ఈ-సెకిళ్ల పంపిణీలో సమర్ధసేవలు
డీఆర్డీఏ సిబ్బందికి కలెక్టర్ ప్రశంస
డీఆర్డీఏ సిబ్బందికి కలెక్టర్ ప్రశంస
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచులో టీమిండియా 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అమెరికా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు పరుగులు రాబట్టడానికి చెమటోడ్చారు. అయినప్పటికీ ఆఖరి వరకు నిలిచి సూర్య ఒంటరి పోరాటం చేశాడు. జట్టు గెలుపుపై మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు.
విధ్వంసకర బ్యాటింగ్‌కు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మ్యాచ్ అనంతరం సూర్య జట్టు గెలుపుపై మాట్లాడాడు. ‘నేనెంత ఒత్తిడి అనుభవించానో.. నేను మాత్రమే చెప్పగలను. కానీ ఏదో ఒక రోజు ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతానని నాకు తెలుసు. నేను చివరి వరకు క్రీజులో ఉంటే పరిస్థితి వేరేలా మారుతుందని నా మీద నాకు నమ్మకముంది. పిచ్ కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంది. కానీ ఎప్పుడు పరుగులు వేగంగా రాబట్టాలో మాకు తెలుసు.క్యురేటర్ తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. పిచ్‌ను రూల్, వాటరింగ్ చేయడానికి సరైన సన్‌లైట్ కూడా లేదు. ఈ పిచ్ మీద 180, 190 పరుగులు చేయలేమని ముందే అనిపించింది. 140 పరుగుల వికెట్ ఇది. 14 ఓవర్ల తర్వాత వచ్చిన బ్రేక్‌లో గౌతీ భాయ్ నాకు అదే విషయం చెప్పాడు. చివరి వరకు బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించు.. నువ్వు ఏ సమయంలోనైనా కవర్ చేయగలవు అన్నాడు. ఆ బ్రేక్ మాకు కలిసొచ్చింది. ముఖ్యంగా నేను ముంబైలో చాలా క్రికెట్ ఆడాను. ఇక్కడి పిచ్‌ల గురించి నాకు ఓ అవగాహన ఉంది’ అని సూర్య చెప్పుకొచ్చాడు.