అమావాస్య సందర్భంగా రామేశ్వరుని ఆలయం లో ప్రత్యేక పూజలు…

అమావాస్య సందర్భంగా రామేశ్వరుని ఆలయం లో ప్రత్యేక పూజలు

భక్తులకు అన్న ప్రసాదం చేసిన డప్పుర్ సంగమేష్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు రామేశ్వరుని ఆలయంలో అమావాస్య సందర్భంగా అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు పూజారులు టేకుర్ స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సంగమేష్ దంపతులు అన్నప్రసాద ఏర్పాటు చేశారు. పూజలు అనంతరం అతిథులకు ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ సునీతా హన్మంత్ రావు పాటిల్, మాజీ అధ్యక్షులు హన్మంత్ రావు పాటిల్, గ్రామ అధ్యక్షులు డప్పుర్ సంగమేష్, సర్పంచ్ చింతల్ గట్టు శివరాజ్, యువ నాయకులు ఉదయ్ శంకర్ పాటిల్ ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ వివిధ గ్రామాల సర్పంచ్ లు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు,

జహీరాబాద్ 32వ వార్డు బరిలో ఇంజనీర్ ఖిజర్ అలీ ఖాన్ కుటుంబం…

జహీరాబాద్ 32వ వార్డు బరిలో ఇంజనీర్ ఖిజర్ అలీ ఖాన్ కుటుంబం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో జహీరాబాద్ పట్టణంలోని 32వ వార్డు (NGO’S కాలనీ & సుభాష్ గంజ్) నుండి పోటీ చేసేందుకు యువ నాయకుడు, బీఈ సివిల్ ఇంజనీర్ మహమ్మద్ ఖిజర్ అలీ ఖాన్ తన సంసిద్ధతను ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన దరఖాస్తును గౌరవ ఎమ్మెల్యే శ్రీ కె. మాణిక్ రావు గారు మరియు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ దేవి ప్రసాద్ గారికి అందజేశారు.ఈ సందర్భంగా ఖిజర్ అలీ ఖాన్ మాట్లాడుతూ, వార్డు రిజర్వేషన్ల నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు తాను కానీ లేదా తన భార్య కానీ పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. “మహమ్మద్ మజహర్ ఖాన్ కుమారుడిగా స్థానికులతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. ఒక సివిల్ ఇంజనీర్‌గా నాకున్న విజ్ఞానంతో వార్డులోని డ్రైనేజీ, రోడ్లు మరియు మౌలిక సదుపాయాలను శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తాను. పార్టీ నమ్మకంతో అవకాశం కల్పిస్తే, నేను లేదా నా భార్య పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.మీడియా మరియు ఓటర్ల సహకారం కోరుతూ..”ఎన్నికల్లో పోటీ చేసేందుకు మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. వార్డు ఓటర్లు, పెద్దలు మరియు మీడియా మిత్రులు మాకు సహకరించి ఆశీర్వదించాలని కోరుతున్నాము. ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రథమ ప్రాధాన్యత. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాము,” అని ఖిజర్ అలీ ఖాన్ పేర్కొన్నారు.

జహీరాబాద్ నుండి మహిళల ఆవిష్కరణ ఎదగాలి…

జహీరాబాద్ నుండి మహిళల ఆవిష్కరణ ఎదగాలి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ లో ఈ కారిక్రామాన్ని ప్రారంభించి ఎన్నో అద్భుత సూచనలు ఇచ్చిన మాజి మంత్రివర్యులు డా. ఎ. చంద్రశేఖర్ మాట్లాడుతు సాధారణంగా పెద్ద పరిశ్రమలూ వ్యాపారాలకైతే పెట్టుబడి పెట్టే సంస్థలు చాలానే ఉంటాయి. కానీ చిన్నగా వ్యాపారం ప్రారంభించదలచుకున్న వాళ్లకి అప్పులూ బ్యాంకు లోన్లే ఆధారం. అందుకు పూచీకత్తు పెట్టడానికి స్థిరాస్తుల్ని చూపాల్సి ఉంటుంది. అవేవీ లేనివారు పెట్టుబడికి డబ్బులేక ఎంత మంచి ఆలోచన ఉన్నా వ్యాపారం ఆశలు వదులుకుంటారు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకుని వ్యాపారరంగంలో తమని తాము నిరూపించుకోవాలనుకునేవారికి ఆర్థికంగా అండగా ఉంటాం అన్నారు.యం.ఎస్.ఎఫ్ సామాజిక పారిశ్రామికవేత్త, మేనేజింగ్ డైరెక్టర్,అస్మా మాట్లాడుతూ.జహిరాబాద్ ప్రాంతంలోని మహిళతో ఉన్న నైపుణ్యాలను గుర్తించి వ్యాపారం చేసే వాళ్ళల్లో ఉన్న వైపుశ్యాన్ని వ్యాపారాలుగా మారుస్తూ మహిళలు వ్యాపారం చేయుటకు కావలసిన ప్రతి మెళుకువలను ప్రదర్శించుటకు – మార్కెట్ కు సంబంధించిన సాధ్య అసాధ్యలు, ఏమిటి – ప్రణాలికలను ఎలా రచించాలి ఇలాంటి అనేక వ్యూహలను ప్రదర్శించేందుకు బహుత్కార కారిక్రమం.ప్రతి మహిళలలోను వ్యాపార ఆలోచనలు ఉన్నపటికీ అది వ్యాపారంగా తెలియకపోవడం. మన గ్రామీణ ప్రాంతంలో అవసరాలను గుర్తించి ఆ అవసరాలనే ఆవిష్కరణలనుగా మార్చాలి.
స్థానిక పరిశ్రమలకు అణుగుణంగా మన వ్యాపారాలను ప్రారంభిస్తే గనుక మనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది . త్వరలో అన్ని పరిశ్రమ యజమానులను సంప్రదించి మహిళలకు తగిన అవకాశాలు తమ కంపెనీలో వ్యాపార అవకాశాలను ఇవ్వాలని విన్నవిస్తాను. మరియు నిష్ఠు లో కూడా మహిళా ఆధారిత పరిశ్రమలు నెలకోల్పాలని పెద్దల దృష్టికి తసుకెత్తాం అన్నారు.
సుమారు 300 మంది మహిళలు వివిధ గ్రామాలనుండి హాజరై వారి అభిప్రాయలను తెలియజేసారు ఈ కరీక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి, మొగుడంపల్లి మండల అధ్యక్షులు మక్సూద్ అహ్మద్,జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు కండెం నర్సిములు,న్యాల్కల్ మండల అద్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ అద్యక్షులు అర్షద్ అలీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహిళా అధ్యక్షులు మమత చంద్రకళ, స్వరూప, మారుణీ బాయి, చన్ను బీ, మల్లికా రెడ్డి, అరుణ, ఈశ్వరమ్మ, ఆసియా, తుల్జమ్మ, తదితరులు పాల్గొన్నారు

పార్టీ కోసం పనిచేసిన వారికి టిక్కెట్ దక్కేనా….

పార్టీ కోసం పనిచేసిన వారికి టిక్కెట్ దక్కేనా….?

పైసలుంటేనే కౌన్సిలర్ టిక్కెటా…? ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన వారికి టిక్కెటా..?

మున్సిపల్ ఎన్నికలు మంత్రికి పెద్ద సవాలేనా…?

బిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే వార్డుల రిజర్వేషన్ల మార్పా..?

