గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీత రామచంద్రస్వామి ఆలయంలో బుధవారం ఉదయం ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన మచ్చక సారమ్మ కీర్తిశేషులు జ్ఞాపకార్థం వారి కుమారుడు మచ్చక ముఖేష్ కుమార్ ఆలయ అభివృద్ధి కొరకు 10,000₹ రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూల శ్రీనివాస్ గౌడ్ బటక స్వామి బూర రాజగోపాల్ మాదాసు అర్జున్ మాదాసు మొగిలి దయ్యాల భద్రయ్య పాండవుల భద్రయ్య ఆలయ ప్రాంగణంలో హనుమాన్ మాల ధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు
ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బడిబాట…
కేసముద్రం నేటి ధాత్రి:
విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బేరువాడ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం బేరువాడ గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతు న్న ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, నాణ్యమైన మధ్యాహ్న భోజనం,ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ , రాగి జావా,రెండు జతల బట్టలు ఇస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన జరుగుతుందని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రైవేటు పాఠశాలలో చేర్పించి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బానోతు వాగ్య, కోడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పనికి ఆహారపథకంలో పాల్గొంటున్న విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీరం జనార్దన్ రెడ్డి కోరారు.
శ్రీ శ్రీ శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి మహోత్సవాలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
శ్రీశ్రీశ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వర స్వామి దేవస్థానం ఝరాసంగం మండలం ఈధులపల్లిలో శ్రీ శ్రీ శ్రీ రేవణ సిద్దేశ్వర స్వామి చండికాంబ మాత జయంతి మహోత్సవాలు ఆలయ కమిటీ అద్వార్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది…ఇట్టి కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు హనుమంత్ రావు పాటిల్, పెద్దలు రాచయ్య స్వామి,శంకర్ పాటిల్,యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ ,పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, కొల్లూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు డప్పూరు సంగమేష్,యూత్ కాంగ్రెస్ ఝరాసంగం మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్ మరియు పలువురు పెద్దలు, నాయకులు,భక్తులు పాలుగొన్నారు..
జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన వారిని సన్మానించిన ఇరు బార్ అసోసియేషన్ల:-
హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
బుధవారం రోజున ఇటీవల జరిగిన జూనియర్ సివిల్ జడ్జి అర్హత పోటీ పరీక్షల్లో ఎంపికైన వారిని హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుదీర్ ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ హాల్లో ఘనంగా సన్మానించడం జరిగింది. ఇట్టి నియామకాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ముగ్గురు మహిళా న్యాయవాదులు గంగిశెట్టి ప్రసీద, అంబటి ప్రణయ, దార సాయి మేఘన మరియు న్యాయశాఖ ఉద్యోగిి లడే రాజుల ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల హన్మకొండ మరియు వరంగల్ బార్ అసోసియేషన్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి సందర్భంగా పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ మన ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి నల్గురు జడ్జిలుగా ఎంపిక కావడం చాలా సంతోషకరం అన్నారు. గతంలో కూడా చాలా మంది ఈ బార్ అసోసియేషన్ల నుండి జడ్జిలుగా ఎంపికై వివిధ న్యాయస్థానాలలో జడ్జిలుగా విధులు నిర్వహిస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ మరియు వరంగల్ ప్రధాన కార్యదర్శులు కె.రవి, డి.రమాకాంత్ మరియు ఇరు కమిటీ సబ్యులు మరియు సీనియర్, జూనియర్ న్యాయవాదులు,మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో కన్యకా పరమేశ్వరి మాతదేవాలయం లో వైశాఖ శుద్ధ దశమి బుధవారం రోజున వాసవి మాత జన్మదిన సందర్భంగా దేవాలయం ఫౌండర్ ట్రస్ట్రీ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఉదయం 6 గంటలకు అభిషేకం, మహిళలు చే కుంకుమార్చనలు పూజలు, వాసవి మాత పారాయణం, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా అమ్మవారికి పల్లవి సేవ డోలారోహణం, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆర్య వైశ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు భోజనప్రసాదాలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ నాయకులు, మండల నాయకులు,వాసవి క్లబ్ వనిత క్లబ్,ఆవోప సంఘాలు నాయకులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో కన్యకా పరమేశ్వరి మాతదేవాలయం లో వైశాఖ శుద్ధ దశమి బుధవారం రోజున వాసవి మాత జన్మదిన సందర్భంగా దేవాలయం ఫౌండర్ ట్రస్ట్రీ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఉదయం 6 గంటలకు అభిషేకం, మహిళలు చే కుంకుమార్చనలు పూజలు, వాసవి మాత పారాయణం, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా అమ్మవారికి పల్లవి సేవ డోలారోహణం, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆర్య వైశ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు భోజనప్రసాదాలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ నాయకులు, మండల నాయకులు,వాసవి క్లబ్ వనిత క్లబ్,ఆవోప సంఘాలు నాయకులు పాల్గొన్నారు.
శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేతలు డా. దిలీప్ కుమార్, డా.విశ్వా తేజ్, మండల వ్యవసాయ అధికారి గంగ జమున వారి ఆధ్వర్యంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” రైతుల అవగా హన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .
Farmer Awareness Program.
రైతులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చుల ను తగ్గించుట, అవసరం మేరకు రసాయనా లు వినియోగం, రైతు సోదరు లు కొనుగోలు చేసిన విత్తనాల మరియు పురుగుల మందుల రసీదులను భద్రపరచు కోవ డం, పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు, చెట్లను పెంచడం, సాగునీటిని ఆదా చేయడం వలన కలిగే ప్రయో జనాలు రైతులకు వివరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్, గ్రామపంచా యతీ కార్యదర్శి నాగశ్రీ, వ్యవ సాయ కళాశాల వరంగల్ విద్యార్థులు,కొత్తగట్టుసింగారం గ్రామ రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కొలతల ప్రకారంగానే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలి
సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్ నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపల్లి గ్రామ పంచాయతీని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం సందర్శించారు. గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి,ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని లబ్ధిదారులకు తెలియజేశారు.సకాలంలో ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,ఎంపీడీవో జి.సత్యనారాయణ గౌడ్,ఎంపీవో శ్రీపతి బాబురావు,హౌసింగ్ ఏఈ కాంక్ష,పంచాయతీ కార్యదర్శి ఏ.సత్యనారాయణ,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని కొత్త బస్టాప్ వద్ద గల బ్రహ్మంగారి గుడి వద్ద పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి గోవిందమ్మల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి గోవిందమ్మల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నరసింహ చారి, సత్యనారాయణ, రామస్వామి, బాల్ నరసయ్య లక్ష్మీనారాయణ, స్వామి, రామచంద్రం, శ్రీనివాస్, బాలరాజు, మురళి, వెంకటనారాయణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
బైసరాన్ లోయలోని పహల్గామ్ సమీపంలోని పర్యాటక శిబిరంపై జరిగిన ఉగ్రదాడిలో తీవ్రవాదులు కుటుంబాల్లోని పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో అందరూ పురుషులే. ఈ ఘటనతో అనేక మంది మహిళలు వితంతువులుగా మిగిలిపోయారు.ఈ దారుణానికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్కు ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు పెట్టడం వెనుక గొప్ప సంకేతార్థం ఉంది. “సిందూర్” భార్యగా ఉన్న మహిళ ధరించే పవిత్ర చిహ్నం. పురుషులను టార్గెట్ చేసిన దాడి వల్ల భార్యలు సింధూరాన్ని కోల్పోయినట్టైంది.ఈ నేపథ్యంలో, భారత సైన్యం ఆ మహిళలకు న్యాయం చేయడం కోసం “ఆపరేషన్ సిందూర్” అని పేరుతో పహల్గంలో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందన కు శ్రీకారం చుట్టిందని, పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై “ఆపరేషన్ సిందూర్” పేరుతో మెరుపు దాడులు చేసి, దేశ సత్తా చాటిన ఇండియన్ ఆర్మీకి, ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు పక్షాన సెల్యూట్ చేస్తున్నామని సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు ప్రారంభించిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బిజెపి శ్రేణులు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక, పూజలు ప్రార్థనలు నిర్వహించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో పట్టా కాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆడెపు రవీందర్, రాంప్రసాద్, భాస్కర్, ప్రతాప్, నరేష్, శ్రీహరి, రాజు, నరసయ్య, శ్రీనివాస్, చందు, పరమాత్మ శేఖర్, వైశాలి, మాధవి, శిరీష, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
