న్యాయం కావాలి.!

న్యాయం కావాలి

‘బంధన్’ బాధితుడు కృష్ణ

⏩ ‘ఎంజీఎం’ నిపుణుల నివేదిక కోసం బాధితుడి ఎదురుచూపులు
⏩‘బంధన్’ ఘటనపై ఎక్స్‌పర్ట్స్ కమిటీ రిపోర్ట్ వచ్చేదెప్పుడు?
⏩8 నెలలు దాటుతున్నా ఫిర్యాదుపై కనీస పట్టింపు లేదు
⏩ఐఎంఏ సమక్షంలో తప్పు ఒప్పుకున్న సదరు ఆస్పత్రి వైద్యులు!
⏩ఆ నివేదిక ఆధారంగానే చర్యలు అంటున్న డీఎంహెచ్‌వో!

కాశిబుగ్గ నేటిధాత్రి

 

 

 

 

 

తనకు జరిగిన అన్యాయంపై త్వరితగతిన విచారణ చేపట్టి న్యాయం చేయాలని ‘బంధన్’ హాస్పిటల్ బాధితుడు కృష్ణ వేడుకుంటున్నారు.గత ఏడాది ‘బంధన్’ఆస్పత్రిలో తనకు అన్యాయం జరిగిందని,పలు విభాగాల అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా ఇంకా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్జరీ,పోస్ట్ ఆఫ్ కేర్‌లో ‘బంధన్’లో జరిగిన క్షమించరాని నిర్లక్ష్యంతో తాను జీవితపు చరమాంకానికి వెళ్లి బయటపడ్డానని వెల్లడించారు.

పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కాసుల కాంక్షతో, వ్యాపార దృక్పథంతో సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శిస్తున్నారు.

తనకు జరిగిన అన్యాయంపై అధికారులకు కంప్లయింట్ చేసి 8 నెలలు దాటుతున్నా కనీస పట్టింపు లేకపోవడం సరికాదని,ఈ లెక్కన వ్యవస్థలో సామాన్యులకు న్యాయం అందడం,తప్పు చేసిన వారి పైన చర్యలు అంతంత మాత్రమే అనే భావన ఏర్పడుతోందని పేర్కొన్నారు.

పూర్తి వివరాలతో బాధితుడు కృష్ణ తెలిపిన ప్రకారం బంధన్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలలపాటు మంచానికి పరిమితం అయ్యానని బాధితుడు కృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది జూలై 21న అపెండిక్స్ సమస్యతో బంధన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కృష్ణకు అదే రోజు సాయంత్రం 6 గంటలకు 4 గంటల పైనే వైద్యులు ఆపరేషన్ చేశారు.

ఈ క్రమంలో పెద్ద పేగుకు రంధ్రం పడటంతో రోగి శరీరం మొత్తం ఇన్‌ఫెక్షన్ స్ప్రెడ్ అయి పరిస్థితి విషమించింది.

ఒకరోజు తర్వాత అది గ్రహించిన కుటుంబ సభ్యులు వైద్యులను అడగగా ఎవరూ స్పందించకపోవడంతో ఆపరేషన్ వికటించిందని భావించి జూలై 23 రాత్రి వరంగల్ మెడికవర్ హాస్పటల్‌కు తీసువెళ్లారు.

అక్కడ వైద్యులు రోగిని చెక్ చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించాలని సూచించారు.దాంతో ఆ రాత్రే బేగంపేట మెడికవర్ హాస్పటల్‌కి వెళ్లి అడ్మిట్ అయ్యారు.

 

⏩పెద్దలతో ‘బంధన్’కు బంధాలు..!

 

 

మెడికవర్ ఆస్పత్రికి చేరుకునే సరికి రోగి శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించింది.

 

మరో 6గంటలు ఆలస్యం అయితే ప్రాణానికి ప్రమాదమని అక్కడి సీనియర్ వైద్యులు తెలిపారు.