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టేందుకే వార్డుల రిజర్వేషన్లు మార్పు చేశారా..? అంటే అవుననే సమాధానం ప్రజల నుండి ఎక్కువగా వినిపిస్తుంది. రానున్న క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలే అని తెలుస్తుంది.పంచాయతీ ఎన్నికల్లోనూ చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆశించినంతగా ఫలితాలు రాలేదనే చెప్పాలి. బీఆర్ఎస్ కు పంచాయతీ ఎన్నికల్లో బాగానే ఫలితాలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికలంటే గుర్తులుండవు. కానీ ఆ ఎన్నికల్లో కూడా ఎవరికి వారే పార్టీలుగా విడిపోయి ప్రచారం చేసుకోవడంతో గ్రామాల్లో ప్రధాన పార్టీలన్నీ పోటీ చేశాయి. అయితే గ్రామాలు వేరు పట్టణాలు వేరు. పట్టణ ఓటర్లు ఒక పట్టాన అర్ధం కారు. పట్టణ ఓటర్లు ఖచ్చితంగా పార్టీ పాలనను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటారు. డెవలెప్ మెంట్ చూస్తారు. అలాగే సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మరీ ఓటేస్తారు. అందులో భాగంగానే క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి రాబోయే మున్సిపల్ ఎన్నికలు మంత్రి వివేక్ వెంకటస్వామి కి పెద్ద సవాలుగానే నిలిచాయి.గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం, ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన వారికే కౌన్సిలర్ టికెట్ కేటాయిస్తారా..!

పైసలుంటేనే టికెట్ కేటాయిస్తారా..! అనేది వేచి చూడాల్సిందే.మున్సిపాలిటీలో బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీలకు కూడా పట్టు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ తప్పేట్లు కనిపించడం లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ వారికి మంత్రి భరోసా ఇచ్చి ప్రత్యామ్నాయ పదవులు ఇస్తారో లేదో అనేది వేచి చూడాల్సిందే. అధికార పార్టీ నేతలు అయితే టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తామని బహిరంగంగానే చెబుతుండడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తుంది. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సంతృప్త స్థాయి ప్రజలు ఉన్నారు, అసంతృప్త స్థాయి ప్రజలు కూడా అదే రేంజ్ లో ఉన్నారు.పింఛనుదారుల నుంచి నిరుద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు పట్టణ ఓటర్లుగా తమ తీర్పును చెప్పనున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, మంత్రికి, డిసిసి అధ్యక్షులకు కత్తిమీద సాము లాంటివనే చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల విషయంలో మంత్రులనే బాధ్యులను చేసినప్పటికీ మంత్రులు ఏ స్థాయిలో పార్టీ గెలుపునకు ఉపయోగపడతారన్నది వేచి చూడాల్సిందే. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికలను ప్రెస్టేజ్ గా తీసుకున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ రానున్న మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.

ముదిరాజ్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ …

ముదిరాజ్ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ …

◆-: ఎమ్మెల్యే మాజీ డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

తాలూకా ముదిరాజ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్యరావు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ పాల్గొనడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ముదిరాజ్ సంఘం కు హామీలు ఇవ్వడం జరిగిందని అన్ని హామీలు నెరవేర్చే బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది అంతేకాకుండా

ముదిరాజులను రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుదలకు తాను సాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది . అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముదిరాజ్ నాయకులకు టికెట్లు ఇచ్చి ఆదుకుంటానని వారిని గెలిపించే బాధ్యత పూర్తిగా ముదిరాజ్ నాయకులు తీసుకోవాలని ముదిరాజ్ సంఘం నాయకులకు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి నాయకులు గొల్ల భాస్కర్ పాల్గొని బిజెపి పార్టీ తరపున సరైన అభ్యర్థులు ఉంటే టికెట్ ఇచ్చే బాధ్యత నాది అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది శివకుమార్ మాట్లాడుతూ అన్ని విధాలుగా ముదిరాజ్ సంఘం ను ఆదుకుంటామని తెలపడం జరిగింది మాజీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం మాట్లాడుతూ ఐక్యమత్యంతో ముందుకు సాగుతున్నారు అని అభినందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బేవా రిజిస్ చైర్మన్ దేవి ప్రసాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ తంజం మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ అదేవిధంగా ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు శంకర్ ముదిరాజు ముదిరాజ్ సంఘం గౌరవాధ్యక్షులు నారాయణ ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి సంగప్ప ముదిరాజ్ జిల్లా కార్యదర్శి గోపాల్ ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు నాయకుని రమేష్ ముదిరాజ్ జనరల్ సెక్రెటరీ మహేష్ ముదిరాజ్ కోయిరు మండల జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ ముదిరాజ్ శాంతినగర్ అధ్యక్షులు ప్రవీణ్ ముదిరాజ్ కార్యదర్శి హరీష్ ముదిరాజ్ టౌన్ సెక్రటరీ విజయ్ ముదిరాజ్ శివ ముదిరాజ్ పాండు ముదిరాజ్ మాజీ మండల అధ్యక్షులు విట్టల్ ముదిరాజ్ రంజోల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జమాల్ దత్తు ముదిరాజ్ పాల్గొనడం జరిగింది,

మిగిలిన రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి…

మిగిలిన రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి

అభివృద్ధి చేసేవారిని కౌన్సిలర్లు గా ఎన్నుకోవాలి

తెలుగుదేశం పార్టీ నేత గొల్ల శంకర్

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణంలో వివేకానం చౌరస్తా నుండి మర్రికుంట కొత్త బస్టాండ్ ఆర్డీవో ఆఫీస్ లైన్ కొల్లాపూర్ రోడ్డు మహబూబ్ నగర్ రోడ్డు లో ఇరుకు రోడ్లతో ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకుని పెండింగులో ఉన్నా వనపర్తి లో రోడ్ల వెడల్పు విస్తరణ పనులు చేపట్టాలని తెలుగుదేశం పార్టీనేత శంకర్ వనపర్తి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మేగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ను ఒక ప్రకటన లో కోరారు వనపర్తి లో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా కొందరు ఇండ్లు కూలగొట్టుకున్నారని ఆయన తెలిపారు గతంలొ రాజీవ్ చౌక్ అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ పాత బజారు వరకు దాదాపు రోడ్ల విస్తరణ పూర్తి చేశారని అన్నారు .శ్రీ రామ టాకీస్ దగ్గర సెంటర్ డివైడరింగ్ పాత యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర ఏర్పాటు చేయాలని వాహనాలు ఎటు పోవాలని అర్థం కాక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని శంకర్ తెలిపారు వనపర్తి పట్టణ ప్రజలు పాలకులను గమనిస్తూన్నారని గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ అశ్వని దామోదర్ ను వనపర్తి పట్టణ ప్రజలు ఎన్నుకున్నారని తెలిపారు మున్సిపల్ కౌన్సిలర్లు గా వార్డులను అభివృద్ధి ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారని ఎన్ను కోవాలని ప్రజలను కోరారు వనపర్తి పట్టణ ప్రజలు ఆలోచనలు చేసుకొని ఓట్లు వేసి మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ల గా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు

యువత అన్ని రంగాల్లో రానించాలి : మాజీ మంత్రివర్యులు…

యువత అన్ని రంగాల్లో రానించాలి : మాజీ మంత్రివర్యులు
మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి
* మున్సిపాలిటీలో ముగిసిన సీఎంఆర్ క్రికెట్ ట్రోఫీ లు
* బహుమతుల ప్రధానోత్సవం

మేడ్చల్  ప్రతినిధి, నేటిధాత్రి :

 

యువతను ప్రోత్సహించినప్పుడే అన్ని రంగాల్లో రాణించ గలుగుతారని మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ సిర్వి క్రికెట్ గ్రౌండ్ లో సంక్రాతి పండగా సందర్బంగా సీఎంఆర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ అలియాబాద్, ముడుచింతలపల్లి మున్సిపాలిటీల క్రికెట్ పోటీలను నిర్వహించిన విషయం తెలిసిందే.

