అందరికీ కనెక్ట్‌ అయ్యే పాత్ర..

అందరికీ కనెక్ట్‌ అయ్యే పాత్ర

‘గబ్బర్‌సింగ్‌’, ‘రేసుగుర్రం’, ‘ఎవడు’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్‌. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కూలీ’. రజనీకాంత్‌, నాగార్జున, ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రధారులుగా…

‘గబ్బర్‌సింగ్‌’, ‘రేసుగుర్రం’, ‘ఎవడు’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్‌. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కూలీ’. రజనీకాంత్‌, నాగార్జున, ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రధారులుగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్‌ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘‘ఓ ఆల్బమ్‌ కోసం లోకేశ్‌ను కలసినప్పుడు ‘కూలీ’లో నా పాత్ర గురించి చెప్పారు. వినగానే నచ్చేసింది. అందరూ కనెక్ట్‌ అయ్యే పాత్ర ఇది. మంచి భావోద్వేగాలతో నిండిన ఈ రోల్‌ నా కెరీర్‌లోనే ప్రత్యేకమైనది. రజనీ సార్‌తో కలసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన పోషించిన దేవ పాత్ర సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. నాగార్జున విలన్‌ పాత్రలో అద్భుతంగా నటించారు. లోకేశ్‌ విజన్‌, టేకింగ్‌ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. ‘కూలీ’ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది’’ అని చెప్పారు.

‘దేవదాసు’ పాత్ర గురించి  అభిమానికి జవాబు  ..

‘దేవదాసు’ పాత్ర గురించి  అభిమానికి జవాబు  

అభిమానుల అభినందనలే అభినయమూర్తులకు అసలైన ఉత్తేజం కలిగించే ఔషధం! సదా ప్రశంసల జల్లులే కాదు సద్విమర్శలనూ కళాకారులు స్వీకరించాలి.

అభిమానుల అభినందనలే అభినయమూర్తులకు అసలైన ఉత్తేజం కలిగించే ఔషధం! సదా ప్రశంసల జల్లులే కాదు సద్విమర్శలనూ కళాకారులు స్వీకరించాలి. అప్పుడే వారిలోని అసలైన ప్రతిభ వెలుగొందుతుంది. ఈ అంశాన్ని తు.చ. తప్పక పాటించిన వారెందరో కళారంగంలో రాణించారు. చిత్రసీమలో మహానటులుగా జేజేలు అందుకున్నవారు, ప్రేక్షకుల అభిమానం చూరగొన్నవారు ఈ పంథాలోనే పయనించారు. అందుకే ఈ నాటికీ వారి కళను చర్చించుకుంటున్నాం. తెలుగు చిత్రసీమలో ఎందరో నటరత్నాలు తమదైన బాణీ పలికించారు. చిత్తూరు నాగయ్య, యన్టీఆర్, ఏయన్నార్(ANR), యస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య, భానుమతి, సావిత్రి, అంజలీదేవి, జమున- ఇలా చెప్పుకుంటూ పోతే చేంతాడంత జాబితా సిద్ధమవుతుంది. వీరందరూ అభిమానులను అలరించడానికి ఎంతో శ్రమించినవారే! (ANR Letter to Fan).

ప్రస్తుత విషయానికి వస్తే మహానటుడు అక్కినేని నాగేశ్వరరావును తలచుకోగానే ఈ నాటికీ ఆయన అభిమానులు ముందుగా ‘దేవదాసు’ పాత్రనే గుర్తు చేసుకుంటారు.1953లో రూపొందిన ‘దేవదాసు’ చిత్రంతో ఏయన్నార్ జనం మదిలో చెరగని ముద్ర వేశారు. ఈ తరం ప్రేక్షకులు సైతం ఆ చిత్రాన్ని వీక్షిస్తే అక్కినేని అభినయాన్ని అభినందించకుండా ఉండలేరు. ఆ రోజుల్లోనే ఆరిపాక సూరిబాబు అనే అభిమాని అక్కినేని నాగేశ్వరరావుకు ‘దేవదాసు’ (Devadasu)పాత్ర గురించి ఓ ఉత్తరం రాశారు. అందుకు ఏయన్నార్ స్వదస్తూరితో రాసిన లేఖ ప్రస్తుతం లభ్యమవుతోంది. ఆ లేఖ సారాంశం ఇది…

‘మిత్రులు ఆరిపాక సూరిబాబు గారికి నమస్తే… మీరు ప్రేమతో రాసిన కార్డు చేరింది. చాలా సంతోషం. మీరు నా పట్ల చూపిన అభిమానానికి నా కృతజ్ఞతలు తెల్పుతున్నా.

మహాకవి శరశ్చంద్రుడు సృష్టించిన దేవదాసు కథలో (నా దృష్టిలో) అతిక్లిష్టమైన దేవదాసు పాత్రను నేను నటించపోవడం, ఆ భయంతోనే దేవదాసు పాత్ర నటించడానికి అంగీకరించాను. పట్టుదలతో పనిచేశాను. నేనే కాకుండా, డైరెక్టరూ, కెమెరామన్, తదితర మిత్రులు, ఆ పాత్ర విజయవంతం కావడానికి సర్వవిధాలా సహాయం చేశారు. అనేక మంది ఏదో అనుకున్నా, అందరి సహాయంతో అతి కష్టమైన పాత్రతో, మీ బోటి సద్విమర్శకుల మెప్పు పొందానంటే మీరన్నట్లు ఈ పాత్ర దొరకడం నా అదృష్టంగానే భావిస్తున్నా. ఇకముందు కూడా, నా నటనద్వారా మీకింకా దగ్గర కావడానికి ప్రయత్నిస్తా’

నా కెరీర్‌లో ఇదే బెస్ట్‌ క్యారెక్టర్‌.

