దేశానికి డా.బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివి: జిల్లా ఎస్పీ

దేశానికి డా.బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివి: జిల్లా ఎస్పీ

ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు.

డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల సందర్భంగా Arrive-Alive లో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ కార్యక్రమాలు.

సిరిసిల్ల టౌన్ : ( నేటిధాత్రి )

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈరోజు దేశానికి డా.బి.ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివనీ జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే కొనియాడారు.భారతరత్న డా.బి ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

డా.బి ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే పేరొందిన గొప్ప న్యాయవాది,మానవతావాది ఆని,లండన్ లో ప్రముఖ విశ్వ విద్యాలయం డా.బి ఆర్ అంబేద్కర్ కు మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ప్రధానం చేసిందన్నారు.అన్ని అంశాల్లో పట్టున్న గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని అన్నారు.దేశానికి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగమును రాసి భవిష్యత్తులో దేశం ఎదుర్కొనే అనేక సవాళ్లకు పరిష్కార మార్గాలు చూపారని కొనియాడారు.డా.బిఆర్ అంబేద్కర్ కలలుగన్నా దేశంగా,సూపర్ పవర్ గా భారత్ ఎదగాలంటే తల్లిదండ్రులు పిల్లలని చదువు వైపు ప్రోత్సాహించాలని , నేటి యువత అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగుతూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ కార్యక్రమాలు..

జిల్లా వ్యాప్తంగా డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా( ‘Arrive Alive’ )
కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా రోడ్డు భద్రతా కార్యక్రమాలు నిర్వహించి వాహనదారులు, ప్రజలతో కలిసి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టాడం జరిగిందన్నారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించడం,సురక్షిత ప్రయాణాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ నటేష్,ఆర్.ఐ లు మధుకర్,రమేష్, ఎస్.ఐ కిరణ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version