◆ : ఇటీవలే కోట్లు ఖర్చు చేస్తూ చిరాగ్ పల్లిలో పాఠశాల నిర్మాణం
◆ : ప్రజల్లోనే నిరంతరం ఉండే నాయకుడు
” ప్రజలకు నేనున్నాని భరోసా కలిపించే నాయకుడు
జహీరాబాద్. నేటి ధాత్రి:
ప్రజల సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలకు భరోసా కలిపించే వాడే నాయకుడు, తండ్రి బాటలో నడుస్తూ వృత్తి రీత్యా వైద్యుడు ఆయన వైద్యునిగా కొనసాగుతూనే జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు నేనున్నాని భరోసా కలిపిస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటు పేద ప్రజల సమస్య తీరుస్తున్న నాయకుడు ఆయన, అతని ఎవరో కాదు చిరాగ్ పల్లి గ్రామానికి చెందిన జహీరాబాద్ మండలం మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరాగ్ పల్లి నారాయణరెడ్డి కుమారుడు డాక్టర్, ఉజ్వల్ రెడ్డి గత కొంతకాలం నుండి అమెరికాలో వైద్య సేవలు చేస్తూ తాను జన్మించిన గడ్డపైన పేదలకు ఎదో మంచి చేయాలనుకుని రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ నుండి జహీరాబాద్ పార్లమెంట్ టికెట్ ఆశించారు కాని ఎంపీగా టికెట్ రాకపోయిన కాంగ్రెస్ అధిష్టానం మాటకు కట్టుబడి ఉండి క్రమశిక్షణ కలిగి, నేటి జహీరాబాద్ ఎంపీ సురేష్ కెట్కర్ కు మద్దతుగా ఆయన విజయానికి కృషి చేశారు. కాని ఎంపీ టికెట్ రాలేదని ఎక్కడ నిరాశచందకుండా పేద ప్రజలకు అండదండగ ఉంటున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఏకైక నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, పేద ప్రజల సమస్యలను ఓపిగగా వింటు తన సొంత సమస్యగా పరిగనించి పరిష్కరిస్తున్న నాయకుడు. ఇటీవలే జహీరాబాద్ మండలం తన స్వగ్రామం అయిన చిరాగ్ పల్లిలో పేద విద్యార్థుల గురించి సొంత నిధులు ఖర్చు చేసి దాదాపు 6కోట్ల వ్యయంతో పాఠశాల నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని సంకల్పించి సేవ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక నాయకుడు ఉజ్వల్ రెడ్డి, ఎటువంటి వారు సహాయం కోరిన చిరునవ్వుతో వారిని పలకరించి సమస్య తీరుస్తున్న నాయకుడు సౌమ్యుడు ప్రజల మేలు కోరే నిజాయితీ కలిగిన వ్యక్తి, రాజకీయాలు వేరు ప్రజా సమస్యలు వేరుగా చూసి రాజకీయాలకు అతీతంగా సేవచేస్తున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి. ప్రజా సేవకుడు ప్రజలను సేవలందిస్తున్న మహా నాయకుడు ప్రజల ఆపదనులను ఆదుకుంటున్న ప్రజా నాయకులు ప్రజల్లోనే నిరంతరం ఉండే నాయకుడు డాక్టర్ ఉజ్వల రెడ్డి.
శ్రీ చైతన్య విద్యార్థిని అభినందించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్
ఎల్లారెడ్డిపేట(రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని దుంపేటి లాస్య ఇటీవల జరిగిన జాతీయ స్థాయి ఇండియన్ నేషనల్ సెర్చ్ ఒలంపియాడ్ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాఠశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి అధ్యక్షతన అభినందించి బహుమతిని(ల్యాప్ టాప్, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్) అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి దుంపేటి లాస్య నీ శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్,డైరెక్టర్ శ్రీ విద్య, ఎ.జి.యం అన్నపూర్ణ అకాడమిక్ కోఆర్డినేటర్ రాంబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ విజయ్ కుమార్,రవీందర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
వేసవి సెలవుల్లో కుర్రకారుపై పోలీసులు నిఘా పెట్టాలి…
యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితం కోల్పోతున్నారు…..
రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బందితో నిఘా పెంచాలి…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
వేసవి సెలవులు రాగానే పిల్లల్లో ఎక్కడా లేని సంతోషం కనిపిస్తుంది. రయ్ … రయ్ మంటూ కుర్రకారు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు నడుపుతుంటారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారు. ఈ సమయంలో కాలక్షేపం కోసం చేసే పనులు ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ఒక్కోసారి అవి కన్నవారికి కడుపుకోత మిగులుస్తాయి. బడిలో అయితే నిత్యం ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటారు.
Driving
చదువుకోవలసి ఉండడంతో విరామం దొరకదు. వేసవి సెలవుల్లో అధిక సమయం ఖాళీగా ఉండే నేపథ్యంలో రాత్రి,పగలు రోడ్లపైకి వెళ్లి బైక్ లపై ముగ్గురేసి పిల్లలు, యువకులు ఎక్కి హై స్పీడ్ లో వెళ్తూ, సడన్ గా బ్రేకులు వేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. మధ్యాహ్నం వేళ పోలీసుల నిఘా ఉంటున్నప్పటికీ, రాత్రి వేళల్లో కూడా పెట్రోలింగ్ నిర్వహించే పోలీస్ సిబ్బందితో నిఘా పెట్టాలని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
Driving
ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే వారిలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.ర్యాష్ డ్రైవింగ్,ఎక్కువ శబ్దాలు వచ్చే వాహనాల పై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియం, రైల్వే స్టేషన్, కాకతీయ కాలనీ, ఆర్కే ఫోర్ గడ్డ, ఆదివారం సంత సమీపంలోని సింగరేణి క్వార్టర్స్, నాగార్జున కాలనీ, సింగరేణి సిహెచ్పి, ఏ జోన్ ఏరియాలలో యువకులు సిగరెట్లు సేవిస్తూ, మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆరోపణలు సైతం ప్రజల నుండి వినిపిస్తున్నాయి. సింగరేణి ప్రాంతం కావడంతో పిల్లల తండ్రులు సింగరేణి ఉద్యోగానికి వెళ్తుంటారు.
