నైట్ టైంలో ఆకలిగా అనిపిస్తుందా..

నైట్ టైంలో ఆకలిగా అనిపిస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోండి..

 

 

కొంతమందికి అర్ధరాత్రి కూడా ఆకలిగా అనిపిస్తుంది. అయితే, అలాంటి వారు పడుకునే ముందు వీటిని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

 

 

చాలామందికి అర్ధరాత్రి ఆకలి వేస్తుంది. ఇది వివిధ కారణాల వల్ల జరగవచ్చు. ముఖ్యంగా రాత్రి మేలుకువగా ఉండేటప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో చాలా మంది చిప్స్, స్వీట్లు వంటి అనారోగ్యకరమైన వాటిని తింటారు. కానీ ఇవి జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాక బరువు పెరగడానికి కూడా కారణం అవుతాయి. కాబట్టి, మీకు ఆకలిగా అనిపిస్తే ఈ తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ ఆకలిని తీరుస్తాయని, అదే సమయంలో నిద్రకు ఇబ్బంది కలిగించవని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

గోరువెచ్చని పాలు

రాత్రిపూట ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. అలాగే, పాలలో ప్రోటీన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలకు మంచిగా పనిచేస్తాయి. అలాగే ఆకలిని కూడా నియంత్రిస్తాయి. ప్రతి రోజు పడుకునే ముందు 150–200 మి.లీ పాలు తాగడం మంచిది.

 

 

 

 

 

 

గింజలు (బాదం, వాల్‌నట్స్)

గుప్పెడు బాదం లేదా 2–3 వాల్‌నట్స్ తినడం మంచిది. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. బాదంలో మెగ్నీషియం ఉండటం వల్ల ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రకు సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల తక్షణమే ఆకలి తగ్గుతుంది. అలాగే రాత్రంతా చక్కెర స్థాయిలు స్తిరంగా ఉంటాయి.

 

 

 

 

 

 

అరటిపండు

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 ఉంటాయి. ఇవి కండరాలను సడలించడంతో పాటు నిద్రకు సహాయపడతాయి. అరటిపండు ఆకలిని తీరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న అరటిపండు తినవచ్చు. దీనిని పాలతో కలిపి తీసుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.

 

 

 

నాణ్యత లోపం ఎవరిదీ ఈ పాపం.

నాణ్యత లోపం ఎవరిదీ ఈ పాపం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

కప్పాడు గ్రామం, ఝరాసంగం మండలం. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని కప్పడ్ గ్రామం మరియు రాయికోడ్, మండలం కప్పడ్ మరియు రాయి కోడ్, ఈ రెండు గ్రామాల మధ్యలో, దాదాపు మూడు నెలల క్రితం, సాంకేతిక పరిజ్ఞానంతో, రకరకాల మిశ్రమాలను ఉపయోగించి, తారు రోడ్డును వేశారు. కాని పని పూర్తి చేసిన మూడు నెలల లోపే, రోడ్డుకు పగుళ్లు ఏర్పడి, గుంతలుగా మారుతున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి, రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుచున్నారు.

రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం గిరిధర్ రెడ్డి.

నూతన రాష్ట్ర మంత్రిని సన్మానించిన

రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,సచివాలయంలో బుధవారం కార్మిక, ఉపాధి, శిక్షణ కర్మాగారాలు, గనులు భూగర్భ శాస్త్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు గడ్డం.వివేక్ వేంకట స్వామి ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి , జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్‌రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

లారీ ఓనర్ అధ్యక్షుడిగా మేకల చంద్రయ్య ఎన్నిక.

లారీ ఓనర్ అధ్యక్షుడిగా మేకల చంద్రయ్య ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి:

కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మేకల చంద్రయ్య భారీ మెజార్టీతో గెలుపొందారు
భూపాలపల్లి లోని మంజునగర్ లో కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది అధ్యక్షుడుగా మేకల చంద్రయ్య కోశాధికారిగా రాకేష్ ఉపాధ్యక్షుడిగా ఏనగంటి రాజేందర్ ప్రధాన కార్యదర్శిగా ఎండి అన్వర్ పాషా సహాయ కార్యదర్శిగా రాసలింగమూర్తి ఎన్నికైనారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మేకల చంద్రయ్య మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించి నన్ను రెండోసారి లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిపించిన సభ్యులందరికీ రుణపడి ఉంటాను నా మీద నమ్మకంతో నన్ను రెండోసారి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ గెలుపు నామీద మరింత పనిచేసే భారాన్ని పెంచింది కావున కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ మరింత అభివృద్ధి పథంలోకి నడిపియడానికి నా వంతుగా రెండోసారి కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రజిత.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రజిత