 

ఆదివారం ఫైనల్ మ్యాచ్ లను తిలకించి ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో విన్నర్ టీం లింగాపూర్ తండా క్రీడాకారులకు రూ.25వేలు, రన్నర్ టీం ఆనంతరంకు రూ.15వేలు నగదు బహుమతి ట్రోఫీలు, అలియాబాద్ మున్సిపాలిటీ విన్నర్ టీం లాల్ గడి మలక్పేట్ కు రూ. 25వేలు, రన్నర్ టీం అలియాబాద్ కు రూ.15వేలు నగదు బహుమతి ట్రోఫీ మాన్ ఆఫ్ సిరీస్, మాన్ అఫ్ మ్యాచ్ ట్రోపి లను అందజేయడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను మహిళలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో సంక్రాంతి ముగ్గుల పోటీలు, సిఎంఆర్ క్రికెట్ పోటీలు అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ భద్రారెడ్డి, మున్సిపాలిటీల అధ్యక్షులు సరసం మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ వార్డు నెంబర్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఇండోర్‌లో కలుషిత నీరు.. గిల్ చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..

ఇండోర్‌లో కలుషిత నీరు.. గిల్ చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..

 

భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆదివారం మూడో వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. అయితే.. ఇటీవల ఇండోర్‌లో కలుషిత నీరు తాగడం వల్ల పలువురు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Shubmఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచులు జరగ్గా.. ఇరుజట్లు 1-1తేడాతో సమంగా కొనసాగుతున్నాయి. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన మూడో వన్డే ఆదివారం ఇండోర్ వేదికగా జరగనుంది. బలమైన కివీస్ జట్టును టీమిండియా ఎదుర్కొని సిరీస్ పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే.. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇండోర్‌లో ఇటీవల కలుషిత తాగునీటి వల్ల పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆటగాళ్లున్న ఫైవ్ స్టార్ హోటల్, మైదానంలో పరిశుభ్రమైన నీరందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) మరింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. తాను బస చేస్తున్న హోటల్‌లోని తన గదిలో రూ.3లక్షలు ఖరీదు చేసే వాటర్ ప్యూరిఫయర్‌ను బిగించుకున్నట్లు సమాచారం. ఈ పరికరానికి ఆర్వో వాటర్, ప్యాకేజ్డ్ వాటర్‌ను కూడా మళ్లీ ప్యూరిఫై చేసే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది.

విరాట్ ఎప్పటి నుంచో..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పటి నుంచో తాను తాగే నీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అతడు ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల నుంచి సేకరించే ప్రత్యేక వాటర్‌ను మాత్రమే వినియోగిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే.

నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు..

నాకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు.. ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకున్న ఆసీస్ స్టార్ ప్లేయర్

 

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్.. మెనింజైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం మార్టిన్ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్(Damian Martin).. మెనింజైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే. చికిత్స కోసం అతడిని కొద్ది రోజులు వైద్యులు కోమా స్థితిలో ఉంచారు. గతేడాది డిసెంబర్ చివరిలో మార్టిన్ పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మార్టిన్ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు.
‘నన్ను(డామియన్ మార్టిన్) ఆసుపత్రికి తరలించే సమయానికి నేను బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని వైద్యులు తెలిపారు. మెనింజైటిస్ నా మెదడును ఆక్రమించినప్పుడు నేను పూర్తిగా ప్రాణాపాయ స్థితిలోకి జారుకున్నాను. ఈ వ్యాధితో పోరాడటానికి వైద్యులు నాకు చాలా సాయం చేశారు. వారు నన్ను 8 రోజులపాటు కోమాలో ఉంచారు. నేను కోమాలోంచి బయటకు వచ్చిన తర్వాత దాదాపు నాలుగు రోజుల వరకు మాట్లాడలేకపోయాను, నడవలేకపోయాను. తర్వాత డాక్టర్ల ప్రోత్సాహంతో అవన్నీ చేయగలిగాను. రికవరీ ప్రారంభమైన తర్వాత వైద్యులు నన్ను డిశ్చార్జి చేశారు. నేను తిరిగి ఇంటికి రావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. బీచ్‌లోని ఇసుకలో నా పాదాన్ని మళ్లీ మోపగలిగాను. వైద్యులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని మార్టిన్ పేర్కొన్నాడు.డామియన్ మార్టిన్ ఆసీస్ తరఫున 67 టెస్టులు, 208 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. ఆస్ట్రేలియా 1999, 2003 ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత్‌తో జరిగిన 2003 వరల్డ్ కప్ ఫైనల్‌లో 88 పరుగులు చేశాడు. 2006 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. ఆ టోర్నీలో అతడు ఐదు ఇన్నింగ్స్‌ల్లో 80.33 యావరేజ్‌తో 241 పరుగులు చేశాడు.

 వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్…

 వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

 

అండర్-19 ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ లైన్ వద్ద అతడు పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన బ్యాటింగ్‌తో బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు అతడిని ఔట్ చేస్తే.. సగం మ్యాచ్ గెలిచినట్లుగా ఫీల్ అవుతోందంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే అనేక అద్భుతాలు సృష్టించిన వైభవ్.. తాజాగా అండర్-19 ప్రపంచ కప్‌లో స్టన్నింగ్ క్యాచ్ అందుకుని క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో వైభవ్.. బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
అండర్-19 ప్రపంచ కప్‌లో(Under 19 World Cup) భాగంగా శనివారం.. భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో(డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో) బంగ్లాదేశ్‌పై గెలిచింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా బంగ్లా లక్ష్యాన్ని 29 ఓవర్లలో 165గా నిర్ణయించారు. ఛేదనలో బంగ్లా 28.3 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది. ఇక.. బంగ్లా బ్యాటింగ్ సందర్భంగా.. యువ సంచలనం వైభవ్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. 25.2 ఓవర్‌లో విహాన్ మల్హోత్రా వేసిన బంతిని బంగ్లా బ్యాటర్ బాసిర్ రతుల్ భారీ షాట్ ఆడాడు. బంతి గాల్లో ఎగురుతూ సిక్సర్ వెళ్లేలా కనిపించింది. సరిగ్గా బౌండరీ లైన్ వద్ద ఉన్న వైభవ్ ఏమాత్రం తడబడకుండా అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసి పట్టాడు.

పొగమంచు వల్ల హృదయ విదారకంగా టెకీ మరణం..

పొగమంచు వల్ల హృదయ విదారకంగా టెకీ మరణం..

