట్లాడుతూ, వ్యవసాయ వ్యర్థాలతో తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే బయోచార్ ప్రయోజనాలను వివరించారు. “బియోచార్ మట్టిలో పోషకాలు మరియు నీటిని నిలిపే సామర్థ్యాన్ని పెంచుతుంది, సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది, రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గిస్తుంది,” అని ఆమె చెప్పారు. “ఇది మట్టిలో కార్బన్ను వందల సంవత్సరాలపాటు నిలుపుతుంది. ఇది వాతావరణానికి మేలు చేసే పరిష్కారం.” రైతులు బయోచార్తో కంపోస్టింగ్ ప్రారంభించాలని ఆమె సూచించారు. “మీ మట్టి, మొక్కలు మరియు భూమి మిమ్మల్ని ధన్యవాదాలు చెబుతాయి,” అని ఆమె అన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి (డి ఏ ఓ ) శ్రీ కె. శివప్రసాద్ హెచ్ డి పి సి పత్తి సాగుపై వివరాలు పూర్తి వివరాలు తెలియచేశారు.
“ఎకరాకు ఎక్కువ విత్తనాలు వేసి, తక్కువ దూరంతో సాగు చేస్తే దిగుబడి బాగా పెరుగుతుంది,” అని ఆయన అన్నారు. “దేశంలో పెరుగుతున్న పత్తి డిమాండ్ను తీర్చడానికి, తక్కువ దిగుబడిని అధిగమించడానికి హెచ్ డి పి సి సరైన మార్గం” అని ఆయన పేర్కొన్నారు.
సహాయ సంచాలకులు బిక్షపతి మాట్లాడుతూ పాత పద్ధతి వ్యవసాయం నూతన పద్ధతిలో వ్యవసాయం గురించి తేడాలను రైతులకు వివరించడం జరిగింది.
మండల వ్యవసాయ అధికారి వెంకటేశం మాట్లాడుతూ గత ఏడాది అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు గురించి గత ఏడాది వచ్చిన సమస్యల గురించి వాటికి ఏ విధంగా అధిగమించాలని రైతులకు సూచించడం జరిగింది, అలాగే ఫార్మర్ రిజిస్ట్రీ సోమవారం నుండి చేయడం జరుగుతుంది అని తెల్పడం జరిగింది,
రైతులకు ఉచితంగా బయోచార్ను అందిస్తూ, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కంపెనీ పనిచేస్తోందని తెలిపారు.
నూజీవీడు సీడ్స్ ప్రతినిధి మాట్లాడుతూ, హెచ్ డి పి సి పత్తి సాగు రైతుల్లో మంచి ఆదరణ పొందుతోందన్నారు.
ఈ పద్ధతిలో సంప్రదాయ సాగుతో పోల్చితే ఎకరాకు 3 నుండి 5 క్వింటాళ్ల ఎక్కువ పత్తి దిగుతుంది. ఈ సీజన్లోనే 59 జిల్లాల్లో 35,000 ఎకరాల్లో హెచ్ డి పి సి పత్తి నమోదు చేయడం దీనికి నిదర్శనం అన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమం గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ దిగుబడులు మరియు పర్యావరణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్థిరమైన సాగు పద్ధతులను ప్రోత్సహించేందుకు కీలకమైన అడుగు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు బిక్షపతి మరియు మండల వ్యవసాయ అధికారి వెంకటేశం ఆరణ్య ఎన్జీవో సీఈవో పద్మ నూజివీడు సీడ్స్ నరసింహారెడ్డి, ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది..

రైతును మోసం చేస్తే సహించం.

రైతును మోసం చేస్తే సహించం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

ధాన్యం కొనుగోలు సెంటర్లలో తరుగు పేరుతో రైతును మోసం చేస్తే సహించమని కఠిన చర్యలు ఉంటాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హెచ్చరించారు.

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలంలో జీవనజ్యోతి ప్లేరపి మహిళ సమైక్య వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యే జిఎస్ఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి రైతులు తరుగు లేకుండా లాభం పొందాలని వారు సూచించారు. అదేవిధంగా రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకురావాలని అన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలి అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టేందుకు అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లు, గన్నీలు,వేయింగ్ యంత్రాలు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతు కుటుంబాల వివరాలు పంట నష్టం వివరాలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పంట నష్ట వివరాలను వ్యవసాయ ఉద్యాన శాఖల వివరాలను సక్రమంగా పంపించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వ్యవసాయ శాఖ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివ శంకర్ గౌడ్ వడ్లకొండ నారాయణ గౌడ్ మండల నాయకులు అధికారులు ఎమ్మార్వో ఎంపీడీవో మహిళా సమైక్య అధికారులు సిసి బాబా మహిళలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని.