అక్కడ ట్రీట్‌మెంట్ అనంతరం బాధితుడు కృష్ణ తన ఆరోగ్యం కొంత కుదుటపడిన తర్వాత బంధన్ హాస్పిటల్‌కి వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై నిలదీశాడు.

దానికి వైద్యులు నిర్లక్ష్యమైన సమాధానాన్నిస్తూ తమ వెనుక పెద్దపెద్ద రాజకీయ నాయకులు ఉన్నారని, హాస్పటల్ రాజకీయ నాయకులదేనని బెదిరిస్తూ వస్తున్నారు.

 

‘మా బంధన్’ హాస్పిటల్ ఓపెన్ చేసింది కూడా ఓ మంత్రినే’అని తెలుసుకోవాలని బెదిరించినట్టు బాధితుడు ఆరోపించాడు.

 

తనకు జరిగిన అన్యాయంపై బాధితుడు ఆధారాలతో హన్మకొండ డీఎంహెచ్‌వోకు,ఐఎంఏ వాళ్లకు ఫిర్యాదు చేశాడు.

 

ఐఎంఏ పెద్దల ముందు తాము బాధితుడు కృష్ణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించామంటూ ఒప్పుకున్నారు.

 

కానీ, ఆ హాస్పిటల్ మీద వైద్యులపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదంటూ ఐఎంఏ డాక్టర్లు స్పష్టం చేశారు.

 

 

⏩రిపోర్ట్‌కు ఇంకెంత టైం కావాలో?

 

 

అనంతరం బాధితుడు డీఎంహెచ్‌వోను గతేడాది నవంబర్‌లో సంప్రదించగా..

 

16 డిసెంబర్ 2024న వరంగల్ ఎంజీఎం
సూపరింటెండెంట్‌కు ఎక్స్‌పర్ట్స్(నిపుణుల) కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని కోరారు.

కానీ ఎంజీఎం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక రాకపోవడంతో బంధన్ హాస్పిటల్‌పై, వారి వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని అధికారులు తెలుపుతున్నారని బాధితుడు కృష్ణ వెల్లడించారు.

 

ఈ ఏడాది కాలంలో బంధన్ హాస్పిటల్‌లో ఇలాంటి ఘటనలు రెండు,మూడు జరిగాయని, అందులో ఓ వ్యక్తి ఇటీవల మృతి చెందారని కృష్ణ వివరించారు.

 

ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన ఎంక్వయిరీ పూర్తి చేసి తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

గుడి పేట 13వ బెటాలియన్ లో ఆత్మహత్యల నివారణ.

గుడి పేట 13వ బెటాలియన్ లో ఆత్మహత్యల నివారణ అవగాహన సదస్సు

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

 

మంచిర్యాల జిల్లా గుడి పేట 13వ బెటాలియన్ లో ఆత్మహత్యల నివారణ సదస్సు కార్యక్రమం శనివారం చేపట్టారు.ముఖ్య అతిథిగా డాక్టర్ పరికిపండ్ల అశోక్, డాక్టర్ గుమ్మడి వెళ్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంచిర్యాలలో సామాజికంగా, బిసి ఉద్యమంలో ముందు ఉండి నడిపిస్తూ సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు మార్పు కోసం పనిచేస్తున్న వడ్డేపల్లి మనోహర్ ని గుర్తించి తెలంగాణ నేత్ర అవయవాల శరీర దాతల అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కన్వీనర్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ పరికిపండ్ల అశోక్ నియమించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ గుమ్మడి వెళ్లి శ్రీనివాస్,అదేవిధంగా బెటాలియన్ అధికారులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గా ఎన్నిక చేసినందుకు డాక్టర్ పరికిపండ్ల అశోక్,రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజలలో నేత్రదానము,అవయవాల దానము శరీర దానం పైన మంచిర్యాల జిల్లా పరిధిలో విస్తృతంగా ప్రజలకి అవగాహన కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

దశదినకర్మల్లో పాల్గొన్న రేగ.