 

దట్టమైన పొగమంచు ఘోర రోడ్డు ప్రమాదాలకు, హృదయ విదారక మరణాలకు దారితీస్తోంది. యూపీలో ఒక టెకీ చివరి క్షణం వరకూ ప్రాణాలు కాపాడుకునేందుకు యత్నించి విఫలమయ్యారు. వివరాల్లోకి వెళితే…

ఉత్తర్ ప్రదేశ్, జనవరి 18: దట్టమైన పొగమంచు కారణంగా శుక్రవారం రాత్రి గ్రేటర్ నొయిడా సెక్టార్ 150లో జరిగిన దారుణమైన రోడ్డు ప్రమాదంలో 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువరాజ్ మెహతా మృతి చెందాడు. గురుగ్రామ్‌(హరియాణా)లోని డన్‌హమ్బీ ఇండియాలో పనిచేస్తున్న యువరాజ్ శుక్రవారం రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

 యూపీలో పొగమంచుతో ప్రమాదం! పరస్పరం ఢీకొన్న వాహనాలు…

 యూపీలో పొగమంచుతో ప్రమాదం! పరస్పరం ఢీకొన్న వాహనాలు

 

యూపీలో ఆదివారం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా డ్రైవర్లకు ఎదురుగా ఉన్నది స్పష్టంగా కనిపించక.. పలు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. 10 వాహనాలు దెబ్బతిన్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర భారత దేశంలో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఆవరించడంతో ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. యూపీలోని అమ్రోహా జిల్లా, షావజ్‌పూర్ గ్రామం వద్ద ఢిల్లీ-లఖ్నవూ రహదారిపై భారీ ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్నవి కనిపించక వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది గాయాలపాలయ్యారు. 10 వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే, దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేటి ఉదయం పొగమంచు అలుముకుంది. పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ 430 మార్కును దాటింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు ఇప్పటికే పలు ఏర్పాట్లు చేశారు. కాలుష్య కట్టడి కోసం శనివారం నుంచే జీఆర్ఏపీ-4 నిబంధనలను అమలు చేస్తున్నారు.

 సంతోషాన్ని పట్టుకుందాం…

 సంతోషాన్ని పట్టుకుందాం!

 

ప్రస్తుతం ప్రపంచం విచిత్రమైన సందిగ్ధంలో ఉంది. ఇల్లు, కారు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ … ఇలా అన్నీ ఉంటాయి కానీ, ముఖంపై చిరునవ్వు ఉన్న వాళ్లని వేళ్ల మీద లెక్కించే రోజులు వచ్చాయి.

ప్రస్తుతం ప్రపంచం విచిత్రమైన సందిగ్ధంలో ఉంది. ఇల్లు, కారు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ … ఇలా అన్నీ ఉంటాయి కానీ, ముఖంపై చిరునవ్వు ఉన్న వాళ్లని వేళ్ల మీద లెక్కించే రోజులు వచ్చాయి. ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా’ … అందరిలో ఏదో తెలియని నిరాశ, నిర్లిప్తత, అశాంతి, అలజడి. ఒకప్పుడు సిటీలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కట్టుకున్నానని ఘనంగా చెప్పుకునేవారు… ఇప్పుడు మూడు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌ ఉన్నా సంతృప్తి ఉండడం లేదు. అందుకే లైఫ్‌స్టయిల్‌ జబ్బులు, మానసిక వ్యాధులు దండయాత్ర చేస్తున్నాయి. వీటన్నింటినీ చూసి, అనేక పరిశోధనలు చేస్తున్న మానసిక శాస్త్రవేత్తలు ‘సంతోషాన్ని ఓ హాబీలా అలవర్చుకోమ’ని సలహాలిస్తున్నారు. అయితే సంతోషాన్ని అలా సాధించవచ్చా? అది సాధ్యమేనా??
అదో సూత్రం…

ప్రతీ అంశాన్ని గణాంకాలతో, సులభంగా అర్థం అయ్యేలా చెప్పడం నేటి ట్రెండ్‌. సంతోషాన్ని కూడా అచ్చం అలాగే 50-40-10ని ‘హ్యాపీనెస్‌ రూల్‌’గా చెబుతున్నారు. ఈ నియమం ప్రకారం… యాభై శాతం సంతోషాన్ని మన శరీరంలోని జీన్స్‌ నిర్ణయిస్తాయి. మన చుట్ట్గూ ఉన్న పరిస్థితులు 10 శాతం, ఆ సమయంలో ఉన్న మన మానసిక స్థితిని బట్టి మిగతా 40 శాతం సంతోషం ఆధారపడి ఉంటుందట. ‘ద హౌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ పుస్తకంలో సోన్జా ల్యూబోమిర్కీ తొలిసారిగా ఈ నియమాన్ని ప్రతిపాదించారు. అప్పటి నుంచి చాలామంది హ్యాపీనెస్‌ను ఈ సూత్రం ఆఽధారంగా పేర్కొంటున్నారు. అంటే ‘జీన్స్‌, చుట్టూ ఉన్న పరిస్థితులను మనం మార్చలేం కానీ… ఆ సమయంలో ఉన్న మానసిక స్థితిని మార్చుకోగలగడం వల్ల 40 శాతం సంతోషాన్ని సాధించుకోవచ్చు’ అని చెప్పేదే ఈ సంతోషాల సూత్రం. అంటే మన సంతోషాన్ని కూడా మనం నియంత్రించవచ్చన్న మాట. అయితే ఇది శాస్త్రపరంగా నిరూపితమైనది కాదు. కానీ దీని ఆధారంగా కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి.

  • మన సంతోషాన్ని కొద్ది స్థాయిలో నియంత్రించొచ్చు.
  • సాధన ద్వారా సంతోషాన్నీ సాధించవచ్చు.

అందుకే, కొందరు ఎప్పుడూ సంతోషంగా కనిపిస్తుంటారు. మరికొందరు మూతి ముడుచుకుని ఉంటారు. ఎందుకిలా అన్నది కచ్చితంగా చెప్పలేం కానీ, విభిన్న దృక్కోణాల వల్ల కూడా మనలో మార్పులు వస్తాయని కచ్చితంగా చెప్పొచ్చు.

ఉదాహరణకు జైలులో ఉన్న ఇద్దరు ఖైదీలు కిటికీలోంచి బయటకు చూస్తూ… ఒకరు నేలమీదున్న బురదని చూస్తే, మరొకరు ఆకాశంలోని తారకలను చూస్తూ హాయిని పొందడం లాంటి కథలు వింటూనే ఉన్నాం. మనం ఉన్న పరిస్థితులు, పెరిగిన సంస్కృతి, జీవితంలోని దశలను బట్టి సంతోషం మారుతుందనేది మానసిక నిపుణులు ప్రముఖంగా పేర్కొంటున్నారు

కోకా-కోలా భారత బాట్లింగ్ యూనిట్ HCCB నుంచి రూ.9 వేల కోట్ల ఐపీఓ…

కోకా-కోలా భారత బాట్లింగ్ యూనిట్ HCCB నుంచి రూ.9 వేల కోట్ల ఐపీఓ

 

కోకా-కోలా తన భారతీయ బాట్లింగ్ సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్‌ను పబ్లిక్‌ ఇష్యూకు తీసుకురాబోతోంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.9,027 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో కంపెనీ విలువ సుమారు రూ. 90,000 కోట్లు ఉండే లక్ష్యంగా నిర్దేశించుకుంది.

