వేసవి శిక్షణా తరగతులు.

విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి

 

 

ప్రభుత్వ ఆదేశాల మేరకు తొర్రూరు మండలంలోని తొర్రూరు హై స్కూల్, చెర్లపాలెం హై స్కూల్, మాటేడు హై స్కూల్, అమ్మాపురం హై స్కూల్ మరియు హరిపిరాల హై స్కూల్ లలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంప్)తేదీ 6-05-2025 నుండి 20-05-2025 వరకు (15 రోజులు), ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు నిర్వహించడం జరుగుతుంది.
సమ్మర్ క్యాంపులో ఈ క్రింద తెలుపబడిన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము.
1 ఇండోర్ గేమ్స్
2 ఆటలు మరియు పాటలు
3 స్పోకెన్ ఇంగ్లీష్
4 బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్
5 సైన్స్ ఎక్స్పెరిమెంట్స్
6 డ్రాయింగ్ స్కిల్స్
7 క్రాఫ్ట్ (కుట్లు మరియు అల్లికలు)
8 కమ్యూనికేషన్ స్కిల్స్
9 డాన్స్
10 వాలీబాల్ ,షటిల్ గేమ్స్
పైన సూచించిన కార్యక్రమాలతో పాటు ఇతర కొత్త కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది.
కావున తమరు అందరూ ఐదవ తరగతి నుండి పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరనైనది.
ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రధానోపాధ్యాయుల సమావేశంలో MEO మహంకాళి బుచ్చయ్య కోరారు.

జహీరాబాద్ విద్యార్థినికి గోల్డ్ మెడల్..

జహీరాబాద్ విద్యార్థినికి గోల్డ్ మెడల్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం రంజోల్కు చెందిన మహమ్మద్ కరీం కూతురు నూరిన్ ఫాతిమా లా విద్యాలో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించింది. HYDలో లా పూర్తి చేసిన ఫాతిమా మూడు రోజులపాటు HYDలోని సుల్తాన్ ఉల్ ఉలమ్ కాలేజ్ ఆఫ్ లాలో హార్మనీ ఇన్ డిస్ప్యూట్స్ అనే అంశంపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నాగేశ్వరరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. దీంతో కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు.

పిల్లలు చదువుతోపాటు దైవభక్తిని పెంపొందించుకోవాలి.

పిల్లలు చదువుతోపాటు దైవభక్తిని పెంపొందించుకోవాలి- జిల్లా సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

పిల్లలు చిన్నప్పటి నుంచి చదువుతోపాటు దైవభక్తిని పెంపొందించుకోవాలని కరీంనగర్ జిల్లా సైకాలజిస్ట్ అసోసియేషన్ (టిపిఏ) అధ్యక్షులు మల్లేశం అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని ఇమ్మానియేల్ ఏజి చర్చిలో పాస్టర్ మచ్చ తిమోతి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ఉచిత చిల్డ్రన్ బైబిల్ క్లాసులు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దైవభక్తి కలిగి ఉన్నప్పుడు పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించే మంచి అలవాట్లు అలవాడతాయన్నారు. చదువుతోపాటు నీతి విలువలతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చిన్నప్పటినుంచి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్య సాధన కోసం పాటుపడుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా చిన్నారుల జీవితాలకు ఉపయోగపడే స్ఫూర్తిదాయకమైన మాటలను వివరించారు. అనంతరం ఇందులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈకార్యక్రమంలో చర్చి నిర్వాహకులు మచ్చ తిమోతి, బైబిల్ క్లాస్ టీచర్లు రజిని, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో రెండవ దశ ఒలంపియాడ్ ఫౌండేషన్ పరీక్ష విజేతలకు కలెక్టర్ పమేలా సత్పతి బహుమతులు అందజేశారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల సంయుక్తంగా నిర్వహించిన ఒలంపియాడ్ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎనబై మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఫలితాలను పెంపోందించెందుకు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి అవకాశాలను విద్యార్థులకు అందేలా ప్రోత్సహించాలని, ఈకార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వసతులు కల్పిస్తూ, ప్రోత్సాహన్ని అందిస్తున్న ఆల్పోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని కలెక్టర్ అభినందించారు. ప్రస్తుతం యాభై ఏడు మంది నుండి మూడవ బ్యాచ్ డెబ్బై ఐదు మందిగా తిరిగివచ్చి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను కోరారు. ఈకార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, రామడుగు తాహశీల్దార్ రాజేశ్వరి, విఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ ఆదర్శవాణి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

శ్రీ ఆదర్శవాణి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

డివిజన్ టాపర్ గా కొత్త కార్తీక్..

