మన ఊరు మన భద్రత మన బాధ్యత జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

మన ఊరు మన భద్రత మన బాధ్యత జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో సర్పంచులకు, కౌన్సిలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, డ్రగ్స్ నియంత్రణ సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రాష్ట్రంలో యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రోడ్డు భద్రత, నేరాల నివారణపై సర్పంచులు ప్రజాప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
యువతలో సానుకూల మార్పు తీసుకురావడంలో గ్రామ స్థాయి నాయకత్వం కీలకమని పేర్కొంటూ, సర్పంచులు ముందుండి యువతను సరైన దిశలో నడిపించాలని సూచించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న వారి వివరాలను పోలీసులకు తెలియజేసి సమాజాన్ని రక్షించడంలో భాగస్వాములు కావాలని కోరారు.
అదేవిధంగా, నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి గ్రామంలో వాటి ఏర్పాటు కోసం ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీ సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version