అట్లాంటా, జనవరి 18: ప్రపంచంలోనే అతిపెద్ద బెవరేజ్ కంపెనీ కోకా-కోలా తన భారతీయ బాట్లింగ్ సంస్థ హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్(HCCB)ను పబ్లిక్‌గా లిస్ట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ IPO ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్లు(సుమారు రూ.9,027 కోట్లు) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ విలువ 10 బిలియన్ డాలర్లు(సుమారు రూ.90,000 కోట్లు) ఉండే లక్ష్యంగా నిర్దేశించుకుంది.ఈ IPO 2026 వేసవిలో(సమ్మర్) లాంచ్ చేయాలని ప్రణాళిక. అయితే.. గతేడాదిలా వర్షాల వల్ల పీక్ సమ్మర్ డిమాండ్ తీవ్రంగా పడిపోతే, దీనిని 2027కి వాయిదా వేయవచ్చని సమాచారం. కోటక్ మహీంద్రా క్యాపిటల్, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్, సిటీ బ్యాంక్ వంటి ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను ఈ ప్రక్రియకు నియమించారు.HCCB భారతదేశంలో కోకా-కోలా, థమ్స్‌అప్, స్ప్రైట్, మాజా, కిన్లీ, దసాని, జార్జియా కాఫీ, ష్వెప్స్ వంటి బ్రాండ్లను తయారు చేసి, పంపిణీ చేస్తుంది. దేశంలోని రూ.60,000 కోట్ల సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. HCCB 15 ప్లాంట్లతో పనిచేస్తోంది. మిగిలిన ఆపరేషన్లు ఇతర ఇండిపెండెంట్ బాట్లర్ల ద్వారా జరుగుతాయి.
గత సంవత్సరం కోకా-కోలా తన గ్లోబల్ అసెట్-లైట్ వ్యూహంలో భాగంగా HCCB పేరెంట్ ఎంటీటీలో 40 శాతం వాటాను జుబిలెంట్ గ్రూప్(Jubilant Bhartia)కు రూ. 12,500 కోట్లకు అమ్మింది. ఈ IPO కూడా అదే వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. బాట్లింగ్ ఆపరేషన్ల నుంచి దూరమై.. బ్రాండ్ బిల్డింగ్, ఇన్నోవేషన్, డిజిటైజేషన్‌పై దృష్టి పెట్టడం దీని లక్ష్యంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఫైనాన్షియల్ ఇయర్(FY)25లో HCCB రెవెన్యూ రూ.12,751 కోట్లు (9 శాతం తగ్గుదల) నమోదైంది. ఇది ప్లాంట్లను ఫ్రాంచైజీ బాట్లర్లకు అమ్మడం వల్ల వచ్చిన ప్రభావమని చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా అన్‌సీజనల్ రెయిన్స్ వల్ల కూడా సాఫ్ట్ డ్రింక్స్ సేల్స్ ప్రభావితమయ్యాయి.

ఇక.. ఈ IPO భారతదేశంలో MNCల బిగ్ లిస్టింగ్‌ల ట్రెండ్‌లో భాగమవుతుంది. ఇంతకుముందు హుందాయ్ Hyundai($3.3 బిలియన్), ఎల్‌జీ LG($1.3 బిలియన్) తర్వాత మరో మెగా డీల్‌గా నిలవనుంది. ఈ ఐపీఓ విజయవంతమైతే.. భారత FMCG మార్కెట్‌లో కోకా-కోలా బలాన్ని మరింత పెంచుతుంది.. ఇన్వెస్టర్లకు ఆకర్షణీయ అవకాశంగా మారనుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు..

 

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కథానాయకుడు, మహానాయకుడు ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో కథానాయకుడు, మహానాయకుడు ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ఊరువాడల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి.. సినీ హీరోగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆయన కుటుంబ సభ్యులు చేరుకుని నివాళులర్పించారు.

గుంటూరు జిల్లా..

జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్య రావు, స్థానిక ఎమ్మెల్యే నసీర్, ఏపీఐడీసీ ఛైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహన్ కృష్ణతో పాటు పలువురు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

భీమవరం..

జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఏపీఐఐసీ ఛైర్మన్, టీడీపీ జిల్లాధ్యక్షుడు మంతెన రామరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చిలకలూరిపేటలోలో..

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావూ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కరిముల్లా, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలు.. ఆరు రోజుల పాటు జరుగనున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ జన్మదినం రోజున ముగియనున్నాయి.

విశాఖపట్నం..

స్వర్గీయ ఎన్టీఆర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు పాలనలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయని విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. అధికారం శాశ్వతం కాదు, దానిని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మేలు జరగాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఆయన స్థాపించిన టీడీపీలో తాను ఎంపీగా సేవలందించడం గర్వంగా ఉందన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పని చేస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు నగరంలోని బీచ్ రోడ్‌లో ఎన్టీఆర్ విగ్రహనికి విశాఖ ఎంపీ శ్రీ భరత్‌తోపాటు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణ, ఎమ్మెల్సీ చిరంజీవి రావు, జిల్లా అధ్యక్షుడు పట్టాభితోపాటు భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.

గంటా శ్రీనివాసరావు..

చలనచిత్ర రంగంలో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలన అందించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజలే దేవాలయం అన్న సిద్ధాంతంతో ముందుకు వెళ్లారని చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ముందుకు వెళుతుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలతోపాటు సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.

అనకాపల్లి జిల్లా..

నర్సీపట్నంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

కర్నూలు జిల్లా..

పత్తికొండ మార్కెట్ యార్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, టీడీపీ కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎన్టీఆర్ జిల్లా..

బీసీలకు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెట్టిన మహోన్నత నేత ఎన్టీఆర్ అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. రాయలసీమకు తాగునీరు సాగునీరు అందించిన భగీరథుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధితోపాటు పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనుల్లో పురోగతితోపాటు పరిశ్రమ ఏర్పాటుతో ఏపీ.. దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదుగుతుందన్నారు. గొల్లపూడి, గుంటుపల్లి, కొండపల్లిలో.. ఎన్టీఆర్ 30వ వర్ధంతిని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఘనంగా నిర్వహించారు.

శ్రీ సత్యసాయి జిల్లా..

భారతదేశ రాజకీయాలలో ఒక సంచలంగా మొదలైన ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే ఆల్ టైం రికార్డ్ ఎన్టీఆర్‌దేనని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. కదిరి పట్టణంలో స్థానిక సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి.. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ స్థాపించిన 90 రోజుల్లో అధికారంలోకి రావడం చారిత్రాత్మకమని అభివర్ణించారు. పటేల్, పట్వారి వ్యవస్థలకు చరమ గీతం పాడిన మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు పేరు మీద పేదలకు కిలో రూ. 2లకే బియ్యం అనేది జీవితంలో గుర్తుండిపోయే పథకమని పేర్కొన్నారు. అందుకే ఎన్టీఆర్ పూజ్యుడు చిరస్మరణీయుడని అభివర్ణించారు. రాజకీయ పార్టీలు.. సేవా కార్యక్రమాలు చేయడం అనేది టీడీపీ ఆవిర్భావం తర్వాతనే వచ్చాయని వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేద్దామంటూ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. రైళ్లు, విమాన సర్వీసుల్లో అంతరాయం…

ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. రైళ్లు, విమాన సర్వీసుల్లో అంతరాయం

 

న్యూఢిల్లీని పొగమంచు దుప్పటి కప్పేసింది. ఎదురుగా ఉన్నవి కనిపించనంత దట్టంగా పొగ అలుముకుంది. వాయు నాణ్యత సూచీ 439కు పెరిగింది.