నర్సంపేట,నేటిధాత్రి:

 

గత నెల 30న విడుదలైన పదవ తరగతి ఫలితాలలో శ్రీ ఆదర్శవాణి విద్యార్థులు ప్రతిభ కనబరిచి డివిజన్ టాపర్ లుగా నిలిచారు.అలాగే ఇదే పాఠశాలకు చెందిన కొత్త కార్తీక్ అనే డివిజన్ టాపర్ గా రికార్డు సృష్టించాడు.కాగా డివిజన్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పూల మాలలతో అభినందించారు. 2025 -2026 సంవత్సరంలో 10/10 జీబీఏ 600 మార్కులకు 563 మార్కులు సాధించి డివిజన్ టాపర్ గా నిలిచిన కొత్త కార్తీక్,అలాగే 558 మార్కులు సాధించిన బూర సాత్విక్, 557 మార్కులు సాధించిన మూలా అవినాష్ లను పూల బొకేలతో అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందు ఉండాలని విద్యార్థులను ఆశీర్వదించారు.

students

ఈ కార్యక్రమంలో శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గౌరవంగా ఉందని తెలియజేశారు.అలాగే గత సంవత్సరం ముగ్గురు విద్యార్థులు 10/10 లు సాధించి జిల్లాలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారని ఈ సంవత్సరం నర్సంపేట డివిజన్ టాపర్ లు గా నిలవడం గౌరవంగా ఉందన్నారు. 62 మంది విద్యార్థులకు 30 మంది విద్యార్థులు 500 లకు పైగా మార్కులు సాధించగా ఆ విద్యార్థులను అభినందించారు.పట్టుదలతో చదివి ఉన్నత మార్కులు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తీసుకొచ్చినందుకు వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ కవిత, బిక్షపతి, మణికంఠ, శశిధర చారి, ప్రిన్సిపల్స్ స్రవంతి, సుధాకర్, స్వప్న చారి,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన.

పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన శ్రీ కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించినందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ ర్యాంకులు,గ్రేడ్లు ప్రాముఖ్యత కాకుండా ఆవరేజ్ విద్యార్థులను తీసుకొని అందరినీ ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేస్తున్న శ్రీ కృష్ణవేణి హై స్కూల్ ఉపాధ్యాయులు యాజమాన్యం ప్రతి సంవత్సరం నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నారు.భవిష్యత్తులో విద్యార్థులు విద్యావంతులు కావడానికి వారే స్వయం నిర్ణయాన్ని తీసుకోవాలని అనేక రంగాలలో ప్రవేశించడానికి( ఐటిఐ, పాలిటెక్నిక్,డిప్లమా కోర్సులు, ఇంటర్మీడియట్) తదితర కోర్సులలో ప్రవేశించడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని,ఎవరిని బలవంతం పెట్టకుండా భవిష్యత్తులో మంచి మార్గం ఎన్నుకోవడానికి విద్యార్థులను కృషి చేయాలని కోరారు.

ఎస్ఎస్ఎస్సి 2025 ఫలితాలలో అక్షర విద్యార్థుల ప్రభంజనం .

