యువత అన్ని రంగాల్లో రానించాలి : మాజీ మంత్రివర్యులు…

యువత అన్ని రంగాల్లో రానించాలి : మాజీ మంత్రివర్యులు
మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి
* మున్సిపాలిటీలో ముగిసిన సీఎంఆర్ క్రికెట్ ట్రోఫీ లు
* బహుమతుల ప్రధానోత్సవం

మేడ్చల్  ప్రతినిధి, నేటిధాత్రి :

 

యువతను ప్రోత్సహించినప్పుడే అన్ని రంగాల్లో రాణించ గలుగుతారని మాజీ మంత్రివర్యులు మేడ్చల్ ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ సిర్వి క్రికెట్ గ్రౌండ్ లో సంక్రాతి పండగా సందర్బంగా సీఎంఆర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ అలియాబాద్, ముడుచింతలపల్లి మున్సిపాలిటీల క్రికెట్ పోటీలను నిర్వహించిన విషయం తెలిసిందే.

 

ఆదివారం ఫైనల్ మ్యాచ్ లను తిలకించి ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో విన్నర్ టీం లింగాపూర్ తండా క్రీడాకారులకు రూ.25వేలు, రన్నర్ టీం ఆనంతరంకు రూ.15వేలు నగదు బహుమతి ట్రోఫీలు, అలియాబాద్ మున్సిపాలిటీ విన్నర్ టీం లాల్ గడి మలక్పేట్ కు రూ. 25వేలు, రన్నర్ టీం అలియాబాద్ కు రూ.15వేలు నగదు బహుమతి ట్రోఫీ మాన్ ఆఫ్ సిరీస్, మాన్ అఫ్ మ్యాచ్ ట్రోపి లను అందజేయడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను మహిళలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో సంక్రాంతి ముగ్గుల పోటీలు, సిఎంఆర్ క్రికెట్ పోటీలు అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ భద్రారెడ్డి, మున్సిపాలిటీల అధ్యక్షులు సరసం మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజీ వార్డు నెంబర్లు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం…

