ఇండోర్‌లో కలుషిత నీరు.. గిల్ చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..

ఇండోర్‌లో కలుషిత నీరు.. గిల్ చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే..

 

భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆదివారం మూడో వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. అయితే.. ఇటీవల ఇండోర్‌లో కలుషిత నీరు తాగడం వల్ల పలువురు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Shubmఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచులు జరగ్గా.. ఇరుజట్లు 1-1తేడాతో సమంగా కొనసాగుతున్నాయి. సిరీస్ విజేతను నిర్ణయించే కీలకమైన మూడో వన్డే ఆదివారం ఇండోర్ వేదికగా జరగనుంది. బలమైన కివీస్ జట్టును టీమిండియా ఎదుర్కొని సిరీస్ పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే.. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇండోర్‌లో ఇటీవల కలుషిత తాగునీటి వల్ల పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఆటగాళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఆటగాళ్లున్న ఫైవ్ స్టార్ హోటల్, మైదానంలో పరిశుభ్రమైన నీరందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) మరింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు. తాను బస చేస్తున్న హోటల్‌లోని తన గదిలో రూ.3లక్షలు ఖరీదు చేసే వాటర్ ప్యూరిఫయర్‌ను బిగించుకున్నట్లు సమాచారం. ఈ పరికరానికి ఆర్వో వాటర్, ప్యాకేజ్డ్ వాటర్‌ను కూడా మళ్లీ ప్యూరిఫై చేసే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది.

విరాట్ ఎప్పటి నుంచో..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పటి నుంచో తాను తాగే నీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అతడు ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల నుంచి సేకరించే ప్రత్యేక వాటర్‌ను మాత్రమే వినియోగిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే.

టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరంటే…

టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరంటే?

 

భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. దీంట్లో భాగంగా వడోదర వేదికగా కాసేపట్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగనుంది.

 

 ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. దీంట్లో భాగంగా వడోదర వేదికగా కాసేపట్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగనుంది. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఆడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. టెస్టు, టీ20 ఫార్మాట్లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన రో-కో.. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.

శ్రేయస్ ఆ విషయంలో తొందరపడకు.. మాజీ బ్యాటింగ్ కోచ్ సూచన…

శ్రేయస్ ఆ విషయంలో తొందరపడకు.. మాజీ బ్యాటింగ్ కోచ్ సూచన

 

టీమిండియా.. న్యూజిలాండ్‌తో వడోదర వేదికగా తొలి వన్డేలో నేటి నుంచి తలపడనుంది. అయితే గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.. అయ్యర్‌కు పలు జాగ్రత్తలు సూచించాడు.

మంచి వన్డే కెప్టెన్ అవుతాడు..

‘కెప్టెన్‌గా శుభ్‌మల్ గిల్‌పై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. అతడికి మైదానంలో సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం అతడికి అందుబాటులో ఉంటుంది. అతడు క్రమంగా ఎదుగుతాడు. చివరికి మంచి వన్డే కెప్టెన్ అవుతాడు’ అని బంగర్ పేర్కొన్నాడు.

 కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే…

 కోహ్లీకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన కోహ్లీ.. ఎలాగంటే?

 

టీమిండియా-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు వారిని చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్‌కు విరాట్ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో తొలి మ్యాచ్ వడోదర వేదికగా జరగనుంది. అయితే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కేవలం వన్డేలు ఆడుతుండటంతో ఈ మ్యాచులపై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు వారిని చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్‌కు విరాట్(Virat Kohli) ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
ఆ చిన్నారుల్లో ఒక పిల్లాడు.. అచ్చు చిన్ననాటి కోహ్లీలాగే ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కోహ్లీ కూడా ఆ చిన్నారికి ఆటోగ్రాఫ్ ఇస్తూ.. చిరునవ్వు చిందిచడం అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది. ‘వీడేంటి నా లాగే ఉన్నాడు..’ అని కోహ్లీ అనుకుని ఉంటాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్‌ వస్తున్నాయి.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version