మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా VFX  అందుకే విశ్వంభర ఆల‌స్యం.

మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా VFX  అందుకే విశ్వంభర ఆల‌స్యం…

 

ద‌స‌రా, దీపావ‌ళికి సంబంధించిన వివ‌రాలు రిలీజ్ డేట్లు వ‌స్తున్నాయి. కానీ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘విశ్వంభర’ రిలీజ్‌ డేట్‌ మాత్రం డైలామాలో ఉంది.ఈ సంవ‌త్స‌రం ఇప్ప‌టికే అర్థ‌ భాగం ఆరు నెల‌లు పూర్తి అయిది.

ఈ క్ర‌మంలో టాలీవుడ్‌లో సంక్రాంతి, స‌మ్మ‌ర్ సీజ‌న్‌లు ముగియ‌డంతో పెద్ద సినిమాల విడుద‌ల‌కు బ్రేక్ ప‌డిన‌ట్లే అయితే ఇప్ప‌టి నుంచే ద‌స‌రా, దీపావ‌ళికి సంబంధించిన సినిమాల వివ‌రాలు రిలీజ్ డేట్లు వ‌స్తున్నాయి.

కానీ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) రిలీజ్‌ డేట్‌ మాత్రం డైలామాలో ఉంది.

ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సిన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఎప్పుడొస్తుందా? అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తవ‌గా, 90 శాతం షూటింగ్‌ ఇండోర్‌లోనే జరిగింది.

కొద్ది ప్యాచ్‌ వర్క్ మాత్ర‌మే బాకీ ఉంది. ఇదిలాఉంటే ఈ యేడు మొద‌ట్లో విడుద‌ల చేసిన టీజ‌ర్‌లో విజువ‌ల్స్ VFX తేలిపోయిన‌ట్లు వ్య‌తిరేక‌త‌ను తీసుకువ‌చ్చింది.

దీంతో మేక‌ర్స్ మ‌రింత జాగ్ర‌త్త ప‌డి సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసి మ‌రో కంపెనీతో సీజీ ప‌నులు చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. వాటి నుంచి అవుట్‌ పుట్‌ వచ్చాకే రిలీజ్‌ డేట్‌ ప్రకటించాలని చిరంజీవి నిర్ణయించుకొన్నారట.

ఒకసారి సీజీ వర్క్‌ వచ్చి అది నచ్చక మళ్లీ వెనక్కి పంపి, మళ్లీ రిలీజ్‌ డేట్‌ మార్చి..

ఈ రచ్చంతా ఎందుకు? సినిమా మొత్తం చూసుకొన్న తరవాత అప్పుడు రిలీజ్‌ డేట్‌ ప్రకటిద్దాం అని పక్కా ప్రణాళిలతో ఉన్నారట చిరు.

యూవీ క్రియేషన్స్‌ కూడా ఇదే మాటకు కట్టుబడి ఉందని తెలుస్తోంది.

జూలై, ఆగస్టు ఈ రెండు నెలలు ‘విశ్వంభర’ రావడానికి అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఇటీవ‌ల ఆంగ్ల మీడియాతో మాట్లాడిన చిత్ర దర్శకుడు వశిష్ఠ, సినిమా గురించి అప్‌డేట్‌ ఇచ్చారు. ‘విశ్వంభర’ ఒక్క పాట మినహా షూటింగ్‌ అంతా పూర్తైంది.

సినిమా ఒక విజువల్‌ వండర్‌లా ఉంటుంది.

ఆ అనుభూతినిచ్చేందుకే వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరుగుతున్నాయి. వాటి నాణ్యత విషయంలో అస్సలు రాజీపడడం లేదు. అందుకే ఆలస్యం అవుతోంది.

ఈ పనులు ఓ కొలిక్కి వచ్చాకే విడుదల తేదీపై స్పష్టతనిస్తాం అన్నారు.సినిమాలో అత్యధికంగా 4676 వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ ఉన్నాయని, అవి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటాయన్నారు.