Driving
ఈ సందర్భంలో వేసవి సెలవులు కావడంతో కుర్రకారు స్నేహితులు తో కలిసి కాలక్షేపానికి అలవాటుపడి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, పోలీసులు నిఘా పెంచి యువకులను క్రమశిక్షణలో పెట్టేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పిల్లలు వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటాం..
ఆర్కెపి ఎస్సై జి రాజశేఖర్
వేసవి సెలవులు ఉన్నాయని తల్లిదండ్రులు మైనర్లకు సరదా కోసం బైకులు ఇస్తే చర్యలు తీసుకుంటాం.పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తాం. హెల్మెట్, లైసెన్స్ లేకుంటే కేసులు నమోదు చేస్తాం.ర్యాష్ డ్రైవింగ్ చేస్తే బండిని సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం.రాత్రి వేళల్లో పెట్రోలింగ్ సిబ్బందితో నిఘా పెంచుతాం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తాం.
ఈనెల 27 న వరంగల్ జిల్లా సమీప ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ పట్ల నర్సంపేట రూరల్ మండలంలోని ఇటుకలపల్లి,ఆకుల తండా,ఏనుగుల తండా,ఇప్పల్ తండ గ్రామలలో బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆయా గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.అనంతరం గోడ పత్రికలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రుణ మాఫీ పట్ల ప్రకటన ప్రకారం మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ రంగాల్లో విఫలమయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,క్లస్టర్ ఇన్చార్జిలు మోటూరి రవి,కడారి కుమారస్వామి,మాజీ ఎంపీటీసీ భూక్యా వీరన్న,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,ఇటుకాపల్లి గ్రామకమిటీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్,ఆకుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు కూకట్ల రవి,ఇప్పల్ తండ గ్రామ పార్టి అధ్యక్షుడు ధరావత్ బద్దు,ఏనుగుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ బానోతు రవి,మాజీ సర్పంచ్ లు మండల రవీందర్,భానోత్ శంకర్ నాయక్,మాజీ ఉప సర్పంచ్ జమాల చంద్రమౌళి,వాడికారి గోపాల్,కుసుంబ కోటి,మండల రాజమౌళి,రాధరపు రాజు,నకినబొయిన సారంగం,జామచెట్ల చేరాలు, సాంబయ్య,గజ్జి బాబు, హరీష్, సుమన్,కిషన్ నాయక్,బోయిని సమ్మాలు,పాసికంటి శంకర్ లింగం,కన్నెబోయిన రాజు, కూకట్ల కుమార్ ఉప్పునూతల వీరాచారి,గోపు సాంబయ్య,బానోతు దశ్రు,కిషన్,ధరావత్ దసురు,జై కిసాన్ బద్రు,గ్రామ కమిటీ సభ్యులు,నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కార్ యాక్సిడెంట్ జరిగిందా? డోంట్ వర్రీ- వెంటనే ఈ 10 పనులు చేస్తే అంతా సేఫ్!
జహీరాబాద్. నేటి ధాత్రి:
మన దేశంలో ప్రతీ గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతీ నాలుగు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తోంది. ప్రపంచ బ్యాంక్ గతంలో విడుదల చేసిన ఓ నివేదికలోని వివరాలు ఇవి. మొత్తం మీద ఇది భారత్‌లోని రోడ్లపై డ్రైవింగ్ అనేది పెద్ద సవాలుతో కూడిన విషయమని స్పష్టం చేసింది. నిత్యం ఎన్నో కార్లు రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఒకవేళ మీ కారు ఇలాంటి ప్రమాదం బారినపడితే వెంటనే చేయాల్సిన 10 విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
కారును ఆపండి :
రోడ్డు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో, అక్కడే మీ కారును ఆపేయండి. దీనివల్ల మీకు ఆ కేసులో లీగల్ చిక్కులు రావు. ప్రమాదం చిన్నదే అయినా అక్కడి నుంచి కారుతో పరార్ కావద్దు. ప్రమాదం జరిగిన చోట ఎవరితోనూ గొడవకు దిగవద్దు.
గాయాలపాలైన వారికి సాయం చేయండి :
రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వారికి వీలైనంత త్వరగా చికిత్స అందేలా ఏర్పాట్లు చేయండి. అంతకంటే ముందు మీకు అయిన గాయాలను చెక్ చేసుకోండి. వేగంగా సమీపంలోని ఆస్పత్రికి చేరుకోండి. మీ వాహనం వల్ల ఇతరులకు గాయాలైతే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా దానికి సంబంధించిన క్లెయిమ్ చేయండి.
వైద్య సాయం పొందండి :
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మీ కారులోని ప్రథమ చికిత్స పెట్టెను వాడుకోండి. గాయపడిన వారికి అందులోని సామగ్రితో ప్రథమ చికిత్స చేయండి. మీకు గాయాలైతే మీరు కూడా ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి. ఇదే సమయంలో తప్పకుండా అంబులెన్సుకు కబురుపెట్టండి. మీ ప్రాథమిక చికిత్స ప్రక్రియ పూర్తయ్యేలోగా అంబులెన్సు వస్తుంది. దానిలో ఆస్పత్రికి చేరుకోవచ్చు.
బీమా కంపెనీకి సమాచారం ఇవ్వండి :
Car Insurance
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారందరికీ చికిత్స చేయించిన వెంటనే, బీమా కంపెనీకి ఈ ప్రమాదంపై సమాచారాన్ని అందించండి. తద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ త్వరగా మొదలవుతుంది. మీకు అయిన గాయాలు, ఇతరులకు అయిన గాయాలు, వాహనం దెబ్బతిన్న తీరు వంటి వివరాలన్నీ బీమా కంపెనీకి అందించండి. తప్పుడు సమాచారం అందిస్తే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.
పోలీస్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి :
ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకూడదంటే, మీరు వెంటనే సమీపంలోని పోలీసు స్టేషనుకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి. థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీని బీమా కంపెనీ అడుగుతుంది.
