పత్తి పువ్వమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్.

పత్తి పువ్వమ్మ పాట ఆవిష్కరించిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

చిట్యాల, నేటిధాత్రి :

 

 

ఉగాది పండుగ పర్వదినాన పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా జరిగిన శ్రీ వివేకానంద సేవా సమితి ఫౌండర్ కే సంజీవరావు అధ్యక్షతన పుష్ప గ్రాండ్ పంక్షన్ హాల్ లో అవార్డ్ కవుల, కళాకారులుకు అవార్డు ప్రదానోత్సవం జరిగినది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధి గా భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొని పత్తి పువ్వు పాట ఆవిష్కరణ చేయడం జరిగింది సమాజంలో మేలుకొలిపే పాటలు రాయాలని పేర్కొన్నారు పాట రచయిత దాసారపు నరేష్ బాగా రాసారని అభినందించారు ఈ కార్యక్రమంలో సినీ నటులు ఆర్ఎస్ నంద గాయకులు మధు రోజా సంధ్య మ్యూజిక్ డైరెక్టర్ కిట్టు ఎన్ఎస్ఆర్ ఫౌండర్ సంపత్ రావు , కవులు గాయకులు పాల్గొన్నారు.

కౌసర్ మజీద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.

కౌసర్ మజీద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి :

ముస్లింల పవిత్ర పండుగ అయినా రంజాన్ పండుగను పురస్కరించుకొని చిట్యాల మండల కేంద్రంలోని కౌసర్ మజీద్ ఆవరణలోని ఈద్గాలో మండలంలోని ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో నమాజ్ చేసుకుని ఒకరికొకరు అలై బాలాఈ చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ సమావేశంలో మండల కో ఆప్షన్ మాజీ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ ముస్లింలకు పవిత్ర మాసం రంజాన్ నెల ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం 30 రోజులు కఠోర ఉపవాస దీక్ష లో ఉండి సోమవారం.రోజున ఉపవాస దీక్షను విరమించి రంజాన్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అలాగే సమాజంలో గంగ జమున తహసీబ్ కే జైస హిందూ ముస్లింలు అనే భేదం లేకుండా అందరు కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈ సమావేశంలో మసీదు కమిటీ అధ్యక్షలు అజ్మత్ మియా కార్యదర్శిహైదర్ పాషా వైస్ ప్రెసిడెంట్ షఫీ జాయింట్ సెక్రెటరీ అక్బర్ ట్రెజరర్ షేక్ హుస్సేన్ వివిధ గ్రామాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

అంత్య క్రియలకు ఆర్థిక సాయం అందజేత.

అంత్య క్రియలకు ఆర్థిక సాయం అందజేత

నిజాంపేట , నేటిధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలో కమ్మరి నరసింహ చారి (20) మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మెదక్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంట తిరుపతిరెడ్డి అంత్య క్రియల నిమిత్తం 5000 రూపాయలు తన అనుచరులతో అందించారు ఇందులో నర్సింలు, మావురం రాజు, తాడం మల్లేశం, నాయిని లక్ష్మణ్, తిరుమల గౌడ్ తదితరులు ఉన్నారు

కరెంటు షాక్ తో షాపు దగ్ధం.

కరెంటు షాక్ తో షాపు దగ్ధం

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఆదివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ తో పట్టణానికి చెందిన మారం రాకేష్ కంప్యూటర్,ఆయిల్ షాపులు కరెంటు షాక్ తో దగ్ధమయ్యాయి.

Electric shock

ఈ ప్రమాదంలోభారీగా ఆస్తి నష్టం జరిగింది. సుమారుగా రూ.50 లక్షల అస్థి నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కాలిపోయిన షాపుని పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఎమ్మెల్యేను కోరాడు. ఈ విషయం తెలుసుకున్న కల్వకుర్తి వర్తక, వ్యాపారస్తులు పలువురు ఆర్థిక సహాయాన్ని అందించారు.

అల్లా దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి.

– అల్లా దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి….

