ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను.

ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలి

జిల్లా విద్యాశాఖ అధికారి ఎం రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం రెండవ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగేడు & మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జంగేడు ఉపాధ్యాయుల సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి యం. రాజేందర్ కరపత్రాన్ని ఆవిష్కరించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు 551/600 సాధించిన విద్యార్థి కె. అజయ్ ను సన్మానించారు, అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విద్య ఆరోగ్యం న్యూట్రిషన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని ప్రభుత్వ వసతి గృహాలు పాఠశాలలు విద్యాసంస్థలలో అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వాటి యొక్క ప్రాముఖ్యత క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఈ అంశాలపై శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను అందించాలని సూచించారు, బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న నూతన సాంకేతిక విద్య, క్రీడా, సాంస్కృతిక తదితర అంశాలను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిందని తెలిపారు, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ప్రచారం నిర్వహించాలని ప్రచారంతోపాటు బాధ్యతాయుతంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు, ప్రతి ఒక్కరూ స్వయం సహాయక బృందాలు,మెప్మా తదితర మహిళా సంఘాలు వారి యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని కోరారు, ప్రభుత్వ సూచించిన ప్రకారం జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల హాజరు శాతం పెంచాలని ఆయన కోరారు, అనంతరం ఉపాధ్యాయులు చేపట్టిన ఇంటింటి బడి ఈడు పిల్లలను గుర్తించే కార్యక్రమంలో పాల్గొని బడి ఈడు పిల్లలు గ్రామస్తులతో చదువు యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నారు విద్యార్థులను చదువు వైపు మళ్ళించే విధంగా చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అజ్మీర దేవా, జిల్లా సామాజిక సమన్వయకర్త సామల రమేష్, క్వాలిటీ కోఆర్డినేటర్ కాగిత లక్ష్మణ్, ప్రణాళిక సమన్వయకర్త దుప్పటి రాజగోపాల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంగేడు ప్రధానోపాధ్యాయులు అశోక్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్వయం సహాయక బృందాలు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు, విద్యావంతులు, తదితరులు పాల్గొన్నారు.

చిన్నారుల శుభకార్యానికి ఎమ్మెల్యే దొంతి హాజరు.

చిన్నారుల శుభకార్యానికి ఎమ్మెల్యే దొంతి హాజరు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణానికి చెందిన 2వ వార్డు కమలాపురంలో నేడు లోడే రాజు-నాగమణి దంపతుల కుమారులు లోడే కౌశిక్-లోకేష్ ల ధోతి కట్టించుట శుభకార్యానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్, 2వ వార్డు ఇంచార్జ్ మాజీ ఎంపీటీసీ ముత్తినేని వెంకన్న, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాదాసి రవికుమార్, ఐఎన్టియుసి నర్సంపేట పట్టణ అధ్యక్షులు కంచు రవి, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, జన్ను మురళీ, మాజీ వార్డు సభ్యులు గండి గిరి గౌడ్, 3వ వార్డు అధ్యక్షులు కోరే సాంబయ్య, పూజారి సారంగం గౌడ్, వేల్పుల కృష్ణ, అల్లంశెట్టి సోమయ్య, గాదగోని వీర సోమయ్య, లోడే పెద్దరాజు, వింతల రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కబ్జా కోరల్లో గార్ల పెద్ద చెరువు శిఖం భూములు…

కబ్జా కోరల్లో గార్ల పెద్ద చెరువు శిఖం భూములు…

నేటి ధాత్రి -గార్ల :-3

 

 

 