ఎస్ఎస్ఎస్సి 2025 ఫలితాలలో అక్షర విద్యార్థుల ప్రభంజనం

రామడుగు, నేటిధాత్రి:

 

ప్రభుత్వం ప్రకటించిన పదవి తరగతి పలితాలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అక్షర హై స్కూల్ విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగే ఈవిద్యా సంవత్సరం కూడా కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా అత్యుత్తమ ఫలితాలను సాధించారని కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ మినుకుల మునీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్షర హై స్కూల్ లో 95 విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 500 పైగా మార్కులు 63 మంది విద్యార్థులు సాధించారు. 550కిపైగా 22 మంది విద్యార్థులు సాదించారు. అత్యధిక మార్కులు సాధించిన జి.మనస్విని 568, టి.తేజ 562, ఈ.సాక్షిత 560, కే.మమత 559, ఎల్.కార్తీక్ 558, విద్యార్థులను కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ మినుకుల మునీందర్ విద్యార్థులను పుష్పగుచ్చములతో అభినందించిన అనంతరం మునిందర్ మాట్లాడుతూ 500 పైన మార్కులు జిల్లా స్థాయిలో ఎక్కువ మంది అక్షర విద్యార్థులే సాధించడం గొప్ప విజయమని విద్యార్థులను కొనియాడారు. ఈకార్యక్రమంలో డైరెక్టర్ మినుకుల రాధ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

100% ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

‘100% ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

బాలానగర్ /నేటి ధాత్రి.

 

 

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..

ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్రత సాధించిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100% ఉత్తీర్ణత సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు.

Students

 

 

అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన.

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన…..

రామాయంపేట మే 1 నేటి ధాత్రి (మెదక్)

 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెరుగైన విద్యా బోధన అందించడం జరుగుతుందని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంగ్లీష్, జువాలజీ అధ్యాపకులు యాదగిరి, స్వామి అన్నారు. గురువారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఇండ్లలోకి వెళ్లి ప్రభుత్వ కళాశాలలో విద్యాబోధనపై వారికి అవగాహన కల్పించారు. రామాయంపేట పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవం గల అధ్యాపకుల తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. విశాలమైన తరగతి గదులతో పాటు ఇతర వసతులు ఉన్నాయని చెప్పారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరాలని వారు సూచించారు. ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు బస్ పాస్ సౌకర్యం ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందన్నారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కళాశాలలో బైపిసి, ఎంపీసీ, సి ఈ సి, హెచ్ ఈ సి గ్రూపులతో పాటు ఒకేషనల్ విభాగంలో ఎలక్ట్రికల్, ఆఫీస్ అసిస్టెంట్ షిప్, అకౌంటెంట్ టాక్సేషన్ గ్రూపులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయని విద్యార్థులకు వివరించారు. అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ కళాశాలలో చేరి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా వారు సూచించారు. ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా లెక్చరర్లు తెలిపారు.

అత్యుత్తమ ఫలితాలు సాధించిన అల్ఫోర్స్.

అత్యుత్తమ ఫలితాలు సాధించిన అల్ఫోర్స్

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

రాష్ట్ర విద్యాశాఖ బుధవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో అల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు కీర్తిని తెచ్చిపెట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో 600 మార్కులకు గాను బక్కశెట్టి హర్షిని 574, కే.భాను ప్రకాష్ 573, ఎం.శరణ్య 568, జె.సాయి చరణ్ 568, కే.సంజన, జి.మన్విత 566మార్కులు సాధించారు. 500కు పైగా 72 మంది వంద శాతం ఉత్తీర్ణతతో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని పాఠశాల చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ ఊట్కూరి నరేందర్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు.

అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఎన్నిక.

అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ కలిగేటి కవిత లక్ష్మణ్, మాజీ సర్పంచ్ మన్నె దర్శన్ రావు, ఉపాధ్యాయులు మేకల ప్రవీణ్ కుమార్ ల ఆధ్వర్యంలో నూతనంగా అంబేద్కర్ సంఘం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈయొక్క కమిటీ గౌరవ అధ్యక్షులుగా మన్నె కిషన్ చందర్, కమిటీ సలహాదారునిగా మేకల విజేందర్, అధ్యక్షులుగా మేకల ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి దాసరి రమేష్, ఉపాధ్యక్షులుగా చిలుముల హరీష్, మేకల కిరణ్ లు, కోశాధికారిగా సుమన్, కార్యదర్శిగా మేకల అభిషేక్, జాయింట్ సెక్రెటరీగా రవితేజ, సహాయ కార్యదర్శిగా గడ్డం రాజు, కార్యవర్గ సభ్యులుగా దాసరి సుధీర్ కుమార్, కనకం సతీష్, గుడిసే శ్రీకాంత్, కలిగేటి శ్రీకాంత్, వడ్లూరి మహేష్, మన్నే విక్రం, గోల్కొండ సంతోష్, మేకల విని కుమార్, తదితరులను ఎన్నుకోవడం జరిగింది.

