భూభారతి రైతులకు ఒక వరం.

భూభారతి రైతులకు ఒక వరం

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్య శారదా

#నెక్కొండ,

నేటి ధాత్రి;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణిని దరిదాపుల్లో లేకుండా చేసి భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ భూభారతి రైతుకు ఒక వరం రైతులు ఈ భూభారతిని సరైన విధంగా వినియోగించుకోవాలని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి బుధవారం అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతి రికార్డుల్లో తప్పులు సవరణ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సెక్షన్ 5, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్, ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, పట్టాదారు పాసు పుస్తకాలు, ఆపిల్ వ్యవస్థ రివిజన్ అధికారాలు, గ్రామ రెవెన్యూ రికార్డులు, రికార్డుల నకలు పొందడం ఎలా, తదితర అంశాలపై రైతులకు ఒక అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తున్నదని, అధికారులు గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలకు భూభారతి విధివిధానాల కరపత్రాలు గ్రామాల్లో పంపిణీ చేయాలని, ఆయన అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని, 39 గ్రామపంచాయతీలు ఉన్నాయని, మండలంలో మొత్తం విస్తీర్ణం 49,466 ఎకరాల భూమి ఉందని, 33,250 ఎకరాల పట్టా భూములు ఉన్నాయని, అలాగే 6862 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, 25491.36 ఎకరాల భూమికి పట్టాదారు పాస్బుక్కులు ఇప్పటివరకు ప్రభుత్వం సరఫరా చేసిందని,6293 ఎకరాల భూములపై వివాదాస్పదమైన ఆరోపణలతో కేసులు ఉన్నాయని అలాగే 4120, వివిధ కారణాలతో పట్టా భూములకు ఇంకా పట్టాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా రైతుకు సులభమైన మార్గంలో మీ భూ సమస్యలు పరిష్కారానికై ఈ భూభారతి విధానం వచ్చిందని అన్నారు. నెక్కొండ మండలంలో భూ యజమానులు 15145 ఉన్నారని, 15145 ఖాతా నెంబర్లు కలిగి ఉన్నారని, ఇప్పటివరకు మండలంలో ఆర్ఓఆర్ కంప్యూటర్ లో నిక్షిప్తం అయినావి 15145, ఇవి కాక 6293 పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ఉన్నాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి, ఏ డి ఏ దామోదర్ రెడ్డి, నెక్కొండ తహసిల్దార్ వేముల రాజ్ కుమార్, నెక్కొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి ,నర్సంపేట వ్యవసాయ మార్కెట్ఠ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బక్కీ అశోక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, పలు గ్రామాల మాజీ సర్పంచ్ ఎంపీటీసీలు మహిళా సంఘ ప్రతినిధులు మహిళ సంఘల మహిళలు, రైతులు, మహిళ రైతులు,లతోపాటు సిఐ సన్నాయిల శ్రీనివాస్, ఎస్ఐ మహేందర్లు, బందోబస్తు నిర్వహించారు.

వర్షాల కారణంగా రైతులకు పంట నష్టం .

వర్షాల కారణంగా రైతులకు పంట నష్టం ….

◆ చేతికొచ్చిన పంట కోతకు రాని దుస్థితి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