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోన ముస్లిం ప్రార్థన మందిరంలో రంజాన్ వేడుకలు

*పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన గొప్ప మాసంలో కఠోర ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని ముస్లిం పెద్దలు అన్నారు *

Ramadan

*ఈద్-ఉల్-ఫీతర్ (పవిత్ర రంజాన్) పర్వదినం పురస్కరించుకొని ఈరోజు జెడ్పీఎస్ఎస్ పాఠశాల నందు మైదానంలో ముస్లిం సోదర అందరూ ప్రార్థనలు చేశారు ముస్లిం ప్రార్థన గురువు మసీద్ సదర్ ఎండి యూసుఫ్ పాషా ముఖ్య అతిథులుగా చిట్యాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ
*వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద గొప్ప పండుగలో ఒకటి రంజాన్ అని కొనియాడుతూ చెడు భావాలని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ పండుగని అన్నారు. ఈ పవిత్ర మాసం దీక్షలు, ప్రేమ, దయ, సౌబ్రతృత్వ గుణాలు పంచుతుందని పేర్కొన్నారు. మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ముస్లింలకు పెద్దపేట వేస్తుందని అన్నారు. అల్లా దయతో ఈ పండుగ మానవాళికిచ్చే గొప్ప సందేశమని అన్నారు.

మహిళపై అత్యాచారం ఎమ్మెల్యే ఆగ్రహం.

మహిళపై అత్యాచారం.. ఎమ్మెల్యే ఆగ్రహం

జడ్చర్ల / నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరానని వెల్లడించారు. ఊర్కొండలోని ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఆరుగురు యువకులు ఒక వివాహిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తో ఫోన్లో మాట్లాడిన అనిరుద్ రెడ్డి పవిత్ర ప్రదేశంలో ఈ దురాగతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారని తన దృష్టికి వచ్చిందని అయితే ఈ సంఘటనకు పాల్పడింది ఎవరైనాప్పటికీ తాను రాజకీయాలు చేయదలుచుకోలేదని బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ఈ సంఘటనలో బాధిత యువతికి అండగా ఉంటానని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలోని ఊర్కొండ పోలీసులతో కూడా మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరారు. గ్రామంలోనీ యువతులు కూడా జరిగిన సంఘటన పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కూడా అనిరుధ్ రెడ్డి ఆదేశించారు.

పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ.

పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ

 

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

ఏప్రిల్ 27 న మహబూబ్ నగర్ పట్టణం లోని ఎంబిసి మైదానంలో నిర్వహించనున్న పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. మహబూబ్ నగర్ పట్టణం లోని అంబేద్కర్ కళాభవన్ లో పూలే – అంబేద్కర్ జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూలె- అంబేద్కర్ జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూలే – అంబేద్కర్ జాతర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి నర్సింహులు, వేంకట స్వామి, సామెల్, సిరసనోళ్ళ బాలరాజు, గువ్వ లక్ష్మణ్, యాదగిరి నాయక్, జంగయ్య, మాసయ్య, ఆది విష్ణు, విద్యావతి, బాబమ్మ, నర్సింహులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ఈద్గ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర.

ఈద్గ ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

ముస్లిం సోదరులకు,వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.
ముస్లింల పవిత్రదినం రంజాన్ పండుగ సందర్బంగా భూపాలపల్లి బాంబులగడ్డలోని ఈద్గలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొన్ని ముస్లిం సోదరీ సోదరులకు వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపి,మీ కష్ట నష్టాలల్లో, ముస్లిం మైనారిటీ ప్రజల అభ్యున్నతిలో బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు పాల్గొన్నారు

ఘనంగా మండలంలో ఈద్-ఉల్-ఫితర్.

ఘనంగా మండలంలో ఈద్-ఉల్-ఫితర్.

“వక్ఫ్ బిల్లుకు “వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన.

రాష్ట్ర ఉన్నతి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థన.

ఈద్గాల వద్ద ప్రజా ప్రతినిధుల హాజరు, ముస్లింలకు “ఈద్” శుభాకాంక్షలు.

పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమంలోనూ “ఈద్” శుభాకాంక్షలు.

సి ఐ ఎస్ ఐ, ల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

 

ఈనెల రెండవ తేదీ నుండి ప్రారంభమైన రంజాన్ సోమవారం నాటికి ఈదుల్ తో ముగిసింది. మహాదేవపూర్ మండల కేంద్రం తో పాటు ఉమ్మడి మండలంలోని కాళేశ్వరం, పంకేనా, లెంకలగడ్డ, అన్నారం, గ్రామాల్లోని ఈద్గాల వద్ద, ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ కొరకు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరై ప్రార్థించడం జరిగింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వఫ్ఫ్ బోర్డు బిల్లును క్యాబినెట్ ఆమోదం కొరకు ప్రతిపాదించడంతో, ఈద్గా వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలను ధరించి బిల్లులు వ్యతిరేకించడం జరిగింది. మండల కేంద్రంతో పాటు ఉమ్మడి మండలంలోని గ్రామాల్లో ఈద్గాలు అలాగే గ్రామ ప్రజలు ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలపడంలో నిమగ్నం కావడం జరిగింది. మతసామర్స్యాలకు ప్రతీకంగా రంజాన్ మాసం, పవిత్రత తో కూడిన పండుగ కావడంతో, కుల మతాలకు తేడా లేకుండా పిల్ల పెద్ద, ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులకు అలై బలై చేస్తూ ఈద్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

రాష్ట్ర ఉన్నతి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థన.