వైభవంగా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన వేడుకలు
నడికూడ నేటిధాత్రి:
శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన వేడుకలు నడికూడ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కడివెండి నరేందర్ చారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు.వీర బ్రహ్మేంద్రస్వామి చిత్రపటానికి పూలమాలలు అలంకరించి, వేద పండితుల మంత్రోచ్ఛారాల నడుమ పూజలు చేశారు.అనంతరం స్వామి వారికి పాలకాయలు సమర్పించి,కర్పూర హారతి ఇచ్చి పూజలు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్ల మలహల్ రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గ్రామకమిటీ అధ్యక్షుడు ఎలకంటి రాజు చారి, ఉపాధ్యక్షుడు బెజ్జంకి రాజేందర్ చారి,కార్యవర్గ సభ్యులు క్రిష్ణాది సాంబయ్య చారి, మసంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇండియన్ ఆర్మీకి సెల్యూట్… ఫహల్గాం ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైనస్పందనకు శ్రీకారం చుట్టింది
ఆపరేషన్ సింధూర్ తో దాయాది దేశానికి వార్నింగ్
దేశ సత్తా చాటిన సైనిక దళాలకు, పీఎం మోడీ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు
ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల జిల్లావ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో బిజెపి శ్రేణుల ప్రత్యేక పూజలు, ప్రార్థనలు
బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్
సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి )
ఈరోజు సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పహల్గంలో ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందన కు శ్రీకారం చుట్టిందని , పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై” ఆపరేషన్ సిందూర్” పేరుతో మెరుపు దాడులు చేసి , దేశ సత్తా చాటిన ఇండియన్ ఆర్మీకి, ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు పక్షాన సెల్యూట్ చేస్తున్నామని సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు ప్రారంభించిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బిజెపి శ్రేణులు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక, పూజలు ప్రార్థనలు నిర్వహించారు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో పట్టా కాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.. ఇట్టి కార్యక్రమంలో ఆడెపు రవీందర్ రాంప్రసాద్ భాస్కర్ ప్రతాప్ నరేష్ శ్రీహరి రాజు నరసయ్య శ్రీనివాస్ చందు పరమాత్మ శేఖర్ వైశాలి మాధవి శిరీష ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట్ గ్రామంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు గా బావించే స్వయంభూ గా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో కనుల పండగ కొనసాగింది.
స్వామివారి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులు కావడం జరిగింది.
పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.
ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.
మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి లో ఇదే తంతు.
అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.
దర్జాగా వసూళ్ల సాక్షాలు అయిన టీఎస్ఎండిసి నిశ్శబ్దం, అమ్ముడుపోయిందని ప్రజలకు అర్థం.
