ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం

శిక్షణ అందించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్. మే 20:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గీతా నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ఐదు రోజుల ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది.

Collector Sandeep Kumar

 

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు గీత నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని, విద్యార్థులను గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.

గీతం యూనివర్సిటీ నుండి పిహెచ్‌డి పట్టా పొందిన.

గీతం యూనివర్సిటీ నుండి పిహెచ్‌డి పట్టా పొందిన డాక్టర్ దీప్తి..

వరంగల్ తూర్పు, నేటిధాత్రి.

 

 

వరంగల్ నగరానికి చెందిన స్కాలర్ ఆర్ దీప్తి, గీతం యూనివర్శిటీ విశాఖపట్నం లోని, స్కూల్ ఆఫ్ ఫార్మసీ నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీకి అర్హత సాధించారు. ఈ విషయాన్ని ఇటీవల విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రకటించారు. గీతం యూనివర్సిటీ పరిశోధనా స్కాలర్ అయిన రయిల్లా దీప్తి “అడెనిన్-ప్రేరిత దీర్ఘకాలిక కిడ్నీ నష్టం మరియు కార్డియోవాస్కులర్ ఆల్టరేషన్స్-టార్గెటింగ్, టిజిఎఫ్, కాస్పేస్ 3, ఎంచుకున్న సహజ సమ్మేళనాల రక్షణ ప్రభావాల మూల్యాంకనం” అనే శీర్షికతో తన పిహెచ్‌డి పరిశోధనను సమర్పించింది.

Dr. Deepthi

 

ఆమె గీతం విశ్వవిద్యాలయంలో ఫార్మసీ డిపార్ట్మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి సుహాసిన్ పర్యవేక్షణలో తన పరిశోధన చేశారు. వరంగల్ నగరానికి చెందిన డాక్టర్ దీప్తి, ప్రస్తుతం హనుమకొండ జిల్లా, ఓగ్లాపూర్‌లోని కేర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అంకిత భావంతో డాక్టర్ దీప్తి పిహెచ్‌డి పూర్తి చేయడం పట్ల తోటి స్కాలర్స్, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు దీప్తిని అభినందించారు.

ఇంటర్మిడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు.

ఇంటర్మిడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు *పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి)

 

జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణ పై సోమవారం సంబంధిత అధికారులతో మినీ సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు.

జిల్లాలో మే, 22 నుంచి మే 29, 2025 వరకు ఇంటర్ తియరీ పరీక్షలు,జూన్ 03 నుండి 12 వరకు (ప్రాక్టికల్) ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉ. 9.00 నుండి మ.12.00 వరకు రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2:30 నుండి 5:30 వరకు పరీక్షలు జరుగుతాయని, మొదటి సం.2385 రొండవ సం.1478 మొత్తం 3863 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఇందుకు గాను 13 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వం పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పరిక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

విద్యార్దులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని సూచించారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని, ప్రతి కేంద్రం వద్ద ఏ.ఎన్.ఎం స్థాయిలో వైద్య సిబ్బంది, ఓ.అర్.ఎస్. ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నపత్రాలను నిల్వ జేయుటకు పోలిస్ స్టేషనలో తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రశ్నపత్రాలకు పోలిసు బందోబస్తు కల్పించాలని ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన సదుపాయాలు కల్పించాలని,పరీక్ష కేంద్రాల వద్ద తప్పనిసరిగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, సెంటర్లలో మాస్ కాపీయింగ్ మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పరీక్షలకు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయలు వారికి ధైర్యం చెప్పాలని అన్నారు.

జిల్లాలో పరీక్షలు నిర్వహించే పరీక్షలకు ప్రశ్న పత్రాలను పోలిసు వారి బందోబస్తు వుంచి తీసుకొని వెళ్లాలని, జిల్లాలోని రెవెన్యూ శాఖ నుండి పరీక్షా కేంద్రాలకు ప్లైయింగ్ స్వ్వాడ్ లను ఏర్పాటు చేసి పరీక్ష జరుగుతున్న తీరు పై నిఘా వుంచాలని , 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.