కోహిర్ మండలం పరిధిలోని మామిడి మొక్కజొన్న, బొప్పాయి పంట రైతులకు తీవ్ర నష్టం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు.చేతికొచ్చిన పంటలను కోయలేని పరిస్థితి నెలకొనడంతో రైతు నేలకు భారీ నష్టం సంభవిస్తుంది.మొక్కజొన్న,కూరగాయల వంటి పంటలు కోతకు సిద్ధంగా ఉండగా, నిరంతర వర్షాలు, వడగళ్ల కారణంగా బురదమయ ఏమైనా పొలాల కారణంగా కోత పనులు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు పొలాల్లో నిలిచిపోవడంతో పంటలు కుళ్లిపోతున్నాయి. ముఖ్యం గల తక్కువ ఎత్తులో ఉన్న పొలాల్లో నీరు చేరడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ పరిస్థితి రైతులను ఆర్థికంగా మానసీకం గా కూడా కుంగదీస్తుంది. కొందరు రైతులు పంట కోసేందుకు కూలీలు రాకపోవంతో యంత్రాలు బురదలో కదలలేని స్థితి కారణంగా నష్టం తప్పడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి, బొప్పాయి. రైతులు భారీ వర్షాలు వనగళ్లు కారణంగా కాయలు తీ వ్రంగా దెబ్బతినడంతో మార్కెట్లో ధర లేకపోవడం తో చెట్టుపైనే మామిడికాయలు కోయకుండా వదిలేశారు. రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని సూచించారు. రైతుల కష్టాలను తీర్చడానికి వ్యవసాయ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని పంట నష్టాన్ని అధిగమించేందుకు సాంకేతిక,ఆర్థిక సహయం అందించాలని స్థానిక రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

భూ భారతి చట్టం..పేద రైతుల చుట్టం.

భూ భారతి చట్టం..పేద రైతుల చుట్టం

-భూ భారతితో భూ వివాదాలన్నీ పరిష్కారం.

-నవాబ్ పేట్ సదస్సులో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

నవాబుపేట నేటి ధాత్రి

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి చట్టం పేదల రైతులు, ప్రజల చుట్టం అనీ, దీని ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మంగళవారం అన్నారు. నవాబ్ పేట్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో అప్పటి ఎమ్మెల్యేలు నిరుపేదల భూములను కబ్జాలు చేసి వేలకోట్లు సంపాదించారని విమర్శించారు. పేద ప్రజల భూములకు పట్టా పాస్ బుక్ లు ఇవ్వకుండా ఎన్నో రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. భూ భారతి చట్టం రైతుల చట్టం, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూ భారతి చట్టం అని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా, ప్రతి భూమికి భూధార్ కార్డుని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ ,భూధాన్, అసైన్డ్, దేవాదాయ, భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా సీసీఎల్ఏకి అధికారాలు ఉంటాయన్నారు. కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చామని, ఎవరి భూమి అయిన వేరే వాళ్ళకు తప్పుగా నమోదైతే ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీ, కలెక్టర్ కు అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చాన్నారు.

 

Farmers

ప్రతి సమస్య పరిష్కారానికి నిర్ణీత గడువు ఉంటుందని, ఆ గడువులోపుగానే సమస్యలు పరిష్కారమౌతాయని, అందుకే భూ భారతి చట్టం వచ్చాక రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సమస్యలు గ్రామంలోనే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. జూన్ నెలలో ప్రతి గ్రామంలో అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు, ప్రజలకు అన్ని సేవలు అందించేలా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. ధరణి వల్ల రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతితో సులభంగా పరిష్కారం అవుతుందన్నారు. ధరణి రిజిస్ట్రేషన్ లో పొరపాటు జరిగిన సరిదిద్దుకునే అవకాశం ఉండేది కాదని, పేద రైతులు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదాని వ్యాఖ్యానించారు. ధరణి వల్ల అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని వివరించారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మొత్తం పారదర్శకంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.

భూ భారతితో రైతులకు మేలు.!

‘భూ భారతితో రైతులకు మేలు’

కలెక్టర్ విజయేందిర బోయి

జడ్చర్ల నేటి /ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం మండలంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందని, భూ భారతి చట్టంలో పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేస్తే ముందు నిర్ణీత కాలంలో విచారణ, పాసు పుస్తకాలలో భూమి పటం, భూ ఆధార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలకు, వ్యవసాయతర భూములకు హక్కుల రికార్డు, రైతులకు ఉచిత న్యాయ సహాయం, మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వం భూధాన్, అసైన్డ్, ఎండోమెంట్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం ఉందన్నారు. భూభారతి చట్టంతో రైతులకు మేలు కలుగుతుందన్నారు.