నా కెరీర్‌లో ఇదే బెస్ట్‌ క్యారెక్టర్‌…

 

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈనెల 10న తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా..

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈనెల 10న తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది.
ఈ సందర్భంగా సినీ నటి అంజలి మాట్లాడుతూ‘ ఈ సంక్రాంతికి తెలుగులో ‘గేమ్‌ ఛేంజర్‌’, తమిళంలో విశాల్‌ చిత్రం రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నా.
‘గేమ్‌ ఛేంజర్‌’లో నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా పార్వతి. డైరెక్టర్‌ కథ చెప్పినప్పుడు, క్యారెక్టర్‌ చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారు.
సెట్స్‌ నుంచి వచ్చాక కూడా ఈ పాత్ర చాలా రోజులు నన్ను వెంటాడుతూనే వచ్చింది. నా కెరీర్‌లో ఇదే బెస్ట్‌ క్యారెక్టర్‌. రామ్‌ చరణ్‌ తన కో స్టార్స్‌ని ఎంతో గౌరవిస్తారు.
సెట్స్‌లో అందరితోనూ చక్కగా మాట్లాడతారు.
అప్పన్న, పార్వతీల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది.
శంకర్‌, మణిరత్నం చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది.
శంకర్‌ చిత్రంలో నటించే అవకాశం రావడం అనందంగా ఉంది. ‘గేమ్‌ ఛేంజర్‌’ వల్ల నా ఆలోచనాధోరణి మారింది.
ఈ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా.

బాబీ డియోల్ పాత్ర మరింత శక్తివంతంగా…

బాబీ డియోల్ పాత్ర మరింత శక్తివంతంగా…

 

 

 

బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తన అన్న సన్నీ డియోల్ మాదిరి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోకపోయినా…

వైవిధ్యమైన పాత్రలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

ఆ మధ్య సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ లో విలన్ గా చేసి మెప్పించాడు.

అలానే ఇప్పుడు దక్షిణాది చిత్రాల మీద కూడా బాబీ డియోల్ ఆసక్తి చూపుతున్నాడు.

పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) జూలై 24న విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా క్రిష్ (Krish) తో పాటు ఆ సినిమా దర్శకత్వంలో భాగస్వామి అయిన జ్యోతికృష్ణ (Jyothi Krishna) కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలియచేశారు.

వాటి గురించి ఆయన చెబుతూ, ‘నిజానికి బాబీ డియోల్ (Bobby Deol) పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించాం.

కానీ, ‘యానిమల్‌’ (Animal) లో బాబీ నటనను చూసిన తర్వాత ‘హరి హర వీరమల్లు’లో ఆయన పాత్రను పునః రచించాలని నిర్ణయించుకున్నాను.

ఆ పాత్రను సరికొత్తగా తీర్చిదిద్ది, మరింత శక్తివంతంగా మలిచాను. ‘యానిమల్’ చిత్రంలో బాబీ డియోల్ గారి నటన అద్భుతం.

పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది.

అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని జ్యోతికృష్ణ అన్నారు.

జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని విభాగాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు.

బాబీ డియోల్ పోషించిన ఔరంగజేబు పాత్ర విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
బాబీ డియోల్ నటనలోని భావోద్వేగ లోతును తీసుకురావడం కోసం..
ఆ పాత్రను ఎంతగానో మెరుగుపరిచారు.
జనాలు ‘యానిమల్’ తర్వాత బాబీ డియోల్ సరికొత్త స్టార్‌డమ్‌ ను చూశారు.
ఆ స్టార్‌డమ్‌ కి న్యాయం చేయడానికి ఆయనపై ఉన్న అంచనాలను అందుకోవడానికి ఔరంగజేబు పాత్రకు మరింత ఆకర్షణీయమైన ఆర్క్ అవసరమని జ్యోతి కృష్ణ భావించారట.
అందుకే ఆ పాత్ర వ్యక్తిత్వం, నేపథ్య కథ, ఆహార్యం వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారని తెలిసింది.
దీనిని గురించి ఆయన మరింత వివరిస్తూ, ‘నేను సవరించిన స్క్రిప్ట్‌ను చెప్పినప్పుడు బాబీ గారు చాలా ఉత్సాహపడ్డారు.
ఆయన తనని తాను కొత్తగా ఆవిష్కరించు కోవడానికి ఇష్టపడే నటుడు.
‘హరి హర వీరమల్లు’ లో బాబీ డియోల్ ఎంతో శక్తివంతంగా కనిపిస్తారు.
ఆయనతో కలిసి పని చేయడం గొప్ప అనుభవం’ అని అన్నారు.

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.

ప్రవీణ్ కె. ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్ లను రూపొందించారు.

ప్రతిభగల సాంకేతిక బృందం సహకారంతో ఈ చిత్రం ఒక దృశ్య కావ్యంగా రూపుదిద్దుకుంటోంది.

ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version