దశదినకర్మల్లో పాల్గొన్న రేగ

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.నేటిధాత్రి…

 

 

 

కరకగూడెం మండలంలోని వెంకటపురం గ్రామానికి చెందిన పోలెబోయిన క్రిష్ణయ్య (హెల్త్ డిపార్ట్మెంట్-కరకగూడెం)తండ్రి గారైన పోలెబోయిన.ఎర్రసమ్మయ్య అనారోగ్యంతో మరణించారు.శనివారం దశదినకర్మలకు పినపాక మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు బాధిత ఇంటికి వెళ్లి,మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య, గ్రామ మాజీ సర్పంచ్ పోలెబోయిన పాపమ్మ,స్థానిక నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

108 అంబులెన్సు లో మహిళ ప్రసవం.

108 అంబులెన్సు లో మహిళ ప్రసవం

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

నిజాంపేట పట్టణంలో నివాసముంటున్న బీహార్ కు చెందిన మహిళ మనిషేదేవ్ పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్న సమయంలో పురిటి నొప్పులు అధికమవడంతో మార్గమధ్యంలో 108 ఈఎంటి స్వామి అంబులెన్స్ లో ప్రసారం చేశారు. మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలను ధర్మారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు.

పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్.!

జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను జిల్లా కలెక్టర్ సమక్షంలో మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి మరియు మండల పంచాయతీ అధికారులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారులు తమ యొక్క సమస్యలను పరిష్కరించాలని,వెహికిల్ అలవెన్సులు మంజూరు చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డి. వేంకటేశ్వర రావు,బెల్లంపల్లి ఇంచార్జీ డి ఎల్ పి ఓ సఫ్తర్ అలీ,జైపూర్,చెన్నూరు,
బెల్లంపల్లి మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపు రావు,అజ్మత్ అలీ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కుల వివక్షత చూపరాదు.

— కుల వివక్షత
చూపరాదు
• రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

గ్రామాలలో ఎవరు కులవివక్షత చూపరాదని అందరు సమానులే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు గ్లాసుల పద్ధతిని వీడనాడాలని, అంటరానితనం, కుల వివక్షత పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. భారత రాజ్యాంగం భారత పౌరులకు హక్కులు కల్పించిందని హక్కుల ద్వారా మనిషి స్వేచ్ఛగా జీవించవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చప్పేట నరసింహారెడ్డి, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.

పరకాల పట్టణంలో పోలీస్ కవాతు.

పరకాల పట్టణంలో పోలీస్ కవాతు

భద్రత భావాన్ని ప్రజల్లో నింపడానికే ఈ కార్యక్రమం

పరకాల ఏసీపీ సతీష్ బాబు

పరకాల నేటిధాత్రి

 

 

సిపి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు శనివారం రోజున రాపిడ్ యాక్షన్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసులు నిర్వహించారు.ఈ కావాతును పాత సీఎంఎస్ గోదాం వద్ద ఏసీపీ సతీష్ బాబు ప్రారంభించారు.పట్టణంలోని అంబేద్కర్ కూడలి నుండి డిపో సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వరకు పోలీస్ కవాతు సాగింది.ఈ సందర్భంగా పరకాల ఎసిపి మాట్లాడుతూ తాము ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.ఏఆర్ఎఫ్ అధికారి సరస్వతి పరకాల సిఐ క్రాంతికుమార్,శాయంపేట సీఐ పి.రంజిత్ రావు,ఆత్మకూరు సీఐ ఆర్.సంతోష్,పరకాల ఎస్సైలు శివకుమార్,రమేష్,శాయంపేట ఎస్ఐ.పరమేష్,దామెరా ఎస్ఐ అశోక్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల.!

పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు అనైతికం.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికే ప్రభుత్వం కృషి చేయాలి

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే బడిబాట కంటే ముందే సర్దుబాటు ఏంటి…..?