program

అనంతరం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ధరణి పేరుతో అనేక అక్రమాలకు పాల్పడిందని, బీఆర్ఎస్ రాజకీయ నాయకులు రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, ప్రభుత్వ భూములను పట్టాలుగా మార్చారన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు మేలు చేస్తుందన్నారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ సెక్షన్ 6 ప్రకారం.. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి, గత 12 సంవత్సరాలుగా.. అనుభవంలో ఉంటూ.. 12-10- 2020 నుండి 10-11-2020 మధ్య కాలంలో క్రమబద్ధీకరణ కోసం చిన్న సన్నకారు రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీవోలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారన్నారు. భూభారతి చట్టంలో రైతులకు మేలు కలుగుతూ.. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుందన్నారు.

program

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీవో నవీన్, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ లిఖిత రెడ్డి, బాలానగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మల్ల అశ్విని రాజేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, విజయలక్ష్మి తిరుపతి, వెంకట్ రెడ్డి, పొట్లపల్లి యాదయ్య, శ్రీనాథ్ నాయక్, రైతులు పాల్గొన్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.

‘రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు’

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్ద రేవల్లి, చిన్న రేవల్లి, బాలానగర్, మొదంపల్లి, మోతీ ఘనపూర్, హేమాజీపూర్ గ్రామాలలో శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుమ్మల్ల అశ్వినీ రాజేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వరి ధాన్యమును అమ్ముకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోకూడదన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాలో.. డబ్బులు జమ అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, ఆది రమణారెడ్డి, లింగారం యాదయ్య గౌడ్, బత్తుల రాఘవేందర్, భాస్కర్ గౌడ్ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

రైతులు పండించిన ప్రతి చివరి గింజల వరకు.!

రైతులు పండించిన ప్రతి చివరి గింజల వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కానీ జిల్లాలో కానీ ఆరుగాసాల కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు చేస్తుందని దయచేసి రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని విషయం ఏమిటంటే ప్రతి సంవత్సరం మే మాసంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని గత ప్రభుత్వ పాలకులు ఏం చేశారు ప్రజలందరికీ తెలుసునని ఇప్పుడు కూడా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తద్వారా కొద్దిగా గన్నిసంచులు లారీల కొరత ఉన్నది వాస్తవమే అని రైతులు పండించిన ధాన్యాన్ని ఐకెపి సెంటర్ ద్వారా విక్రయించాలని అలాగే రైతులకు బ్యాంకు అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నారని విషయం పై అధికారులదృష్టికి వచ్చిన పై అధికారులు తగు చర్యలు తీసుకుంటారని అలాగే రేపు జరగబోయే రైతు అవగాహన సదస్సు పై ప్రభుత్వ వీప్ఆది శ్రీనివాస్. సిరిసిల్లనియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులు రైతులతో అవగాహన సదస్సు నిర్వహించి రైతుల అమూల్యమైన సలహాలు తీసుకుంటారని దీనిపై భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని తెలియజేస్తూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు మీ మండలంలో పనిచేసే ఒక అధికారి పని ఒత్తిడి భారమో. మీ నాయకులు చేస్తున్న ఒత్తిడి వల్ల కానీ సమస్యలు వస్తున్నాయని దృష్టికి వచ్చిందని దీనిపై వివరణ . కోరగా జరిగిన మాట వాస్తవమే కానీ. అసలు ఏం జరిగింది అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరక లేక ఆమె వ్యక్తిగత అవసరాల గురించా తెలియదు కానీ దీనిపై సంబంధిత అధికారులు తగు విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని దీనిపై మండల కాంగ్రెస్ పార్టీ లో పనిచేసే నాయకులు కార్యకర్తలు ఉన్నారని ఆరోపిస్తుండడం కరెక్టే కానీ దీనిపై విచారణకు సిద్ధమై. అధికార పార్టీ నాయకులైన కార్యకర్తలైన ఏ నాయకులైన చట్టానికి చుట్టం కాదని దీనిపై తగు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో యూత్ నియోజకవర్గ ఇన్చార్జి. చుక్క శేఖర్. మునిగల రాజు. సత్తు శ్రీనివాస్ రెడ్డి. పొన్నాల లక్ష్మణ్. గుగ్గిళ్ళ భరత్ గౌడ్. భాస్కర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

భూభారతి రైతులకు మేలు చేస్తుంది.!

