మొగుళ్ళపల్లిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై వాహనదారులకు ప్రజలకు అవగాహన

మొగుళ్ళపల్లి నేటి దాత్రి

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు భద్రత కార్యక్రమాన్ని మొగలపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొగుళ్ళపల్లి ఎస్సై బోరగాల అశోక్ సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ ఉపసర్పంచ్ ఎర్రబెల్లి హిమబిందు కోటేశ్వరరావు పంచాయతీ సెక్రెటరీ నరేష్ పాల్గొన్నారు. మంగళవారం మొగుళ్ళపల్లి మండల కేంద్ర పరిధిలో వాహనదారులకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు భద్రతా నియమాల వివరించారు ఈ సందర్భంగా ఎస్సై బి అశోక్ మాట్లాడుతూ ఈ నెల 01 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన భద్రతా నియమాలను వివిధ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని,కార్ల వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని,పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఇవ్వకూడదని,వాహనాలకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని, పరిమితికి మించిన వేగంతో వెళ్లకూడదని, శబ్ద కాలుష్యానికి కారణం కాకూడదని వాహనదారులకు సూచించారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాహనదారులు ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది వెంకటయ్య విజయ్ పాల్గొన్నారు

25 ద్విచక్ర వాహనాలు సీజ్…

25 ద్విచక్ర వాహనాలు సీజ్

మందమర్రి నేటి ధాత్రి

 

రాంగ్ రూట్ ప్రయాణంపై మందమర్రి పోలీసుల కఠిన చర్యలు: 25 ద్విచక్ర వాహనాలు సీజ్

రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజలు నిబంధనలు పాటించాలి – మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి

రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మందమర్రి పోలీసులు రోడ్డు భద్రతకు భంగం కలిగించే వాహనదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా, గత నాలుగు రోజులుగా బురద గూడెం అందుగులపేట జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తున్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఈ డ్రైవ్‌లో, నిబంధనలను ఉల్లంఘించిన 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం మంచిర్యాల ఆర్ టి ఓ (ప్రాంతీయ రవాణా అధికారి) కార్యాలయానికి నివేదించడం జరిగింది.
ఈ సందర్భంగా, సీఐ మాట్లాడుతూ… “ప్రజలు తమతో పాటు ఇతరుల భద్రత కోసం తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి” అని స్పష్టం చేశారు.
రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి
షార్ట్ కట్ వద్దు: వాహనదారులు షార్ట్ కట్ మార్గాలలో ముఖ్యంగా జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వలన జరిగే తీవ్ర ప్రమాదాలను గుర్తించాలి.
నిబంధనల ప్రకారం ప్రయాణం: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ, సరైన మార్గంలోనే ప్రయాణం చేయాలి.

పోలీసు నినాదం:
డ్రైవ్ సేఫ్ బి సేఫ్

రాంగ్ రూట్ వాహనదారులకు తీవ్ర హెచ్చరిక
సీఐ ఈ సందర్భంగా వాహనదారులను హెచ్చరించారు. “ప్రజల భద్రతకు ముప్పు కలిగించే విధంగా రాంగ్ రూట్‌లో వచ్చే ఏ వాహనాన్ని కూడా మందమర్రి పోలీసులు ఉపేక్షించరు. ఇక ముందు కూడా రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనాలను స్వాధీనం చేసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించి, పోలీసులకు సహకరించాలని మందమర్రి పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ప్రమాదాల నివారణకు కసరత్తు..ప్రమాద స్థలాల గుర్తింపు..

ప్రమాదాల నివారణకు కసరత్తు..ప్రమాద స్థలాల గుర్తింపు

సిపి అంబర్ కిషోర్ జూ

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

రాజీవ్ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాల వలన ప్రజల ప్రాణల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల నివారణకు చర్యలకు డిజిపి చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమం లో భాగంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్ఆర్కె సంస్థ అధికారులతో కలిసి గోదావరిఖని బి – గెస్ట్ హౌస్ మూల మలుపు వద్ద, ఇందారం క్రాస్ రోడ్ వద్ద బ్లాక్ స్పాట్ ను సందర్శించారు.ఈ సందర్బంగా మూలమలుపు వద్ద ఏర్పాటు చేస్తున్నా ఐలాండ్ ల ఏర్పాటు డిజైన్,గతంలో ప్రమాదాలు జరగడానికి గల కారణాలు,ప్రమాదాల నివారణ చర్యలు,రేడియం బ్లింకర్స్,స్టడ్స్,సిసి కెమెరాల ఏర్పాటు,ప్రమాద స్థలాల గుర్తింపు,తదితర అంశాలపై అధికారులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు.రోడ్డు సేఫ్టీ కమిటీ లు ఏర్పాటు చేసి ప్రమాదాలపై క్షేత్ర స్థాయిలో బ్లాక్ స్పాట్ లను సందర్శించి,కారణాలపై సమీక్షా జరిపి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.సీపీ మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాలకు గురై ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయని,కుటుంబాలు దెబ్బతింటున్నాయని,ప్రతిరోజూ జరుగుతున్న ప్రమాదాలను గుర్తు పెట్టుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని తెలిపారు.మద్యం సేవించి వాహనం నడపడం,రాంగ్‌సైడ్ డ్రైవింగ్,సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు.ట్రాఫిక్ నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి,ప్రతి వ్యక్తికి చేరవేసి, ప్రమాదరహిత రామగుండం కమీషనరేట్ గా నిర్మించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని సీపీ స్పష్టం చేశారు.అరైవ్ అలైవ్ ద్వారా విద్యార్థుల్లో,యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే కాకుండా,ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరాన్ని కూడా స్పష్టంగా తెలియజేశారు.ఈ కార్యక్రమం లో గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి,రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు,రోడ్ సేఫ్టీ టీమ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు,మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ,ఎస్ఐ లు,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version