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నజిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల, తంగళ్ళపల్లి మండలంలో గల చిన్న బోనాల ,పెద్దూరు ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపురం ఆరోగ్య ఉపకేంద్రములను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డిఐఓ, ప్రోగ్రాం ఆఫీసర్లు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రికార్డులను పరిశీలించి 0-5 సంవత్సరాల పిల్లలకు టీకాలు ఇచ్చిన తర్వాత రెండు గంటలు పాటు టీకాలు వేసిన ప్రాంతంలోనే అబ్జర్వేషన్ లో ఉంచుకొని మరో రెండు రోజులపాటు సంబంధిత ఏ.ఎ.న్ఎం మరియు ఆశ వర్కర్లు టీకాలు వేసిన పిల్లల ఇంటికి వెళ్లి పర్యవేక్షించాలని సూచిస్తూ, సకాలంలో విధులు నిర్వర్తించవలసిందిగా లేనియెడల సి.సి.ఏ. రూల్స్ ప్రకారము చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డి.ఐ.ఓ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నహీం జహన్ మరియు సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లకి భూమి పూజ.

ఇందిరమ్మ ఇండ్లకి భూమి పూజ

నాగర్ కర్నూల్  నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఎర్రకుంట తండా, లట్టుపల్లి, చిన్న పీరు తండా, బిజినేపల్లి తండా బోయపూర్ డాకు తండా, రావుల చెరువు తండాలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి.. వారి కళా సహకారం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం
తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు రవి పటేల్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశం కర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ టీం సభ్యుల ఆహ్వానం మీద పర్యటించడం జరిగింది
గ్రామంలో పలువురు ఆరోగ్య సమస్యలపై రవి పటేల్ వారి కుటుంబాలను కలిసి మాట్లాడడం జరిగింది గ్రామంలో కొడారీ స్వరూప కొడుకు అనిరుద్ యూరినరీ ట్రాక్ సర్జరీ అవసరం ఉంది అని చెప్పారు
హాజర హాస్పిటల్ dr ఉషిక కిరణ్ యూరలజిస్ట్ తో ఫోన్లో మాట్లాడి సర్జరీకి సహకరించని విజ్ఞప్తి చేశారు
పైడిమల్ల ఐలయ్య గీత కార్మికుడు తడిచేట్టు మీదనుండి పడితే కాలు విరిగింది వారిని చూసి మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తేలుకోవడం జరిగింది టీం సభ్యుడు నాగరాజు కూతురు లాస్య వికలాంగురాలు కావున పెన్షన్ రావడంలేదని చెప్పారు కలెక్టర్ గారితో కలిసి మాట్లాడి తప్పకుండా పెన్షన్ పెట్టిస్తానని చెప్పడం జరిగింది
మెదరమెట్ల గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి అక్కడి పరిసరాలు పరిశీలించి ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ స్కూలుకు విద్యార్థులు వచ్చే విధంగా ఉపాధ్యాయులకు కృషి చేయాలని అలాగే గ్రామ ప్రజలు గవర్నమెంట్ స్కూలుకు పిల్లలను పంపించాలని పవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఇందులో పాల్గొన్నవారు గునీకంటి విష్ణు కొడారి రాజు గజ్జి కుమారస్వామి కొడారి రమేష్ కొణికటి దీక్షిత్ పెంతల రాజు p రాజేందర్ ఎడకుల సురేష్ పైడిమల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి.

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బడిబాట కార్యక్రమంలో భాగంగా బడంపేట ప్రాథమికున్నత పాఠశాలలో స్వచ్ఛదనం మరియు పచ్చదనం పాఠశాల పరిధిలో వివిధ రకాల మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మమ్మద్ జాకీర్ హుస్సేన్ (ప్రత్యేక అధికారి) మాట్లాడుతూ పాఠశాల పరిధిలో పచ్చదనం స్వచ్ఛదనంతో పాటు స్వచ్ఛమైన గాలి రావడంతో పిల్లలు ఆరోగ్యంగా మరియు మంచి నీడనిచ్చి స్వచ్ఛమైన గాలి ఇవ్వడం జరుగుతుందని వివరించడం జరిగింది కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి (FAC) కృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సార్ వినోద్ సార్ తదితరులు పాల్గొనడం జరిగింది

బీసీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం.

బీసీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

నర్సంపేట నేటిధాత్రి:

 

రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని బీసీ లందరూ ఏకతాటిపైకి రావాలని కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమం లో బాగంగా నర్సంపేటలో 1500 బీసీ సభ్యత్వాలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని వరంగల్ జిల్లా ఇంచార్జ్ వంగ రవి యాదవ్ అన్నారు. నర్సంపేట పట్టణంలో బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్న ఆదేశాల మేరకు నర్సంపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సిలువేరు ద్రోణాచారి ఆధ్వర్యంలో వంగ రవి యాదవ్ అధ్యక్షతన జరిగింది.రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని బీసీ లందరూ ఏకతాటిపైకి రావాలని కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాగమే అని రవి పేర్కొన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేని పాలకులు ఉన్నత వర్గాల మోసమాటలతో ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మండల కొమ్మాలు,చీర పద్మ, రమేష్, సిలువేరు మానస, ఓదెల రంజిత్,సాంబలక్ష్మి, మండల ఐలమ్మ, ఓదెల నగేష్,రమ తదితరులు పాల్గొన్నారు.

సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు.

సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు

ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులు.

మరిపెడ నేటిధాత్రి:

 

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అడ్మిషన్లు జోరందు కున్నాయి. ఇటీవల ప్రభుత్వ బడుల బలోపేతానికి సర్కారు తీసుకున్న చర్యలు, బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. స్కూళ్లు ప్రారంభమైన వారం రోజుల్లోనే కొత్త అడ్మిషన్లు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం ప్రాథమిక పాఠశాలలో 30 నూతన అడ్మిషన్లు రావడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుర్రం వెంకన్న గౌడ్ తెలిపారు కొత్త అడ్మిషన్లలో సగానికి పైగా ఒకటో తరగతిలో 18 మంది విద్యార్థులు, 2 వ తరగతి లో 5 మంది విద్యార్థులు, 3 వ తరగతి లో 5 మంది విద్యార్థులు, 4 వ తరగతి లో 1, 5 వ తరగతి లో 1 చొప్పున మొత్తం 30 మంది విద్యార్థులు నూతన అడ్మిషన్లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు అయితే, ఇంకా కొంత మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది అని వారు తెలిపారు, ఈ నెల 12 నుంచి 2025-26 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపునకు ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందన్నారు.

ఫలితాలిస్తున్న సర్కారు నిర్ణయాలు.

ఇటీవల బడుల బలోపేతానికి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. కొత్తగా పదివేల కు పైగా టీచర్లను నియమించగా, ఖాళీగా ఉన్న చోట్ల బదిలీలు నిర్వహించి సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చింది. దీనికితోడు 1.10లక్షల మంది టీచర్లకు ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చింది. దీనికితోడు బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ తరగతులు, చదువులో వెనుకబడిన స్టూడెంట్ల కోసం పలు బడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్ సహకారంతో పాఠాలు బోధించడం లాంటివి ఉపయోగపడుతున్నాయి అన్నారు,మరోపక్క బడులు తెరిచిన రోజే ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు యూని ఫామ్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గువ్వడి లక్ష్మయ్య,రాజేశ్వరి, క్రాంతి, గణేష్,ఎస్ఎంసి చైర్ పర్సన్ పసుపులేటి శోభ,విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరికుమార్.

బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికల నిర్వచించాలి
బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూరికుమార్
బీసీలను దళితులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

దళితులనుమోసం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మొగుళ్లపల్లిమండల బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవనూరి కుమార్ విమర్శించారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో 80 శాతం బిసిలు ఉన్నారు వారికి నష్టం చేస్తే బిసిలు చూస్తు ఊరుకోరని ఏన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పుతారని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం చేయడం లేదు 6 గ్యారంటీలు 420 హమీలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క పధకం అమలు చేయడం లేదు తులం బంగారం లేదు ఆసరా పెన్షన్లు 4 వేలు లేదు వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలి ప్రతీ మహిళకు 2500 లేదు రైతు భీమా లేదు 500 లకు గ్యాస్ లేదు రాజీవ్ వికాస అనేక వేల మంది నిరుద్యోగులను మోసం చేసారు దళితబందు 12 లక్షలు లేవు జూన్ 2 న నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు అందిస్తామని చెప్పారు దాని విషయం మర్చిపోయారు నిరుద్యోగులు బ్యాంక్ ల ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఏది ఏమైనా బిసి రిజర్వేషన్ 42 శాతం అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేని ఎడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

నిజాంపేట నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయంగా ఎకరాకు 6000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయం అని నస్కల్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మద్దికుంట శ్రీను అన్నారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నిరుపేదల పెన్నిధి సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు .రాష్ట్రంలో పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అనంతరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు ఇందిరమ్మ లబ్ధిదారులు దొంతరమైన ఎల్లవ్వ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి , మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ఇల్లు కట్టుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేశెట్టి సిద్ధ రాములు, బక్కన్న గారి లింగం గౌడ్, నాతి లక్ష్మా గౌడ్, అజయ్, దేవరాజు యాదవ్, మెట్టు వెంకట్ , దేశెట్టి రాజు, రమేష్, సురేష్ ,కిషన్, సత్యం తదితరులు పాల్గొన్నారు

అగ్నిపర్వతం బద్దలవడంతో వెనక్కి తిరిగొచ్చిన విమానం

అగ్నిపర్వతం బద్దలవడంతో వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

 

 

ఢిల్లీ నుంచి బాలికి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI2145‌ను భద్రతా కారణాల రీత్యా వెనక్కి తిరిగి రావాలని సూచించామని, విమానం సురక్షితంగా ఢిల్లీకి చేరిందని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

 

 

 

న్యూఢిల్లీ: తూర్పు ఇండోనేసియా (Eastern Indonesia)లోని లెవోటోబి లకి లకి (Lewotobi Laki Laki) అగ్నిపర్వతం బద్దలవడంతో ఎయిర్ ఇండియా విమానంతో సహా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో అక్కడికి సమీపంలోని బాలికి వెళ్లే ఎయిరిండియా (Air India) విమానం బుధవారంనాడు వెనక్కి మళ్లింది.

 

 

ఢిల్లీ నుంచి బాలికి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI2145‌ను భద్రతా కారణాల రీత్యా వెనక్కి తిరిగి రావాలని సూచించామని, విమానం సురక్షితంగా ఢిల్లీకి చేరిందని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

 

 

ఇండోనేసియాలోని తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లో లెవోటోబి లకి లకి పర్వతం మంగళవారం సాయంత్రం విస్ఫోటనం చెందటంతో 10,000 మీటర్ల ఎత్తులో బూడిద ఎగిసిపడింది. 150 కిలోమీటర్ల వరకూ ఈ బూడిద కనిపిస్తోంది. బుధవారం ఉదయం మరోసారి విస్ఫోటనం చెందడంతో దట్టమైన బూడిద ఎగసిపడుతోందని అధికారులు తెలిపారు. 8 కిలోమీటర్ల మేర డేంజర్ జోన్ ప్రకటించారు. దీంతో బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసారు.‌

 

కాగా, ఎయిరిండియా ప్రతిరోజూ దేశీయంగా, అంతర్జాతీయంగా 1,000కు పైగా విమాన సర్వీసులను నడుపుతోంది. జూన్ 12 నుంచి 17 వరకూ 83 ఎయిరిండియా విమానాలు రద్దయ్యాయని, వాటిలో 66 బోయింగ్ 787 విమానాలు ఉన్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన.

సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన

నిజాంపేట నేటి ధాత్రి:

 

సైబర్ క్రైమ్ నేరాలపై పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట ఎస్సై రాజేష్ సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసగిస్తున్నారు ఎవరైనా ఫోన్ చేస్తే ఓటిపిలు చెప్పొద్దన్నారు . అలాగే సైబర్ నేరాల బారిన పడితే 1930 కి కాల్ చేయాలని ఆయన సూచించారు

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య.

జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య అందించాలి

బహుజన స్టూడెంట్స్ యూనియన్(బి ఎస్ యు)

ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్

శాయంపేట నేటిధాత్రి:

shine junior college

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పత్రికా& ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థ లలో ఉచిత విద్యఅందించాలి నేడు ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో బహుజన స్టూడెంట్స్ యూనియన్ (బి ఎస్ యు) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వా లు మారిన పత్రికా విలేకరు లకు ఇచ్చిన హామీలు ఏ ప్రభు త్వం నెరవేర్చ లేకపోతుంది సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పత్రికా విలేకరుల పిల్లల కు ఉచిత విద్య అందించలే కపోవడం చాలా బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పత్రిక అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థ లలో ఉచిత విద్య ఆoదించాలి అని ప్రత్యేకమైన జీవో ఏర్పా టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు

సేవాకార్యక్రమాలకే వినియోగం…

సేవాకార్యక్రమాలకే వినియోగం…

 

 

 

 

 

shine junior college

 

 

 

 

 

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు సందర్భంగా తనకు లభించిన నగదు పారితోషికంలోని అధిక భాగాన్ని వివిధ సేవా సంస్థలకు విరాళంగా అందించారు.

 

 

 

 

 

 

గద్దర్ అవార్డులు (Gaddar Awards) పొందిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు బహుమతులనూ ఇచ్చింది. ఓ పక్క ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దాదాపు 17 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి తెలంగాణ గద్దర్ అవార్డులను నిర్వహించాల్సిన అవసరం ఏమిటని కొందరు ప్రశ్నించారు కూడా! అలానే అవార్డులు అందుకున్న వారి అర్హతల మీద కొన్ని విమర్శలు వచ్చాయి.

 

 

 

 

 

 

ప్రముఖ నటుడు స్వర్గీయ కాంతారావు స్మారక అవార్డును విజయ్ దేవరకొండకు ఇవ్వడం పట్ల కొందరు విమర్శనాస్త్రాలు సంధించారు. నటీనటులకు ఆ అవార్డు ఇవ్వాలని అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం సీనియర్స్ కు ఆ అవార్డును ఇస్తే బాగుండేదని, ఇప్పటికిప్పుడు విజయ్ దేవరకొండకు ఆ స్థాయి అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఏముందని అన్నారు. అదే సమయంలో ఈ వేడుకకు కాంతారావు కుటుంబ సభ్యులను సరైన రీతిలో ఆహ్వానించలేదనే విమర్శలూ వచ్చాయి. కాంతారావు పేరుతో అవార్డు ఇస్తూ వారి కుటుంబ సభ్యులను గౌరవించకపోవడం సరైన పద్దతి కాదని కొందరు అన్నారు. అయితే అధికారులు కాంతారావు కుమారుడు రాజాను ఈ వేడుకకు పిలిచామని ఆయన కార్యక్రమానికి హాజరు కావడం కోసం వెయ్యి రూపాయలు టాక్సీ ఖర్చుగా ఇచ్చామని వివరణ ఇచ్చారట. ఆ చర్యను సైతం కొందరు తప్పుపట్టారు. టి.ఎల్. కాంతారావు కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కారు పంపి, వారిని గౌరవంగా వేదికకు తీసుకు రావాల్సింది పోయి రానూ పోనూ ఖర్చులకు డబ్బులు ఇచ్చామని చెప్పడం ఏమిటని కొందరు వాపోయారు.

 

 

 

 

 

 

 

ఇదిలా ఉంటే టి.ఎల్. కాంతారావు పేరుతో విజయ్ దేవరకొండకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల రూపాయలను అందించింది. ఆయన దానిని ఎలా, ఎందుకోసం ఖర్చు పెడతారనేది పక్కన పెడితే… ఇదే వేడుకలో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్న ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మాత్రం తన పెద్ద మనసును చాటుకున్నారు. రచయితగా ఆయన తనకు వస్తున్న రాయల్టీలో చాలా భాగాన్ని కొన్నేళ్ళుగా వివిధ సామాజిక, సేవా సంస్థలకు విరాళాల రూపంలో అందిస్తున్నారు. అలానే ఇప్పుడు కూడా రఘుపతి వెంకయ్య అవార్డును అందుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘ఇందులో అధిక మొత్తాన్ని వివిధ సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తాన’ని యండమూరి చెప్పారట.