ప్రపంచస్థాయి క్వాలిటీని అందివ్వడానికి టాప్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీలు పనిచేస్తున్నాయి.

చిరంజీవి ఇప్పటివరకూ చేసిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల అవుట్‌పుట్‌ చూసి థ్రిల్లయ్యారు’ అని అన్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది.

 

ఆస్కార్ అకాడమీలో తెలుగు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్.

 ఆస్కార్ అకాడమీలో తెలుగు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్…

 

ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కమిటీలో సభ్యుడిగా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ యుగంధర్ తమ్మారెడ్డి ఎంపికయ్యారు.ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కమిటీలో ( Oscars committee) సభ్యుడిగా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ (VFX Supervisor) యుగంధర్ తమ్మారెడ్డి (Yugandhar Tammareddy) ఎంపికయ్యారు.

ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్‌లో ప్ర‌ముఖంగా వార్త‌ల్లో నిలిచింది. తెలుగు సినిమా పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) రంగంలో విశేష కృషి చేసిన యుగంధర్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ Academy of Motion Picture Arts and Sciences (AMPAS) లో 2025 క్లాస్‌లో సభ్యుడిగా చేరడంతో అంతర్జాతీయ స్థాయిలోఆయ‌న గుర్తింపును సాధించారు. ఇప్ప‌టివ‌ర‌కు 125కి పైగా చిత్రాల‌కు ప‌ని చేసిన ఆయ‌న త‌న అద్భుత ప్ర‌తిభ‌తో తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.

1999లో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన రాజకుమారుడు చిత్రంతో కెరీర్ మొదలు పెట్టిన యుగంధర్ నాటి నుంచి తెలుగు సినిమాల్లో వీఎఫ్ఎక్స్ వినియోగాన్ని కొంత పంత‌లు తొక్కించాడు.
ఆ రంగంలో నిరంతరం నూత‌న‌ ఆవిష్కరణలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కు విజువ‌ల్ ట్రీట్ అందించడంలో కీల‌క పాత్ర పోషించాడు. రంగస్థలం చిత్రంలో గ్రామీణ నేపథ్యాన్ని సజీవంగా తీర్చిదిద్దిన విజువల్స్, అల వైకుంఠపురము, దేవరలో యాక్షన్ సన్నివేశాల విజువ‌ల్స్ తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రమే కాక, దేశ వ్యాప్తంగా యుగంధ‌ర్‌కు మంచి పేరును తీసుకు వ‌చ్చాయి.ఇదిలాఉంటే..
‘ది అకాడెమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌’ ఇటీవల విడుదల చేసిన కొత్త కమిటీ సభ్యుల జాబితాలో భారత్‌ నుంచి కమల్‌ హాసన్‌ (Kamal Haasan)తో పాటు నటుడు ఆయుష్మాన్‌ ఖురానా, దర్శకురాలు పాయల్‌ కపాడియా, ఫ్యాషన్‌ డిజైనర్‌ మాక్సిమా బసు ఉన్నారు.
ప‌లువురు హాలీవుడ్‌ నటీనటులతో పాటు ఆస్కార్‌ ఓటింగ్‌ ప్రక్రియలో వీరు పాలు పంచుకోనున్నారు. దీంతో అకాడెమీ 2025 క‌మిటీలో యుంధ‌ర్ ఎంపిక‌తో తెలుగు సినిమాకే కాకుండా మొత్తం భారతీయ వీఎఫ్ఎక్స్ రంగానికి గర్వకారణమ‌ని, మ‌రో సారి భార‌తీయుడి ప్ర‌తిభ‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పార‌ని ఆయ‌న‌ను కొనియాడుతున్నారు.
అన్ని ఇండ‌స్ట్రీల‌ నుంచి ఆయ‌న‌కు ప్ర‌శంస‌ల వెళ్లువెత్తుతున్నాయి.ఇక‌పై మ‌న‌ సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అంటున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version