భూస్వాములు,బడా రైతులు గార్ల పెద్ద చెరువు శిఖం భూములను దర్జాగా కబ్జా చేశారని, అక్రమంగా భూములు కబ్జా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎమ్ -ఎల్ న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జడ సత్యనారాయణ డిమాండ్ చేశారుపెద్ద చెరువు భూములు కబ్జా చేసిన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని శనివారం మండల కేంద్రంలోని స్థానిక న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సత్యనారాయణ మాట్లాడుతూ, చెరువు భూములు కబ్జా చేయడంతో చెరువు విస్తీరం తగ్గిపోవడం మూలంగా నీటి నీల్వ లేకపోవడంతో చిన్న, సన్నకారు రైతుల పంటలు ఎండిపోతున్నాయని అన్నారు.కబ్జాదారులు చెరువులో ఎక్కువ లోతులో బావులు, బోర్లు, కరెంటు స్థంబాలు ఏర్పాటు చేసుకొని అక్రమంగా నీటిని వాడుకుంటున్నారని తెలిపారు. ఒక్కసారి చెరువు నిండితే పంటలు పండే గార్ల చెరువు, రెండుసార్లు నిండి అలుగు పోసినప్పటికీ పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గార్ల పెద్ద చెరువు శిఖం భూములపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆక్రమించుకున్న భూమిని చెరువులో కలపాలని, ఇప్పటికే తప్పుడు పత్రాలు సృష్టించే పట్టాలు చేయించుకున్న కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ ఎమ్ ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు జి. సక్రు, మాన్య, యాకయ్య, సైదులు, వెంకన్న, వీరన్న, సురేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

నల్లాల నీళ్లు రాకపోవడంతో.

నల్లాల నీళ్లు రాకపోవడంతో
రవినగర్ గ్రామస్తుల నిరసన

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలంలోని పరశురాంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రవి నగర్ లో నల్లాలు రాకపోతుండడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా గ్రామస్తులు గ్రామంలో నీటి వసతి కొరకు ఏర్పాటుచేసిన బోర్ లు పనిచేయకపోతుండటంతో పాటు ఓహెచ్ ద్వారా అందించాల్సిన తాగు నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి తమకు నీటి వసతి ఏర్పాటు చేయాలని శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.

పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు.

పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు ప్రత్యేక బస్సులు

*ఆర్టిసి టూర్ ప్యాకేజీలను వినియోగించుకోవాలి *

నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ కోరారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట నుండి
1)భద్రాచలం-పర్ణశాల-కిన్నెరసాని-మల్లూరు-బొగత జలపాతం.
2)కొమురవెల్లి-వేములవాడ-కొండగట్టు-ధర్మపురి-గూడెంగుట్ట.
3)నాగార్జునసాగర్-స్వర్ణగిరి-యాదగిరిగుట్ట.
4)పంచారామాలు:అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, మరియు విజయవాడ.
5)విజయవాడ, ద్వారాకాతిరుమల, భద్రాచలంకు మరియు 40మంది ప్రయాణకులు ఉంటే మీరు కోరుకున్న ప్రదేశాలకు బస్సులను నడుపబడునని తెలియజేసారు. వివరాలకు 9959226052,9866373825, 9989038476 నంబర్లను సంప్రదించగలరని డిపో మేనేజర్ కోరారు.

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు.

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు.శనివారం మండలంలోని వెలిశాల లో జరిగిన బక్రీద్ వేడుకలలో సతీష్ గౌడ్.వెలిశాల మాజీ సర్పంచ్ ఎండి కమరుద్దీన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రేమ, సౌబ్రాతుత్వంతో ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.అన్ని మతాలను గౌరవించే భారతదేశ సంస్కృతిలో బక్రీద్ పండుగ విశేష స్థానం కలిగి ఉందని అన్నారు.ఈ పండుగను ప్రతి ఏటా శాంతియుతంగా,స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందని,హిందువులు సోదర భావంతో శుభాకాంక్షలు తెలియజేస్తూ కులమత బేదలకు అతీతంగా భవిష్యత్తులో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో.జిల్లా నాయకులు దొంతుల శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాంపల్లి వీరేశం.మండల ప్రధాన కార్యదర్శి బండి రవీందర్.కాంగ్రెస్ నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

చెల్పూర్ ఈద్గా లల్లో బక్రీద్ జరిగిన వేడుకల్లో పాల్గొన్న.

చెల్పూర్ ఈద్గా లల్లో బక్రీద్ జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలం చే ల్పూర్ గ్రామంలో శనివారం ఈద్ ఉల్-అధా (బక్రీద్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా లల్లో జరిగిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా భాగస్వామ్యం, దానధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం బక్రీద్ పండుగ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని బక్రీద్ తెలుపుతుందన్నారు. చెల్పూర్ ఈద్గా లల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు ఉన్నారు.