‘భూభారతి రైతులకు మేలు చేస్తుంది’

దేవరకద్ర /నేటి ధాత్రి:

ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

మదనాపురం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వీవర్స్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, తనదనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను.!

అకాల వర్షం తో వడగండ్ల వానతో నష్టపైన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి

కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్.

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి

 

 

 

మండలంలోని. వర్షకొండ ఇబ్రహీంపట్నం, కేశవాపూర్ ,ఎర్రపూర్, గోధుర్, కోమటి కొండాపూర్ రైతులను వెంటనే ఆదుకోవాలని మానుక ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల ఈదురు గాలులకు నువ్వుల పంట, సజ్జ ,వరి పంటలు, మొక్కజొన్న ,మామిడి, రైతులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యంగా వరి పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షంతో నష్టపోయారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే, పలువురు గుడిసెలు సైతం దెబ్బతిన్నాయని పంటలు నేలవాలయని నష్టపోయిన రైతులను పరామర్శించి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకొని జిల్లా కలెక్టర్ ,వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని, అలాగే నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల టిడిపి అధ్యక్షులు ఎండి సాదుల్లా నియోజకవర్గ టిడిపి సభ్యులు రాజ గణేష్ ,కోరుట్ల పట్టణ టిడిపి ఉపాధ్యక్షులు మహదేవ్, ఇర్నాల గంగులు ,శ్రీనివాస్ ,బాలే మారుతి రైతులు రాములు ,మల్లయ్య, లచ్చయ్య, దయాకర్, లక్ష్మణ్ ,పెద్ది నరసయ్య ,రాజేశ్వర్, గంగాధర్, భాగ్యలక్ష్మి, చిన్న భూమయ్య, వెంకటి, నర్సారెడ్డి ,విజయ, రాజలింగం ,భూమన్న ,మురళి ,పెద్ద భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు.!

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం లో
రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైతులకు సూచించారు. ఈరోజు బుధవారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంతో పాటు రవినగర్(జంగుపల్లి), గొల్లపల్లి గ్రామాలల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అదేవిధంగా, గత ప్రభుత్వంలో దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇలాంటి అనేక హామీలను ఇచ్చి పదేళ్లు ప్రజలను మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ఇంతకీ ఇరవై ఐదేళ్ల ఉత్సవాలు టీఆర్ఎస్ పార్టీకా? తెలంగాణ పదాన్ని తీసేసిన బీఆర్ఎస్ పార్టీకా? అని ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నించారు. ఎమ్మార్వో ఎంపీడీవో ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.

రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం సేకరించాలి.

రైతులకు ఇబ్బంది కలుగకుండా ధాన్యం సేకరించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యాసంగి పంట కొనుగోలు లో రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన వరి ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రెండు లారీలను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని,
కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. మన జిల్లాలో ఇప్పటి వరకు 241 కొనుగోలు కేంద్రాలకు గాను 239 కేంద్రాల ప్రారంభం చేసి 198 కొనుగోలు కేంద్రాల నుంచి 16 వేల 22 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు జమ అయ్యేలా చూడాలని అన్నారు.
మిల్లు అలాట్మెంట్ కాని కోనుగోలు కేంద్రాలకు సమీపంలో గల అపెరల్ పార్క్ లో ఇంటర్మీడియట్ గోదాము నందు ధాన్యం భద్రత కోసం బుక్ చేయాలని అన్నారు. రైస్ మిల్లుల సమస్య కారణంగా ఎక్కడా ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడానికి వీలు లేదని అన్నారు. కోనుగోలు కేంద్రాలలో నాణ్యత ప్రమాణాలు పరిశీలించి, భారత ఆహార సంస్థ నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు.
సిరిసిల్ల జిల్లాలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని అన్నారు.ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 2 లారీలను అందుబాటులో పెట్టాలని, ధాన్యం రవాణా ఎటువంటి ఇబ్బందులు ఉండవద్దనిపేర్కొన్నారు.ఈ సమీక్షా సమావేశంలో డిఆర్డిఓ శేషాద్రి, డిఏఓ అఫ్జలి బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, పౌర సరఫరాల శాఖ అధికారులు రజిత, వసంత లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సెస్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు.