ప్రయత్నం చేయకుండానే పాఠశాలల మూసివేతలా…?

ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే కావాలి కానీ ఏదో కారణంతో మూసివేయడం కారాదు.

ప్రభుత్వం ఈ సర్దుబాటు నిర్ణయాన్ని వెంటనే పునః పరిశీలించాలి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ డిమాండ్.

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

 

పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్ణయం సరికాదని,ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పాఠశాలల పునః ప్రారంభానికి ముందే ఉపాధ్యాయ సర్దుబాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా సురేందర్ మీడియాతో మాట్లాడుతూ…

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడుగు బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతే ఈ ప్రభుత్వ లక్ష్యమని ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు ఆయా వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి ఉపాధ్యాయులను మరొక పాఠశాలలో సర్దుబాటు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

ఇటీవలే ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చి, పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని,బడిబాటలో అత్యధిక సంఖ్యలో అడ్మిషన్లు చేయాలని సూచించిన ప్రభుత్వం, కనీసం ఉపాధ్యాయులకు ఆ ప్రయత్నం చేసే అవకాశం ఇవ్వకుండానే ఉపాధ్యాయుల సర్దుబాటు నిర్ణయం ప్రకటించడం అనైతికమని విమర్శించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జూన్ 6వ తేదీ నుండి బడిబాట కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ఉపాధ్యాయ లోకం కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అత్యధికంగా చేర్పించాలనే కసితో ఉన్నారని, ఇప్పటికే పలుమార్లు గ్రామాల్లో బడిబాట ర్యాలీలు తీయడం, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం కూడా జరిగిందని వివరించారు.

ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే సంకల్పం, పట్టుదలతో ఉపాధ్యాయులు ఉన్నారని, చేస్తారని కూడా ధీమా వ్యక్తం చేశారు.

విద్యార్థులను పాఠశాలలో చేర్పించే అసలు బడి బాట కార్యక్రమం ముందే ఉండగా, కనీసం ఉపాధ్యాయులను బడిబాట కార్యక్రమ ప్రయత్నం చేయనివ్వకుండానే కొన్ని పాఠశాలలను మూసివేస్తామనడం, ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామనడం ప్రభుత్వ దమననీతికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. కనీస ప్రయత్నం చేయించకుండానే పాఠశాలలను ఎలా మూసివేస్తారని, ఏ ప్రాతిపదికన ఉపాధ్యాయ సర్దుబాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే కావాలి కానీ పాఠశాలలను ఏదో ఒక కారణంతో మూసివేయడం కారాదు అని సూచించారు.

ఒకవేళ బడిబాట కార్యక్రమ అనంతరం కూడా అడ్మిషన్లలో ఎలాంటి పురోగతి లేనట్లయితే అప్పుడు ప్రభుత్వం తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

అంతే కాదు చాలా పాఠశాలల్లో త్రాగు నీటి సౌకర్యం లేదని, కావున ప్రభుత్వం వెంటనే స్పందించి త్రాగునీటి సౌకర్యం కల్పించేలాగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు .

ప్రభుత్వ పాఠశాలలకు పునర్ వైభవం తీసుకొచ్చేలాగా ప్రభుత్వం పనిచేయాలని ఈ సందర్భంగా సురేందర్ డిమాండ్ చేశారు.

బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో శనివారం రోజున ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ,

ఈ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడా అయినా బాల్ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చిన అసోసియేషన్ ను అభినందించడం జరిగింది.