మహాదేవపూర్ నేటి ధాత్రి:
ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, టీజీఎండిసి శాఖ కాసులకు కక్కుర్తి పడడం, కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు చేసుకొని అక్రమ వసూళ్లకు సహకరించడం యదేచ్చగా కండ్ల ముందు అక్రమ వసూళ్ల దందాను టీజీఎండిసి సిబ్బంది తోపాటు కాంట్రాక్టర్ సిబ్బంది వసూళ్ల పరంపరను కొనసాగిస్తున్నప్పటికీ టీజీఎండిసి ఉన్నత అధికారులు మరోవైపు ప్రభుత్వం అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం తో మండలంలోని ఇసుక రీచులు అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రెచ్చిపోయి కొనసాగించడం జరుగుతుంది. మరోవైపు పక్క జిల్లాలకు సంబంధించిన ఇసుక రీచుల కాంట్రాక్టర్లు హద్దులు దాటి గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాన్ని చేసి ఇసుకను రవాణా కొనసాగిస్తుంటే ప్రభుత్వం టీజీఎండిసి అధికారులు చర్యలకు ససేమీరా అనడం తో కాంట్రాక్టర్లు ఇసుక రీచుల్లో అక్రమాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్రమాలపై టీజీఎండిసి చర్యలు తీసుకోకపోవడం, ఇసుక రిచుల్లో అక్రమాల వ్యవహారం అదునపు వసూళ్లు తీసుకుంటున్న టీజీఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ సూపర్వైజర్ లా ఫోటోలు వీడియోల సాక్షాలు వచ్చినా కూడా ఇప్పటివరకు ఒక్క క్వారీపై కూడా చర్యలు తీసుకోలేదంటే టీజీఎండిసి కిందిస్థాయి నుండి పై స్థాయి అధికారి వరకు కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయారని స్పష్టంగా కనబడుతుంది.
పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.
సోమవారం రోజు పలుగుల తొమ్మిది ఇసుక క్వారీలో కాంట్రాక్టర్ సిబ్బంది లారీ డ్రైవర్ నుండి 1100 రూపాయలు సీరియల్ పేరుతో వసూలుచేస్తూ. తరువాత లోడింగ్ కొరకు సీరియల్ నంబర్ చిట్టిని అందించాడు. ఈ క్వారీలో గత నెల రోజులు నుండి పెద్ద మొత్తంలో అన్ని క్వారీల కంటే ఎక్కువగా వసూళ్ల పరంపర కొనసాగుతుందని, దానికి సంబంధించిన సాక్షాలు గత నెలలో 1200 తీసుకున్న పలుకుల 9 ప్రస్తుతం 1100 వందలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ వద్ద 200. వందల రూపాయలు గత నెలలో 1400 వసూలు చేయడం జరిగింది. ప్రస్తుతం 1300 పాసింగ్ పై అదనపు ఇసుకను తీసుకోవడం జరుగుతుంది. పలుగుల తొమ్మిది గత నెల ప్రతిరోజు 119 నుండి 148 వరకు లారీల్లో ఇసుక నింపి రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ మార్చ్ నెలలో నాలుగవ తేదీన ప్రారంభమై మొదట్లో ఆవరేజ్ 60 నుండి మొదలుకొని నేటి వరకు ప్రతిరోజు 100కు పైచిలుకు లారీల ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మూడు నెలల్లో సుమారు ఈ క్వారీ 60 రోజుల్లో 6000 లారీల ఇసుక రవాణా చేయడం జరిగింది. లారీకి 14 నుండి 1100 అక్రమ వసూళ్ల విషయానికొస్తే 65 నుండి 85 లక్షల రూపాల అక్రమ వసూళ్లను సొమ్ము చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు తెరలేపిన పలుగుల తొమ్మిది పై, టి జి ఎం డి సి కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు, మరి కొన్ని రోజుల్లో అక్రమ వసూళ్లతో తమ క్వాంటిటీని సమాప్తం చేసుకునే వరకు టీజీఎండిసి అధికారులు చూస్తూనే ఉంటారు.
collect
ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.