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ అన్నారు. ఆదివారం బాగారెడ్డి క్రీడా మైదానంలో ఖిజర్ యఫై గోల్డ్ కప్.4 నూతనంగా గెలుపొందిన సర్పంచ్ లు చస్మా ఉద్దీన్, చల్లా శ్రీనివాస్ రెడ్డి, రాథోడ్ మోహన్ లతో కలిసి మ్యాన ఆఫ్ ది మ్యాచ్
బహుమతులను ప్రధానం చేశారు. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ కు ముఖ్య అతిధులుగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తట్టు నారాయణ, మండల బీఆర్ఎస్ సర్పంచులు మాట్లాడుతూ ఖిజర్ యఫై గోల్డ్ కప్ తో జహీరాబాద్ లాంటి ద్వితీయ శ్రేణి నగరం పేరు దేశంలో మారుమోగుతుందని, దేశం నలుములల నుంచి క్రీడాకారులను పరిచయం చేసి స్థానిక యువకులను క్రికెట్ పై మక్కువ పెరిగే విదంగా ఖిజర్ యఫై చొరవ చూపడం అభినందనీయం అని, దేశంలో ఎక్కడ లేని విదంగా ఒక వ్యక్తిగత టౌర్ని ఇంత పెద్ద మొత్తం 7 లక్షల విన్నర్, 4 లక్షల రన్నర్ ప్రైజ్ మనీతో టౌర్ని నిర్వహిస్తూ ఇక్కడి నుంచి ఆటగాళ్లను రంజి, జోనల్ స్థాయి ఆటల్లో ప్రమోట్ చెయ్యాలని అన్నారు. అస్రర్ సీసీ ఔరంగబాద్ మరియు నాయిమ్ ఎలెవన్ నిజామాబాద్ సీసీ మధ్య జరిగిన పోరులో టాస్ గెలిచి ఆస్రర్ సీసీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టనికి 178 పరుగులు చేయడంతో 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి నిజామాబాద్ సీసీ జట్టు 19.2 ఓవర్లలో 153 పరుగులు చేసి అలౌట్ అవ్వడంతో అస్రర్ సీసీ 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమి ఫైనల్ కు అర్హత సాధించింది. 21 పరుగులు చేసి, 3 వికెట్లు సాధించడంతో హమీద్ రజా కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఇచ్చారు. రెండవ మ్యాచ్ లో జోహార్ఫా శేకపూర్ సీసీ మరియు డిసి ఎలెవన్ ఫరిద్ జట్ల మధ్య జరిగిన పొరులో శేకపూర్ సీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టనికి 224 పరుగులు చేయడంతో 225 పరుగుల లక్ష్యంతో డిసి బరిలోకి దిగి 20 ఓవర్లలో 201 పరుగులే చేయడంతో 23 పరుగులతో శేకపూర్ సీసీ విజయం సాధించి క్వార్టార్ ఫైనల్లో ప్రవేశించింది. ముఖ్య అతిధులు తట్టు నారాయణ, మొహమ్మద్ చెష్మోద్దీన్ ,చల్లా శ్రీనివాస్ రెడ్డి ,రాథోడ్ మోహన్ చేతుల మీదుగా వెయ్యి రూపాయల నగదు, ట్రాఫీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రధానం మరియు అదనంగా తట్టు నారాయణ మరియు వారి సోదరుడు తట్టు విశ్వనాథ్ లు శేఖాపూర్ జట్టుకు పది వేయిల రూపాయలు నగదు రివార్డును సైతం అందజేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సురేష్ ,తులసి దాస్ గుప్తా ,ప్రభాకర్,శ్రీకాంత్ , ఫైయాజ్ ,సాయిరెడ్డి, బూడిదిపాడు రాజు, సన్నీ, శ్రీకాంత్, ప్రభు ఆహ్వాన కమిటీ చైర్మన్ రాములు నేత, మీడియా ఇంచార్జ్ మహేబూబ్ అలీ, అదం యఫై, అబుద్ యఫై, తహ యఫై, నిర్వాహకులు మాక్సుద్ అలీ, మొహమ్మద్ అలీ, రాంచరణ్, వ్యాఖ్యాతలు అబ్దుల్లా సిద్దిఖీ, తయ్యబ్ అలీ, జయచంద్ రాథోడ్, విజయ్ రాథోడ్, మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ అమెర్, మొయిజ్ లష్కరి, అబ్దుల్ మజీద్, అమీర్ రేగుండా, శ్రీనివాస్ ముదిరాజ్, హిరు రాథోడ్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మొహమ్మద్ అబ్దుల్ వహీద్, రాకేష్ పబ్బతి తదితరులు పాల్గొన్నారు ప్రధానం చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రభాకర్్, సాయిరెడ్డి, బూడిదిపాడు రాజు, సన్నీ, శ్రీకాంత్, ప్రభు
ఆహ్వాన కమిటీ చైర్మన్ రాములు నేత, మీడియా ఇంచార్జ్ మహేబూబ్ అలీ, అదం యఫై, అబుద్ యఫై, తహ యఫై, నిర్వాహకులు మాక్సుద్ అలీ, మొహమ్మద్ అలీ, రాంచరణ్, వ్యాఖ్యాతలు అబ్దుల్లా సిద్దిఖీ, తయ్యబ్ అలీ, జయచంద్ రాథోడ్, విజయ్ రాథోడ్, మొహమ్మద్ జుబేర్, మొహమ్మద్ అమెర్, మొయిజ్ లష్కరి, అబ్దుల్ మజీద్, అమీర్ రేగుండా, శ్రీనివాస్ ముదిరాజ్, హిరు రాథోడ్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మొహమ్మద్ అబ్దుల్ వహీద్, రాకేష్ పబ్బతి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version