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోయింది. ఆదివారం ఉదయం.. రాజధాని వ్యాప్తంగా దట్టమైన పొంగ మంచు పరుచుకోవడంతో ఎదురుగా ఉన్నవేవీ కానరాని పరిస్థితి వచ్చింది. దీంతో పలు రైళ్లు, విమానాల ప్రయాణాలు వాయిదాపడ్డాయి. నేటి ఉదయం 7:30 గంటల సమయంలో ఢిల్లీలో వాయునాణ్యత సూచీ ఏక్యూఐ 439కు చేరింది. కాలుష్యం కట్టడి కోసం ఢిల్లీ అధికార యంత్రాంగం జీఆర్ఏపీ-4 నిబంధనలను శనివారం నుంచి అమలు చేస్తోంది.ఢిల్లీలోని సఫ్దర్‌ గంజ్‌లో దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ పూర్తిగా తగ్గిపోయింది. పాలమ్ ప్రాంతంలో 100 మీటర్లకు మించి దూరంలో ఉన్నవేవీ కనిపించని పరిస్థితి నెలకొందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దట్టమైన పొగ మంచు కారణంగా ఎయిర్ ఇండియా, ఇండిగో సహా పలు ఎయిర్‌లైన్స్‌ విమాన జర్నీలను వాయిదా వేశాయి. ఈ విషయంపై కస్టమర్లను కూడా అప్రమత్తం చేశాయి. తమ విమానం ఎప్పుడు బయల్దేరుతుందనేది ఒకసారి చెక్ చేసుకుని ఎయిర్‌పోర్టులకు రావాలని సూచించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 35 శాతం విమాన ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి.
అయితే.. ఈ పరిస్థితి ప్రస్తుతం క్రమంగా కుదురుకుంటోందని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఉదయం 8 గంటల సమయంలో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఉత్తర భారతంలో ఢిల్లీతోపాటు బరేలీ, లఖ్నవూ, కుషీనగర్‌లలోనూ దృశ్య మాన్యత పూర్తిగా తగ్గిపోయింది. ఇక అమృత్‌సర్, గోరఖ్‌పూర్‌లలో 100 మీటర్ల దూరంలో ఉన్నవీ కనిపించే పరిస్థితి లేదని ఐఎమ్‌డీ తెలిపింది. ప్రయాగ్‌రాజ్‌లో 200 మీటర్ల దూరంలో ఉన్నవీ కనిపించనంతగా పొగ మంచు అలుముకుందని పేర్కొంది.

పొగ మంచు కారణంగా రైళ్ల సర్వీసుల్లోనూ అంతరాయం ఏర్పడింది. రాజధాని, దురంతో, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ వంటి అనేక రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి

 మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..

 మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

 

మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈరోజు గోదావరి నదిలోని ఏడు సాగర సంగమాల వద్ద స్నానం ఆచరిస్తారు. దీనిని సప్త సాగర యాత్ర అని అంటారు.

Mouni Amavasya
నేటితో పుష్యమాసం ముగుస్తోంది. పుష్య బహుళ అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తరాయణంలో వచ్చే తొలి అమావాస్య. అసలు దీనికి మౌని అమావాస్య అని పేరు రావడానికి గల కారణాలను వేద పండితులు వివరిస్తున్నారు. ఉత్తరాయణ కాలంలో వచ్చే ఈ రోజున ఉపాసకులు, సాధువులు తదితరులు మౌనంగా వారి వారి సాధనను కొనసాగిస్తారు. ఉత్తర భారతదేశంలో మౌనవ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది. అందుకు ఈ మౌనవ్రతానికి ప్రతీకగా దీనిని మౌని అమావాస్య అని పిలుస్తారు. తపస్సిద్ధి పొందిన వారిని మౌని అని అంటారు. తపస్సు అనగా తప ఆలోచన అని అర్థం. ఇంకా చెప్పాలంటే.. సంకల్పించిన విషయం మీద తప్ప వేరే ఆలోచన లేకపోవడం అని అంటారు. ఈ రోజు సముద్ర లేదా నదీ స్నానం చేయడం మంచిదని అంటారు.
చొల్లంగి అమావాస్య..

ఈ మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. గోదావరి నదిలోని ఏడు సాగర సంగమాల వద్ద స్నానం ఆచరిస్తారు. దీనిని సప్త సాగర యాత్ర అని అంటారు. ఇలా గోదావరిలో స్నానం చేయడం వల్ల చేసిన పాపాలు తొలగుతాయంటారు. ఈ సప్త సాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య రోజు చొల్లంగి వద్ద గోదావరి సంగమ స్నానంతో ముగుస్తుంది. అందుకే దీనిని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు.

సూర్యభగవానుడు..

ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడికి ఆదివారం అత్యంత ఇష్టమైన రోజు. ఈ ఏడాది జనవరి 18వ తేదీ మౌని అమావాస్య.. ఆదివారం వచ్చింది. ఈ రోజు విశేషమైన దినంగా చెబుతారు. జాతకంలో గ్రహదోషాలు ఉన్నవారు ఈ మౌని అమావాస్య రోజు.. సముద్ర లేదా నదీ స్నానం చేసి సూర్యడికి అర్ఘ్యం సమర్పించి.. ఎర్రని పువ్వులు, ఎర్ర చందనంతో అర్చన చేయాలి. దీనివల్ల సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుజడితోపాటు రాహుకేతు గ్రహ దోషాలు తొలగి.. ఆరోగ్య ప్రదాయకుడైన ప్రత్యక్ష భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు.. బ్రహ్మీ ముహూర్తంలో.. సూర్యోదయానికి ముందు ఆ తర్వాత 90 నిమాషాల్లోపు స్నానం చేయడం మంచిదని అంటారు.

పితృ కార్యాలు..

మౌని అమావాస్య రోజు.. పితృ శాపాలు, జాతకంలో పితృ దోషాలు ఉన్న వారు అన్నదానం చేస్తే మంచిదని చెబుతారు. సంక్రాంతి రోజు ఆచరించవల్సిన దానాలు చేయలేకుంటే.. ఈ అమావాస్య రోజు చేయడం వల్ల మంచి ఫలితాన్ని అందుకుంటారని పండితులు అంటున్నారు.

సమ్మక్క తీర్థం..భూతల మహిమాన్వితం!

`మేడారం మిల మిల..కొత్త తోరణాలతో తళ తళ.

`ఆదివాసీ గిరిజన జాతర వైభవం!

`ఏడు వందల ఏళ్ల చరిత్రకు నిదర్శనం.

medaram 2026

`రాజులపై సామాంతుల తొలి తిరుగుబాటు సంతకం.

`వీర వనితల పోరు చరిత్రకు సజీవ సాక్ష్యం.

`వీర వనితలు దేవతలు గా అదృష్యమైన గొప్ప వేదిక మేడారం.

`ప్రజలకు రక్షణగా నిలుస్తూ దీవెనలిస్తున్న దైవాలా గద్దెలు.

`మేడారం వ్యాప్తంగా ప్రజలను చల్లగా చూస్తున్న అమ్మల దీవెనలు.

medaram 2026

అమ్మల వేడుకకు ప్రజా ప్రభుత్వంలో సరికొత్త హంగులు!

`పతిష్టమైన అద్భుత కట్టడాలు.

`వందల ఏళ్ల దాకా చెక్కు చెదరకుండా నిర్మాణాలు.

మంత్రులు శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్కల పట్టుదలకు నిదర్శనాలు.

`మంత్రులు దగ్గరుండి పనుల పర్యవేక్షణలు.. పరిశీలనలు.

`ఎప్పటికప్పుడు సమీక్షలు.. సంప్రదింపులు.

`ఆదివాసీలా సంసృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణ పనులు.

ఆరు నెలలుగా మంత్రులు పడుతున్న శ్రమకు నిదర్శనాలు.

`అద్భుతమైన రోడ్లు… దశబ్దాలైనా చెక్కు చెదరకుండా ప్రాంగణ పరిసరాలు.

`నిరంతరం భక్తులకు సకల సౌకర్యాలు.

`ఒకప్పుడు జాతర సమయం లోనే భక్తులు వచ్చేవారు.

`ఇప్పుడు నిరంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

`అమ్మవార్ల చెంత నిద్రలు చేస్తున్నారు.