Wakf Bill

 

ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలోని” ఖుద్బ” అనంతరం ప్రత్యేక దువా కార్యక్రమం చేయడం జరుగుతుంది, 30 రోజులపాటు రోజాలు ఉన్న ముస్లింలు చేతులెత్తి ఈదుల్ ఫితర్ నమాజ్ అనంతరం” దువా” నిర్వహించడం జరుగుతుంది, ఈ దువాలు మదిని ఈదుగా జామి మస్జీద్ ఈద్గా కు సంబంధించిన మత గురువులు ప్రత్యేకంగా, రాష్ట్ర ఉన్నతి శ్రేయస్సు కొరకు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తుపాతు రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రత్యేక దువ నిర్వహించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మతాల ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యం, సంపద, లో అల్లాహ్, దీవించి సంరక్షించాలని కోరడం జరిగింది. మరోవైపు ఈద్ శుభాకాంక్షలు సంబంధించి సామాజిక మాధ్యమం ఉమ్మడి మండలంలోని “వాట్సప్ గ్రూప్”
“నమస్తే మహాదేవపూర్” మిన్ను భాయ్ రిపోర్టర్” లోకల్ గ్రూప్ తో పాటు “మిన్ను భాయ్ విత్ ముస్లిం” సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరూ మతానికి సంబంధం లేకుండా ఈదుల్ ఫితర్ తో పాటు ఈద్ ముబారక్ సందేశాలను పంపి, శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.

Wakf Bill

ఈద్గాల వద్ద ప్రజా ప్రతినిధుల హాజరు, ముస్లింలకు “ఈద్” శుభాకాంక్షలు.

పవిత్ర మాసం రంజాన్ చివరి రోజు, ఈదుల్ ఫితర్ కొరకు ప్రత్యేక ప్రార్థన కొరకు ఈద్ఘా ల వద్దకు చేరిన ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుటకు, ఉమ్మడి మండలంలోని కాంగ్రెస్ పార్టీ, బి ఆర్ ఎస్, బిజెపి, పార్టీలతో ప్రతినిధులతో పాటు, పలు కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ఈద్గాల వద్దకు చేరి నమాజ్ అనంతరం, అలా ఇవ్వలాయ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ బాన్సువాడ రాణి బాయ్,రామారావు, మాజీ జెడ్పిటిసి గుడాల అరుణ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు సుధాకర్, పి ఎ సి ఎస్ చైర్మన్ తిరుపతి, మహాదేవపూర్ మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్, శ్రీపతి బాబు, సల్మాన్ ఖాన్. సింగిల్ విండో డైరెక్టర్ ఇబ్రహీం, వామన్ రావు, కలికోట వరప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, కుదురుపల్లి మాజీ సర్పంచ్ కోట సమ్మయ్య, నాగరాజు,అశోక్,ముస్లిం సోదరులతో పాటు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన, సల్మాన్ ఖాన్, ఇస్తియాక్, ఖదీర్, అలీమ్ ఖాన్, తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన, అస్రార్ ఖురైషి, ఎండి అజాజ్ ఖాన్, ఎండి సలావుద్దీన్, గయాజ్ ఖాన్, ఇర్షాద్ ఖాన్, సలాం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మతిన్ ఖాన్, ముజీబ్ ఖాన్, అసిన్ ఖాన్ ఖాన్ మేస్త్రి, ఎండి ఉవెజ్, సోయఫ్ ఖాన్, షాకిరుల్ల ఖాన్, సయ్యద్ ముఖిద్, సయ్యద్ మెహరాజ్, ఎండి నయూమ్, ఎండి సోహెల్, ఎండి చాంద్, ఎండి నదీమ్, షేక్ బబ్లు, ఎండి ఇమ్రాన్, ఎండి నూమాన్, షేక్ రొమాన్,షారుఖ్ ఖాన్,ఎండి మోఖిద్,అక్రమ్ ఖాన్,షాహిద్,వాలిఉల్లహ ఖాన్,మశుక్ అలీ, లకు కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈద్గాల వద్ద శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

Wakf Bill

సి ఐ ఎస్ ఐ, ల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు.