 

 

 

 

 

 

ఆ మాటను నిలబెట్టుకుంటూ ఆయన కడపలోని ఆర్తి ఫౌండేషన్ కు మూడు లక్షల రూపాయలు, శ్రీకాకుళం పక్కనే ఉన్న అభయం ఫౌండేషన్ కు లక్ష రూపాయల చెక్కునూ పంపారు. నటుడు కాంతారావు కుమారుడు రాజా ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ఇంటి అద్దె కట్టడానికి కూడా కష్టంగా ఉందనే విషయం యండమూరి దృష్టికి రావడంతో అతన్ని ఇంటికి పిలిచి లక్ష రూపాయలను యండమూరి అందించడం విశేషం.

 

 

 

 

 

ఇక్కడో చిన్న ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… యండమూరి వీరేంద్రనాధ్‌ రాసిన ‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవల అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. అందులోని కథానాయకుడి పేరు… ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఒక్కటే… రేవంత్‌!!

మండల అధ్యక్షులుగా గుమ్మడి సత్యనారాయణ ఎన్నిక.

మండల అధ్యక్షులుగా గుమ్మడి సత్యనారాయణ ఎన్నిక.

చిట్యాల నేటి ధాత్రి:

shine junior college

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ అండ్ సీడ్స్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది
అధ్యక్షులు గా గుమ్మడి సత్యనారాయణ
ఉపాధ్యక్షులు:గా సర్వ రాజు
ప్రధాన కార్యదర్శి గా పువ్వటి హరికృష్ణ
సహాయ కార్యదర్శి గా కైరిక కిషన్ రావు కోశాధికారి గా జిన్నె వేణు
కార్యవర్గ సభ్యులుగా మేకల శ్రీనివాస్ గంజి రవీందర్ జోగు భాను చందర్ మారెళ్ల దేవేందర్ రెడ్డి,గుండెబోయిన మహేందర్ లను డీలర్ అందరమూ సమావేశమై ఏకగ్రీవంగా నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.

యంగ్ హీరోస్ పరిస్థితేంటీ…

యంగ్ హీరోస్ పరిస్థితేంటీ…

 

 

 

 

 

 

 

 

 

shine junior college

 

 

 

 

 

 

 

 

 

 

మొన్నటి దాకా సందడి చేసిన టాలీవుడ్ యంగ్ హీరోస్ సడెన్ గా సైలెంట్ అయిపోయారు. హంగామా వద్దు – కష్టించడమే ముద్దు అనుకుంటున్నారు. మరి వీరిలో కష్టానికి ప్రతిఫలం దక్కించుకునే హీరోలెవరో చూద్దాం.

 

 

 

 

 

 

వెలుగు – చీకటి, కష్టం – సుఖం, మంచి – చెడు – ఎంత వ్యతిరేకమైనా పక్కపక్కనే ఉంటాయి. అదే తీరున నిశ్శబ్దం వెనకాలే శబ్దం కూడా చోటు చేసుకొని ఉంటుంది. ప్రస్తుతం ఓ గ్రాండ్ సక్సెస్ కోసం తపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోస్ (Tollywood Young Heros) అందరూ సైలెంట్ గానే కనిపిస్తున్నారు. తమ చిత్రాలతోనే సౌండ్ చేయాలని వీరు నిర్ణయించినట్టు అనిపిస్తోంది. అలాంటి వారిలో విశ్వక్ సేన్ (Vishwaksen), సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), వరుణ్ తేజ్ (Varun Tej), సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) ఉన్నారు.

 

 

 

 

 

 

 

వీరందరూ ‘హంగామా వద్దు – కష్టపడడమే ముద్దు’ అనే సూత్రాన్ని నమ్మి సాగుతున్నట్లు అనిపిస్తోంది. ఆ మధ్య వరుస సినిమాలతో హంగామా చేసిన విశ్వక్ సేన్ తన తాజా చిత్రం ‘ఫంకీ’ని పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. ఓ సారి సినిమా పూర్తయ్యాకే ‘ఫంకీ’ ప్రమోషన్స్ లో కనిపించాలని విశ్వక్ సేన్, ఆ సినిమా డైరెక్టర్ అనుదీప్ భావిస్తున్నారట. మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ సైతం కామ్ గానే సాగుతున్నారు. ఆయన నటిస్తోన్న మూవీ ‘ఇండో కొరియన్ హారర్ కామెడీ’తో తెరకెక్కుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకు మేర్లపాక గాంధీ డైరెక్టర్. రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాకే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని వరుణ్, గాంధీ భావిస్తున్నారు. ‘జటాధర’ సినిమాలో నటిస్తోన్న సుధీర్ బాబు సైతం ప్రస్తుతం సైలెన్స్ నే ఆశ్రయించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రచార పర్వం ప్రారంభమయ్యాకే సుధీర్ నోరు విప్పే ఛాన్స్ కనిపిస్తోంది.