పరీక్షా కేంద్రాల వద్ద మంచి నీరు, ఫ్యాన్లు, లైట్లు సరి అయిన విదంగా వుండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని , వెలుతురు వుండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాలను సరిగా సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్భందిగా చేపట్టాలని అన్నారు.

పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సరైన సమయంలో చేరుకునే విధంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను అదనపు కలెక్టర్ సూచించారు.

అదనపు ఎస్పీ చంద్రయ్య ,ఆర్డీవోలు రాధాబాయి వెంకటేశ్వరావు,జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శ్రీనివాస్ , విద్యా, వైద్య,ఫైర్, ఆర్.టి.సి, పోస్టల్ శాఖల అధికారులు తదితరులు
ఈ సమావేశంలో  పాల్గోన్నారు.

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు.

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు

మండల విద్యాశాఖ అధికారి యస్. వెంకటేశ్వర్లు..

నర్సంపేట నేటిధాత్రి:

 

 

మండల స్థాయి ప్రభుత్వ పాఠశాలల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దుగ్గొండి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుగ్గొండి మండలం లోని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకు వేసవి సెలవులలో ఈ నెల 20 నుండి 2025 వరకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలు దుగ్గొండి మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించబడునని వివరించారు. శిక్షణా కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందన్నారు.తెలుగు ,ఆంగ్లం, గణితం,పరిసరాల విజ్ఞానం విషయాలలో విద్యా సామర్థ్యంతో పాటు ఎఫ్ఎల్ఎన్ లపై రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ పేర్కొన్నారు.
ప్రతి విద్యార్థి తెలుగు, ఆంగ్లంలలో చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు సాధించడం, పరిసరాల విజ్ఞానంలో భావనలు నేర్చుకునేలా రాబోయే విద్యా సంవత్సరంలో ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో విద్యార్థులకు నేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే
బాలబాలికలు ఫౌండేషన్ లిటరసీలో భాగంగా విద్యాసామర్ధ్యాలను సాధించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని ఎంఈఓ
యస్. వెంకటేశ్వర్లు తెలియజేశారు.

కొండూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ.

కొండూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

మేధా చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర స్థాయి ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన కొండూరు విద్యార్థులు.

“రాయపర్తి, నేటిధాత్రి*

 

 

మేధా చారిటబుల్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్ లో జెడ్ పి హెచ్ ఎస్ కొండూరు పాఠశాల విద్యార్థులు గంకిడి సాయి వర్ధన్, బొబ్బల వర్షిత్ రెడ్డి లు సెలెక్ట్ అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొనతం పద్మలత తెలియజేశారు. వీరికి శ్రీ మేధా ట్రస్ట్ నుండి సుమారు మూడు నుండి నాలుగు లక్షల విలువైన రెండు సంవత్సరాల ఉచిత విద్యను ప్రఖ్యాత నారాయణ, శ్రీ చైతన్య కాలేజిలలో అందిస్తారు. విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు రామిరెడ్డి, ఆచార్యులు, సత్యనారాయణ, రఘు, నాగరాజు, వెంకటరమణ, శ్యాంసుందర్, అనిత రాణి, శ్రీదేవి, బోజ్య నాయక్ , స్వామి, అమర స్వర్ణ ,శివకృష్ణ  అభినందించారు.

జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తల్లిదండ్రుల సమావేశం.

జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తల్లిదండ్రుల సమావేశం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

మండలంలోని వర్షకొండ గ్రామం లోని రైతు వేదిక లో జడ్పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కలిసి తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్ దంతుల శ్యామల తూక్కారం మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఆవుల లావణ్య పాల్గొన్నారు, ఈ సంవత్సరం పాఠశాల సాధించిన ఫలితాలను ప్రధానోపాధ్యాయులు రాజేందర్ వివరించారు 527 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిన నారే లహరి, 525 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచిన హర్షిని లను సమావేశంలో అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య దొరుకుతుందని అందరు కూడా మన గ్రామంలో ఉన్న వర్షకొండ జడ్పీ పాఠశాల యందు వారి పిల్లల్ని చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివకృష్ణ, మహేష్, అనిత, సుజాత గారలు పాల్గొన్నారు. సుమారు వందమంది పేరెంట్స్ పాల్గొన్నారు.