జోరుందుకున్న ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజలు.

జోరుందుకున్న ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజలు

మండలం లో ప్రతీ గ్రామం లో
ఇండ్ల కు ముగ్గులు పోస్తున్న అధికారులు

కొత్తగూడ, నేటిధాత్రి:

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో ఏళ్లకు ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది పేదింటి వాడి సొంతింటి కల నెరవేరే అవకాశం మరి కొద్ది రోజుల్లో పూర్తవునుంది..ఎప్పుడో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులు తప్ప తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రజలు సొంతింటి కల నెరవేరుతుందని కోటి ఆశలతో ఎదురు చూశారు కానీ గత పాలకుల నిర్లక్ష్యం వారి స్వార్థాలతో పదేళ్లపాటు సొంత గూడు లేక అల్లాడిపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఊరటనిచ్చింది.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొత్తగూడ మండలంలోని పోగుల్లపల్లి గ్రామంలో
శనివారం రోజు ప్రభుత్వ అధికారులు పంచాయతీ కార్యదర్శి బి కళ్యాణి
ఆధ్వర్యంలో ముగ్గు పొసే కార్యక్రమం నిర్వహించారు..ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు పేర్లు1 బుగ్గ పద్మ.2. భూక్య అనిత 3. మోకాళ్ళ మౌనిక 4 బైరబోయిన రజిని 5 జూల వనక్క 6 బోళ్ల పద్మ 7 శిరపోయిన లచ్చమ్మ 8 నక్క సారమ్మ 9 బోళ్ల సమ్మక్క 10 శిర బోయిన స్వరూప 11 ముత్యం మమత 12 రాగి దేవేంద్ర 13 మొత్తం సప్న 14 దొంతర బోయిన రాధిక 15 కాగితం వెంకటమ్మ 16 నన్నే బోయిన కోమల 17 పడిగే నర్సమ్మ 18 గుగ్గిళ్ళ దీవెన.. అను లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు…
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు డేగల భద్రయ్య కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షులు చొప్పరి కుమార్,గ్రామ పెద్దలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు….

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన.

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ కౌన్సిలర్ సంపత్ కుమార్

 

పరకాల నేటిధాత్రి

 

 

ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను పురస్కరించుకొని పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ నాయకులు మడికొండ.

సంపత్ కుమార్ జామా మజీద్ దగ్గర హాజరై మజీద్ ఇమామ్ అజీజ్ కి,మజీద్ కమిటీ అధ్యక్షులు గౌస్ ఉద్దీన్,పెద్దలు మసూద్ అలీకి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రవక్తల అచంచలమైన దైవభక్తి,త్యాగానిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందని అన్నారు.

ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపి అందరిని ఆ అల్లా చల్లగా చూడాలని అల్లాను వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో బజరుద్దీన్, అఫ్జల్,అజ్గర్ అలీ,ఎస్కే మోయిన్,పాషా,షబ్బీర్ అలీ, ఇస్సాక్ అలీ,సాజిద్,జావేద్, అలీ,ఉస్మాన్,మదర్, బియాభాని,రహీం,ఇక్పాల్, అజీమ్,హబీబ్,ముస్లిం పెద్దలు,యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మహారుద్ర యాగంలో పాల్గొన్న తాజా మాజీ సర్పంచ్.

మహారుద్ర యాగంలో పాల్గొన్న తాజా మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం లోని బర్దీపూర్ ఆశ్రమంలో గత నలభై రోజులుగా . డా.సిద్ధేశ్వర అవదూత గిరి మహరాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారుద్ర యాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది అని ఈ సందర్భంగా మేధపల్లి తాజ్ మాజీ సర్పంచ్ పరమేశ్వర పాటిల్.మాట్లాడుతూ దేశాన్ని పట్టి పీడిస్తున్న రాక్షసా శక్తుల పీడ నివారణకై.చేపడుతున్న ఇట్టి యజ్ఞంలో పాల్గొనడం తో చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఇలాంటి యజ్ఞాలు మరిన్ని చేయాలని దేశ సైనికులకు ప్రజలకు శాంతీ సౌభాగ్యం కలిగించాలని శత్రు పీడ నశించాలి అని లోక కళ్యాణఅర్థం ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు.

