నందిగామలో పౌర హక్కుల దినోత్సవం.

నందిగామలో పౌర హక్కుల దినోత్సవం

నిజాంపేట: నేటి ధాత్రి

 

మండల పరిధిలోని నందిగామ గ్రామంలో సోమవారం తహసిల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో కుల వివక్షత చూపరాదని, హోటల్లో రెండు గ్లాసుల పద్ధతిని వీడని ఆడాలని సూచించారు. కులం పేరుతో దూషించినట్లయితే 100 నెంబర్ కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి గ్రామస్తులు ఉన్నారు.

కవేలి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం.

కవేలి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం శనివారం నిర్వహిచడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటి తహశీల్దార్ వర ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రతీ పౌరుడు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇక కొన్ని ప్రాంతాలలో కుల వివక్ష కొనసాగుతుందని, దానిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిదంగా హక్కుల సాధన దిశగా అందరూ అడుగులు వేయాలన్నారు.

తిప్పనగుల్లలో పౌర హక్కుల దినోత్సవం.

తిప్పనగుల్లలో పౌర హక్కుల దినోత్సవం

నిజాంపేట్, నేటి ధాత్రి

నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుళ్ల గ్రామంలో బుధవారం రోజున పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎస్ఐ జైపాల్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశాలను తెలుపడం జరిగింది. గ్రామంలో ఎస్సీ ఎస్టీలను కులం పేరుతో ఎవరైనా దూషిస్తే మా దృష్టికి తీసుకురావాలని గుడిలోకి, బడిలోకి, రానివ్వకుండా కులం పేరుతో మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, హోటళ్లల్లో అందరికీ ఒకేలాగా ఒకే తీరు గ్లాసులల్లో చాయ్ ఇవ్వాలని మీకు వేరు మాకు వేరు అనే పద్ధతిని ఉంటే అటువంటి అంశాలపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని కోనేరు రంగారావు సిఫారసుల మేరకు ప్రతినెల చివరి రోజున మండలంలోని ఏదో ఒక గ్రామంలో ఇలాంటి పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం చేపడతామని, ఆ గ్రామాలలో ఏవైనా కులాల వారీగా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో జీవించాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు సమాన అవకాశాలు సమాన విద్య అందరికీ అందించే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇమాద్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు దుబాసి సంజీవ్, ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి శ్యామల పోలీస్ సిబ్బంది గ్రామస్తులు చంద్రం, యాదగిరి, రాజు, నవీన్, గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.

ఘనంగా పౌర హక్కుల దినోత్సవం.

ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

# నెక్కొండ, నేటి ధాత్రి:

 

మండలంలోని వెంకటాపురం గ్రామంలోని గంగాదేవి తండా ఎస్టీ కాలనీ లో పౌరహక్కుల దినోత్సవం ను పంచాయతీ సెక్రటరీ కోట శిరీష ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ తహసిల్దార్ పల్లకొండ రవి హాజరై మాట్లాడుతూ ప్రతి పౌరుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని నిర్మాణం చేయాలని, అంటరానితనం రూపుమాపి సమానత్వం కొరకు సామాజిక చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే అందరూ సమ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని,ఆర్థిక,రాజకీయ, సామాజిక అభివృద్దిలో ముందుండాలని అన్నారు, ప్రజల వద్ద నుండి వచ్చిన వినతులను స్వీకరించి తగిన పరిష్కారం చేస్తామన్నారు, అనంతరం పౌరహక్కుల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ నజ్మా, ఏ ఇ ఓ అరున్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు, జిల్లా విజిలెన్స్ , మానిటరింగ్ కమిటీ సభ్యులు మాంకాల యాదగిరి , సీసీ యాకాంబ్రం, అంగన్వాడీ టీచర్ భాలీ , ఉమాదేవి, సినియర్ అసిస్టెంట్ రాజేష్, ఎంఆర్ పీ స్ మండల అధ్యక్షులు ఈ వెంకన్న, రాష్ట్ర నాయకులు గడ్డం రమేశ్, సిఎ రజిత, గ్రామ పంచాయితీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version