ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కలిగివుండాలి…

ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కలిగివుండాలి

త్వరలో కొత్త పథకాలు అమలు.. జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి

దుగ్గొండిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పట్ల ప్రజా ప్రతినిధులు,అధికారులు అవగాహన కల్గి ఉండి ప్రజలను చైతన్య వంతులను చేయాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు.
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పట్ల దుగ్గొండి మండల స్థాయి సమావేశం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడిఓ లెక్కల అరుంధతి,మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరై మాట్లాడారు.ముందుగా మండల ప్రగతి పట్ల ఆయా శాఖల అధికారులు వివరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పట్ల మండల పరిధిలోని గ్రామపంచాయతీ నిర్వహించిన గ్రామసభలు ఫిర్యాదుల పట్ల చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పథకాల సందర్భంగా పది రకాల పథకాల టీమ్స్ పై ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ రూపొందించిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త స్కీం లు ప్రవేశ పెడుతూ తీర్మానాలు చేసిందని పేర్కొన్నారు.
“అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,మహాలక్ష్మి, గృహజ్యోతి, సన్నరకం బియ్యం, వడ్లబోనస్, చేయూత పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళా శక్తి బ్యాంకు లింకేజ్ మట్టిలేని రుణాలు ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డుల పథకాలు అమలవుతున్నాయి వాటిని ప్రతీ గ్రామంలో ఉన్న రైతులు,ప్రజలు ఉపయోగించుకుంటున్నారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త పథకాలు అమలు చేయాలని ఉద్దేశంతో
రాబోయే రోజుల్లో అల్పాహార పథకం, కుటుంబ జీవిత భీమా, ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజనం వికలాంగ విద్యార్థులకు వాహనాలు, పంటల మార్పిడి. సేంద్రియ వ్యవసాయం వంటి పథకాలు రాబోతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల అవగాహన చేసుకొని ప్రజలకు అందజేసే విధంగా కృషి చేయాలని అధికారులకు సర్పంచ్లకు ఆదేశించారు. ప్రజా అవసరాల దృశ్య మండల స్థాయిలో తీర్మానం చేపట్టితేనే
అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.“అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా హెల్మెంట్ లేకుండా గ్రామాల్లో వాహనాలు రావద్దని తీర్మానాలు చేసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ లకు ఆదేశాలు..
తడి పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీలకు అప్పజెప్పాలని చెత్త సేకరణ తర్వాత తప్పని సరిగా రీసైక్లింగ్ చేసి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని తెలిపారు.చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు ప్రణాళికలు చేయాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఆదేశాలు చేశారు.
మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధం లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వేసవి కాలలంలో డ్రింకింగ్ వాటర్ పట్ల అధికారులు శ్రద్ధ చూపాలి.ఉపాధి కూలీలు ఉదయాన్నే పనులకు వెళ్లాలి.. ఎండ పట్ల జాగ్రత్తలు పడాలి.వారికి నీడ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రోడ్డు భద్రత పట్ల నియమాలు పాటించాలి.10 శాతం వివిధ రకాల మరణాలు జరుగగా
ప్రమాదాల వలన 90 శాతం మరణాలు జరుగుతున్నాయని ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పుష్పలత,ఎమ్మార్వో ముస్కు సమ్మక్క,ఎంపిడిఓ డాక్టర్ లెక్కల అరుంధతి,మండల వ్యవసాయ శాఖ అధికారి శ్యామ్,మార్కెట్ డైరెక్టర్ హింగే రామారావు,మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు,ఎస్సై రావుల రణధీర్ రెడ్డి, ఎంపీఓ శ్రీధర్ గౌడ్,సర్పంచ్ లు,గ్రామ పంచాయతీ కార్యదర్శులు,జీపి స్పెషల్ ఆఫీసర్స్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలు

పకడ్బందీగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలు

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక మండల సభ ఇల్లంతకుంటలో నిర్వహణ

అంగన్వాడీలకు ఆక్వా గార్డ్ యంత్రాల పంపిణీ

దివ్యాంగుడికి వీల్ చైర్ అందజేత

ఆకట్టుకున్న వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లు

సిరిసిల్ల ప్రతినిథి/ఇల్లంతకుంట(నేటి ధాత్రి):

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్వహించారు.

ఇల్లంతకుంట మండల కేంద్రంలో గురువారం మండల సభ నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, వార్డ్ సభ్యులు, మహిళా సంఘాల బాధ్యులు, రైతులు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గీతంతో ప్రారంభించారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందేశం వినిపించారు. అరైవ్.. అలైవ్ కింద ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు భద్రత నియమాలు వివరించారు. పలు అంగన్వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్ నీటి శుద్ధి యంత్రాలు పంపిణీ చేశారు. దివ్యాంగుడికి వీల్ చైర్ అందజేశారు

11,756 మందికి ఇందిరమ్మ చీరలు..