ఫొటోలు తీయండి :
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలం ఫొటోలన్నీ తీయండి. గాయపడిన వారి ఫొటోలు, దెబ్బతిన్న కారు భాగాల ఫొటోలు తీయాలి. ఈ ఫొటోలు క్లియర్‌గా కనిపించేలా ఉండాలి. అన్ని యాంగిల్స్‌లో ఫొటోలు తీయండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ కావడంలో ఈ ఫొటోలు కీలక పాత్ర పోషిస్తాయి.
డాక్యుమెంట్లు సమర్పించండి :
రోడ్డు ప్రమాదం విషయాన్ని బీమా కంపెనీకి తెలియజేసిన వెంటనే, మీరు కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. ఆ జాబితాలో డ్రైవింగ్ లైసెన్సు, పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ, కారు ఆర్‌సీ, కారు బీమా పత్రాలు, రిపేర్ అంచనా నివేదికలు ఉండాలి. ఇవన్నీ ఇచ్చాక థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను సెటిల్ చేసే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
కారును రిపేర్ చేయించుకోండి :
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కారును రిపేర్ చేయించవద్దు. బీమా కంపెనీ ఒక సర్వేయర్‌ను పంపుతుంది. అతడు వచ్చి కారుకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, నమోదు చేసుకుంటాడు. మరమ్మతులకు అయ్యే ఖర్చులను సర్వేయర్ అంచనా వేస్తాడు. ఆ నివేదికను అతడు బీమా కంపెనీకి అందజేస్తాడు. ఈ ప్రాసెస్ ముగిశాక మనం కారుకు మరమ్మతులు చేయించుకోవచ్చు. కారును మెకానిక్ షెడ్ వరకు తీసుకెళ్లే సౌకర్యాన్ని సైతం బీమా కంపెనీ కల్పిస్తుంది. ఆ బీమా కంపెనీ పరిధిలో లేని మెకానిక్ వద్ద కూడా కారును రిపేర్ చేయించుకోవచ్చు. మెకానిక్ నుంచి పొందిన బిల్లులను ఇన్సూరెన్స్ కంపెనీకి అందించి, రీయింబర్స్‌మెంట్‌ను పొందవచ్చు.
కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ :
బీమా కంపెనీ నెట్‌వర్క్‌లో కొన్ని కార్ గ్యారేజీలు ఉంటాయి. వాటిలో మీరు కారును రిపేర్ చేయించుకుంటే, నేరుగా ఆ గ్యారేజీకే బీమా కంపెనీ పేమెంట్ చేస్తుంది. ఒకవేళ మీరు నెట్‌వర్క్‌లో లేని గ్యారేజీలో కారును రిపేర్ చేయించుకుంటే, మీకు అంత మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది.
సదా అప్రమత్తంగా ఉండండి :
రోడ్డు ప్రమాదం అనేది చెప్పిరాదు. అది అకస్మాత్తుగా జరుగుతుంది. అందుకే మనం నిత్యం అలర్ట్‌గా ఉండాలి. అవగాహనతో ఉండాలి. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, తక్కువ వేగంతో కారును డ్రైవ్ చేయాలి. మద్యం మత్తులో వాహనం నడపకూడదు. బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి పత్రాలన్నీ కారులో సిద్ధంగా ఉంచుకోండి.
మల్గి గ్రామ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి పాటిల్ & మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి ఆధ్వర్యంలో మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి కాలువ పూలమాలలతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మల్గి మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి యువ నాయకులు వైద్యనాథ్ అఖిల్ మియా బసవరాజ్ జాలేందర్ మహేష్ సునీల్ సిద్దూ సాయినాథ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పట్టణ బిఆర్ఎస్ పార్టీ అద్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డ ఆదేశాల మేరకు పార్టీ 2 వ వార్డు అద్యక్షులు పోతరాజు బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిలుగా హాజరైన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదన్నపేట చెరువులోకి గోదావరి జలాలు తీసుకువచ్చి నర్సంపేటను సస్యశ్యామలం చేసిన చరిత్ర పెద్ది సుదర్శన్ రెడ్డిది అని పేర్కొన్నారు.మాదన్నపేట చెరువును మినీ ట్యాంక్ బండ్ కు నిధులు తీసుకువచ్చి చెరువు అభివృద్ధికి కృషిచేశారని,పట్టణ ప్రజల తాగునీటి కోసం అర్బన్ మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లాల ద్వారా తాగునీరు సౌకర్యం కల్పించారని వివరించారు.వైద్య రంగంలో డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, మెడికల్ కళాశాల, టీ డయాగ్నొస్టిక్ సెంటర్ , నర్సంపేట కి తీసుకు వచ్చిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు.బిఆర్ఎస్ పార్టీ అందించిన సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని,ఈనెల 27 న జరిగే బిఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజ్,మాజి కౌన్సిలర్లు బండి ప్రవీణ్, శివరాత్రి స్వామీ, బండి రమేష్, వాసం సాంబయ్య,పట్టణ యువజన విభాగం ఉపాధ్యక్షులు పైసా ప్రవీణ్, 2 వ వార్డు పార్టీ ముఖ్యనాయకులు ముత్తినేని వీరస్వామి, ముత్తినేని వీరన్న, ముత్తినేని శ్రీను, ముత్తినేని సోమేశ్, పోతురాజు అచ్చయ్య, పోతరాజు రాజు, వడిజర్ల శీను, పొన్నల ప్రభాకర్, ముస్కు శీను, జడల శీను, మల్లేష్ గూడెపు, యాకు భాష, గూడెప్ రాకేష్, ఆకుల చందు, ఆకుల వీరన్న, మిటబెల్లి శీను, చందు రాజు, మల్లూరు దేవన్న, హంస రవి, వంశీ, ఆకుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లిమండలంలో పలు గ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు. తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్.గ్రామానికి చెందిన పోరాట యోధుడు కామ్రేడ్ దిగవంతి సింగిరెడ్డి భూపతిరెడ్డి కూతురు బద్దం సత్యవ కొన్ని రోజుల క్రితం మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించినా మనో ధైర్యం ఇచ్చిన నాయకులు అలాగే జిల్లా రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు కూర అంజిరెడ్డి తండ్రి కొన్ని రోజుల క్రితం మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం చెప్పి రెడ్డి సంఘం తరఫున కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల పాక్స్ వైస్ చైర్మన్ ఎగు మామిడి వెంకటరమణారెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పడిగల రాజు తెలంగాణ మండల జాగృతి అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ మిట్టపల్లి రామ్ రెడ్డి తదితరులు పరామర్శించారు
తాటి వనంలో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రామడుగు గ్రామానికి చెందిన కావలి భూమయ్య 55 సంవత్సరాలు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భార్య పిల్లలతో విడిపోయి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్లి బుధవారం ఉదయం ఆరు గంటల వరకు ఇంటికి రాకపోవడంతో గ్రామంలో గాలించగా తాటివనంలో కావలి భూమయ్య ఒంటరితనం తట్టుకోలేక తాగుడుకు బానిసై నమిలినారా చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోని కనిపించాడని మృతుడు భూమయ్య సోదరుడి కొడుకు కావాలి రాజు తండ్రి పోశాలు ఫిర్యాదు చేయగా పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రామడుగు ఎస్సై రాజు తెలిపారు.