వర్షాలకు తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని

బీ ఆర్ ఎస్ అధ్యర్యములో రైతులు రాస్తా రోకో

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

వర్షాలకు తడిసిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యర్యములో రైతులు వనపర్తి లో రాస్తా రోకో చేశారు రైతులకు అండగా ఉంటామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతులకు అండగా ఉంటామని చెప్పారు.
రాత్రి వనపర్తి జిల్లా లో కురిసిన వర్షాలకు తడిసిన వడ్లను మార్కెట్ యార్డ్ లో పరిశీలించి ప్రభుత్వం ధాన్యాని కొనుగోలు చేసేవరకు పోరాడుతామని బి.ఆర్.ఎస్ నాయకులు రైతుల కు ధైర్యం చెప్పారు జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,పి.రమేష్ గౌడ్,మార్కు ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్,పి.ఏ.సి.ఎస్ అధ్యక్షులు వెంకట్రావ్,రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నెల రోజుల క్రితం వచ్చిన వడ్లను సంచులు లేవని,ట్రాస్ఫోర్ట్ లేదని కొనుగోళ్లు చేయకపోవడం వడ్లు వర్షాల వల్ల నీటి పాలు అయినాయని ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు
ఈ యాసంగిలో 75లక్షల బస్తాలు మార్కెట్ యార్డ్ కు వస్తాయని అంచనా ఉన్నా పర్యవేక్షణ లేక రైతులను ప్రభుత్వం నట్టేట మంచిదని విమర్శించారు.
రైతులతో కలసి దాదాపు గంటసేపు రాస్తారోకో చేసి వాహనాలను స్తంభింపజేసి నిరసన తెలిపారు.రాస్తా రోకో దగ్గిరి కి వచ్చిన తహసీల్దార్ తడసిన వడ్లను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల.అశోక్,గంధం.పరంజ్యోతి,భానుప్రకాష్ రావు,మహేశ్వర్ రెడ్డి,ధర్మా నాయక్,నాగన్న యాదవ్,ఉంగ్లం. తిరుమల్, గులాం ఖాదర్ ఖాన్, సూర్యవంశం.గిరి,ఇమ్రాన్, జోహెబ్ హుస్సేన్ సునీల్ వాల్మీకి,చిట్యాల రాము బాబు నాయక్,పాషా,నారాయణ నాయక్,రైతులు పాల్గొన్నారు.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి.

పంట నష్టపరిహారంపై స్పందించని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు…

బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులకు అండగా నిలబడాలి..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి, గాలి బీభత్సానికి కోతకు వచ్చిన వరి,ఇతర పంటలు నేలమట్టం కావడంతో రైతులకు తీవ్రనష్టం జరిగిందని మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి
అవేదన వ్యక్తం చేశారు.పంట కోత సమయంలో జరిగిన నష్టం రైతును మానసికంగా కృంగదీసిందని ఆయన పేర్కొన్నారు.గాలి బీభత్సం,అకాల వర్షం వలన నర్సంపేట డివిజన్ వ్యాప్తంగా పలు రకాల పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
డివిజన్ పరిధిలో కొన్నిచోట్ల కోతలు పూర్తి చేసుకుని అమ్మకానికి కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్న రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దైందన్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని,పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు చెల్లించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఖానాపురం మండలంలో గత పది రోజుల క్రితం కురిసిన వర్షానికి పంట నష్టపోయిన రైతులను క్షేత్రస్థాయిలో స్థానిక రైతులుబిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తాను పరిశీలించి అధికారులకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు,అధికారులు రైతులను పట్టించుకునే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు.ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు రోడ్లపై ధర్నాలు చేస్తుండగా పోలీసులతో అరెస్టు చేయించారే తప్ప రైతులకు మాత్రం భరోసా ఇవ్వలేకపోయారని ఆరోపించారు.నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పరిశీలించి రైతులకు భరోసా ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.

పంట నష్టపోయిన రైతులకు.!

పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25000/- నష్ట పరిహారం అందించాలి –

మాజీ పి ఎ సి ఎస్ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

మిల్లర్లు రైతులకు సహకరించాలి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలంలో అకాల వర్షం కారణంగా మండలంలో వరి పంట పూర్తిగా దెబ్బతిందని , పంట చేతికచ్చే సమయానికి రైతులపై పకృతి విలయతాండవం చేసిందని, రెండు రోజులుగా కురిసిన వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ఇ పరిస్థితులను విపత్తుగా పరిగణలోకి తీసుకొని నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ 25000/- అందించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా అధికారులు, జిల్లా మంత్రి చొరవ తీసుకుని రైతులను ఆదుకోవాలని అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు
మిల్లర్లు రైతులకు సహకరించాలని, సివిల్ సప్లై అధికారులు నిత్యం అందుబాటులో ఉంటూ రైతులకు భరోసా కల్పించాలని పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అన్నారు.

అకాల వర్షాల వల్ల కౌలు రైతుల ఆవేదన .

అకాల వర్షాల వల్ల కౌలు రైతుల ఆవేదన

ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చేతికి అంది వచ్చిన పంట పొలాలు నీట మునిగి కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గణపురం మండలానికి చెందిన కౌలు రైతు గుర్రం తిరుపతి గౌడ్ అనే రైతు 10 ఎకరాల లో వరి పంట సాగు చేయడం జరిగింది మొన్న కురిసిన అకాల వర్షం కారణంగా వరి పంట మొత్తం నీట మునిగి నష్టం వాటిల్లిందని కౌలు రైతు ఆవేదన వ్యక్తం తెలిపాడు
కౌలు రైతులు పంట పొలాలకు ఎంతో పెట్టుబడింది పెట్టి కష్టపడి పండిస్తున్న పంట చేతికి వచ్చే. సమయానికి అకాల వర్షం వల్ల నష్టాలు జరిగే కౌలు రైతులు పెట్టిన పెట్టుబడి చేతికి అందక అప్పుల పాలు అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం కానీ అధికారులు గానీ కౌలు రైతులను ఆదుకోవాలి అని తెలిపారు

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది.

అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న పంటలపై సర్వే చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గాలివానకు దెబ్బతిన్న వరి,మామిడి,మిర్చి ఇతర నేలకొరిగిన పంటలను సర్వే చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు.క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంటలను పరిశీలించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.అలాగే రైతుల పక్షపతి కాంగ్రెస్ ప్రభుత్వం అని,ప్రజలు అధైర్య పడొద్దని,ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భరోసా కల్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version