విద్యార్థినికి 692 వ ర్యాంకు.

విద్యార్థినికి 692 వ ర్యాంకు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన హానిక EAPCET లో 692వ ర్యాంకు సాధించింది. కనిక తల్లిదండ్రులు నవీన, శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. అధ్యాపకులు, తల్లిదండ్రుల కృషితో తనకు మంచి ర్యాంకు వచ్చిందని హానిక తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య.

*ప్రభుత్వ పాఠశాలలోనే గుణాత్మక విద్య *
జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన గుణాత్మక విద్య అందుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పిడిసిల్ల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మహ్మద్ సాదిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి సబ్జెక్టులో తగిన అర్హతలతో మంచి అనుభవం గల ఉపాధ్యాయులచే అన్ని ప్రభుత్వ పాఠశాలలో బోధన అందిస్తున్నామన్నారు. ఐఎఫ్ఫీ (IFP)ప్యానల్ బోర్డుతో విద్యార్థులకు పరిపూర్ణమైన అవగాహనను కల్పిస్తూ, ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్టు విద్య బోధన జరుగుతుందన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో ఏఐ (కృత్రిమ మేధ) తో కూడా విద్య బోధన అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టిక ఆహారం, ఉదయం రాగి జావా, ఉచిత పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, 10వ తరగతి విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతుల బోధన, ఆ సమయంలో విద్యార్థులకు స్నాక్స్ కూడా అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు విశాలమైన ఆట స్థలంలో వారి ఆసక్తికి అనుగుణంగా వ్యాయామ ఉపాధ్యాయులచే వివిధ రకాల ఆటలు ఆడిస్తూ వారి మానసిక, శారీరక పెరుగుదలకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సాదిక్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బడి ఈడు పిల్లలను, ప్రవేట్ పాఠశాలకు వెళ్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిడిసిల్ల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ చేపించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి లింగాల కుమారస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సామల రమేష్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ దుప్పటి రాజగోపాల్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శోభ, అంగన్వాడి సిబ్బంది, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు…

విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట.

విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట

#అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలు.

#మధ్యవర్తులను నమ్మి మోసపోతున్న తల్లిదండ్రులు.

# కాలేజీ చైర్మన్ నీ కలిసిన తరువాతనే అడ్మిషన్ తీసుకోవాలి.

మంద సురేష్ బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు

హన్మకొండ,నేటిధాత్రి:

 

 

గ్రామలలో ఇంటింటి ప్రచారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యంత్రం ఉపాధ్యాయులకు లక్ష్యంగా నిర్దేశం కరపత్రాలు బ్రోచర్ల పంపిణీ నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలు పెంపు లక్ష్యంగా ఉపాధ్యాయులకు టార్గెట్ నిర్దేశిస్తున్నాయి ఆ లక్ష్యం వాళ్లను సాధించేవరకు మండుటెండల్లో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను కలుస్తున్నారు తమ పాఠశాల ప్రత్యేకతలు విశిష్టతను వివరిస్తూ ఆకాశాన్నియమైన బ్రోచర్లు కరపత్రాలను పంచుతున్నారు పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాపారం వెనుక ప్రచారాల తలపిస్తుంది ప్రతి ఒక్కరూ 10 నుండి 20 మందిని పాఠశాలలో చేర్పించాలంటూ ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలల యజమాన్యాలు టార్గెట్ విధించారు దీంతో వారు ఉదయం ఏడు గంటల నుండి ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ ప్రదక్షణం కొరబడినందున ఆరోపణలు ఉన్నాయని ఫీజులు నియంత్రణ కోసం ప్రభుత్వం జారీచేసిన జీవోలను అమలు చేయడంలో లేదు అలాగే కొన్ని పాఠశాలలో సరైన విద్యా అర్హత లేని వారితో బోధనలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి అని మంద సురేష్ ఇప్పటికైనా అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థల పైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని అధికారులపై మండిపడ్డారు.

