కూకట్‌పల్లిలోని వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌పై కేసు నమోదు..
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌పై కేసు నమోదు అయింది. ప్లాట్స్ కట్టిస్తామని చెప్పి మోసం చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 500 మంది నుంచి రూ.270 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది..
హైదరాబాద్: కూకట్‌పల్లిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్ సంస్థపై కేసు నమోదు అయింది. ప్లాట్లు కట్టిస్తామని నమ్మబలికి వందలాది మందిని మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదుల ప్రకారం.. సుమారు 500 మంది నుంచి దాదాపు రూ.270 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. పదేళ్లుగా వివిధ ప్రాజెక్టుల పేరుతో డబ్బులు తీసుకుంటూ వచ్చినప్పటికీ, హామీల మేరకు ప్లాట్లు ఇవ్వలేదని బాధితులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై సంస్థ యజమాని అజయ్‌తో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే వైట్ వాటర్ కన్‌స్ట్రక్షన్‌పై సైబరాబాద్ EOWలో సుమారు వంద మంది ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వసూలు చేసిన నిధుల వినియోగం, ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితి వంటి అంశాలపై అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.