ఈ రోజు గురువారం రోజున మందమర్రి మినీ ట్యాంక్ బండ్ పైన సీసీ కెమెరాల ను అమర్చడం తో పాటు గతంలో ట్యాంక్ బండ్ ని సందర్శించి ట్యాంక్ బండ్ పై ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి వెంటనే సంబంధిత మున్సిపల్ కమిషనర్ రాజలింగు గారికి ఆదేశాలు ఇవ్వడం తో వాకార్స్ కు అడ్డంగా ఉన్నా పెద్ద పెద్ద తుమ్మ చెట్లను దాదాపు ఒక వారం రోజుల పాటు జేసీబీ ట్రాక్టర్ల తో పాటు ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద తుమ్మ చెట్లను తొలగించి శుభ్రం చేయడం జరిగింది..
అక్కడ మహిళకు ఎలాంటి ఇబ్బందులు జరగాకుండా పోలీసు సెక్యూరిటీ నీ ఏర్పాటు చేయడం జరిగింది…
దానితో పాటు ఈ రోజు పెద్దమొత్తంలో ట్యాంక్ బండ్ చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది..
Police
అడగగానే అతి తక్కువ సమయంలో పెద్ద మనుసుతో పైన తెలిపిన పనులు చేపించిన చెన్నూరు శాసన సభ్యులు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు బడుగు బలహీన వర్గాలు ఆశ జ్యోతి డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారికి మరియు యువ నాయకులు డైనమిక్ పెద్ద పల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ గారికి వాకార్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండి సదానందం యాదవ్ గారు మరియు కమిటీ సభ్యులందరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మరి ఎంపీ గారికి ఎల్లపుడు ఋణపడి ఉంటామని తెలిపారు…,
‘‘కేసిఆర్’’ నాయకత్వం వరం..తెలంగాణ అయ్యింది బంగారం: రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’.
బీఆర్‌ఎస్’’ రజతోత్సవాలు తెలంగాణ ప్రజల పండుగ.
‘‘కేసిఆర్’’ లాంటి నాయకులు యుగానికొక్కరు మాత్రమే వుంటారంటున్న రాజ్యసభ సభ్యుడు, ‘‘బిఆర్‌ఎస్’’ సీనియర్ నాయకుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’, నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో
‘‘బిఆర్‌ఎస్’’ రజతోత్సవ వేడుకలు,
‘‘కేసిఆర్’’ ఘనకీర్తిపై ముచ్చటించిన అంశాలు ఆయన మాటల్లోనే…
`తెలంగాణ కోసం జన్మించిన ‘‘కారణ జన్ముడు కేసిఆర్’’
`పట్టు వదలని విక్రమార్కుడు’’గా తెలంగాణ సాధించిన వీరుడు ‘‘కేసిఆర్’’
`తెలంగాణ కర్త, కర్మ, క్రియ ‘‘కేసిఆర్’’
`తెలంగాణ ఆత్మ గౌరవం నిలిపిన నాయకుడు ‘‘కేసిఆర్’’
`ఉద్యమాన్ని, రాజకీయాన్ని రంగరించి తెలంగాణ సాధించిన ‘‘అపర చాణక్యుడు కేసిఆర్’’
`రాజకీయంగా అస్తిత్వాన్ని చూపించి తెలంగాణ తెచ్చిన నేత ‘‘కేసిఆర్’’
`ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఉద్యమ రాజకీయానికి శ్రీకారం చుట్టిన నాయకుడు ‘‘కేసిఆర్’’
`‘‘కేసిఆర్’’ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు
`‘‘కేసిఆర్’’ ను కాదని తెలంగాణను చూడడం చరిత్రకే సాధ్యం కాదు
`తెలంగాణ రాష్ట్ర సిద్ది కోసం పడిన పరిశ్రమ ‘‘కేసిఆర్’’
`తెలంగాణ తేవడమే జీవిత లక్ష్యంగా రాజకీయం నడిపిన నాయకుడు ‘‘కేసిఆర్’’
`మరో 25 సంవత్సరాల వరకు ‘‘బిఆర్‌ఎస్’’ అధికారంలో వుండేందుకు పునాదులు పడతాయి
`ఇక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఎప్పుడూ నమ్మరు
`సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో తెలంగాణను బంగారం చేసిన ఘనత ‘‘కేసిఆర్’’ది
`తెలంగాణ తెచ్చి, బంగారు తెలంగాణ చేసిన నాయకుడు ‘‘కేసిఆర్’’
`‘కేసిఆర్’’ లాంటి నాయకుడు ప్రపంచ చరిత్రలోనే మరొకరు కనిపించరు
హైదరాబాద్,నేటిధాత్రి: నా పల్లెలో నీరెందుకు లేదు? నా ఊరుకు నీళ్లెందుకు రావు? నా చెరువులు ఎందుకు ఎండిపోతున్నాయి? చెరువులెందుకు ఒట్టిపోతున్నాయి? నా తెలంగాణ ఎందుకు పచ్చబడదు? నా తెలంగాణలో నీళ్లెందుకు పరవళ్లు తొక్కవు? పంటపొలాల నిండా నీళ్లెందుకు వుండవు? బావుల్లో ఊటమెందుకు మాయమైపోతున్నాయి? చేదబావుల్లో నీళ్లెందుకు అడుగంటుతున్నాయి? చుక్క నీరు కూడా లేక జనం గొంతు ఎండుతోంది? ఎవరి లోపం? ఎందుకు ప్రశ్నించలేకోతున్నాం? ఎందుకు నిలదీయలేకపోతున్నాం? ఎందుకు తెలంగాణకు నీళ్లు తెచ్చుకోలేకపోతున్నాం? అటు ఫ్లోరైడ్ పీడన, ఇటు సాగుకు రైతు వేధన ఎంత కాలం? ఎన్నెళ్లు ఈ ఆరాటం? ఊళ్లన్నీ వల్లకాడులౌతున్నాయి? తెలంగాణ పల్లె జనం వలసలు పోయి ఇళ్లన్నీ కూలిపోతున్నాయి. వాకిళ్లు పొక్కిళ్లు తేలి, ఊరు పాడుబడితోంది? నా తెలంగాణకే ఎందుకీ గోస? మా ప్రజలకే ఎందుకీ బాధ? అని ప్రతి క్షణం కన్నీరు పెట్టుకున్న నాయకుడు కేసిఆర్. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే తెలంగాణలోనా..అంటూ కవులు పాడుతుంటే కన్నీరు మున్నీరైన నేత కేసిఆర్. అందుకే తెలంగాణకు విముక్తి జరిగితే తప్ప మన ప్రాంతం బాగు పడదని బలంగా నమ్మి జై తెలంగాణ నినాదం అందుకున్న గొప్ప దార్శనికుడు కేసిఆర్ అంటున్న రాజ్యసభ సభ్యుడు, బిఆర్‌ఎస్ సీనియర్ నేత వద్ది రాజు రవిచంద్ర నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో కేసిఆర్ గురించి పంచుకున్న ముచ్చట్లు ..ఆయన మాటల్లోనే…
బలవంతంగా చేసిన పెళ్లితో సంసారం కల కాలం సాగదు. గతి లేని సంసారమైనా సాగుతుందేమో? కాని శృతిలేని సంసారం సాగదు?ఉ మ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వచ్చారు. పాలనతో వివక్ష చూపుతూ వచ్చారు. అభివృద్దిలో సవతి తల్లి ప్రేమ చూపారు. తెలంగాణను ఎండబెట్టారు. ఏపిని పండుగ చేసుకున్నారు. ఏపి, తెలంగాణ కలవక ముందు తెలంగాణలో కరవు లేదు. తెలంగాణలో పీడ లేదు. తెలంగాణకు ఆకలి లేదు. కాని ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు కాగానే శాపం తగిలినట్లు తెలంగాణ వాడిపోయింది? ఎండిపోయింది? నీటికి గోసపడాల్సి వచ్చింది. సాగు పడిపోయింది. రైతుకు దుఖం మిగిలింది. ఇల్లు, ఊరు, భూమిని వదలుకొని తెలంగాణ పల్లె జనం వలసలు పోయే దుస్తితి వచ్చింది. సాగులేదు. కొలువు లేదు. తెలంగాణకు సరిగ్గా సదువులేదు. సౌకర్యాలు లేవు. కరంటు లేదు. ఏదీ లేదు. కాని ఏపిలో అన్ని సమకూరుతున్నాయి. కాలువలు లేని చోట కొత్త కాలువలు పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు తెలంగాణకన్నా సాగులో ఏపి వెనుకబడి వుంది. తెలంగాణతో కలవగానే ఏపి అన్న పూర్ణగా మారింది. అయినా తెలంగాణతో జతకట్టి బాగు పడ్డామని ఏపి నాయకులు అనుకోలేదు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృ ద్ది చేయాలనుకోలేదు. రెండు ప్రాంతాలు కలిసినప్పుడే తెలంగాణ వద్దని మొత్తుకున్నది. కాని బలవంతంగా కలిసి, తెలంగాణను చిల్లం చిల్లం చేశారు. తెలంగాణను గోస పెట్టారు. ఈ గోసను చిన్న నాటి నుంచి కళ్లారా చూసిన కేసిఆర్‌ను రగిలించింది. తెలంగాణ ఉద్యమ బావుటా ఎగురవేయాలని ఆనాడే కేసిఆర్ మది సంకల్పించింది. సమైక్య వాదులు చేసిన మోసాన్ని, పాపాన్ని కడిగేసే సమయం వచ్చింది. కేసిఆర్ చేతి పిడికిలి బిగించింది. జై తెలంగాణ అని ఎలుగెత్తి చాటింది. దిక్కులు పిక్కటిల్లేలా కేసిఆర్ గొంతు జై తెలంగాణ నినానం చేసింది. అంతే తెలంగాణ మొత్తం గొంతు సవరించుకొని జై తెలంగాణ అని జై కొట్టింది. ఎందుకంటే కేసిఆర్ అనే పదమే ఒక ఉప్పెన. కేసిఆర్ అనే పదమే ఒక విజృంభన. కేసిఆర్ అనే పదమే ఒక ఉద్యమం..ఒక ఆరాటం..ఒక పోరాటం. ఒక ఆలోచనతో కూడిని ఆవేశం. మొత్తంగా కేసిఆర్ పిలుపే ఒక ప్రభంజనం. అందుకే కేసిఆర్ జై తెలంగాణ అన్న వెంటనే తెలంగాణ సమాజం కదలింది. ఉప్పెనై పొంగింది. వరదలా జై తెలంగాణ నినాదం మారు మ్రోగింది. కేసిఆర్ అనే మూడక్షరాల పదంలోనే తెలంగాణ వుంది. తెలంగాణ జీవితం వుంది. తెలంగాణ ఆత్మ వుంది. తెలంగాణ జీవం వుంది. తెలంగాణ జీవితం ప్రజలకు కేసిఆర్‌లో కనిపించింది. కేసిఆర్‌తో కలిసి తెలంగాణ సమాజం నడిచింది. తెలంగాణ కోసం ప్రజ తెగించి కొట్లాడిరది. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి యుగానిక్కొరే కేసిఆర్ లాంటి యుగ పురుషులు జన్మిస్తారు. ప్రజల కోసం తమ జీవితం కరిగిస్తారు. జనం కోసమే జీవిస్తారు. జనం దుఖమే తమ దుఖమనుకుంటారు. జనం కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. అలాంటి గొప్ప సుగుణాలే కాదు, పోరాట విలువలున్న ఏకైక నాయకుడు కేసిఆర్. జనమే కేసిఆర్, కేసిఆరే జనం అన్నంతగా ప్రజల గుండెల్లో నిండిపోతారు. అలాంటి కారణజన్ముడు తెలంగాణ సాధన కోసం బిఆర్‌ఎస్ పార్టీ పెట్టి 25 సంవత్సరాలు పూర్తవుతుంది. పుబ్బలో పుట్టి మగలో మాయపోతుందని ఎగతాలి చేసిన వాళ్లును తెలంగాణ పొలిమేర దాక తరిమికొట్టిన నాయకుడు కేసిఆర్. తొండలు గుడ్లు కూడా పెట్టవని ఎద్దేవా చేసిన వారి కళ్లు కుల్లుకునేలా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ చేశారు. ఒకప్పుడు కోనసీమలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనొచ్చు అనుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే అదే కోనసీమలో 50 ఎకరాలు కొనొచ్చు అనే స్ధాయికి కేసిఆర్ తెచ్చారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చారు. తెలంగాణకు గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వడమే కష్టమన్న వారు చూస్తుండగానే ఇంటింటికీ దేశంలోనే ఎవరూ ఇవ్వనటువంటి సురక్షితమైన మంచినీటిని అందించారు. ఆరోగ్య తెలంగాణను కేసిఆర్ ఆవిష్కరించారు. ఎత్తి పోతల తప్ప తెలంగాణకు దిక్కులేదు..అంత శక్తి ప్రభుత్వానికి లేదు…తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేం..ఆ ప్రాంత దౌర్భాగ్యానికి మేమేం చేయలేమని సమైక్య వాదులు ఈసడిరచుకున్నారు. తెలంగాణలో పుట్టడమే మీ ఖర్మ అన్నంతగా నిర్లక్ష్యం చేశారు. ఆ కసి నుంచి పుట్టిన జంరaామారుతమే కేసిఆర్. ఏ నోటితోనైనా తెలంగాణ పచ్చబడడం కల అని అన్నారో వాళ్ల నోటితోనే తెలంగాణ అన్న పూర్ణ అనిపిస్తానని చెప్పి మరీ నీళ్లు తెచ్చిన అపరభగీరధుడు కేసిఆర్. తెలంగాణ తెచ్చాడు. తెచ్చిన తెలంగాణను పదేళ్లలో బంగారు తునక చేశాడు. సహజంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కుదుటపడడానికే కొంత సమయం పడుతుంది. కాని తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే తెలంగాణకు వెలుగులు పంచారు. ఆరు నెలల్లో తెలంగాణలో కరంటు కోతలు లేకుండాచేశారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కరంటువస్తుందో..ఎప్పుడు పోతుందో.. తెలియని పరిస్దితి నుంచి తెలంగాణలో చీకట్లను తరిమేసిన నాయకుడు కేసిఆర్. తెలంగాణ రాత్రిళ్లు కూడా పగలును మరిపించేలా వెలుగులు విరజిమ్ముతుంటే, ఏపిలో కరంటు కోతలతో అల్లాడిరది. తెలంగాణ వస్తే కరంటు వుండదు..అంధకారమౌతుందని చెప్పిన వాళ్ల కళ్లు తెరిపించేలా కరంటువెలుగులు నింపారు. మరో వైపు రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇచ్చారు. ఏడాది లోపే మిషన్ కాకతీయ జలయజ్ఞం మొదలుపెట్టారు. చెదిరిపోయి, పూడిపోయి, ఆనవాలులేకుండా పోయిన చెరువులను బాగు చేశారు. తెలంగాణలో వున్న 46వేలకు పైగా చెరువులను మూడు దఫాలుగా మూడేళ్లలో రూపు రేఖలు మార్చారు. ఎండా కాలంలో కూడా చెరువులు మత్తళ్లు పోయించారు. ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ల క్రితమే ఎండిపోయిన బావులు నీళ్లు ఎల్లబోశాయి. బోర్లు వేసి, వేసి అలసిపోయిన రైతులకు పాత బావులు నిండి పొలాలు పారాయి. తమ జీవిత కాలంలో కూడా అచ్చు కట్టని భూములను కూడా రైతులు సాగుకు సన్నద్దంచేశారు. చెను, చెలకల్లో కూడా వరి పండిరచి, గుంట స్ధలం కూడా వదిలిపెట్టకుండా రైతులు పొలాలుగా మార్చుకున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటు వస్తుండడంతో వలసలు పోయి తెలంగాణ ప్రజలు మళ్లీ పల్టెబాట పట్టారు. చెదిరిపోయిన ఇళ్లను బాగు చేసుకొని, పల్లెల్లో బంగారం పండిస్తున్నారు. సాగుతోపాటు, పాడిని పెంచుకుంటూ, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ రైతు కూడా రకరకాల ఆదాయ మార్గాలను ఎంచుకునేలా చేశాడు. ఇరవై నాలుగు గంటల కరంటుతో అనేక ఉపాది అవకాశాలు పెరిగాయి. ఒకప్పుడు జిరాక్స్ కావాలంటే కూడా రోజులో కరంటు ఎప్పుడొస్తుందా? అని గంటల తరబడి పడిగాపులు కాసిన వాళ్లే, ఇప్పుడు సాగుతోపాటు జిరాక్స్ మిషన్లు తెచ్చి అదనపు ఆదాయం సంపాదించుకుంటున్నారు. తెలంగాణ పల్లెలను ఆదాయసృష్టి వనరులుగా మార్చారు. ఇవన్నీ మన కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలు. అందుకే కేసిఆర్ తెలంగాణప్రజల దేవుడు. ఊరును మట్టిదిబ్బ, పొలాన్ని ఎడారి చేసిన సమైక్య వాదుల కంబంధ హస్తాల నుంచి తెలంగాణను రక్షించి, తెలంగాణ తెచ్చి పల్లెను పాలవెల్లిని చేసిన గొప్ప నాయకుడు కేసిఆర్.
