పొగమంచు వల్ల హృదయ విదారకంగా టెకీ మరణం..
దట్టమైన పొగమంచు ఘోర రోడ్డు ప్రమాదాలకు, హృదయ విదారక మరణాలకు దారితీస్తోంది. యూపీలో ఒక టెకీ చివరి క్షణం వరకూ ప్రాణాలు కాపాడుకునేందుకు యత్నించి విఫలమయ్యారు. వివరాల్లోకి వెళితే…
ఉత్తర్ ప్రదేశ్, జనవరి 18: దట్టమైన పొగమంచు కారణంగా శుక్రవారం రాత్రి గ్రేటర్ నొయిడా సెక్టార్ 150లో జరిగిన దారుణమైన రోడ్డు ప్రమాదంలో 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువరాజ్ మెహతా మృతి చెందాడు. గురుగ్రామ్(హరియాణా)లోని డన్‌హమ్బీ ఇండియాలో పనిచేస్తున్న యువరాజ్ శుక్రవారం రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
