అభాగ్యులను ఆదుకునేదేవరు.?
పగలు చెట్ల కింద.. రాత్రిదుకానాలవద్ద.
మెదక్ జిల్లాలో 200కు పైగా నిరాశ్రయులు.
పట్టించుకోని మున్సిపల్ అధికారులు.
రామాయంపేట డిసెంబర్ 31 నేటిధాత్రి (మెదక్)
వారు ఎవరికి పట్టని అభాగ్యులు..
అనారోగ్యంతో కొందరు, మతిస్థిమతి లేక మరికొందరు ఏ ఆసర లేక నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎవరైనా దయతలిస్తేనే వారి కడుపు నిండేది.. లేదంటే పస్తులు ఉండాల్సిందే. ఏ ఆశ్రయం లేక, ఎక్కడ తలదాచుకోవాలో తెలియక..
పగటిపూట చెట్ల కింద, రోడ్ల పైన.. రాత్రి అయితే దుకాణాల అరుగుల మీద సేదతీరుతున్న వీరిని అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రం మెదక్లో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అనాధలు నిరుపేదలు సుమారు వందమందికి పైగా ఉంటారని అంచనా. రోడ్ల వెంట బస్టాండు చర్చి పలు దేవా దేవాలయాల పరిసరాల్లో వీరు సంచరిస్తుంటారు. ఇండ్లు ఓటర్ల వెంట తిరిగి ఎవరైనా దయతలిచి అన్నం పెడితే కడుపు నింపుకుంటారు. లేదంటే పస్తులు తప్పవు. రాత్రి వేళల్లో పలువురు దాతలు అన్నం ప్యాకెట్లు అందిస్తారు దీంతో ఆ పూట గడుస్తుంది. మరుసటి రోజు ఎవరైనా దయతలస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తుంటారు. ఆలన పాలన చూసేవారు లేక చాలామంది అభాగ్యులు వానకు నాన్నతో ఎండకు ఎండుతూ చలికి వణుకుతూ దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు.
బల్దియాదే బాధ్యత..
అనాధలు నిరాశ్రయులకు జీవించే హక్కు కనిపించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. పట్టణాలు నగరాల్లో రాత్రి బస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రతి కేంద్రంలో నీరు ఆహారం మరుగుదొడ్లు పడుకునేందుకు వసతి కల్పించాలని సూచించింది. వీటిని మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అనాధలకు ఆవాసం కల్పించి వారికి ఇంత తిండి పెట్టించాల్సిన బాధ్యత కూడా మున్సిపాలిటీలదే.
పట్టణంలో ఎక్కడో ఒకచోట వారికి ఆవాసం ఏర్పాటు చేసి వారు ఉండటానికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆకలి తీర్చాలి. అయితే ఏ ఆశ్రయం లేక రోడ్లమీద దుకాణాల వద్ద సేద తీరుతున్న వీరిని అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. జిల్లా అధికారులైన స్పందించి అనాధలు అభాగ్యుల గురించి పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నామమాత్రంగా పునరావాస కేంద్రం.
జిల్లా కేంద్రమైన మెదక్లో అనాధలకు ఆశ్రయం కల్పించేందుకు పట్టణానికి దూరంగా ఉన్న పిల్లి కొట్టాల్ వద్ద పునారావస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అయితే అందులో ఎంత మందికి ఆశ్రయం కల్పించారు కూడా మున్సిపల్ అధికారులకు తెలియదు. అసలు ఆ సెంటర్ పనిచేస్తుందా లేదా అనేది కూడా సమాచారం ఇవ్వలేని దుస్థితిలో అధికార గణనం ఉంది. ఈ విషయమై మెదక్ మున్సిపల్ కమిషన్ శ్రీనివాస్ రెడ్డిని కోరగా తనకు పూర్తి సమాచారం లేదని సమాధానం ఇచ్చారు
దుకాణాల ముందు ఇలా..
ఏ ఆశ్రయం లేని వారికి దుకాణాల ఆవరణలు చెట్లే దిక్కవుతున్నాయి. రాత్రివేళ వ్యాపారులు తమ వ్యాపారాలను ముగించుకొని దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోగానే అనాధలు అభాగ్యులంతా ఆ దుకాణాల వద్దకు చేరుకుంటారు. అక్కడే అరుగుల మీద నిద్రకు ఉపక్రమిస్తారు. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు రామాయంపేట తూప్రాన్ పట్టణాల్లో ఊరికి దూరంగా చెట్ల కింద చిన్నపాటి తాడిపత్రిలతో నివాసం ఏర్పాటు చేసుకుని ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది ఉన్నారు.