ఈదుల్ ఫితర్ నిర్వహణకు ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈద్గాల వద్ద చేరడం జరుగుతుందని, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వకుండా, మహదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, రామ్మోహన్ రావ్, సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్, కాలేశ్వరం సబ్ ఇన్స్పెక్టర్ తమాషా రెడ్డి, పలివెల సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ ల ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద, సిఆర్పిఎఫ్ బాటాయంతో పాటు సివిల్ పోలీస్ లతో ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది, సుమారు రెండు గంటల పాటు పోలీస్ సిబ్బంది, ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ విధులు నిర్వహించి, చివరికి పోలీసులు కూడా ముస్లింలకు ఈద్గాల వద్ద శుభాకాంక్షలు తెలపడం జరిగింది. స్థానిక మైనారిటీలతోపాటు మస్జిద్ కమిటీల బాధ్యులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.

సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీ చౌకధరల దుకాణం 25 వెలగం సంతోష్ కుమార్ షాప్ వద్ద శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, ట్రేడ్ కార్పోరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డితో కలిసి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపునిండా భోజనం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికి ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నేరవేరుస్తూనే గత ప్రభుత్వాలు చేయలేని ఒక చరిత్రాత్మకమైన పనిని కేవలం సంవత్సరంన్నర కాలంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపెట్టారని ఆయన స్పష్టం చేశారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీలో మాఫియాలు ఉండేవని ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. గత పది సంవత్సరాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఏ సందర్భంగా సన్న బియ్యం పంపిణీ పథకం రాష్ట్ర ప్రజలకు కలిగించే ప్రయోజనాలను మంత్రి వివరించారు. పేద ప్రజలకు పోషకాలతో కూడిన నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ చారిత్రక పథకాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ పథకం చారిత్రకమని, ఇది రాష్ట్రంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేస్తుందని తద్వారా పేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ
ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తూనే ప్రభుత్వ ఉద్యోగ నియమాలు చేపట్టామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పధకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ పథకం అమలుతో నిరుపేదలకు సన్నబియ్యంతో కూడిన ఆహారం అందుతుందని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ అనేది నిరంతరాయంగా కొనసాగుతుందని అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందించి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ట్రేడ్ కార్పోరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ
సన్న బియ్యం పంపిణీ పధకం ద్వారా పేద కుటుంబాలకు భారం తగ్గుతుందని తెలిపారు. రేషన్ కార్డులు పంపిణీ చేపట్టి ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఎస్ఓ రాములు, ఆర్డిఓ రవి, సివిల్ సప్లై జిల్లా అధికారి రాములు తహసిల్దార్ శ్రీనివాసులు పట్టణ అధ్యక్షుడు దేవాన్ పదహారే వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ రేషన్ డీలర్ సంతోష్ కుమార్ పిసిసి మెంబర్ చల్లూరు మాది బుర్ర కొమురయ్య విజయ్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు

ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన మాజీ ఎమ్మెల్సీ.!

ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనా చారి

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ ఈద్గలో ముస్లిం మైనారిటీ తో ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్న మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి అనంతరం మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు అలాగే బిఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ విద్యార్ధిని విద్యార్థుల కోసం వారి చదువుల అభ్యున్నతికోసం ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు నిర్మాణం చేశారు. ప్రతి రంజాన్ పండుగకు అందరికీ దుస్తువులు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు ఇచ్చేవారు అంతే కాకుండా వారి కోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించి వారి సంక్షేమానికి పెద్దపీట వేశారు అదంతా మీరు కళ్లారాచూశారు కనివిని ఎరుగని రీతిలో అన్నింటా పురోగతి సాధించాలనే సదుద్దేశంతో కేసీఆర్ ముందుకు నడిచారు మన జిల్లా కేంద్రంలోని నా వంతు పాత్ర పోషించి గతంలో మీ కోసం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పటానో మీరు చూశారు… రానున్న మన బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో పెదవారికోసం అనేక ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేవిధంగా కృషి చేస్తాం అని తెలుపుకుంటూ నెల రోజుల నుండి ఎంతో భక్తిపవిత్రతతో పెద ధనిక అని అని బిన్న అభిప్రాయాలు లేకుండా మంచి మనస్తత్వంతో ఇన్ని రోజులు ఉపవాసాలు ఉండి ఓకె దగ్గర ఈ పండుగ వాతావరణం జరుపుకోవడం చాలా సంతోషంగా ఈ కార్యక్రమానికి పాల్గొని మిమ్మల్ని కలిసిందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరొక్క మారు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. తెలిపారు

శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం.

శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయంలో పంచాంగ శ్రవణం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయం లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం దేవాలయంలో అర్చకులు ఆరుట్ల కృష్ణమా చారి పంచాంగశ్రవణం చేసినారు. ఈ సంవత్సరము సూర్యుడు రాజు అగుట వలన నాయకుల మధ్య పరస్పర విరోధము తీవ్రంగా ఉంటుం దని మంత్రి చంద్రుడు ఆగుటచే పంటలు మామూలుగా పండు తాయని ఆహారధాన్యాల కొరత ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి వినుకొండ శంకరాచారి, ఏంశెట్టి ప్రభాకర్ నల్లెల్లవిజేందర్ ,గాదే రాజేందర్, బాసని చంద్రమౌళి దిండిగాల వంశీ, బెరుగు రాజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నెక్కొండలో ఘనంగా రంజాన్ వేడుకలు.

నెక్కొండలో ఘనంగా రంజాన్ వేడుకలు

@ ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

 

#నెక్కొండ ,నేటి ధాత్రి:

 

ముస్లింలకు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగ రంజాన్ కావడంతో నెక్కొండ లోని ముస్లిం సోదరులు నెక్కొండ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై ముస్లిం సోదరులతో అలైబాలై తీసుకుంటూ ముస్లిం సోదరులతో కలిసి మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులు నెల రోజుల నుండి ఉపవాసం ఉంటూ చిన్న పెద్ద తేడా లేకుండా అత్యంత పవిత్రతో జరుపుకునే పండగ రంజాన్ పండగని ఈ రంజాన్ పండుగ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం లోని ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. అలాగే ఈ సంవత్సరం రాష్ట్రంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతోని పాడిపంటలతోని ఆ అల్లా కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల మహేష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కీ అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ షబ్బీర్, రామాలే కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సంపేట ఏజిపి అడ్వకేట్ బండి శివకుమార్, నెక్కొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రావుల మైపాల్ రెడ్డి, దొడ్డ విజయ్, తాళ్లూరి నరసింహస్వామి, నెక్కొండ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోలిశెట్టి భాను, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సింగం ప్రశాంత్, ముస్లిం సోదరులు రఫీ, మహమ్మద్ అమీర్ , మహమ్మద్ హమీద్, ఎండి అన్వర్ పాషా, యాకుబ్ పాషా, ఇబ్రహీం, ఎండి అఫ్జల్, సలీం, ముస్లిం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్ క్లబ్ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం.

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమం అని జర్నలిస్టులు వార్తలకే పరిమితం కాకుండా సామాజిక సేవ చేయడం అభినందనీయమని అలాగే పాత్రికేయులు కీర్తిశేషులు మాస్ రాజయ్య రామ్ రెడ్డి స్మారకార్థం ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు, ఈ చలివేంద్రానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా కార్యదర్శి మధు వంశీకృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్. కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాట్రేవుల ఐలయ్య, జర్నలిస్టులు రమేష్ రామచంద్ర మూర్తి, రవితేజ, సత్యం , రాజశేఖర్, కట్కూరి శ్రీనివాస్, బుర్ర రమేష్ రాజమౌళి,బొల్లరాజేందర్, సరిగొమ్ముల రాజేందర్ ,రంగన్న సంపత్, తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన మేరు సంఘం.

ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన మేరు సంఘం జిల్లా నాయకులు

చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి

 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అన్ని విధాల కృషి చేస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

ఈ సందర్భంగా స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని హనుమకొండలోని ఆయన స్వగృహంలో మేరు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసినారు.

ఈ సందర్భంగా మేరు సంఘ సభ్యులు ఎమ్మెల్యే తో మాట్లాడుతూ మేర కులానికి అందవలసిన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు జిల్లా, నియోజకవర్గంతో పాటు మండల కేంద్రంలో మేరు సంఘ భవన నిర్మాణంతోపాటు జనగాం జిల్లాలోని మేరు కుటుంబాలకు జూకి మిషన్లు అందించాలన్నారు.

దీంతోపాటు ఇల్లు లేని మేరు కులస్తులకు ఇందిరమ్మ ఇల్లు అందించాలన్నారు.

