శింబు మానాడు-2.. కాంబినేషన్ రిపీట్!

శింబు మానాడు-2.. కాంబినేషన్ రిపీట్!

 

 

శింబు, వెంకట్ ప్రభు కాంబినేష‌న్‌లో నాలుగేండ్ల క్రితం వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం మానాడు.

హీరో శింబు (Simbu), వెంకట్ ప్రభు (Venkat Prabhu)కాంబినేష‌న్‌లో నాలుగేండ్ల క్రితం వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం మానాడు (Maanaadu).
హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ న‌టించిన ఎడ్జ్ ఆఫ్ టుమారో త‌ర‌హా టైమ్ లూప్ క‌థ‌ నేప‌థ్యంలో తెర‌కెక్కిన
ఈ మూవీ క‌రోనా త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఓ ఊపు ఊపింది.
ఆపై తెలుగులోనూ ఓటీటీ ద్వారా ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు చేరువైంది..
ఈ చిత్రం వ‌చ్చి నాలుగేండ్లు పూర్తైనా ఇప్ప‌టికీ
ఈ సినిమాలోని ఎస్జే సూర్య (S. J. Suryah) చెప్పే వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్‌ డైలాగ్ చాలా ప్రాంతాల‌లో విరివిగా వినిపిస్తూ ఉంటుందంటే ఈ సినిమా జ‌నాల‌లోకి ఎంత‌లా వెళ్లిందో అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తీయ‌డానికి మేక‌ర్స్ ఫ్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం హీరో శింబు, ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు మ‌రోసారి జ‌త క‌ట్ట‌బోతున్నారు.
ఈ సినిమాకు దసుమారు ద‌శాబ్దంకి పైగా హిట్ లేక కెరీర్ ఎండ్ కార్డ్‌ ప‌డుతున్న స‌మ‌యంలో హీరో శింబు(Simbu) కు ఈ చిత్రం ఓ అమృతంలా ఆదుకోవ‌డ‌మే కాక అప్ప‌టి వ‌ర‌కు శింబుకు ఉన్న స్టేట‌స్‌ను రెండింత‌లు రెట్టింపు చేసి అగ్ర స్థానంలో నిలిపింది.
దీంతో ఇప్పుడు ఈ సీక్వెల్‌పై అంచ‌నాలు క్ర‌మంగా ప్రారంభ‌మ‌య్యాయి.
అయితే.. ప్ర‌స్తుతం శింబు (Simbu), వెంక‌ట్ ప్ర‌భు ఇద్ద‌రు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఆ చిత్రాలు పూర్తి చేసిన అనంత‌రం తిరిగి ఈ సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నారు.
తొలిభాగం నిర్మించిన నిర్మాత సురేష్ కామాక్షి (Suresh kamatchi)
ఈ సీక్వెల్‌ను సైతం నిర్మించనుండ‌గా మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల వివ‌రాలు త్వ‌ర‌లోనే వెళ్ల‌డించ‌నున్నారు.
ఇదిలాఉంటే ప్ర‌స్తుతం ఈ మానాడు (Maanaadu) మొద‌టి చిత్రం త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లో సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక.!

క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసంg…ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు

ముస్లింలకు రంజాన్ మాసం పవిత్రమైనది…ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు

మహమ్మద్ చోటు బాయ్ రూపొందించిన రంజాన్ శుభాకాంక్షలు తెలిపే వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన…ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు

రంజాన్ మాసంలోనే కాదు అనునిత్యం సేవా కార్యక్రమాలు చేసే చోటు బాయ్ ని అభినందించిన…ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు

వర్దన్నపేట (నేటిదాత్రి) :

ఈరోజు…హనుమకొండలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నందు సహృదయ అనాధ వృద్ధాశ్రమం నిర్వాహకులు, సేవా తత్పరుడు & కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ చోటు బాయ్ గారు రూపొందించిన ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపే వాల్పోస్టర్ను వద్దన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు గారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మాట్లాడుతూ…క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. ముస్లింలు చంద్రమాన క్యాలెండర్ ను అనుసరిస్తారు చంద్రమాన క్యాలెండర్ ప్రకారం వచ్చే 9 వ నెలనే రంజాన్ మాసం.ఈ రంజాన్ మాసంలోనే ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ వ్రాయబడింది.కావున రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు అని అన్నారు.

ముస్లిం సోదర సోదరీమణులు రంజాన్ మాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్రంగా రోజా ఉంటూ ఉంటారు. రోజా ఉన్న ముస్లింలు రంజాన్ మాసంలో అత్యంత నీతి నియమాలతో నిష్టతో కూడిన ఉపవాస దీక్షలో ఉండి అల్లాను ఆరాధిస్తారని తెలిపారు.

ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉండి ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారు.

పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతను, మన సంస్కృతి వికాసానికి దోహదం చేస్తున్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైన సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుందని, పండుగ మానవాళికి హితన్ని బోధిస్తుందని అన్నారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది అని అన్నారు.

అల్లా ప్రబోధించినట్టుగా మన చోటు బాయ్ గారు కూడా అత్యంత దాతృత్వంతో సహృదయ అనే అనాధ వృద్ధాశ్రమం నడపడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో దానధర్మాలు చేస్తూ ఎంతో విశ్వాసం నమ్మకంతో ఉండే సహృదయ వృద్ధాశ్రమం నిర్వాహకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ చోటు బాయ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు గారు అన్నారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య,మాజీ జెడ్పీటీసీ కొత్తపల్లి & మాజీ సర్పంచ్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్,ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తుళ్ళ రవి,కాజీపేట మండల అధ్యక్షుడు అనిల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ వర్ధన్నపేట మండల అధ్యక్షుడు ప్రతి బాను ప్రసాద్,జిల్లా నాయకులు నాంపెల్లి యాదగిరి,మహిళా నాయకురాలు తీగల సునీత గౌడ్,కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఎండీ రషీద్,లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version