`అందుకు అనువైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల ముందు సీఎం రేవంత్‌ రెడ్డి మొక్కలు కోరుకున్నాడు.

`సీఎం రేవంత్‌ మేడారం అభివృద్ధి చేస్తామని చెప్పారు.

`ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నారు.

`ఆదివాసీల ఆత్మ గౌరవం కోసం పాటుపడుతున్నారు.

`జనమే వనమై… అమ్మలు కోలువై!

`తల్లుల దీవెనల కోసం భక్తుల ఆరాటం.

`దండుగా భక్తులు చేరుకుని అమ్మలను దర్శించునే భాగ్యం.

`రెండేళ్ల కోసారి మూడు రోజుల జనారణ్యం!

`పూజలతో పులకించే పవిత్రమైన ప్రాంతం.

`అమ్మలు నడ యాడిన విశేషమైన సుందర లోకం.

గొప్ప ఆధ్యాత్మిక ప్రపంచం…అమ్మల నామస్మరణతో మార్మోగే అరణ్యం.

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                             

 మేడారం అంటే ఓ గుడారం కాదు. ఓ కుగ్రామం అసలే కాదు. ఆదివాసీల ప్రజల రాజ్యం. పగిడిద్ద రాజు సంస్ధానం. ఆ రాజ్యాన్ని కాపాడిన దైవాంశ సంబూతురాలు సమ్మక్క. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతానికి దేవుడిచ్చిన వరం. సమ్మక్క దేవతా రూపం. ఇప్పటికీ మేడారాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న దేవతా మూర్తి సమ్మక్క. ఆ ప్రాంతానికి ఇలవేల్పు సమ్మక్క. ఆనాటి నుంచి నేటి వరకు పాలకుల చేత పూజలందుకుంటున్న ఇష్టదై వం సమ్మక్క. ఆదిశక్తికి ప్రతిరూపం. ప్రజలను కాపాడుకుంటున్న కుల దైవం. ఇప్పటికీ కొలిచే వారందరికీ కొంగు బంగారం. అడవిలో వెలసిన ఆడబిడ్డల ప్రతిరూపం. కుంకుమ బరిణ రూపంలో దర్శనమిస్తూ రెండేళ్లకోసారి పూజలందుకుంటున్న తీర్ధం. మేడారం మహిమాన్విత ప్రాంతం. ఆత్మగౌరవ పోరాటానికి తొలి సంతకం. తొలి చైతన్యానికి నిదర్శనం. తిరుగుబాటకు సంకేతం. ఎదిరించే నిలిచే గుండె ధైర్యానికి ఆదర్శం. తరతాలకు చెరగని, తరగని గుండె నిబ్బరాన్ని నింపిన కొండంత ఆశయం. అలాంటి మేడారంలో అడుగుపెడుతుంటేనే మనసు పులకించిపోతోంది. ఏదో ఒక శక్తి ఆవహించినంత సంతోషం కలుగుతుంది. జీవితం మీద ఆశలే కాదు, ఆశయాలు, ఆరోగ్యాలు, ఆనందాలు వెల్లివిరుస్తాయి. అందుకే మేడారం అంటేనే ఒక అద్భుమైన భావన. మేడారం తీర్దమనేది గొప్ప బావన. మనసుకు అనుభూతి నింపే దీవెన. సరిగ్గా ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి రాజరిక పాలనలో పీదనకు వ్యతిరేకంగా ఆదివాసీలు సాగించిన ఆత్మగౌరవం పోరాటం. రాజులకు ఎదిరించి నిలిచిన దీర వనితల ఆత్మత్యాగం. అంత గొప్పది మేడారం చరిత్ర. అరివీర భయంకరంగా ఆదిశక్తులుగా మారి తల్లి కూతుళ్లయిన సమ్మక్క..సారక్కలు సాగిస్తున్న యుద్దాన్ని తట్టుకోలేక వెన్నుపోటు పొడిచి అమ్మలను చంపాలని చూశారు. కాకతీయ కాలంలో జరిగిన ఈ యుద్దం ఆనవాలు ఇంకా సజీవంగానే వున్నాయి. ఆ యుద్దంలో ప్రత్యర్ధులకు యుద్దఖైదీలుగా చిక్కకుండా వారి చేతుల్లో ప్రాణాలు పోకుండా వుండేందుకు చిలకలగుట్టమీదకు వెళ్లి అదృష్యమైన ఆదిశక్తి రూపాల అవతారాలే సమ్మక్క సారక్కలు. మేడారం గూడెంలో దైర్యం నింపారు. వారికి రక్షణగా నిలిచారు. దేవతలుగా మారి అడవినంతా కాపాడారు. కాకతీయ రాజుల నుంచి మేడారం ప్రాంతాన్ని కాపాడుకున్నారు. ఆదివాసీల రాజ్యాన్ని కాపాడారు. నాటి నుంచి నేటి వరకు ఆదివాసీలను కంటికి రెప్పలా కాపాడుకుం టున్నారు. వాళ్లే సమ్మక్క…సారక్కలు. యుద్దంలో వెన్ను చూపని వీరవనితలు, గాయాల బారిన పడిపోయారు. వెన్ను పోటును తట్టుకొని కాకతీయులకు చిక్కకుండా చిలకలగుట్టకు చేరుకున్నారు. ఆ తర్వాత మాయమైపోయారు. ఇది తెలిసిన కాకతీయ రాజులు భయపడ్డారు. అప్పటి నుంచి మేడారం వైపు చూడాలంటే జడుసుకున్నారు. ఏ కాకతీయ రాజుల మూలంగా ఎలా చనిపోయారో కాకతీయ కడపటి రాజు కూడా అలాగే చనిపోవడం ఖర్మఫలితం. సంపెంగ వాగులో దూకి చనిపోయేలా జంపన్నను ఎలా చిత్రహింసలు పెట్టారో అదే తరహాలో కాకతీయ రాజుల కడపడి రాజు ప్రతాపరుద్రుడు కూడా నర్మదా నదిలో దూకి చనిపోవాల్సిన పరిస్దితి ఎదురైంది. ఇది అమ్మల ప్రతీకారమని ఇప్పటికీ చెప్పుకుంటారు. అప్పటి నుంచి రెండేళ్లకోసారి మూడు రోజుల పాటు, ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం, ఆదివాసీ పూజారులు సమ్మక్క, సారలమ్మ తీర్దాన్ని నిర్వహిస్తుంటారు. కన్నె పల్లి గుట్టల నుంచి సారలమ్మను మొదటి రోజు తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్టిస్తారు. రెండో రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. సమ్మక్కను తీసుకొచ్చేపప్పుడు ప్రభుత్వం ఎస్పీ ఆధ్వరంలో గాలిలోకి కాల్పులు కాల్పులు జరుపుకుంటూ అమ్మవారిని తీసుకొస్తారు. ఇద్దరు తల్లులు మూడో రోజు భక్తులకు దర్శనమిస్తారు. ఇలా మూడు రోజుల పాటు సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతుంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద జాతర ఒక్క మేడారంలోనే జరుగుతుంది. ఈ మూడు రోజుల పాటు సాగే జాతరకు సుమారు 10 కోట్ల మంది భక్తులు హజరౌతుంటారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ నుంచే కాకుండా, కర్నాకట, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, మధ్య ప్రదేశ్‌, ఒరిస్సాల నుంచి పెద్దఎత్తున ఆదివాసీ గిరిజనునలతోపాటు, ప్రజలు కూడా హాజరౌతుంటారు. 1996లోనే సమ్మక్క జాతరను రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వంగుర్తించింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అదికారికంగా మరోసారి ప్రకటించింది. కుంభమేలను తలపించేలా జనం తండోపతండాలుగా కోట్లలో హజరౌతుంటారు. అమ్మకు మొక్కులు చెల్లిస్తుంటారు. అమ్మవారికి అంత్యంత ప్రీతిపాత్రమైన బంగారాన్ని నిలువెత్తు సమర్పిస్తారు. ఆమ్మను తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ నిలువెత్తు బెల్లం సమర్పిస్తామని మొక్కుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే పేరుకు ఆదివాసీ జాతరే అయినా కోట్లాది మంది ప్రజలకు ఇలవేల్పులుగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా సమ్మక్క తల్లి కొలువబడుతోంది. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. 