అంతేకాకుండా ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాల్లో జిల్లాలోని మేరు కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా మేర సంఘం కమిటీ సభ్యులు పేర్కొంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మెమోరండం అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి వారితో మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాల్లో మేరు కులస్తులకు ప్రాధాన్యత కల్పించే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మేరు సంఘం స్టేషన్గన్పూర్ మండల అధ్యక్షుడు దీకొండ మురళి, కార్యదర్శి వెన్ను సంపత్, కోశాధికారి సోమ రాజేందర్, పట్టణ అధ్యక్షులు దీకొండ సత్యనారాయణ, ముఖ్య సలహాదారులు గూడూరు నరేందర్,రాపర్తి సుధాకర్, మేరు సంఘం జిల్లా కమిటీ సభ్యులు అధ్యక్షులు రాపర్తి ప్రశాంత, కొత్తకొండ అజయ్ కుమార్,దీకొండ విష్ణు తో పాట లింగాల గణపురం, రఘునాథ్ పెళ్లి, జఫర్గడ్, చిల్పూర్, మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ.

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ ,ఎమ్మెల్యే గారి తనయుడు,యువ నాయకులు మిథున్ రాజ్,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్ ,నాయకులు నరేష్ రెడ్డి ,అశోక్ రెడ్డి ,విజయ్ రాథోడ్ నిఖిల్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు.

BRS leaders

ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించే ఈద్గా అనంతరం మాజి మున్సిపల్ చైర్మన్ తంజీమ్ ,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్ ,మొహిద్దిన్, మాజి కౌన్సిలర్ అబ్దుల్లా, సీనియర్ నాయకులు కలిమ్, జుబేర్ ,నాయకులు కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి కలిసి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఉండాలని ప్రార్థించడం జరిగింది.

కొత్త సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికల సమరం!

కొత్త సంవత్సరం.. స్థానిక సంస్థల ఎన్నికల సమరం!

పార్టీల మధ్య గట్టిపోటీ!

శాయంపేట నేటిధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్తును తేల్చనుంది మండలంలో గల అన్ని గ్రామాల్లో సర్పంచ్ ,వార్డు నెంబర్, మరియు ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు ఈ తెలుగు నూతన సంవత్సరంలో జరుగు తాయి. కాబట్టి రాజకీయ నాయకులు ప్రజాసేవకై ఆసక్తి ఉన్నవారు దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది ప్రజాప్రతి నిధులకు ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది ఈ విషయంలో గ్రామాల్లో పోటీ చేసేందుకు రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సర్పంచ్ ఈసారి నిలబడడానికి ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు. ఇంకా ఎవరెవరు ఎన్నికల బరిలో నిలబడడానికి ఆసక్తిగా ఉన్నారో తెలియక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మండల కేంద్రంలో ఇప్పటికే పలువురు పేర్లు వినబడు తున్నాయి. వారిలో ఎవరికీ చాన్స్ లభిస్తుందని సీక్రెట్ గా పలువురు ఆశావాహులు సర్వే చేసుకుంటున్నారు. మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ప్రజల్లో తన పట్ల ఏ విధంగా ఉందో సర్వేలు చేసుకుని, తనమీద పూర్తి నమ్మకం అనేది ఏవిధంగా ఉందో తెలుసుకుం టున్నారు. పైగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని నమ్మకంతో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఖర్చు అయితే పర్వాలేదు కానీ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం భారీ మెజార్టీతో గెలువాలని రాజకీయ నాయకులు చూస్తున్నారు ఇంకొందరు అయితే ఏమా ఏమీలుసైతం ఏమాత్రం భయపడకుండా ముందుకు కదులుతున్నారు ఇప్పటికే కొందరు గ్రామాల్లో మంచి పేరు కోసం పలు కార్యక్రమాలలో పాల్గొంటు న్నారు.

పార్టీల మధ్య గట్టి పోటీ!

ఇదివరకు ఎన్నడి లేని విధంగా ప్రతి ఒక్కరు పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ,బిజెపి పార్టీలకు తలనొప్పి తప్పదన్న భావన ఆయా పార్టీల నేతల్లో వ్యక్తం అవుతుంది పార్టీలకు అతీతం గా జరిగే ఎన్నికలు ఎప్పుడైనా పరోక్షంగా మద్దతు ఎవరికి ఉంటుందోనన్న టెన్షన్ మాత్రం ఆయా పార్టీల నేతల్లో నెలకొం ది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాదులు సంఖ్య ఎక్కువగా ఉండటం ఈసారి అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థులకు నిలబెట్టడంలో పార్టీ అనుకున్నది ఆ పార్టీ నుంచి పోటీ చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది ఇప్పటికి పలువురు ఆశావా దులు ఆయా పార్టీల పెద్దలను కలుస్తూ తమ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పార్టీ మద్దతు తన వారికి వచ్చే విధంగా చూడాలని కోరుతు న్నారు అధిష్టానం పెద్దల సైతం ఎవరు వచ్చినా కాదనకుండా అందరికీ అభయమిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులపై చాలా నుంచి పోటీకి సిద్ధమవు తున్నారు రాజకీయంలో ఉంటే ఏదైనా సాధించవచ్చు. నమ్మకంతో కొందరు డబ్బు సంపాదనతో పాటు పరపతి పెరుగుతుందని మరికొందరు బ్రహ్మరథం పడుతున్నారు వ్యవస్థను ఎంతో కొంత మార్చడం కోసమైనా రాజకీయం అవసరమైన ఉద్దేశంతో పలువురు సర్పంచులు బరిలో నిలబడుతున్నారు.

పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన.

17వ పోలీస్ బెటాలియన్ లో పదవి విరమణపొందిన
ఆర్.ఎస్.ఐ. వై .నారాయణ 

సిరిసిల్ల టౌన్  ( నేటి దాత్రి)

సిరిసిల్ల జిల్లాలోని 17వ బెటాలియన్ కు చెందిన ఆర్.ఎస్.ఐ. శ్రీ వై. నారాయణ గారు 31-3-2025 రోజున 17వ బెటాలియనులో పదవి విరమణ పొందారు.1983వ బ్యాచ్ కి చెందిన ఇతను మొదట కానిస్టేబులుగా భర్తి అయ్యి 1993లో
హెడ్ కానిస్టేబుల్ గా, 2018లో ARSI, 2021లో RSI గా పదోన్నతులు పొంది.
41 సంవత్సరాల 4 నెలలు పోలీస్ వృత్తిలో విధులు నిర్వహించారు. ఇతను 2023 లో పోలీస్ పథకం అందుకున్నారు. ఈ సందర్భంగా 17వ బెటాలియన్ కమండెంట్ శ్రీ M.I. సురేష్ గారు మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో సుదీర్ఘకాలంగా అంకితభావంతో పనిచేసి పదవి విరమణ చేస్తున్న ఆర్.ఎస్.ఐ. వై .నారాయణ
గారికి అభినందనలు తెలియజేశారు. కర్తవ్యం నిర్వహణ కోసం తమ సుఖసంతోషాలను త్యాగం చేసి శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితం అవుతారని పేర్కొన్నారు. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంలో కుటుంబసభ్యుల బాధ్యత ఎంతో ఉంటుందని , రిటైర్మెంట్ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందముగా గడపాలని సూచించారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని , వీలైతే సమాజసేవలో పాలు పంచుకోవాలన్నారు .రిటైర్ మెంట్ డబ్బును భవిష్యతు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలన్నారు. పోలిస్ శాఖ తరుపున అందాల్సిన ఇతర ప్రయోజనాలు అన్ని త్వరగా అందేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమండెంట్
శ్రీ సాంబశివరావు గారు ,RI & RSI లు మరియు బెటాలియన్ సిబంది పాల్గొని వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

 

రామాయంపేట మార్చ్ 31 నేటి ధాత్రి (మెదక్)

 

మెదక్ జిల్లా కేంద్రం గాంధీనగర్ లోని ఈద్గా వద్ద మైనారిటీ సోదరులు రంజాన్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ వేడుకల్లో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి. సుభాష్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టి జగపతి,అకిరెడ్డి కృష్ణారెడ్డి,మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ లు పాల్గొని ముస్లిం మతం పెద్దలకు, సోదరులకు రంజాన్ (ఈద్ ముబారక్) శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు సర్దార్ మమ్మ హుస్సేన్, శంషుద్దీన్, మహ్మద్ అలీ, కురనోద్దిన్ యూసుఫ్ లు ప్రార్థనలు చేశారు.
అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి, శేరి. సుభాష్ రెడ్డి లు మాట్లాడుతూ రంజాన్ పవిత్రత త్యాగం, శాంతి, సమానత్వానికి ప్రతీక అని అన్నారు.
మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయన్నారు. అన్ని మతాల ప్రజలలు స్నేహభావంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు.
ముస్లిం సోదర సోదరీమణులంతా పండగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, కొ కన్వీర్ కృష్ణ గౌడ్, జుబేర్ అహ్మద్, నాయకులు మహమ్మద్, ఫజిల్, మధు, మోహన్, నాగేందర్, సంతోష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

అభాగ్యులను ఆదుకునేదేవరు.?

అభాగ్యులను ఆదుకునేదేవరు.?