 

 

 

 

 

 

ఇక మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే ‘క’తో కనికట్టు చేసిన ఈయన ‘దిల్ రూబా’ పరాజయంతో కామ్ అయిపోయారు. ఇటీవల ‘కే ర్యాంప్’ సినిమా పూర్తి చేసిన కిరణ్ ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల పైనే అబ్బవరం ఫుల్ హోప్ పెట్టుకున్నాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. ఎలాంటి అప్డేట్స్ లేకుండా చిత్రీకరణ సాగుతోంది. ఇక అల్లరికి కేరాఫ్ అడ్రస్ గా నిలచిన సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’ పరాజయంతో కుదేలయ్యారు. ప్రస్తుతం ‘తెలుసు కదా’లో నటిస్తున్న సిద్ధూ ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. మొన్నటి వరకూ భలేగా సందడి చేసిన ఈ యంగ్ హీరోస్ అందరూ ఒకేసారి హంగామా వద్దు అనుకోవడం విశేషమే. మరి ఈ యువ కథానాయకుల్లో ఎవరెవరు ఏ సినిమాతో హిట్ కొడతారో చూద్దాం.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో హవీష్‌ .

ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో హవీష్‌

 

shine junior college

 

 

 

 

 

హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

 

 

యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్ (Havish), సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు (Trinadha Rao Nakkina) కాంబోలో క్రేజీ మూవీ ఒకటి రూపుదిద్దుకుంటోంది.

 

 

‘నువ్విలా (Nuvvila), జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హవీష్‌. అలానే ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా (Dhamaka), మజాక (Mazaka)’ వంటి చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్ లో త్రినాథరావు నక్కిన కూ మంచి పేరుంది. వీరిద్దరి కలయికలో నిఖిల్ కోనేరు సినిమాను నిర్మిస్తోంది.

 

 

హవీష్‌ మూవీ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను ఈ నెల 19న రిలీజ్ చేయబోతున్నామని నిర్మాత నిఖిల కోనేరు తెలిపారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా.. నిజార్ షఫీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు.

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్.

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP)
ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణి*

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పరిధిలోని సర్ధాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 17వ బెటాలియన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TGSP) ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా సామగ్రి, వాటర్ ప్యూరిఫైయర్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం బెట్టాలియన్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్.
ఆధ్వర్యంలో బుధవారం సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగినది. పోలీస్ కానిస్టేబుల్ అయినా ఇటువంటి రామ్- అంజలి దంపతుల కుమార్తె లక్ష్మి వర్ణిక పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు పంపిణి చేశారు.అనంతరం బేటాలియన్ పోలీసు సిబ్బంది పిల్లలకు నోట్ పుస్తకాలు, ఎగ్జామ్ ప్యాడ్‌లు, వాటర్ బాటిల్, ఇతర స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు, అదే విధంగా బెట్టాలియన్ పోలీస్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో
వాటర్ ప్యూరిఫైయర్ అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఈ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కూడా తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. మొదటి విడతలో భాగంగా.

సర్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగా ఎంచుకొని, పాఠశాలకు పెయింటింగ్ వేయడం, మెరుగైన విద్యకు తోడ్పడటం, మంచి తాగునీటిని అందించడం వంటి పనులకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. పోలీస్ క్రికెట్ టీమ్ నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి, వారి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మంచి తాగునీరు అందించడానికి కృషి చేస్తుందని కమాండెంట్ అన్నారు. ఈ గ్రామానికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ వంతు సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జే. రాందాస్, పాఠశాల ఎం.ఈ.ఓ దూస రఘుపతి,
ఏఏపీసీ చైర్మన్ లక్ష్మి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బి. స్వాతి, పోలీస్ ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, 17వ బెటాలియన్ పోలీస్ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version