రోడ్డు భద్రత అందరి బాధ్యత..!- ప్రతిజ్ఞ..

రోడ్డు భద్రత అందరి బాధ్యత..!– ప్రతిజ్ఞ..
సిఐ డి మల్లేశం ఎస్సై ముప్పు సురేష్
(నేటి ధాత్రి): మొగులపల్లి

రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా భద్రత చర్యలు తీసుకోవాలని చిట్యాల సిఐ డి మల్లేశం ఎస్సై ముప్పు సురేష్ అన్నారు. భూపాలపల్లిజిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక, 99 రోజుల రహదారి భద్రత… వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాహనదారులందరూ భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, నిదానంగా ప్రయాణించడం, రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు.. ప్రమాద రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చిన వారితోవాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వారితో కలిసి అంబేద్కర్ స్టార్చ్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ మాజీ సొసైటీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు చిట్యాల మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు జిల్లా నాయకులు తక్కల్లపల్లి రాజు వివిధ పార్టీల నాయకులుపోలీస్ సిబ్బందిపాల్గొన్నారు.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమానికి శ్రీకారం.

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమానికి శ్రీకారం.

కోదాడ, నేటి ధాత్రి:

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని పెరికా హాస్టల్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ జిలానీ, పోలీస్ శాఖ ఎస్‌ఐ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు తునం కృష్ణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంవీఐ షేక్ జిలానీ మాట్లాడుతూ. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన పెంచడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ఫిట్‌నెస్ లేని వాహనాలు వంటి కారణాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. కమర్షియల్ వాహనాలు, స్కూల్ బస్సులపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన వెంటనే తొలి ఒక గంటను గోల్డెన్ అవర్ గా పరిగణిస్తూ గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని తెలిపారు. రాహ్‌వీర్ పథకం గురించి వివరిస్తూ, ప్రమాద బాధితులకు వెంటనే సహాయం చేసే పౌరులకు ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతులు అందిస్తుందని చెప్పారు.లారీ అసోసియేషన్ అధ్యక్షుడు తునం కృష్ణ మాట్లాడుతూ, డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని అధిక వేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.ఎంవీఐ ఆధ్వర్యంలో డ్రైవర్లు, ఆటో యూనియన్లు, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదనే అంశాలపై ప్రమాణం చేయించారు. పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ రోడ్ల సంరక్షణ, గుంతల పూడ్చివేత, వీధి దీపాల నిర్వహణ వంటి చర్యలను చేపడతామని అధికారులు తెలిపారు.ఏప్రిల్ 13 నుండి 18 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో గ్రామ స్థాయి రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి, ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.అరైవ్ అలైవ్” లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి, గోల్డెన్ అవర్‌లో సహాయం అందించడం, రాహ్‌వీర్ పథకాన్ని వినియోగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలని అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా అనంతగిరిలో రోడ్డు భద్రత గ్రామ సభను ప్రారంభించారు. ఈ గ్రామ సభలో తాసిల్దార్, అనంతగిరి ఎస్సై, కోదాడ ఏఎంవీఐ పాల్గొని గ్రామస్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. గ్రామ స్థాయిలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు పెద్దలు, అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఓదెలలో రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

ఓదెల మోడల్ స్కూల్ రోడ్డు భద్రతా అవగాహన : ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి

ఓదెల మోడల్ స్కూల్, మోడల్ జూనియర్ కాలేజీల్లో పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. మద్యం మత్తులో వాహనం నడపడం చట్ట విరుద్ధమే కాకుండా తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ము స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని, మైనర్లు వాహనాలు నడపరాదని, సరైన డ్రైవింగ్ లైసెన్సు ఉన్నవారే వాహనాలు నడపాలని తెలిపారు. రాంగ్ పార్కింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి చర్యలు ప్రాణాలకే ముప్పు తెస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో రోడ్ సేఫ్టీపై ప్రతిజ్ఞ చేయించగా, నోటీస్ బోర్డుల్లో రోడ్ సేఫ్టీ పోస్టర్లు అతికించారు. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాలో రోడ్డు భద్రతపై పోస్టర్లు షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

ఝరాసంగంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రత మన అందరి బాధ్యత:ఝరాసంగం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కప్పాడ్ గ్రామ చౌరస్తా దగ్గర
ఝరాసంగం పోలీసుల ఆధ్వర్యంలో,సీఐ హనుమంతు మరియు ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ మరియు నాయకత్వంలో “ప్రాణాలతో చేరుకుందాం – రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం”ను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం రోడ్డు ప్రమాదాలను నివారించడం మరియు ప్రజల్లో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించడం.ఈ సందర్భంగా విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు, ఆటో రిక్షా డ్రైవర్లు, కార్ డ్రైవర్లు మరియు సాధారణ ప్రజలకు రోడ్డు భద్రత నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనాల్లో సీటు బెల్టు వినియోగించాలి, మద్యం సేవించి వాహనం నడపకూడదు, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని స్పష్టంగా వివరించారు.అలాగే వేగ నియంత్రణ పాటించడం ఎంత ముఖ్యమో, పాదచారులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వాహనదారుడిపై ఉందని తెలియజేశారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు, ప్రాణనష్టానికి దారి తీస్తుందని తెలిపారు.రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘన చట్టపరమైన చర్యలకు మాత్రమే కాకుండా అమూల్యమైన ప్రాణాల నష్టానికి కారణమవుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ద్వారా “రోడ్డు భద్రత మన అందరి బాధ్యత” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చని పోలీసులు ప్రజలకు సూచించారు. అవగాహన కార్యక్రమం లో కప్పడ్ మాజీ సర్పంచ్ నందప్ప పటేల్ మాజీ ఎంపీటీసీ మహేందర్ గారు సర్పంచ్ కీర్తన ప్రభాకర్ మాకు ఉప సర్పంచ్ ఇస్మాయిల్ సాబ్ మరియూ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version