మండలంలో ఇసుక క్వారీల అక్రమాల వ్యవహారం, సాక్షాలు వసూళ్ల పర్వం, నిబంధనలు దాటి తవ్వకాలు, యదేచ్ఛగా కొనసాగుతుంటే టి జి ఎం డి సి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, టీజీఎండిసి అధికారుల పుణ్యం కాంట్రాక్టర్లు రెచ్చిపోయి, తమకు అడ్డు ఎవరు అని అక్రమ వసూళ్ల వ్యవహారాలను తమ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మండలంలో నిర్వహించబడే ఇసుక రిచుల్లో పలుగుల తొమ్మిది మహదేవపూర్, పుసుక్ పల్లి 1, పలుగుల 8, ఈ రిచుల్లో పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్ల వ్యవహారాలను దర్జాగా కొనసాగించడం జరుగుతుంది. అంతేకాకుండా పక్క జిల్లా ఇసుక క్వారీలు కూడా గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాలు చేసి, కుంట్లం గోదావరి వద్ద అక్రమ తవ్వకాలు జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడుతు యదేచ్చగా అక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. కొత్తగా ఇసుక పాలసీ అమలులో ఉన్న క్రమంలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం టీజీఎండిసి పై చర్యలు తీసుకోవాల్సి ఉండగా నిశ్శబ్దాన్ని పాటించడం, అనేక అనుమానాలకు దారితీస్తుంది.
collect
మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి, లో ఇదే తంతు.
మహదేపూర్ పుసుపుపల్లి1, పేరుతో నిర్వహించబడే ఇసుక క్వారీ లోను కూడా అక్రమ వసూళ్లకు హద్దు లేకుండా పోయింది.
ఇక్కడ టీజీఎండిసి సిబ్బంది 900 రూపాయలు, సీరియల్ పేరుతో వసూలు చేయడం, లోడింగ్ వద్ద 200, కాంటా వద్ద అదనపు ఇసుకకు 300 నుండి 500, యథేచ్ఛగా కొనసాగడం జరుగుతుంది.
ఈ ఇసుక క్వారీ మార్చ్ నెల ఆరవ తేదీన ,ప్రారంభించడం జరిగింది, కానీ కొద్ది రోజులు నామమాత్రంగా లారీలో ఇసుక నింపిన ఈ క్వారీ ఏప్రిల్ నెలలో, అక్రమ వసూళ్ల పరంపరను ప్రారంభించడంతో 60 నుండి మొదలుకొని 175 యావరేజ్ గా ప్రతిరోజు లారీల్లో ఇసుకను రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ ఇప్పటివరకు అక్రమ వసూళ్ల తో 45 లక్షల నుండి 60 లక్షల వరకు సొమ్ము చేసుకోవడం జరిగింది.
ప్రస్తుతం పలుకుల 8 ఇసుక క్వారీ స్థానికులకు భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో లోడింగ్ నిలిచివేయడం జరిగింది, పలుకుల సిక్స్, పుసుక్ పల్లి ఒకటి, టీజీఎండిసి అధికారుల పుణ్యమని అక్రమ వసూళ్లు పెద్ద మొత్తంలో జరుపుకొని లక్షల రూపాయల సొమ్ము చేసుకుని ఇసుక క్వాంటిటీని సమాప్తం చేసుకోవడం జరిగింది.
అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.
అక్రమ వసూళ్ల వ్యవహారం మండలంలోని ఇసుక క్వారీలకు ఒక వరంగా అందించింది టీజీఎండిసి, అదుపు ఇసుక రవాణా నిలిపివేయడం, నూతన ఇసుక పాలసీ విధానం అమలు చేయడం జరుగుతుంది అని చెప్పిన ప్రభుత్వం, టీజీఎండిసి అధికారులకు ఇచ్చిన” డేడ్” లైన్ అధికారులు లెక్కచేయకుండా ప్రభుత్వ డెడ్ లైన్ ను తీసిపారేశారు, గత వారం రోజుల క్రింద ఓ అధికారి” హోటల్లో మకాం వేసి, కాంట్రాక్టర్ అందరికీ తమ వద్దకు పిలుచుకొని, సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది.