ఒకప్పుడు నేను కూడా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుని అని ఈ క్రీడను చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు, అలాగే అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడను విద్యార్థి దశలోనే అవగాహన కోసం అండర్ 14 బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించడం కూడా గొప్ప విషయమై కొనియాడారు,

ఈ క్రీడల్లో పాల్గొనడానికి దాదాపు 24 టీములు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాల్గొనడం జరిగిందని, అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు, అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ అయినా బాల్ బ్యాడ్మింటన్ క్రీడను ప్రోత్సహించే ఉద్దేశంతో

 

Sports

 

 

ఈ క్రీడలను నిర్వహించడం జరిగిందని అన్నారు గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అసోసియేషన్ తరపున ఇవ్వడం జరుగుతుందని అలాగే అంతరించిపోతున్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను ప్రోత్సహించేందుకు విద్యార్థి దశ అండర్ 14 నిర్వహిస్తున్నామని దీనికి సహకరిస్తున్న క్రీడాభిమానులకు

ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు, ఆర్ఎన్ఆర్ మాట్లాడుతూ బాల్ బాడ్మిట్ ఉమ్మడిజిల్లా స్థాయిలో నిర్వహించడం గొప్ప విషయమని క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి స్నేహ భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు,

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు గుట్ల తిరుపతి ప్రధాన కార్యదర్శి గుత్తికొండ సాంబయ్య ఉపాధ్యక్షులు వెంకట్రాంరెడ్డి బుచ్చిరెడ్డి స్వామి అంజద్ భాష కోశాధికారి రవీందర్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా నాయకులు చిలకల రాయకుమురు టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్ మండల్ నాయకులు బుర్ర శ్రీనివాస్ చిలుమల రాజమౌళి ఉమ్మడి జిల్లా క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా.

వైద్య అసిస్టెంట్ డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా

కలిసిన జిల్లా వైద్య హెచ్.వన్ సంఘo అధికారులు

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

 

 

తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల H -1 సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్ ఖాదర్ కు సన్మాన కార్యక్రమం.వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కరీంనగర్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పై ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిరీసిల్ల జిల్లా కు వచ్చిన అబ్దుల్ ఖాదర్ కు సన్మాన చేయడం జరిగింది. ఈ సందర్భముగా యూనియన్ రాష్ట్ర జిల్లా నాయకులు మాట్లాడుతూ అబ్దుల్ ఖాదర్ గత 35 ఇయర్స్ నుండి వైద్య ఆరోగ్య శాఖ లో వివిధ హోదాలలో నిబద్ధతో పని చేస్తూ పై అధికారుల మన్నన పొందారని వృత్తి పట్ల చాలా గౌరవంగా ఉంటారనీ తెలిపారు. సౌమ్యంగా వ్యహరిస్తూ కింది స్థాయి సిబ్బంది తో పని చేయిస్తారని తెలుపుతున్నాం. అలాగే ఈ యొక్క ప్రమోషన్ పొందిన పోస్ట్ లోకూడా సక్సెస్ గా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాము.మరియు ఈ సందర్భముగా B. లక్ష్మీ నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ బొకే ఇచ్చి మర్యాద పూర్వకముగా కలిశారు.సన్మాన కార్యక్రమం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ సూపరిడెంట్ MD. షమీము, జిల్లా యూనియన్ నాయకులు MD. అజీజ్ B. జనార్దన్ మరియు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ యన్.శ్రీనివాస్ కర్ణ రాష్ట్ర జాయింట్ జనరల్ సెక్రటరీ ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ T. రవీందర్ బ్లడ్ బ్యాంక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు MD.రఫీ మరియు అంజయ్య, MD. రషీద్ రవి, రాహుల్, మౌనిక మరియు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన సెట్విన్ చైర్మన్.

ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిన సెట్విన్ చైర్మన్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శనివారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలం పీచేరాగడి గ్రామంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, పలువురు కాంగ్రెస్ నేతలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కవేలి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం.

కవేలి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి గ్రామంలో డిప్యూటీ తహశీల్దార్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం శనివారం నిర్వహిచడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటి తహశీల్దార్ వర ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రతీ పౌరుడు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇక కొన్ని ప్రాంతాలలో కుల వివక్ష కొనసాగుతుందని, దానిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిదంగా హక్కుల సాధన దిశగా అందరూ అడుగులు వేయాలన్నారు.

స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు.