సెస్ ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సు.

* సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)*

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు 1వ వార్డు రగుడు లోని సిరిసిల్ల సెస్ విద్యుత్ సంస్థ ద్వారా రాబోయే వర్షా కాలం ద్రుష్టిలో ఉంచుకోని సెస్ వినియోగ దారులు అందరు కరెంట్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకొనగలరని తెలియజేయడం జరిగినది.పొలాల దగ్గరమరియు ఇంటి దగ్గర సెస్ ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉన్న సెస్ సిబ్బంది కి వెంటనే తెలియజేయాలని.రైతలు స్వంత నిర్ణయం తో ట్రాన్స్ఫర్మర్ బంద్ చేయడం స్టార్ట్ చేయడం వంటివి పనులు చేయకూడదని. అలాగే ఏదైనా సమస్య వస్తే సెస్ సిబ్బంది చూసుకుంటుందని తెలిపారు.ఇది వరకు చాలా ప్రమాదాలు జరిగినవి.ఇక పై అలా జరగకుండ తగు జాగ్రత్తలు తీసుకొని ఏ సమస్య అయినా సెస్ సిబ్బంది కి తెలుపగలరు. అని సెస్ DE. రామ సుబ్బారెడ్డి, AE. పద్మ తెలిపారు.ఈ కార్యక్రమం లో రైతులు మరియు సెస్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు.!

ప్రభుత్వం రైతులకు బోర్లు మోటార్లు సోలార్లు మంజూరు చేయాలి.

కొత్తగూడ, నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం లోమంగళవారం రోజు ఆదివాసి సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం కొతగూడ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగింది ఈ యొక్క సమావేశానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దనుసరి రాజేష్ గారు పాల్గొని మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న నిరుపేద ఆదివాసి రైతులకు వర్షం ఆధారంగానే వ్యవసాయం సాగిస్తున్నారు దీనితో వర్షాలు సకాలంలో రాకపోవడం వలన పంటలు ఎండిపోయి కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులు అప్పుల పాలవుతున్నారని వారన్నారు.
వర్షాధారంపై పోడు వ్యవసాయం చేస్తూ నిరుపేద ఆదివాసి రైతులను ప్రభుత్వమే ఆ యొక్క రైతులకు వ్యవసాయ బోర్లు కరెంట్ లైన్ లేదా బోర్లు మోటార్లతోపాటు సోలార్లు మంజూరు చేసి ఈ యొక్క నిరుపేద ఆదివాసి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
లక్షలాది రూపాయలు వెచ్చించి కరెంటు తెచ్చుకోలేని సన్న కారు చిన్న కారు ఆదివాసి రైతులకు సోలార్ విద్యుత్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని వర్షాలు తక్కువ ఉన్నా కానీ బోరు మోటర్ సోలార్ ఉండటంతో దళారుల ఊబి నుండి బయటపడడమే కాకుండా వడ్డీలకు డబ్బులు తెచ్చుకోకుండా అప్పుల ఊబి నుండి వారిని వారు కాపాడుకోవడం కాకుండా వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి జీవనాధారంగా మారుతుందని వారు సూచించారు. అంతేకాకుండా పోడు వ్యవసాయంపై జీవనం సాగిస్తున్న కొంతమంది నిరుపేద ఆదివాసి రైతులకు ఇప్పటివరకు హక్కు పత్రాలు అందకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారని అంతేకాకుండా హక్కు పత్రాలు వచ్చినకాని కొన్ని గ్రామపంచాయతీలలో కార్యదర్శిలు ఇవ్వకపోవడం వలన చాలామంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి నిరుపేద ఆదివాసి రైతులకు తక్షణమే హక్కు పత్రాలు మంజూరు చేయాలని అంతేకాకుండా ముద్రించిన అడవి హక్కు పత్రాలు ఆఫీసు బీరువాల్లో ఉంచుకుంటున్నారే తప్ప ఆ యొక్క రైతులకు చేరవేయడం లేదు ఇదిలా ఉంటే కొంతమంది దళారులు ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతర రైతులకు కూడా అటవీ హక్కు పత్రాలను మంజూరు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి వాటిని పరిశీలించి రద్దు విధంగా చర్యలు తీసుకోవాలని ఇక నిరుపేద ఆదివాసి రైతులకు అటవీ హక్కు పత్రాలు మంజూరు చేసి ఆదివాసి రైతులకు ఇవ్వడంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లోపంతో పూర్తిగా విఫలమైనారని వారు ఆరోపించారు ఇలాంటి తప్పిదాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు గుర్తించి ఆ యొక్క అటవి హక్కు పత్రాలను ఆ రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరినారు. ప్రభుత్వం మంజూరు చేసిన సోలార్ బోర్లులను 6 సంవత్సరాల వ్యవధి కాకుండా 1 సంవత్సరం లోపే సోలార్ బోర్డులను ఆదివాసి రైతులకు అందే విధంగా చూడాలని వారు అన్నారు అదేవిదంగా ఈ నెల 25న ఎన్నుకోబోయే నూతన మండల కమిటీకి మండలములోని ఆదివాసీ యువకులు హాజరుకగలరని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు మంకిడి సురేష్ ,జిల్లా కోశాధికారి పూనెం జనార్దన్ మండల నాయకులు చుంచ అనిల్, చింత శ్రీకాంత్, పులుసం హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు

భూ భారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలి.

భూ భారతిపై రైతులు అవగాహన పెంచుకోవాలి: కలెక్టర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ.. తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మొగుడుంపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ మాధురితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా.!

ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

కార్యక్రమాలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

* సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )*

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని యాసంగి పంట కొనుగోలు రైతులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సన్న బియ్యం సరఫరా , ధాన్యం కొనుగోలు పై పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,సిరిసిల్ల ఇన్చార్జ్ ఆర్డి.ఓ రాదాబాయి తో కలిసి ఇల్లంతకుంట తహసిల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అకాల వర్షాలు కారణంగా రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. దేశంలో అత్యధికంగా వరి పంట పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని, వానాకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, యాసంగి లో 127.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పంట పండిందని అన్నారు. వానాకాలం పంట కొనుగోలు సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినందుకు కలెక్టర్లకు, అదనపు కలెక్టర్ లు, పౌర సరఫరాల అధికారులకు, ఇతర సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు. వాన కాలం కంటే అదనంగా యాసంగి సీజన్ లో 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.ధాన్యం కొనుగోలు అంశంపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకంగా మానిటర్ చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లు తాళ్ళు, తరుగు పేరు మీద ఎటువంటి కోతలు లేకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అధిక ప్రాధాన్యత అందించాలని , దీనికి అనుగుణంగా జిల్లాలలో ఐకెపి, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలలో ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలలో మౌలిక వస్తువుల కొరత ఉంటే కలెక్టర్లు వాటిని కొనుగోలు చేయవచ్చని మంత్రి తెలిపారు.
భారత ఆహార సంస్థ మార్గదర్శకాలు ప్రకారం నూకల శాతం 25 దాటకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వం అందించే ధర కంటే అధికంగా అందిస్తే మాత్రమే రైతులు ప్రైవేట్ గా బియ్యం అమ్ముకోవాలని, తక్కువ ధరకు ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీలు లేదని అన్నారు. మన రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేసారని, దీనిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం 84 శాతం జనాభాకు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని, పేదలు, ప్రజలు సన్న బియ్యం సంతోషంతో స్వీకరిస్తున్నారని, 84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందని అన్నారు.
13 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలని అన్నారు. సన్న బియ్యం నాణ్యత పై సామాజిక మాధ్యమాల్లో అక్కడక్కడ వస్తున్న వ్యతిరేక వార్తలను పరిశీలించి తప్పుడు వార్తలైతే వెంటనే ఖండించాలని మంత్రి అధికారులకు సూచించారు.నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో ఎక్కడైనా త్రాగు నీటి సరఫరా ఇబ్బందులు, కొరత ఎక్కడైనా ఉంటే సమాచారం అందించాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామని, మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నామని తెలిపారు. జిల్లాల 36 బాయిల్డ్ రైస్ మిల్లులు ఉండగా, ఒక్కరు మాత్రమే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారని, మిగతావారు ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రైస్ మిల్లర్లు ముందుకు రాకపోతే ప్రత్యామ్నాయంగా గోదాములలో రైతుల ధాన్యం నిలువ చేస్తామని తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుండి అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్,జిల్లా నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి, అధికారులు కిషోర్, మిషన్ భగీరథ అధికారులు జానకి, శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి వసంత లక్ష్మి, డిఎం రజిత తదితరులు పాల్గొన్నారు.

పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దు.

పంటలు పరిశీలించి…… రైతులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే

పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దు

ఎమ్మెల్యే సత్యనారాయణ రావు

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన మొక్కజొన్న అరటి చెట్లు అధికారులతో కలిసి పరిశీలించి,అకాల వర్షంతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దు వారికి ప్రభుత్వం అండగా ఉంటుం దని అన్నారు అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలు చూసి ఎమ్మెల్యే అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు అని అన్నారు. అయితే అకాల వర్షాలు పంటలకు నష్టం కలిగించే అన్న విషయాన్ని గుర్తించి వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం నష్టపోయిన రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ప్రస్తుతం తాము రైతులకు నష్టపోకుండా కృషి చేస్తామని అన్నారు. రైతులకు నష్టపరిహారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు

 

 

అతి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు… లబ్ధిదారులకు ఐదు లక్షలు

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గరిబీ హటావో నినాదం తెచ్చారు పెద్దరికం తొలగిపో వాలని అన్నది ఆమె ఉద్దేశం. ఇప్పటికీ మనదేశంలో ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు.ఇందిరాగాంధీ ఆశయంతో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల పథకం తెచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో వేగం పెంచాలి. మండలంలోని అన్ని గ్రామాల్లో కమిటీలు నిర్వహించి వారి నుండి నిరుపేదల ఇండ్ల జాబితాను అతి త్వరలో నా దగ్గరికి పంపాలని అన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా జరగాలని అన్నారు. ఒకవేళ తప్పుగా చేస్తే అధిష్టానం శిక్షిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి, బాసని చంద్ర ప్రకాష్

 

MLA

మార్కండేయ,చిందం రవి,భాసని శాంత- రవి , రవిపాల్ ,దుబాసి కృష్ణమూర్తి రాజు ,కట్టయ్య, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, వలిఐధర్, ఎండి రఫీ, మండల నాయకులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

అకాల వర్షం రైతన్నలు ఆగం

అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి

మల్లకపేట గ్రామాల్లో ఇళ్లపై భారీ చెట్లు కూలిపోయాయి

పరకాల నేటిధాత్రి

 

అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్ర నష్టం వాటిళ్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హనుమకొండ జిల్లా పరకాల పట్టణ మరియు మండల పరిధిలో రాత్రికాల సమయంలో ఊహించని విధంగా తుఫాన్ ను తలపించేలాగా విపరీతమైన ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.

 

Farmers

 

దాదాపు ఒక గంటపాటు తీవ్రమైన ఉరుములు మెరుపులతో ఎడతెగని వడగండ్ల వాన కురిసింది.మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఈదురుగాలుల కారణంగా కొన్ని ఇండ్లపైన భారీ వృక్షాలు కూలి రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్లాలలో ఉన్న మిర్చి,మొక్కజొన్న పంటలు తడిచి ముద్దైన పరిస్థితి ఏర్పడింది.ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం రైతన్నల ఆశలను అడియాశలు చేసింది.ఏదైఏమైనా ఈ అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పమల్లక్కపేటలో ఇళ్లపై భారీ చెట్లు కూలిపోయాయి.

