డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ…

డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ

భూపాలపల్లి నేటిధాత్రి

కార్యక్రమంలో భాగంగా ఆటో, లారీ, టిప్పర్ డ్రైవర్ల కోసం నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
ఈ శిబిరాన్ని హన్మకొండకు చెందిన శరత్ ఐ కేర్ హాస్పిటల్ సహకారంతో సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, డ్రైవర్ల కంటి ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, వారి ప్రాణ భద్రతను కాపాడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. డ్రైవర్లు తమ కంటి చూపును నిరంతరం పరీక్షించించుకుని అవసరమైన చికిత్స పొందాలని సూచించారు.
ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో డ్రైవర్లు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించరాదని, మద్యం సేవించి వాహనం నడపరాదని, ఓవర్‌టేకింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను నివారించాలని సూచించారు. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు.
కంటిచూపు సరిగా లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుందని, రోడ్డుపై సూచనలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి డ్రైవర్ తన భద్రతతో పాటు తన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఎస్పీ కళ్లద్దాలు అందజేశారు. సుమారు 300 మందికి పైగా ఆటో, లారీ డ్రైవర్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్ డిఎస్పీ సంపత్ రావు, సీఐ నరేష్ కుమార్, ఎస్సై సాంబమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

ఉచిత కంటి వైద్య శిబిరం, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం..

ఉచిత కంటి వైద్య శిబిరం, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పర్యటన సందర్భంగా, శుక్రవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆదర్శ్ నగర్, పస్తుపూర్ జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించారు. అలాగే, ఎస్వీ ఫంక్షన్ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి, దృష్టి లోపం ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కవర్ చేయాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ

*పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ*

 

నడికూడ,నేటిధాత్రి:

 

 

కంటి వెలుగు పథకం స్పూర్తితో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన సొంతూరు హన్మకొండ జిల్లా నడికూడ మండలం వరికోలులో ఉచిత కంటి పరీక్ష, ఉచిత కళ్ల జోళ్లు పంపిణీకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,ఇందులో భాగంగా ఉచిత కంటి పరీక్షల అనంతరం వారి కుమార్తె ఆశ్రిత రెడ్డి జన్మదిన సందర్బంగా ఉచిత కళ్ల జోళ్లను పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా పుట్టిన ఊరికి సేవ చేయాలన్న ఆలోచనతో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో వరికోల్ గ్రామ సర్పంచ్ దొగ్గెల కుమారస్వామి,ఉప సర్పంచ్ మూర్తాల భుజంగరావు, మాజీ వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి,బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు డేగరాజు,మండలంలోని వివిధ గ్రామాల నూతన సర్పంచులు,గ్రామ ప్రజలు బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version