స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు

సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)

 

 

 

సిరిసిల్ల జిల్లాలోని స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ వారు జూన్ 2 నుండి ఆన్లైన్ లో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్స్ చెల్లింపులకు స్లాట్ బుకింగ్ కు సంబంధించి కేవలం ఒక్క రోజులోనే 48 స్లాట్లు బుకింగ్ చేసుకోవచ్చని.

Slot Booking.

 

బుక్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్స్ స్లాట్ నిర్దిష్టమైన సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని జూన్ 2 నుండి అమలు కానున్న సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రజలకు ప్రకటన ద్వారా సిరిసిల్ల సబ్ రిజిస్ట్రార్ ఆర్.వి.వి. స్వామి తెలిపారు.

ఇంత‌కు ర‌ష్మిక ఉన్న‌ ఇల్లు ఎవ‌రిదంటా గురువు గారు.

ఇంత‌కు ర‌ష్మిక ఉన్న‌ ఇల్లు.. ఎవ‌రిదంటా గురువు గారు

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మ‌రోసారి నెట్టింట తెగ హాడావుడి చేస్తోంది. అయితే ఈ సారి సినిమాకు సంబంధించిన విష‌యంలో కాదు.

 

నేటి ధాత్రి:

Rashmika Mandanna
Rashmika
నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక (Rashmika Mandanna) మ‌రోసారి నెట్టింట తెగ హాడావుడి చేస్తోంది.
అయితే ఈ సారి సినిమాకు సంబంధించిన విష‌యంలో కాదు.
త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, తాజాగా ఎల్లో శారీలో దిగిన ఫొటోలు వాటి గురించి ర‌ష్మిక చెప్పిన మాట‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) ల‌వ్‌లో ఉన్నారు..
ఏ క్ష‌ణంలోనైనా పెళ్లి పీట‌లు ఎక్కుతార‌నే వార్త‌లు ఎలాగో ఉన్నాయి.
అంతేగాక‌ త‌రుచూ ఇద్ద‌రు ఒక‌రితో ఒక‌రికి సంబంధం లేకుండా ఒకే లొకేష‌న్‌ ఫొటోలు షేర్ చూస్తూ నెటిజ‌న్ల‌కు దొరికి పోతుంటారు.
తాజాగా ఇలాంటి ఫొటోలే మ‌రోసారి వైర‌ల్ అయ్యాయి.
రీసెంట్‌గా ర‌ష్మిక (Rashmika Mandanna) ప‌సుపు ప‌చ్చ చీర ధ‌రించి ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌ల సినిమా లాంచింగ్‌కు ముఖ్య‌ అతిథిగా హ‌జ‌రైన‌ సంగ‌తి విధిత‌మే.
ఆపై ఆదే చీర‌పై ఫొటోషూట్ చేయుంచుకున్న ర‌ష్మిక ఈ ఫొటోల‌లో నాకు ఇచ్చినవి, విలువైనవి అన్నీ ఉన్నాయి.
Rashmika
ఇష్టమైన రంగుల చీర, గిఫ్ట్‌గా ఇచ్చిన స్పెషల్ లేడీ, ఈ ఫొటోలు తీసిన వ్యక్తి, ఇష్టమైన ప్లేస్ అన్నీ ఉన్నాయి అంటూ క్యాప్షన్ పెట్టింది.
ఇంకేముంది విజ‌య్ (Vijay Devarakonda), ర‌ష్మిక (Rashmika Mandanna) అభిమానుల‌తో పాటు చాలామంది త‌మ బుర్ర‌ల‌కు, త‌మ అకౌంట్ల‌కు ప‌ని చెప్పి సోష‌ల్ మీడియాల్లో త‌మ స్టైల్ క్రియేటివిటీలతో హాల్‌చ‌ల్ చేశారు.
ఆ ఫోటోలు విజ‌య్ ఇంట్లోనే దిగిన‌వ‌ని, వాటిని విజ‌య్ స్వ‌యంగా తీశాడ‌ని, ఆ చీర‌ను విజ‌య్ అమ్మ‌గారు బ‌హూమ‌తిగా ఇచ్చారంటూ కామెంట్లు చేస్తూ హోరెత్తించారు.
గ‌తంలోనూ ఆ ఫొటోలో ఉన్న‌ బ్యాగ్రౌండ్‌లో విజ‌య్‌, ర‌ష్మిక‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం క‌లిసి దిగిన ఓ పాత‌ చిత్రం ఉండ‌డంతో ఈ ఫొటోపై చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి. ఇక‌నైనా విజ‌య్‌, ర‌ష్మిక‌లు త‌మ రిలేష‌న్‌ను బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌జేయాల‌ని, ఇంకా ఎన్నాళ్లు దాచుతారంటూ హిత‌వు ప‌లుకుతున్నారు.