Mekala Praveen Kumar.

ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ కొరుటపల్లి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయడానికి కలిసికట్టుగా మావంతు కృషి చేస్తామని తెలిపారు.

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ముదిగుంట ప్రభుత్వ .

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ముదిగుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 19 మంది లో బాలురు(13) బాలికలు(6 )గురు విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో చదివిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు.తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు అధిక మార్కులు సాధించి ఉత్తీర్ణత అయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని పేద మధ్య తరగతి విద్యార్థులు అధిక మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరును తీసుకొచ్చారని అన్నారు.అలాగే గ్రామస్తుల సహాయ సహకారాలు,పాఠశాల విద్య కమిటీ చైర్మన్ గుండా సునీత,ఉపాధ్యాయులు చూపిన చొరవతో అధిక మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు రాజగోపాల్ కృతజ్ఞతలు తెలిపారు.

పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రభంజనం.

పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రభంజనం

మండల ర్యాంకులు సాధిం చిన బాలికల పాఠశాల విద్యార్థులు

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాల విద్యార్థులు నామని అక్షయ 549, డి. సాయి శ్రీ 546, ఎండి అమ్రీన్ 527 మార్కులు సాధిం చి స్కూల్ టాపర్లుగా మరియు మండల స్థాయిలో ఒకటవ, రెండవ, నాలుగవ స్థానాలు కైవసం చేసుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు శ్రీలత తెలిపారు. పాఠశాలలో 16 మందికి గాను 15 మంది పాసయ్యారు. 94% ఉత్తీర్ణత సాధించారు జడ్పీ హెచ్ఎస్ బాలుర పాఠశాల రంగు సంజయ్ 529 సాధించారు.

Students

 

16 మందికిగాను 15 మంది పాసయ్యారు. 94% ఉత్తీర్ణత సాధించారు. గురు కుల పాఠశాలలో మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారు విద్యార్థుల మార్కులు 567, రెండవ స్థానం 560 మార్కు లతో పాటు 500 పైగా మార్కులు 38 మంది విద్యార్థులు సాధించారు. కేజీవిపి ప్రభుత్వ పాఠశాలలో 504మార్కులు సాధించారు. పెద్దకోడేపాక పాఠశాలలో కూడా ఉత్తమ ఫలితాలు సాధించారు. పాఠశాల ప్రధానో పాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల కృషి క్రమశిక్షణ అంకితభావంతో సహా అత్యు త్తమ ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రుల సహకారంతో ఈ ఫలితాలు సాధించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల ప్రధానో పాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

రావుస్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు.

రావుస్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించి నoదుకుసన్మానించిన ఐక్యవేదిక నేతలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణ ములో రావుస్ జూనియర్ కళాశాలలో పదవ తరగతి చదివి న విద్యార్థులను ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా రాష్ట్ర స్థాయి మార్పులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యన్ని అభినందించారు
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం, ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్, గౌనికాడి యాదయ్య, శివకుమార్, వెంకటేశ్వర్లు,రమేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ప్రైవేట్ స్కూలు వద్దు అంగన్వాడి ముద్దు.

