రోడ్డు భద్రతపై డీజీపీ హెచ్చరిక…

రోడ్డు భద్రతపై డీజీపీ హెచ్చరిక.

హెల్మెట్ తప్పనిసరి.. ప్రాణ రక్షణే లక్ష్యం.

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తాలో గురువారం పోలీసులు నిర్వహించిన అరైవ్–అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి హాజరై వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడంతో పాటు బటన్ సరిగా పెట్టుకోవాలని సూచించారు.

ప్రమాదాల సమయంలో హెల్మెట్ బిగించకపోతే అది ఎగిరిపోవడంతో తలకు తీవ్ర గాయాలు జరిగి ప్రాణనష్టం కలుగుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా.. ప్రతి ఏడాది సుమారు 8 వేల మంది వివిధ కారణాలతో..మృతి చెందుతుండగా.. వారిలో దాదాపు 7,500 మంది రోడ్డు ప్రమాదాల వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ వెల్లడించారు. నాలుగు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి, గద్వాల రేంజ్ డీఐజీ ఎల్.ఎస్ చౌహన్, ఎస్పీ డి. జానకి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, మండలంలోని పలు గ్రామాలకు చెందిన వాహనదారులు పాల్గొన్నారు.

మర్రిపల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామ సభ…

మర్రిపల్లిలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామ సభ

పంచాయతీ సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ.

దుగ్గొండి,నేటిధాత్రి:

దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన గ్రామ సభను సర్పంచ్ డ్యాగం సుజాత గారి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని హెచ్చరించారు. అలాగే సీటు బెల్ట్ ధరించడం, అతివేగంగా వాహనం నడపకపోవడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ ఉపయోగించకూడదని ప్రజలకు అవగాహన కల్పించారు.రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ డ్యాగం సుజాత స్వంత ఖర్చుతో హెల్మెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎండీ మొయినుద్దీన్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రోజారాణి, అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు శ్రీలత, వార్డు సభ్యులు కుక్కమూడి కవిత, ఎరుకల పద్మ, గాజు శివాజీ, కుక్కమూడి రాజేందర్, గ్రామ సంఘం సమన్వయకర్త వేల్పుల సుజాత, నాయకులు కామ శోభన్ బాబు, కామ కేశవరావు,గ్రామస్తులు కుంట రాజుకుమార్, దానం మొగిలయ్య, పొన్నాల మోహన్ రెడ్డి, డ్యాగం శివాజీ, గాజు నాగరాజు, కొత్తపెల్లి రమేష్, ఇట్టబోయిన ఐలయ్య, ఎరుకల సురేష్, రాధారపు స్వామి, పొన్నాల మల్లారెడ్డి, కన్నెబోయిన సురేష్, కుక్కమూడి లింగయ్య, రామగిరి రవి తదితరులు హాజరయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version