పగలు చెట్ల కింద.. రాత్రిదుకానాలవద్ద.

మెదక్ జిల్లాలో 200కు పైగా నిరాశ్రయులు.

పట్టించుకోని మున్సిపల్ అధికారులు.

రామాయంపేట డిసెంబర్ 31 నేటిధాత్రి (మెదక్)

వారు ఎవరికి పట్టని అభాగ్యులు..
అనారోగ్యంతో కొందరు, మతిస్థిమతి లేక మరికొందరు ఏ ఆసర లేక నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎవరైనా దయతలిస్తేనే వారి కడుపు నిండేది.. లేదంటే పస్తులు ఉండాల్సిందే. ఏ ఆశ్రయం లేక, ఎక్కడ తలదాచుకోవాలో తెలియక..
పగటిపూట చెట్ల కింద, రోడ్ల పైన.. రాత్రి అయితే దుకాణాల అరుగుల మీద సేదతీరుతున్న వీరిని అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రం మెదక్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అనాధలు నిరుపేదలు సుమారు వందమందికి పైగా ఉంటారని అంచనా. రోడ్ల వెంట బస్టాండు చర్చి పలు దేవా దేవాలయాల పరిసరాల్లో వీరు సంచరిస్తుంటారు. ఇండ్లు ఓటర్ల వెంట తిరిగి ఎవరైనా దయతలిచి అన్నం పెడితే కడుపు నింపుకుంటారు. లేదంటే పస్తులు తప్పవు. రాత్రి వేళల్లో పలువురు దాతలు అన్నం ప్యాకెట్లు అందిస్తారు దీంతో ఆ పూట గడుస్తుంది. మరుసటి రోజు ఎవరైనా దయతలస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఆలన పాలన చూసేవారు లేక చాలామంది అభాగ్యులు వానకు నాన్నతో ఎండకు ఎండుతూ చలికి వణుకుతూ దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు.

బల్దియాదే బాధ్యత..

Municipal officials.

అనాధలు నిరాశ్రయులకు జీవించే హక్కు కనిపించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. పట్టణాలు నగరాల్లో రాత్రి బస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రతి కేంద్రంలో నీరు ఆహారం మరుగుదొడ్లు పడుకునేందుకు వసతి కల్పించాలని సూచించింది. వీటిని మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అనాధలకు ఆవాసం కల్పించి వారికి ఇంత తిండి పెట్టించాల్సిన బాధ్యత కూడా మున్సిపాలిటీలదే.
పట్టణంలో ఎక్కడో ఒకచోట వారికి ఆవాసం ఏర్పాటు చేసి వారు ఉండటానికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆకలి తీర్చాలి. అయితే ఏ ఆశ్రయం లేక రోడ్లమీద దుకాణాల వద్ద సేద తీరుతున్న వీరిని అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. జిల్లా అధికారులైన స్పందించి అనాధలు అభాగ్యుల గురించి పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నామమాత్రంగా పునరావాస కేంద్రం.

Municipal officials.

జిల్లా కేంద్రమైన మెదక్లో అనాధలకు ఆశ్రయం కల్పించేందుకు పట్టణానికి దూరంగా ఉన్న పిల్లి కొట్టాల్ వద్ద పునారావస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అయితే అందులో ఎంత మందికి ఆశ్రయం కల్పించారు కూడా మున్సిపల్ అధికారులకు తెలియదు. అసలు ఆ సెంటర్ పనిచేస్తుందా లేదా అనేది కూడా సమాచారం ఇవ్వలేని దుస్థితిలో అధికార గణనం ఉంది. ఈ విషయమై మెదక్ మున్సిపల్ కమిషన్ శ్రీనివాస్ రెడ్డిని కోరగా తనకు పూర్తి సమాచారం లేదని సమాధానం ఇచ్చారు

దుకాణాల ముందు ఇలా..

ఏ ఆశ్రయం లేని వారికి దుకాణాల ఆవరణలు చెట్లే దిక్కవుతున్నాయి. రాత్రివేళ వ్యాపారులు తమ వ్యాపారాలను ముగించుకొని దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోగానే అనాధలు అభాగ్యులంతా ఆ దుకాణాల వద్దకు చేరుకుంటారు. అక్కడే అరుగుల మీద నిద్రకు ఉపక్రమిస్తారు. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు రామాయంపేట తూప్రాన్ పట్టణాల్లో ఊరికి దూరంగా చెట్ల కింద చిన్నపాటి తాడిపత్రిలతో నివాసం ఏర్పాటు చేసుకుని ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version