ఆ అధికారి విధులు కూడా హోటల్లోనే పూర్తి చేసుకున్నాడు.
ఇలా అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే, అక్రమ వసూళ్ల పరంపర జోరుగా కొనసాగకుంటే, కాంట్రాక్టర్లు ఎందుకు ఊరుకుంటారు.
అధికారుల హోటల్లో సిట్టింగ్ పరంపర, గత కొన్ని రోజులుగానే కొనసాగుతుందని చెప్తున్నారు, అందుకే ఏమో ఇసుక క్వారీల ప్రారంభం నుండి, అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం గా కనబడుతోంది.
దర్జాగా వసూళ్ల సాక్షాలు అక్రమ ఇసుక తవ్వకాలు మైనింగ్ నిబంధనలకు తూట్లు పొడుస్తుంటే, టీజీఎండిసి అధికారులు చర్యలకు బదులు హోటల్లో” సిట్టింగ్ తో సెట్టింగ్” చేసుకోవడానికి, ప్రజలు గమనించి వాస్తవమే అక్రమాలకు చర్యలు కాదు, సిట్టింగ్లతో సక్సెస్ అయింది, ఇంకేముంది టిజీఎండిసి కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయిందని అక్రమ వసూళ్ల సాక్షాలు చెబుతున్నాయి అని చెప్పుకొస్తున్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ టీజీఎండిసి అధికారులపై చర్యలకు ఆదేశించి, ఇసుక రీచుల్లో అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
‘ఆపరేషన్ సింధూర్’పై ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షుడు షేక్ రబ్బానీ హర్షం వ్యక్తం చేశారు. ‘పాకిస్థాన్లోని టెర్రరిస్ట్ స్థావరాలపై భారత్ నిర్వహించిన దాడులను ఆహ్వానిస్తున్నాం. మరో పహల్గామ్ ఘటన జరగకుండా పాక్కు ఇలాగే సరైన గుణపాఠం చెప్పాలి. పాక్ టెర్రర్ స్థావరాలు అన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేయాలి. జై హింద్’ అని పోస్ట్ చేశారు. భారత్ నిర్వహించిన మెరుపు దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మన రక్షణ దళాలు జరిపిన లక్షిత దాడులను నేను స్వాగతిస్తున్నాను. పాకిస్తాన్ లోతైన రాజ్యానికి ఒక గుణపాఠం నేర్పించాలి, పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలి. జై హింద్!
-పహల్గాం ఉగ్రదాడితో దేశం మొత్తం కన్నీళ్లు కార్చింది
-నేడు సాయుధ దళాల పోరాటపటిమను చూస్తూ దేశం మొత్తం గర్విస్తుంది
-సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై జరుపుతున్న దాడులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడితో అమాయక దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఆ బాధతో దేశ మొత్తం కన్నీరు పెట్టిందని గుర్తుచేశారు. ఆ దాడికి ప్రతీకారంగా దేశ సాయుధ దళాలు ఉగ్రవాదుల స్థావరాల నిర్మూలనకు ఆపరేషన్ సింధూర్ పేరుతో తమదైన శైలిలో దాడులకు పాల్పడడాన్ని చూసి దేశ ప్రజలు సంతోషిస్తున్నారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు దేశ రక్షణలో సైనికుల పాత్ర వెలకట్టలేనిదని, సాయుధ దళాల పోరాటపటిమ దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన దాడులతో ఉగ్రవాదం పూర్తిస్థాయిలో కనుమరుగు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
-విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేత చేవ్వ శేషగిరి యాదవ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టడం దేశ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని బిజెపి నేత చేవ్వ శేషగిరి యాదవ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1931లో చివరిసారి బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేపట్టిందని, 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణనపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ సిఫారసు చేసిన బీసీ కమిషన్ ను కాంగ్రెస్ పార్లమెంట్ లో చర్చకు తీసుకురాకుండా తిరస్కరించిన చరిత్ర మర్చిపోవద్దన్నారు. నెహ్రూ నుండి ఇందిరా, రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ నాయకులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించారు. కులగణన విషయంలో తెలంగాణ మోడల్ రాహుల్ గాంధీ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం మొసలి కన్నీరేనన్నారు. తెలంగాణలో 12 శాతం ముస్లింలు ఉండగా..10 శాతం ఓబీసీలుగా చూపించి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ మాదిరిగా కాకుండా..పాలనలో అనుభవం కలిగిన గొప్ప నాయకుడిగా ప్రధాని మోడీ పారదర్శకంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
భువన్ రిభుకు వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ హానర్ అవార్డు.