90 శాతం మంది రైతులకు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుంది
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర నేటిధాత్రి:
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు ఇస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ యేసంగి సీజన్ లో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ముందస్తుగానే ప్రణాళిక చేసి సాగు నీటిని విడుదల చేసి గుంట భూమి కూడా ఎండిపోకుండా సాగునీరు అందించాము. తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సన్న వడ్లకు రూ.500 చెల్లిస్తున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేసంగి సీజన్లో భూమికి బరువైనన్ని వడ్లు వచ్చాయి. ఎన్నడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వెలువెత్తుందని, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావొద్దు, కొనుగోలు కేంద్రాలకు రైతును తీసుకువచ్చిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాము. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య,రామిడి రాజిరెడ్డి,సత్తు కనుకయ్య ,గుజ్జుల బాపురెడ్డి, గడ్డం అంజయ్య, రోమల రమేష్, దోమకొండ మహేష్, దోర్నాల శ్రీనివాసరెడ్డి,రాజ గోపాల్ రెడ్డి ,కర్ర బాపు రెడ్డి, తోట సంధ్య ,రెండ్ల శ్రీనివాస్, తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.
వడగళ్ళ వాన తో దెబ్బతిన్న పంటను పరిశీలించి రైతులకు దైర్యం చెప్పిన పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి…
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండల కేంద్రంలో ని జీలకుంట పోత్కపల్లి శానగొండ బయమ్మపల్లి ఇందుర్తి గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగళ్ళ వాన ప్రభావం తో నష్ట పోయిన వరి మొక్కజన్న పంటలను సమీక్షించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుకాలం కష్టపడి పoడించిన పంట అకాల వర్షం తో నేలపాలు కావడం జరిగింది పంట చేతికి వచ్చే దశలో ఈవిదంగా వర్షం పడి రైతుల పొట్టకొట్టిననట్టు కావడం దురదృష్టకారం అన్నారు తక్షణమే నష్ట పోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలనివారు డిమాండ్ చేసారు మండలం లోని AO మరియు AEO తో మాట్లాడిన సంజీవ రెడ్డి దాదాపు 500 వందల ఎకరాల్లో పంట నష్ట జరిగిందని ఈ యొక్క వడగళ్ళ వానతో సీడ్ పంటలు వేసినటువంటి రైతులకు ఆదిలాబాద్ జిల్లా లో సీడ్ ఆర్గనైజర్స్ ఎకరానికి యాభై వెల రూపాయలు ఇస్తున్న విదంగా పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మండలం తోపాటు అన్నీ మండలాల్లో ఇవ్వాలని కోరడమైనది. లోకల్ వరిపంటలు ఇంకా చాలా రకాల పంటలు దెబ్బతినడం జరిగిందని నష్టపోయిన ప్రతి ఒక్క రైతుల వివరాలు సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపి వారికీ నష్ట పరిహారం వచ్చే విదంగా చూడాలని డిమాండ్ చేయడం జరిగింది అలాగే కొంతమంది రైతుల పంటలు కోసి కొనుగోలు కేంద్రాలలో ఎదురు చూస్తున్నారని ఇంకా ఐకేపీ సెంటర్ లు ప్రారంభం చేయలేదని కాబట్టి వెంటనే ఐకేపీ సెంటర్ లో ఓపెన్ చేసి వడ్ల కొనుగోలు చేయాలనీ డిమాండ్ చేసారు. ఈకార్యక్రమంలో లో బీజేపీ నాయకులు దాత రాకేష్ పటేల్ ఎర్రవెల్లి అనిల్ రావు, పుల్లూరి పృథ్వి రాజ్,చర్లపల్లి రాజు,తజ్ ఉద్దీన్,పుల్ల సదయ్య,భూషణవేణి సత్యం, రవీందర్, బిక్షపతి, రమేష్,నరసింహ చారి, భాస్కర్ రెడ్డి,అగ్గి శ్రీనివాస్,కుక్కల మహేందర్,మధునయ్య,ఐలయ్య,పులి కొమురయ్య,మీడుదూల రాజు,రాజా మనోహర్,సతీష్,వినయ్,సాయి కృష్ణ, అనిల్,తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని సంఘం భవనంలో పోషణ అభయన్ లో భాగంగా పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ మణెమ్మ మాట్లాడుతూ మొదట 1000 రోజులు సంరక్షణ తల్లి బిడ్డలకు జీవిత కాలపు రక్షణ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టాలి. పౌష్టిక ఆహారం వైవిద్యం. పరిశుభ్రత,, తల్లిపాలు బిడ్డకు సురక్షత అని ఆమె అన్నారు, అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి మాట్లాడుతూ కిషోర్ బాలికలకు ఐరన్ ఒక్క ప్రాముఖ్యత, మిల్లెట్స్ మరియు గిరిజన సంప్రదాయ ప్రాంతీయ స్థానిక ఆహార పద్ధతులు, చిరుధాన్యాలు కొర్రలు, సామలు, హారికలు, ఊదలు, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు రోజువారి తినే ఆహారంలో తీసుకోవాలి అని ఆమె అన్నారు, ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎమ్ లు, అంగన్వాడి ఉపాధ్యాయురాలు, బాలింతలు, గర్భిణీలు, కిషోర్ బాలికలు తదితరులు పాల్గొన్నారు
విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి నేటిదాత్రి :
*వనపర్తి పట్టణములో పాత బజార్ 4వ వార్డ్ లో దక్షిణ కాళికాంబ సమేత కమరేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్టలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు దక్షిణ కాళికాంబ సమేత కమరేశ్వర స్వామి అమ్మవారికి వనపర్తి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి పంటలతో రైతులు అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు అమ్మవారి విగ్రహ ప్రతిష్టకు అడిగిన వెంటనే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆర్థిక సహాయం చేసినందుకు ఆలయ కమిటీ సభ్యులు కాలనీ ప్రజలు ఎమ్మెల్యే మేఘా రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు తిరుమల మహేష్ విగ్రహ ప్రతిష్ట కు ఆర్థిక ఆర్థిక సహాయం చేశారు ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ తిరుమల మహేష్ వనపర్తి నియోజకవర్గం సమన్వయకర్త లక్కాకుల సతీష్ నాయకులు ఓ బీ సీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ మాజీ మున్సిపల్ వై స్ చైర్మన్ బి కృష్ణ కృష్ణ నందిమల్ల శ్యామ్ పాషానాయక్ పరుశురాం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య టీ పీ సీ సీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తులు పాల్గొన్నారు
గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన కూన గోవర్ధన్ మెట్ పల్లి ఏప్రిల్ 16
నేటి ధాత్రి
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల విద్యార్థులను పారమర్శించిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురైన విద్యార్ధులను వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలని సూచించారు. అనంతరం హాస్పిటల్ ను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మారుతీ,కోరుట్ల పట్టణ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు షైక్ అమీర్,కోరుట్ల పట్టణ మైనర్టీ ప్రధాన కార్యదర్శి యండి ఫైసల్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని లలితా నర్సింగ్ హోంలో బుధవారం రోజున ఫైర్ అధికారి వక్కల భద్రయ్య ఆధ్వర్యంలో 3వరోజు వారోత్సవాలు నిర్వహించారు.హాస్పటల్ సిబ్బంది,డాక్టర్లు,చిత్స నిమిత్తం వచ్చిన వారికి అగ్ని ప్రమాదాల నివారణకు తగుచర్యల గురించి అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా అధికారి భద్రయ్య మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని హాస్పిటల్ యాజమాన్యం అగ్నిప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మెలుకువలు సిబ్బందికి తెలిపారు.కరపత్రాలను హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేశారు.ప్రమాదాలను నివారించెందుకు హాస్పటల్ లో ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో చారి,డ్రైవర్ సురేష్ ,శ్రీకాంత్,అజయ్ కుమార్,రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు.
శాయంపేట మండల కేంద్రంలో నిన్న రాత్రి సమయంలో అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్రనష్టం వాటిళ్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండల పరిధిలో రాత్రి సమయంలో ఊహించని విధంగా తుఫాన్ ను తలపించే లాగా విపరీతమైన ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.
Farmers
దాదాపు ఒక గంటపాటు తీవ్రమైన ఉరుము లు మెరుపులతో ఎడతెగని గాలి,వాన కురిసింది. పలు గ్రామాల్లో ఈదురుగాలుల కారణంగా రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్లాలలో ఉన్న మొక్కజొన్న, వరి పంటలు తడిచి ముద్దయిన పరిస్థితి ఏర్పడింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావిం చిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం రైతన్నల ఆశలను అడియాశ లు చేసింది. ఏదై ఏమైనా ఈ అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు.
ప్రభుత్వమే ఆదుకోవాలి రైతన్నల ఆవేదన
మూసికె అశోక్ శాయంపేట రైతు
శాంపేట మండలంలో మంగళవారం రాత్రిపూట వర్షానికి రైతులు చాలు చేసిన మొక్కజొన్న పంట అరటి చెట్లు పూర్తిగా నేలకొరిగింది. మండలంలోని ముష్క అశోక్ మూడు ఎకరాల మొక్కజొన్న పంట సాగు చేశారు మంగళవారం రాత్రి కురిసిన గాలివాన బీభత్సానికి పంట అంతా నేలకొరిగింది దీంతో రూపాయల నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యానవన పంటలలలో అరటి చెట్లు గాలివాన బీభత్సానికి నెలకు వాలింది. కూతురు రాజు, కోల మల్లయ్య, కోల చక్రపాణి, గాదె చిరంజీవి, కురాకుల ప్రశాంత్ 10 ఎకరాల నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్ష పాలవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Farmers
వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు
శాయంపేట మండల వ్యవసాయ అధికారి గంగా జమున ఆదేశాల మేరకు మండల పరిధిలోని మైలారం, పెద్దకోడేపాక, కొప్పుల, పత్తిపాక, హుస్సేన్ పల్లి, శాయంపేట, గట్లకానిపర్తి, తహరాపూర్, కొత్తగట్టు సింగారం గ్రామాలలో మంగళ వారం రాత్రి గాలివానకు దెబ్బతిన్న పంటలను అర్చన, అన్వేషు, రాకేష్ ఏ ఈ ఓ లు ఉబ్ సందర్శించడం జరిగింది. అందులో మొత్తం 245మంది రైతుల వరి చేను 347ఎకరా లు,38మంది రైతుల 57ఎ కరాల మొక్కజొన్న,15మంది రైతుల 30ఎకరాలు అరటి తోట దెబ్బతిన్నాయి.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ లో గత కొన్ని రోజుల నుండి నీటి సమస్యతో కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యను పట్టించుకోకపోవడం వల్ల బుధవారం గోలేటి నాలుగు స్తంభాల చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.మూడు రోజులలో నీటి సమస్య పరిష్కారం చేయకపోతే జిఎం కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్మిక కుటుంబాలు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఎస్ఓటు జిఎం రాయమల్లు,సివిల్ డివై జిఎం భాష సింగరేణి అధికారులు రెండు రోజులలో నీటి సమస్య పరిష్కరిస్తామని కార్మిక కుటుంబాలకు హామీ ఇచ్చారు.
తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన ఏఎంసి చైర్మన్ రాజిరెడ్డి
పరకాల నేటిధాత్రి
పట్టణంలో నిన్న అకాల వర్షం కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని బుధవారం రోజున పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి పరిశీలించారు.ఈ సందర్బంగా రైతులతో మాట్లాడుతూ ధాన్యాన్ని పరిశీలించి మీరు అధైర్యపడకూడదని ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని రైతులకు దైర్యం చెప్పి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వంచే కొనుగోలు చేసే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణ సహాయం అందేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.