విద్యుత్ నిర్లక్ష్యం కాకూడదు భారీ మూల్యం.

విద్యుత్ నిర్లక్ష్యం కాకూడదు భారీ మూల్యం

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

మందమర్రి మండలంలోని మామిడి గట్టు గ్రామ శివారులో గత వారం పది రోజుల నుండి ఈదురు గాలులకు ఒక చెట్టు వేర్లతో సహా విద్యుత్ వైర్లపై పడింది..
అయితే దానిని సదరు విద్యుత్ అధికారులు మరియు చుట్టుపక్కల వారు చూసి చూడనట్లుగా వెళుతున్నారు.. ఆ విధంగా ఆ విద్యుత్ తీగలపై ఆ చెట్టు ఒరిగి ఉన్నా సరే విద్యుత్ అధికారులు ఆ లైన్ గుండానే విద్యుత్తును సరఫరా చేస్తున్నారు.. ఒకవేళ ఎక్కువ గాలి వచ్చి ఆ తీగలు తెగితే ఆ దారి గుండా రాకపోకలు సాగించే ప్రయాణికులకు కచ్చితంగా ప్రమాదం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంది….
కావున
సదరు విద్యుత్ అధికారులు వెంటనే పై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు…

టాయిలెట్స్ లేక ప్రజల ఇబ్బందులు.

టాయిలెట్స్ లేక ప్రజల ఇబ్బందులు

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకోరా ఎమ్మెల్యే గారు

మూడు నెలల్లో ఓపెనింగ్ అంటిరి

ముల్కల్ల రాజేంద్రప్రసాద్ బహుజన్ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు

చెన్నూరు శాసన సభ్యులుగా ఎన్నికైన అనంతరం మందమర్రి మార్కెట్ లో గల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రజల సౌకర్యార్థం గత సంవత్సరం జనవరి 21వ తేదీన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ గారు టాయిలెట్స్ కి శంకుస్థాపన చేసి మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిన మీరు టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకోరా అని ప్రశ్నించారు బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.
వెంటనే టాయిలెట్స్ పనులు పూర్తి చేసి ప్రజ వినియోగంలోకి తేవాలన్నారు, లేనియెడల మందమర్రి పట్టణ ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు ముల్కల్ల రాజేంద్రప్రసాద్.

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న MLA TSS CCDC.

వివాహా వలిమా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మండలం హుగ్గేల్లి గ్రామంలోని రాజ్ మహల్ ఫంక్షన్ హాల్ లో ఈ రోజు రాత్రి జరిగిన ఝరాసంఘం మండలం చీలేపల్లి గ్రామం మహ్మద్ హుస్సేన్ కుమారుడు మహ్మద్ ఆరిఫ్ వివాహా వలిమా వేడుకల్లో జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు,
మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, నాగన్న, శేషి వర్ధన్ రెడ్డి, దిగంబర్ రెడ్డి, సిద్దప్ప,అక్బర్ సహబ్, సభహ ,గ్రామ పార్టీ నాయకులు,మాజీ సర్పంచ్ రాజు,మల్ రెడ్డి,నబి సాబ్, చెంగల్ జైపాల్,మహ్మద్ అక్రమ్,మహ్మద్ హుస్సేన్,ఖాజామియా,మహ్మద్ ఆషిఫ్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

వరి పురుగుల పై అవగాహన కలిగి ఉండాలి.