రామాయంపేట నేటి ధాత్రి:
ప్రపంచ న్యాయ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు భువన్ రిభు.
వరల్డ్ లా కాంగ్రెస్ లో వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ హానర్ అవార్డును మన భారత సుప్రీంకోర్టు న్యాయవాది భువన్ రిభు అందుకోవటము మన దేశానికి ఒక గొప్ప ప్రతిభ గా చెప్పుకోవాలి, ఈ విజయం 262 జాతీయ స్వచ్ఛంద సంస్థలు తరపున, బాలల హక్కుల కన్వీనర్ భువన్ రిభు అందుకున్నారు.
Association
భువన్ రిభు దేశంలోని బాలల హక్కుల కోసం 416 జిల్లాల్లో పనిచేస్తున్న 262 ఎన్జీవోలను ఒకే గొడుగు కింద తీసుకువచ్చి, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ ను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా భువన్ రీభుకు బుధవారం విజన్ సంస్థ డైరెక్టర్ వంగరీ కైలాస్, జిల్లా కోఆర్డినేటర్ రాజు, సిబ్బంది ప్రత్యేక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలిపారు.
ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనిషి జీవితంలో నీరు ఒక భాగం. నీరు లేకపోతే జీవ రాశుల మనుగడ కష్టం. ఆహారం లేకున్నా కొన్ని రోజుల పాటు జీవించగలం కానీ నీరు లేకపోతే ఒక్క రోజూ జీవించలేం. అటువంటి అత్యవసరమైన నీరు దొరకక ఐదు ఆరు రోజుల నుండి ఓ జహీరాబాద్ లోని ఫరీద్ నగర్ బాలాజీ నగర్ ప్రజలు అల్లాడుతోంది. 12వ వార్డు వీధిలో ఒకే ఒక బోరు ఉంది ఆ బోరు గ్యాప్ ఇవ్వడం వల్ల బ్యాంకులో నీరు ఎక్కడం లేదు అయితే మంజీరా నీరు ఎనిమిది రోజుల నుండి రావడం లేదు ఆర్ డబ్ల్యు ఎస్ మరియు ఎం సి జెడ్ అధికారులు చూసి చూడలేనట్టు వ్యవహరిస్తున్నారు తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఆందోళన చేశారు.మంచినీటి సమస్యతో అల్లాడుతున్నామని మహిళలు తెలిపారు. కనీసం తాగడానికి మంచి నీరు లేక నోరుఎండిపోతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారన్నారు. ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగిన తప్ప ఇప్పటివరకు మంచినీరు మా ప్రాంతానికి ఇవ్వలేదని మండుతున్న ఎండల్లో పిల్లా పాపలతో అల్లాడిపోతున్నామన్నారు. తక్షణం జిల్లా కలెక్టర్ స్పందించి మాకు మంచి నీటి సౌకర్యం కల్పించి మా దాహార్తిని తీర్చాలని మహిళలు ఆందోళన చేపట్టారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో కలెక్టరేట్ ని కలిసి తమ సమస్యలను చెప్తామని మహిళలు హెచ్చరించారు పై అధికారులు వెంటనే స్పందించి ప్రజలను నీటి సౌకర్యం కల్పించాలని కోరుచున్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.