తాడ్వాయి మండలంలోని మేడారానికి వెళ్లాలంటే ఓ ముప్పై నలభై ఏళ్ల క్రితం వరకు కొంత గగనమే.. అడవిలో వున్న సమ్మక్క, సారలమ్మల దర్శనానికి భక్తులు కేవలం జాతర సమయంలోనే వెళ్లేవారు. మిగతా సమయాల్లో వెళ్లాలంటే భయపడేవారు.చుట్టూ వుండే అడవిలో క్రూరమృగాలు సంచరిస్తూ వుండేవి. సమ్మక్క , సారలమ్మ గద్దెల సమీపంలో కూడా పులులు సంచరిస్తూ వుండేవని పెద్దలు చెబుతుంటారు. పైగా అక్కడ వసతులు వుండేవి కాదు. మేడారం జాతర సమ యంలో తప్ప ప్రభుత్వ బస్సులు కూడా నడిచేవి కాదు. ప్రజలకు కూడా ఇప్పటిలాగా కార్లు అందుబాటులో లేవు. రోడ్లు కూడా సరిగ్గా వుండేవి కాదు. 1990 తర్వాత సౌకర్యాల కల్పన మొదలైంది. అయితే జాతర సమయాల్లో తాత్కాలిక సదుపాయాలు కల్పించేవారు. ఇలా ప్రతి రేండేళ్లకోసారి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టేవారు. ఎందుకంటే ఆ సమయంలో మాత్రమే భక్తులు వచ్చేవారు. నాలుగో రోజు ప్రజలు అక్కడ వుండడానికి కూడా భయపడేవారు. మూడు రోజుల పాటు వనమంతా నిండిన జనం, నాలుగో రోజు మేడారం నిర్మాణుష్యమయ్యేది. ప్రభుత్వం కూడా ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపొమ్మని కోరేది. కాని ఇప్పుడు శాశ్వత సౌకర్యాల కల్పన జరిగింది. మూడువందల అరవైఐదు రోజుల పాటు భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మల సన్నిదిలో నిద్రలు చేస్తున్నారు. మొక్కులు తీర్చుకొని అక్కడే బస చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం అదికారంలోకి వస్తే, సమ్మక్క, సారక్క జాతరలను నభూతోన భవిష్యతి అనేలా నిర్వహిస్తామని, మేడారాన్ని శాశ్వత నిర్మాణాలతో అభివృద్ది చేస్తామని, మేడారానికి భక్తులు రావడానికి అవసరమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అద్భుతంగా కల్పిస్తామని సిఎం. రేవంత్‌ రెడ్డి మొక్కుకున్నారు. ఆ మొక్కులు తీరేలా ఆదివాసీ సంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారానికి కొత్త కొత్త హంగులు తీసుకొచ్చారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి సురేఖలు గత ఆరు నెలలుగా మేడారాన్ని దగ్గరుండి అభివృది చేయిస్తున్నారు. రాష్ట్ర ఫ్రభుత్వం అందుకోసం రూ.300 కోట్లు కేటాయించింది. గత రెండేళ్ల క్రితం జాతరకు వచ్చిన భక్తులు కూడా ఇప్పుడున్న మేడారం పరిసరాలను గుర్తుపట్టలేరు. కొన్ని సంవత్సరాలైనా సరే చెక్కు చెదకుండా వుండేలా రోడ్లతోపాటు, మేడారం గద్దెల ప్రాంగణాలతోపాటు, చుట్టుపక్కల పరిసరాలన్నీ పటిష్టమైన నిర్మాణాలతో తీర్చిదిద్దుతున్నారు. పైగా ఇప్పటి వరకు గద్దెల చుట్టూ ఇనుప కంచెలు వుండేవి. ఇప్పుడు గ్రానైట్‌ రాయితో కూడిన, శతాబ్దాల పాటు చెక్కుచెదరని గద్దెల నిర్మాణం చేపట్టారు. గద్దెల నుంచి మొదలు, ఆలయ ప్రాంగణమంతా గ్రానైట్‌ రాయితో ఆలయ స్వరూపం తీసుకొచ్చారు. తోరణాలను నిర్మాణం చేశారు. ఆ తోరణాలపై ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయలను ఆదివాసీ బాషలో చెక్కడం జరిగింది. సమ్మక్క సారక్కల కుటుంబ చరిత్రలోపాటు, వారి వంశస్తులు, పూర్వీకుల గురించి తెలిసేలా బొమ్మల లిపిలో వుండే ఆదివాసీ బాషలో రాయిపై వాటిని చెక్కారు. శతాబ్దాలపాటు చెక్కు చెదరకుండా, భవిష్యత్తు తరాలు ఆదివాసీ చరిత్రను మర్చిపోకుండా గుర్తు చేసేలా నిక్షిప్తం చేశారు. మేడారాన్ని ఇలా తీర్చిదిద్ది సిఎం. రేవంత్‌ రెడ్డి తన మొక్కులు చెల్లించుకున్నారు. జాతర చరిత్రలోనే తొలిసారి ప్రజా ప్రభుత్వం క్యాబినేట్‌ మీటింగ్‌ కూడా ఏర్పాటు చేశారు. మేడారం రాజ్యంలో తల్లుల సన్నిధిలో తెలంగాణ ప్రభుత్వ మంత్రుల సమావేశం…అధ్భుత నిర్ణయం.

మంథని పట్టణంలోని పలు కుటుంబాలను పరామర్శించిన

మంథని పట్టణంలోని పలు కుటుంబాలను పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

మంథని :- నేటి ధాత్రి

 

 

 

మంథని పట్టణంలోని పోచమ్మవాడ లో కురిమిల్ల కమలమ్మ ఇటివల మరణించగ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వారి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి మరియు బోయిన్ పేట లో కొంతం పెద్ద సమ్మయ్య, ప్రయాకర్ రావు మనోహర్ లు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను పరామర్శించి మరియు అనారోగ్యంతో బాధపడుతున్న దాసరపు సమ్మయ్య ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట నాయకులు కార్యకర్తలు వున్నారు

పిఎసిఎస్,ఎఫ్ ఎస్ సి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ…

పిఎసిఎస్,ఎఫ్ ఎస్ సి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ

ఆవిష్కరించిన డిసిఓ నీరజ

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

 

ప్రాథమిక సొసైటీ సహకార సంఘాల పిఎసిఎస్ మరియు ఎఫ్ ఎస్ సి ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వరంగల్ జిల్లా డిసిఒ నీరజ చేతుల మీదగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల అసోసియేషన్, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షుడు మోడం సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొగిలి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకాయల సురేష్, కోశాధికారి రాచమల్ల రమణ చారి, కార్యదర్శి ప్రదీప్, దామోదర్ ,మురళి, ఈగ వెంకటేశ్వర్లు, రవి కిరణ్, రాజు, సోమశేఖర్, మేఘన, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version