హైదరాబాద్‌‌లో భారీ స్కాం.. రూ. 270 కోట్ల మోసం..

హైదరాబాద్‌‌లో భారీ స్కాం.. రూ. 270 కోట్ల మోసం..

 

కూకట్‌పల్లిలో రియల్ ఎస్టేట్ పేరుతో పలువురు బాధితులను వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ మోసం చేసింది. బాధితులు సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులకి ఫిర్యాదు చేశారు..

 కూకట్‌పల్లిలో రియల్ ఎస్టేట్ పేరుతో పలువురు బాధితులను వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్ (White Waters Construction Scam) సంస్థ మోసం చేసింది. బాధితులు సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌లోని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అధికారులకి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో ఈ సంస్థపై అధికారులు కేసు నమోదు చేశారు.

పోలీసుల చర్యలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి వై జంక్షన్ సమీపంలో వైట్ వాటర్స్ పేరుతో అపార్ట్‌మెంట్ ప్రాజెక్ట్‌ను చేపట్టిన ఈ సంస్థ, వందలాది మంది కొనుగోలుదారులను నిలువునా ముంచింది. సుమారు 500 మంది కస్టమర్ల నుంచి దాదాపు రూ. 270 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. పదేళ్లుగా ఈ ప్రాజెక్ట్ పేరుతో డబ్బు వసూలు చేశారని ఫిర్యాదులో తెలిపారు.

న్యాయం చేయాలి..

బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌ యజమాని అజయ్‌పై సైబరాబాద్ EOW పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జీవిత కాల కష్టాన్ని ప్లాట్ల కోసం పెట్టుబడిగా పెట్టామని తమకు న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించి తమ డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version