జహీరాబాద్ 32వ వార్డు బరిలో ఇంజనీర్ ఖిజర్ అలీ ఖాన్ కుటుంబం…

జహీరాబాద్ 32వ వార్డు బరిలో ఇంజనీర్ ఖిజర్ అలీ ఖాన్ కుటుంబం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో జహీరాబాద్ పట్టణంలోని 32వ వార్డు (NGO’S కాలనీ & సుభాష్ గంజ్) నుండి పోటీ చేసేందుకు యువ నాయకుడు, బీఈ సివిల్ ఇంజనీర్ మహమ్మద్ ఖిజర్ అలీ ఖాన్ తన సంసిద్ధతను ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన దరఖాస్తును గౌరవ ఎమ్మెల్యే శ్రీ కె. మాణిక్ రావు గారు మరియు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ దేవి ప్రసాద్ గారికి అందజేశారు.ఈ సందర్భంగా ఖిజర్ అలీ ఖాన్ మాట్లాడుతూ, వార్డు రిజర్వేషన్ల నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు తాను కానీ లేదా తన భార్య కానీ పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. “మహమ్మద్ మజహర్ ఖాన్ కుమారుడిగా స్థానికులతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. ఒక సివిల్ ఇంజనీర్‌గా నాకున్న విజ్ఞానంతో వార్డులోని డ్రైనేజీ, రోడ్లు మరియు మౌలిక సదుపాయాలను శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తాను. పార్టీ నమ్మకంతో అవకాశం కల్పిస్తే, నేను లేదా నా భార్య పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.మీడియా మరియు ఓటర్ల సహకారం కోరుతూ..”ఎన్నికల్లో పోటీ చేసేందుకు మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాము. వార్డు ఓటర్లు, పెద్దలు మరియు మీడియా మిత్రులు మాకు సహకరించి ఆశీర్వదించాలని కోరుతున్నాము. ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రథమ ప్రాధాన్యత. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాము,” అని ఖిజర్ అలీ ఖాన్ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version