అకాల వర్షం రైతన్నలు ఆగం

అకాల వర్షం రైతన్నలు ఆగం

మల్లక్కపేట గ్రామాల్లో ఇండ్లపైన కూలిన భారీ వృక్షాలు

పరకాల నేటిధాత

 

అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్ర నష్టం వాటిళ్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హనుమకొండ జిల్లా పరకాల పట్టణ మరియు మండల పరిధిలో రాత్రికాల సమయంలో ఊహించని విధంగా తుఫాన్ ను తలపించేలాగా విపరీతమైన ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.దాదాపు ఒక గంటపాటు తీవ్రమైన ఉరుములు మెరుపులతో ఎడతెగని వడగండ్ల వాన కురిసింది

 

 

 

Farmers

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఈదురుగాలుల కారణంగా కొన్ని ఇండ్లపైన భారీ వృక్షాలు కూలి రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్లాలలో ఉన్న మిర్చి,మొక్కజొన్న పంటలు తడిచి ముద్దైన పరిస్థితి ఏర్పడింది.ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం రైతన్నల ఆశలను అడియాశలు చేసింది.ఏదైఏమైనా ఈ అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు

ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నల ఆవేదన.

ఈదురు గాలుల బీభ త్సవం.. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నల ఆవేదన

పంటలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో ఈదురు గాలుల బీభత్సానికి కోతకు వచ్చే దశలో మొక్కజొన్న నేలకొరగడంతో రైతులకు కన్నీళ్లు తెప్పిస్తు న్నాయి .

 

farmeres

ఈదురు గాలులతో 100 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న రాత్రి వచ్చినటువంటి గాలి బీభత్సం వల్ల తండా గ్రామ రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని మండల వ్యవసాయ అధికారితో చెప్పగానే వెంటనే రైతుల పొలం కాడికి నేరుగా వచ్చి పరిశీలించి రిపోర్టు రాసుకొని రైతులకు తగిన న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది రైతులు చాలా ఆనందంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరడమైనది.

నూతన ఎమ్మార్వోను కలిసిన రైతుల.!

నూతన ఎమ్మార్వోను కలిసిన రైతుల సాధన సమితి అధ్యక్షుడు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నూతన ఎమ్మార్వో దశరథ్ ను బుధవారం రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సమస్యపై ఎల్లవేళలా తమకు అండ ఉండాలని నూతన ఎమ్మార్వో ను రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు హక్కుల సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు.

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాలమాజీ ఎంపీపీ ముక్తిసత్యం,గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

మండలంలో సోమవారం రాత్రి గాలి, దుమ్ముతోకురిసిన భారీ వర్షానికి మండలంలో పంటలు, ఇల్లులు, కరెంటు స్తంభాలు కూలిపోయాయని ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులతో సర్వేలు చేపించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని మండల తహసిల్దార్ ఇమ్మానియేల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ మండలంలో వందలాది ఎకరాల్లో పంట నేలమట్టం అయిందని, అనేక చోట్ల ఇల్లు కూలిపోయాయని, విద్యుత్ ట్రాన్స్ఫారాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని అన్నారు.
మొక్కజొన్న నష్టపోయిన రైతుకు ఎకరాకు 50 వేలు, మిర్చి ఎకరాకు లక్ష రూపాయలు, వరి పంటకు 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మండలంలో కొడవటంచగ్రామంలో వర్షం కు దెబ్బతిన్న పంటను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు యా సారపు వెంకన్న, పర్శక రవి, మానాల ఉపేందర్, బానోతులాలు, వాగబోయిన సుందర్రావు, వాగబోయిన బుచ్చయ్య, ఎట్టి సుధాకర్, ఇసం రమేష్, ఇసం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version