రైతు భరోసా లబ్ధిదారులు మొత్తం 17,883 మందికి, రైతు రుణ మాఫీ 5,745 మందికి, మొత్తం 593 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 185 మంది ఇండ్లు పూర్తి అయ్యాయని, 408 ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయని ఎంపీడీఓ శశికళ తెలిపారు. మహాలక్ష్మి కింద 8,985 మందికి రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని, గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 9,572 కుటుంబాలకు అందుతుందని, 77 మందికి సన్నరకం వరి బోనస్ అందిందని వివరించారు. చేయూత పెన్షన్స్ 7,915 మందికి అందుతుందని, మండలంలో నూతనంగా 1,974 మందికి తెల్లరేషన్ కార్డులు పొందారని తెలిపారు. 771 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పంపిణి చేశామని వెల్లడించారు. ఇందిరమ్మ మహిళా శక్తి కింద 508 మందికి బ్యాంక్ లింకేజీ రుణాలు, ఇందిరమ్మ చీరలు 11,756 మందికి చీరలు పంపిణీ చేశామని ఎంపీడీఓ శశికళ వెల్లడించారు.

 

 

 

 

ఇందిరమ్మ ఇండ్ల పూర్తిలో రాష్ట్రంలో జిల్లా ఫస్ట్

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లా మొత్తంలో నూతన రేషన్ కార్డులు 23,131 మంజూరు చేశామని, రూ. 500లకే ఇప్పటిదాకా 3,91,247 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామని వెల్లడించారు. జిల్లాలో ఇప్పటిదాకా 1,648 ఇండ్లు పూర్తి అయ్యాయని, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయిన జాబితాలో జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అలాగే 1,25,855 మందికి రైతు భరోసా అందిందని, 46,492 మందికి రుణమాఫీ అయిందని వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, భవ్యిషత్ ప్రణాళికలు రచించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని, ప్రతి వాహనదారుడు ఇంటి నుంచి వెళ్లింది మొదలు ఇంటికి వచ్చే వరకూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికే జిల్లాలో పారిశుధ్య పనులు చేయించామని వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. టీబీ ముక్త్ భారత్ లో భాగంగా జిల్లాకు వచ్చిన మొబైల్ ఎక్స్ రే యంత్రం ప్రారంభించామని, 42 గ్రామాల్లో పరీక్షలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎప్పుడైనా యుద్దాలు, రోగాలతో ఎక్కువ మంది చనిపోతారని అందరూ భావిస్తారని, కానీ గత ఏడాది దేశంలో గత ఏడాది 4,70,000 ప్రమాదాలు జరిగాయని, 1,70,000 మంది మృతి చెందారని గుర్తు చేశారు. ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని వెల్లడించారు.

గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ పక్కాగా అమలు చేయాలి

నో హెల్మెట్.. నో ఎంట్రీ కార్యక్రమాన్ని గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. అందరి రక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం అవుతుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు తమ తండ్రికి హెల్మెట్ ఉపయోగం చెప్పాలని పేర్కొన్నారు. మండలానికి కేటాయించిన వీఓఏ భవనాలు జూన్ 2వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు త్వరలో బ్రేక్ ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మద్యాహ్న భోజనం, దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఇందిరా కుటుంబ జీవిత బీమా అమలు చేయనున్నదని వెల్లడించారు. రైతులు వరితో పాటుగా ఆయిల్ పామ్ సాగు చేయాలని, దీంతో మంచి దిగుబడి, మద్దతు ధర వస్తునద్నని, రైతులకు సబ్సిడీ పై మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. సిద్ధిపేట జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చిందని వివరించారు.

పోషక పదార్థాలతో ఉపయోగాలు తెలిపే స్టాళ్లు

వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఆద్వర్యంలో ఆయిల్ పామ్, పురుగు మందులు పిచికారి చేసే డ్రోన్, నానో యూరియా విశేషాలు వెల్లడిస్తూ.. స్రీ శిశు సంక్షేమ శాఖ పోషక పదార్థాలతో ఉపయోగాలు తెలియజేస్తూ.. మహిళా సంఘాల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వస్త్రాలు, ఆహార పదార్థాల స్టాళ్లను పరిశీలించి.. పథకాల ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, తహసిల్దార్ సురేష్, ఎంపీడీఓ శశికళ, సర్పంచ్ మామిడి రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version