ప్రతిభ ఉన్న విద్యార్థినికి ప్రోత్సాహం.!

ప్రతిభ ఉన్న విద్యార్థినికి ప్రోత్సాహం

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థిని ప్రోత్సహించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బూరుగుపల్లి గ్రామానికి చెందిన గడ్డం శతాక్షి లండన్ వెళ్లడానికి అవసరమైన రూ.70 వేల విలువైన విమాన టికెట్ అందజేసిన ఎమ్మెల్యే

ఖండాంతరాలు దాటి చదువుకొని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాగా భారతదేశానికి ఖ్యాతి తీసుకురావాలని సూచించిన ఎమ్మెల్యే

గంగాధర నేటిధాత్రి :

 

 

 

ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించి అండగా నిలవడంలో ముందుంటారని మరోసారి నిరూపించుకున్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్న విద్యార్థినిని ప్రోత్సహించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన గడ్డం శతాక్షి కి లండన్ లోని గ్రీన్ విచ్ యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదవడానికి అవకాశం వచ్చింది.ఉన్నత చదువుల కోసం శతాక్షి దేశాలకు వెళుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి వచ్చింది.ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడంలో ముందుండే ఎమ్మెల్యే మేడిపల్లి శతాక్షికి ఆర్థిక సహకారం అందజేయాలని నిర్ణయించుకున్నారు.మంగళవారం కరీంనగర్ లోని తన నివాసంలో శతాక్షిని అభినందించి, స్వంత ఖర్చులతో కొనుగోలు చేసిన రూ. 70 విలువైన విమాన టికెట్ ను అందజేశారు. ఖండాంతరాలు దాటి చదివి, అంబేద్కర్ వలె భారతదేశానికి ఖ్యాతిని తీసుకురావాలని విద్యార్థినికి ఎమ్మెల్యే సూచించారు.విమాన టికెట్ను అందజేసిన ఎమ్మెల్యేకు శతాక్షీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా విద్యార్థినిని ప్రోత్సహించి ఆర్థిక సహకారం అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను మండల ప్రజలు అభినందించారు.

కమ్మపెల్లి పాఠశాలల్లో పూర్వ.!

కమ్మపెల్లి పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట మండలంలోని కమ్మపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2004-05 సంవత్సరానికి చెందిన పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఆనాటి ప్రధానోపాధ్యాయులు అప్పారావు హాజరై మాట్లాడారు.20 సంవత్సరాల తర్వాత విద్యార్థులు అందరూ కలిసి ఉపాధ్యాయులను గౌరవించడం సంతోషంగా ఉందన్నారు. కాగా కమ్మపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో ఉన్న అనుబంధాలను తీపి గుర్తులను నెమరేసుకున్నారు.ప్రభుత్వ పాఠశాలను జీవితంలో మరిచిపోలేనని ఇక్కడి విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరారని అన్నారు. మీ పిల్లలను కూడా ఉన్నత చదువులు చదివిపించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా కృషి చేయాలని సూచించారు.అనంతరం పూర్వాపు విద్యార్థులు అందరూ తమ తీపి గుర్తులను అనుభవాలను అందరితో కలిసి పంచుకున్నారు. అనంతరం విద్యార్థులంతా కలిసి ఆట పాటలతో అలరించారు.ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు మల్లికార్జున్ వీరయ్య శంకర్ బాయ్ మదన్ మోహన్ లతోపాటు పూర్వపు విద్యార్థులు కాలే రాజు,ఏడేల్లి మహేందర్ రెడ్డి ,భాషబోయిన రాజు,తంగళ్ళపెల్లి గణేష్,తుమ్మ వెంకటేశ్వర్లు,గట్ల రాజు,ఆరేళ్లి గౌతమి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

వేసవి శిక్షణా తరగతులు.

విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి

 

 

ప్రభుత్వ ఆదేశాల మేరకు తొర్రూరు మండలంలోని తొర్రూరు హై స్కూల్, చెర్లపాలెం హై స్కూల్, మాటేడు హై స్కూల్, అమ్మాపురం హై స్కూల్ మరియు హరిపిరాల హై స్కూల్ లలో పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంప్)తేదీ 6-05-2025 నుండి 20-05-2025 వరకు (15 రోజులు), ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు నిర్వహించడం జరుగుతుంది.
సమ్మర్ క్యాంపులో ఈ క్రింద తెలుపబడిన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము.
1 ఇండోర్ గేమ్స్
2 ఆటలు మరియు పాటలు
3 స్పోకెన్ ఇంగ్లీష్
4 బేసిక్ మ్యాథమెటిక్స్ స్కిల్స్
5 సైన్స్ ఎక్స్పెరిమెంట్స్
6 డ్రాయింగ్ స్కిల్స్
7 క్రాఫ్ట్ (కుట్లు మరియు అల్లికలు)
8 కమ్యూనికేషన్ స్కిల్స్
9 డాన్స్
10 వాలీబాల్ ,షటిల్ గేమ్స్
పైన సూచించిన కార్యక్రమాలతో పాటు ఇతర కొత్త కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది.
కావున తమరు అందరూ ఐదవ తరగతి నుండి పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరనైనది.
ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రధానోపాధ్యాయుల సమావేశంలో MEO మహంకాళి బుచ్చయ్య కోరారు.

జహీరాబాద్ విద్యార్థినికి గోల్డ్ మెడల్..

జహీరాబాద్ విద్యార్థినికి గోల్డ్ మెడల్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ మండలం రంజోల్కు చెందిన మహమ్మద్ కరీం కూతురు నూరిన్ ఫాతిమా లా విద్యాలో సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించింది. HYDలో లా పూర్తి చేసిన ఫాతిమా మూడు రోజులపాటు HYDలోని సుల్తాన్ ఉల్ ఉలమ్ కాలేజ్ ఆఫ్ లాలో హార్మనీ ఇన్ డిస్ప్యూట్స్ అనే అంశంపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నాగేశ్వరరావు చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకుంది. దీంతో కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు.

పిల్లలు చదువుతోపాటు దైవభక్తిని పెంపొందించుకోవాలి.

పిల్లలు చదువుతోపాటు దైవభక్తిని పెంపొందించుకోవాలి- జిల్లా సైకాలజిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

పిల్లలు చిన్నప్పటి నుంచి చదువుతోపాటు దైవభక్తిని పెంపొందించుకోవాలని కరీంనగర్ జిల్లా సైకాలజిస్ట్ అసోసియేషన్ (టిపిఏ) అధ్యక్షులు మల్లేశం అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని ఇమ్మానియేల్ ఏజి చర్చిలో పాస్టర్ మచ్చ తిమోతి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ఉచిత చిల్డ్రన్ బైబిల్ క్లాసులు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దైవభక్తి కలిగి ఉన్నప్పుడు పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించే మంచి అలవాట్లు అలవాడతాయన్నారు. చదువుతోపాటు నీతి విలువలతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చిన్నప్పటినుంచి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని లక్ష్య సాధన కోసం పాటుపడుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా చిన్నారుల జీవితాలకు ఉపయోగపడే స్ఫూర్తిదాయకమైన మాటలను వివరించారు. అనంతరం ఇందులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈకార్యక్రమంలో చర్చి నిర్వాహకులు మచ్చ తిమోతి, బైబిల్ క్లాస్ టీచర్లు రజిని, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.

విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ పాఠశాలలో రెండవ దశ ఒలంపియాడ్ ఫౌండేషన్ పరీక్ష విజేతలకు కలెక్టర్ పమేలా సత్పతి బహుమతులు అందజేశారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల సంయుక్తంగా నిర్వహించిన ఒలంపియాడ్ పరీక్షలకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి ఎనబై మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత ఫలితాలను పెంపోందించెందుకు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి అవకాశాలను విద్యార్థులకు అందేలా ప్రోత్సహించాలని, ఈకార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వసతులు కల్పిస్తూ, ప్రోత్సాహన్ని అందిస్తున్న ఆల్పోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిని కలెక్టర్ అభినందించారు. ప్రస్తుతం యాభై ఏడు మంది నుండి మూడవ బ్యాచ్ డెబ్బై ఐదు మందిగా తిరిగివచ్చి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను కోరారు. ఈకార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, రామడుగు తాహశీల్దార్ రాజేశ్వరి, విఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ ఆదర్శవాణి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

శ్రీ ఆదర్శవాణి విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

డివిజన్ టాపర్ గా కొత్త కార్తీక్..

నర్సంపేట,నేటిధాత్రి:

 

గత నెల 30న విడుదలైన పదవ తరగతి ఫలితాలలో శ్రీ ఆదర్శవాణి విద్యార్థులు ప్రతిభ కనబరిచి డివిజన్ టాపర్ లుగా నిలిచారు.అలాగే ఇదే పాఠశాలకు చెందిన కొత్త కార్తీక్ అనే డివిజన్ టాపర్ గా రికార్డు సృష్టించాడు.కాగా డివిజన్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పూల మాలలతో అభినందించారు. 2025 -2026 సంవత్సరంలో 10/10 జీబీఏ 600 మార్కులకు 563 మార్కులు సాధించి డివిజన్ టాపర్ గా నిలిచిన కొత్త కార్తీక్,అలాగే 558 మార్కులు సాధించిన బూర సాత్విక్, 557 మార్కులు సాధించిన మూలా అవినాష్ లను పూల బొకేలతో అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందు ఉండాలని విద్యార్థులను ఆశీర్వదించారు.

students

ఈ కార్యక్రమంలో శ్రీ ఆదర్శవాణి విద్యా సంస్థల చైర్మన్ నాగనబోయిన రవి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా 100 శాతం ఉత్తీర్ణత సాధించడం గౌరవంగా ఉందని తెలియజేశారు.అలాగే గత సంవత్సరం ముగ్గురు విద్యార్థులు 10/10 లు సాధించి జిల్లాలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారని ఈ సంవత్సరం నర్సంపేట డివిజన్ టాపర్ లు గా నిలవడం గౌరవంగా ఉందన్నారు. 62 మంది విద్యార్థులకు 30 మంది విద్యార్థులు 500 లకు పైగా మార్కులు సాధించగా ఆ విద్యార్థులను అభినందించారు.పట్టుదలతో చదివి ఉన్నత మార్కులు సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తీసుకొచ్చినందుకు వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ కవిత, బిక్షపతి, మణికంఠ, శశిధర చారి, ప్రిన్సిపల్స్ స్రవంతి, సుధాకర్, స్వప్న చారి,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన.

పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించిన శ్రీ కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులు మార్చిలో జరిగిన పబ్లిక్ పరీక్షల్లో 100% ఫలితాలు సాధించినందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ ర్యాంకులు,గ్రేడ్లు ప్రాముఖ్యత కాకుండా ఆవరేజ్ విద్యార్థులను తీసుకొని అందరినీ ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేస్తున్న శ్రీ కృష్ణవేణి హై స్కూల్ ఉపాధ్యాయులు యాజమాన్యం ప్రతి సంవత్సరం నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడానికి కృషి చేస్తున్నారు.భవిష్యత్తులో విద్యార్థులు విద్యావంతులు కావడానికి వారే స్వయం నిర్ణయాన్ని తీసుకోవాలని అనేక రంగాలలో ప్రవేశించడానికి( ఐటిఐ, పాలిటెక్నిక్,డిప్లమా కోర్సులు, ఇంటర్మీడియట్) తదితర కోర్సులలో ప్రవేశించడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని,ఎవరిని బలవంతం పెట్టకుండా భవిష్యత్తులో మంచి మార్గం ఎన్నుకోవడానికి విద్యార్థులను కృషి చేయాలని కోరారు.