ప్రైవేట్ స్కూలు వద్దు అంగన్వాడి ముద్దు.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

చిట్యాల మూడవ కేంద్రంలో అన్యువల్ డే ప్రోగ్రాం అరుణ భాగ్యమ్మ టీచర్స్ఏర్పాటు చేయడం జరిగింది జయప్రద సూపర్వైజర్ హాజరై జూన్24 నుండి ఏప్రిల్ 25 వరకు 11 నెలలలో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో నేర్చుకున్న ప్రీస్కూల్ కార్యక్రమాలన్నింటినీ తల్లులకు చేయించి చూపించడం జరిగింది ఆటలు పాటలు కథలు ఇంగ్లీష్ తెలుగు బోధనా అక్షరాలు అంకెలు వయసుల వారీగా పిల్లల బరువు ఎత్తులు ఏ స్థాయిలో ఉన్నవని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చేసి చూపించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ స్కూల్లువద్దు అంగన్వాడీ ముద్దు అనే నినాదంతో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించినట్లయితే పిల్లల శారీరక మానసిక కండరాల అభివృద్ధి ఆలోచన శక్తి మేధాశక్తి అభివృద్ధి చెంది నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదుగుతూ ఆరు సంవత్సరాలురాగానే ఏ స్కూళ్లకు పంపించిన పిల్లలందరు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకుంటారు ప్రైవేట్ స్కూల్ కి పంపడం వల్ల చిన్న వయసులో ఆడి పాడి సంతోషంగా గడపాల్సిన వయసులో ప్రైవేట్ స్కూల్ బందికానలో బంధించకండి ప్రస్తుతం శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు మినిస్టర్ జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి పరుచుట కొరకు పిల్లలు సంతోషంగా ఉత్సాహంగా ఉండుట కొరకు భవనాలను రిపేర్ చేయించడం రకరకాల పెయింటింగ్ వేయించడం యూనిఫామ్ ఇవ్వడం పిల్లలు కూర్చోవడానికి మ్యాట్స్ ఎన్నో రకాల ఆట వస్తువులను కూడా పంపిచ్చుచున్నారు అలాగే పిల్లలకు ముఖ్యంగా రుచికరమైన భోజనాన్ని వేడిగా అందించడం జరుగుతున్నది అందరూ అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో అరుణ భాగ్యమ్మ జ్యోతి భాగ్యలక్ష్మి సంధ్యారాణి సుజాత మహిళలు హాజరైనారు తల్లులందరికి పిల్లల గ్రోత్ కార్డ్స్ అభివృద్ధి పరిశీలన పత్రాలు అందివ్వడం జరిగింది.

అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం మెట్ పల్లి.

అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల “సిబ్బంది” ఆచారం

మెట్ పల్లి ఏప్రిల్ 26 నేటి దాత్రి

 

 

 

“దోస్ట్” ద్వారా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ లు చేసుకోవాలని కోరుతూ ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున ఆ కళాశాల సిబ్బంది సంయుక్తంగా వెంకట్రావుపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు.

వెంకట్రావుపేట ప్రధాన రహదారి, గ్రామ పంచాయితీ కార్యాలయం, హనుమాన్ దేవాలయం తదితర ప్రాంతాల్లో గల ఇండ్లలోనికి నేరుగా వెళ్ళి,మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 -2026 విద్యా సంవత్సరంలో బీ ఏ; బీ కాం (కంప్యూటర్) ప్రథమ సంవత్సరం కోర్సులలో చేరాలని సిబ్బంది ప్రజలకు సూచించారు.

ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణులైన వారు,ఇంటర్మీడియెట్ డ్రాప్ అవుట్స్ వంటి విద్యార్థులు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని సూచించారు.

ఈ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఎలాంటి ఫీజులు ఉండవని, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, క్రీడలు, ఉపకార వేతనాల మంజూరు,సాధారణ విజ్ఞాన పరీక్షల నిర్వహణ వంటి సౌకర్యాలతో పాటు అనుభవం మరియు నెట్ , సెట్, స్లెట్, పీ హెచ్ డి వంటి అధిక విద్యార్హతలు గల బోధకులు ఉన్నారని,

ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది “దోస్త్” ద్వారా అడ్మిషన్ ల కోసం ఇంటింటి ప్రచారం చేయటం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న, కళాశాల కామర్స్ హెచ్ ఓ డి ఏ.మనోజ్ కుమార్, లెక్చరర్లు గట్టయ్య, అంజయ్య, సత్తయ్య, రికార్డు అసిస్టంట్ వై.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వెంకట్రావు పేట గ్రామంలో “దోస్త్” ద్వారా అడ్మిషన్ల ల కోసం చేసిన ఇంటింటి ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని ప్రిన్సిపల్ కే వెంకయ్య తెలిపారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో. ఈనెల 27న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్ళపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు తెలిపారు. శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ. మొగుళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు . ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న, చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని మోటె ధర్మారావు తెలిపారు.

విద్యార్థిని అభినందించిన ప్రిన్సిపాల్.

విద్యార్థిని అభినందించిన ప్రిన్సిపాల్

నేటి ధాత్రి కథలాపూర్

 

 

 

మన కథలాపూర్ పద్మశాలి ముద్దుబిడ్డ జోగ మహాలక్ష్మి ద్వితీయ సంవత్సరం CEC విభాగం లో 984/1000 మార్కులు వచ్చినందుకు మాస్ట్రో కాలేజీ ప్రిన్సిపల్ ఆకుల రాజేష్  అభినందించారు.

విద్యాశాఖ కరీంనగర్ మరియు అల్ఫోర్స్ సంయుక్తంగా.

పాఠశాల విద్యాశాఖ కరీంనగర్ మరియు అల్ఫోర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒలంపియాడ్ ఫౌండేషన్ తరగతులో భాగంగా హాజరై స్టడీ మెటీరియల్ మరియు పుస్తకాలను పంపిణీ చేసిన నిర్వాహకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా పరిపాలన అధికారి పామెల సత్పత్తి, ఐఏఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒలంపియాడ్ ఫౌండేషన్ కోచింగ్ లో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ హైస్కూల్ ని సందర్శించి ప్రభుత్వ పాఠశాల 8&9వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, పుస్తకాలను అల్ఫోర్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసిన నిర్వాకులు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వి.నరేందర్ రెడ్డి. విద్యార్థులకు ఇరవై ఒక రోజులపాటు ఉచిత భోజన వసతితో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే చక్కటి ప్రణాళికలతో కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుపుతూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మొదటి దశలో మూడు వందల యాభై మంది విద్యార్థులో ఎనభై మంది విద్యార్థులు ఎంపికైనరని ఆఎంపికైన వారికి రెండో దశలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం వ్యాయామం, యోగా, సాయంత్రం డ్యాన్స్ తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. విద్యార్థులకు సేవనందించే అవకాశం కల్పించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమెల సత్పతి, ఐఏఎస్ కి, జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ విఎస్ జనార్దన్ రావుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని తస్కియా ఫైజా ప్రతిభ.

ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని తస్కియా ఫైజా ప్రతిభ.

-రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు, జిల్లాస్థాయిలో ప్రథమ ర్యాంకు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

పట్టణానికి చెందిన తస్కియా ఫైజా, 2024-25 ఇంటర్మీడియట్ ఫలితాల్లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించి జహీరాబాద్ ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది. తస్కియా ఫైజా, జహీరాబాద్ ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలో బైపిసి గ్రూప్లో చదువుతూ, 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఆమె ఈ ర్యాంకుతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినిగా నిలిచింది. ప్రభుత్వ కళాశాలలో చదువుతూ, ఎటువంటి కోచింగ్ సెంటర్ సహాయంలేకుండా తన కష్టపడి సాధించిన ఈ విజయం విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది. తస్కియా ఫైజా అభినందనలు అర్షించింది. ఆమె తల్లిదండ్రులు, అధ్యాపకులు, సహ విద్యార్థులందరూ ఈ విజయాన్ని గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, జహీరాబాద్ విద్యా ప్రాంగణంలో విద్యా సంస్థల ప్రతినిధులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. “ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించగలరన్న సత్యాన్ని తస్కియా నిరూపించిందని అని వారు వ్యాఖ్యానించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version