— వరి పురుగుల పై అవగాహన కలిగి ఉండాలి
• వానపాము ఎరువుల ద్వారా దిగుబడి అధికం
• సైంటిస్ట్ చిన్నబాబు నాయక్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

వర్షాకాలం వరి సాగు పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ సైంటిస్ట్ చిన్న బాబు నాయక్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.. వర్షాకాలంలో పంటలపై వచ్చే రోగాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. పురుగులు నారిమడి పోసినప్పుటి నుండి వరి ఆకులపై గుడ్లను పెట్టి వాటి ఉత్పత్తిని పెంచుకుంటుందన్నారు. వాటి నివారణకు మందులను వాడాలని సూచించారు. వానపాము ఎరువుల ద్వారా వరి పంట అధిక దిగుబడిని ఇస్తుందన్నారు. ఎరువులపై కూడా రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే ఆధునిక పరిజ్ఞానం పరిధిలోని కూలీ, సమయం తగ్గించే విధంగా డ్రోన్ సహాయంతో మందును పిచ్కారి చేయవచ్చన్నారు. డ్రోన్ మిషన్ కూడా అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీలత, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, రైతులు ఊడెడు రాజయ్య, కూడవెల్లి చంద్రం, ఊడెపు శ్రీశైలం, కోమ్మిడి రాజు, బురాని మల్లేశం, మంగలి అమర్, మ్యాదరి కనకరాజు, సౌడ స్వామి, పాతూరి రాంరెడ్డి, రాకేష్, వేణు తదితరులు ఉన్నారు.

వలిమా వేడుక లో పాల్గొన్న TGIDC.

వలిమా వేడుక లో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల్ చిల్లపల్లి గ్రామానికి చెందిన మొహమ్మద్ ఆరిఫ్ గారి వలిమా వేడుకలో పాల్గొని వరుడునికి శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ వారితోపాటు మాజీ ఎంపిటిసి ఆఫీస్ కీజర్ ఖాన్ అశ్విన్ పటేల్ మొహమ్మద్ మోయిన్ మాణిక్ రెడ్డి మొహమ్మద్ ఏజాబ్ బాబా గోవర్ధన్ రెడ్డి జఫర్ అసద్ మతిన్ తదితరులు ఉన్నారు.

వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి.

నియోజకవర్గం వ్యాప్తంగా నూతన మండల కమిటీని ఎన్నుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా,నియోజకవర్గం, మండల,గ్రామల నూతన కమిటీ నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల, గ్రామ అధ్యక్షులకు నియమించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డిను సంగారెడ్డిలో కలసి వినతిపత్రం సమర్పించారు. అదేవిదంగా వివిధ మండలలాల నుండి నూతన కమిటీకి దరఖాస్తు చేసుకొన్నారు.ఈ సందర్బంగా జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాల క్రితం నుండి జహీరాబాద్ లో నూతన అధ్యక్షులకు మార్చిన దాఖలాలు లేవన్నారు. అందుకే 2018- 2023 అసంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందామని ఆమెకు తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..తప్పకుండ నూతన మండల కమిటీని వేయడం జరుగుతుంది అన్నారు. త్వరలో జహీరాబాద్ లో సమావేశం నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ ముల్తాని మక్సుదలిసాబ్ హదునూర్ మస్తాన్ అలీ హదునూర్ సమీబాయి మిర్జాపూర్ నరసింహులు మలిగి రియాజ్ భాయ్ చాలు కి కోయిరు మండల్ మొగుడంపల్లి మండల్ న్యాల్కల్ మండల్ జైరాబాద్ టౌన్ నుంచి తదితరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version