ఎస్ఎస్ఎస్సి 2025 ఫలితాలలో అక్షర విద్యార్థుల ప్రభంజనం .

ఎస్ఎస్ఎస్సి 2025 ఫలితాలలో అక్షర విద్యార్థుల ప్రభంజనం

రామడుగు, నేటిధాత్రి:

 

ప్రభుత్వం ప్రకటించిన పదవి తరగతి పలితాలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అక్షర హై స్కూల్ విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగే ఈవిద్యా సంవత్సరం కూడా కార్పోరేట్ స్కూల్స్ కు దీటుగా అత్యుత్తమ ఫలితాలను సాధించారని కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ మినుకుల మునీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. అక్షర హై స్కూల్ లో 95 విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 500 పైగా మార్కులు 63 మంది విద్యార్థులు సాధించారు. 550కిపైగా 22 మంది విద్యార్థులు సాదించారు. అత్యధిక మార్కులు సాధించిన జి.మనస్విని 568, టి.తేజ 562, ఈ.సాక్షిత 560, కే.మమత 559, ఎల్.కార్తీక్ 558, విద్యార్థులను కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ మినుకుల మునీందర్ విద్యార్థులను పుష్పగుచ్చములతో అభినందించిన అనంతరం మునిందర్ మాట్లాడుతూ 500 పైన మార్కులు జిల్లా స్థాయిలో ఎక్కువ మంది అక్షర విద్యార్థులే సాధించడం గొప్ప విజయమని విద్యార్థులను కొనియాడారు. ఈకార్యక్రమంలో డైరెక్టర్ మినుకుల రాధ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

100% ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

‘100% ఉత్తీర్ణతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

బాలానగర్ /నేటి ధాత్రి.

 

 

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..

ఇంటర్ ఫలితాలలో ఉత్తీర్రత సాధించిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100% ఉత్తీర్ణత సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు.

Students

 

 

అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన.

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన విద్యాబోధన…..

రామాయంపేట మే 1 నేటి ధాత్రి (మెదక్)

 

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెరుగైన విద్యా బోధన అందించడం జరుగుతుందని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంగ్లీష్, జువాలజీ అధ్యాపకులు యాదగిరి, స్వామి అన్నారు. గురువారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో అడ్మిషన్ డ్రైవ్ నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ఇండ్లలోకి వెళ్లి ప్రభుత్వ కళాశాలలో విద్యాబోధనపై వారికి అవగాహన కల్పించారు. రామాయంపేట పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అనుభవం గల అధ్యాపకుల తెలుగు, ఇంగ్లీష్ మీడియం లో విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. విశాలమైన తరగతి గదులతో పాటు ఇతర వసతులు ఉన్నాయని చెప్పారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరాలని వారు సూచించారు. ఉచిత పాఠ్య పుస్తకాలతో పాటు బస్ పాస్ సౌకర్యం ఉపకార వేతనాలు అందించడం జరుగుతుందన్నారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కళాశాలలో బైపిసి, ఎంపీసీ, సి ఈ సి, హెచ్ ఈ సి గ్రూపులతో పాటు ఒకేషనల్ విభాగంలో ఎలక్ట్రికల్, ఆఫీస్ అసిస్టెంట్ షిప్, అకౌంటెంట్ టాక్సేషన్ గ్రూపులు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయని విద్యార్థులకు వివరించారు. అధిక ఫీజులు చెల్లించి ప్రైవేట్ కళాశాలలో చేరి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా వారు సూచించారు. ప్రభుత్వ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా లెక్చరర్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version