మృతిచెందిన కార్మికుని కుటుంబానికి 83 వేల వితరణ.

మృతిచెందిన కార్మికుని కుటుంబానికి 83 వేల వితరణ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన ఎస్ఎన్ పిసి సింగరేణి కార్మికుడు నేరుపటి మొగిలి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు విషయం తెలుసుకున్న తోటి కార్మికులు 83 వేల రూపాయలను ఆర్థిక సహాయం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ మృతుడు నేరుపటి మొగిలి కుటుంబానికి అండగా ఉంటామని కార్మికులు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్ రావు సీనియర్ ఇన్స్పెక్టర్ జగ్గ లక్ష్మి రాజ్యం కార్మికులు సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు

ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలి.

ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలి

కన్నూరి దానియల్ ఏఐ సిసి టియు జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని
ఏఐ సిసిటియు జిల్లా కార్యదర్శి కన్నూరి దానియల్
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2026 మార్చినాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఫాసిస్టు చర్యల్లో భాగమేనని ఆయన విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటివరకు 1000 మంది కీ పై చట్ట విరుద్ధంగా హత్య చేశారని తెలిపారు. ఆపరేషన్ కగార్ మూలంగా మృతుల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉన్నారని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అక్కడి ప్రజలు భయానక స్థితిలో జీవనం కొనసాగించాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడ్డాయని ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే న్యాయ విచారణ చేపట్టాలని అన్నారు
ఈ చట్టవిరుద్ధ హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కొనసాగించడం దుర్మార్గమని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేయాలని అప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన సాగుతుందన్నారు. శత్రు దేశాలపై యుద్ధం చేసినట్లు ఈమధ్య భారత్లో భారత పౌరులపై యుద్ధం చేయడం సరికాదన్నారు. ఉగ్రవాద సంస్థలతో గత ప్రభుత్వాలు చర్చలు జరిపాయని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గొడవలు వద్దు రాజీలు ముద్దు.

గొడవలు వద్దు రాజీలు ముద్దు

ఈనెల 14న లోక్ అదాలత్

పరకాల సీఐ క్రాంతికుమార్

పరకాల నేటిధాత్రి

 

 

పరకాల మరియు నడికూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు 14 జూన్ న పరకాల కోర్టులో జాతీయలోక్ అదాలత్ ఉంటుందని మీ పై కానీ,మీకు తెలిసిన వాళ్లపై గాని ఏమైనా కేసులు ఉంటే వాటిని కాంప్రమైజ్ చేసుకొని కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసులు పూర్తిగా క్లోజ్ చేయ బడుతయాని యాక్సిడెంట్ కేసులు,కొట్టుకున్న కేసులు, చీటింగ్ కేసులు,వివాహ బంధానికి సంబంధించిన కేసులు,చిన్నచిన్న దొంగ తనం కేసులు,డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు మరియు ఇతర రాజీ పడ దగు కేసులు ఉంటే ఈ నేషనల్ లోకదాలతో కాంప్రమైజ్ చేసుకుని క్లోజ్ చేసుకోవచ్చునని ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దీనికోసం ఫిర్యాదు దారుడు మరియు నేరస్తులు అందరూ తమ యొక్క ఆధార్ కార్డు తీసుకుని పరకాల కోర్ట్ పరకాల పోలీస్ స్టేషన్ కు రావాలని పరకాల సీఐ క్రాంతికుమార్,ఎస్ఐ లు రమేష్,శివకృష్ణ లు తెలిపారు.

మాజీ కౌన్సిలర్ల రాసలీలలు.

మహబాబాబాద్ లో “మాజీ కౌన్సిలర్ల” రాసలీలలు.

ఓయో రూమ్ లో భార్యకు అడ్డంగా దొరికిన మాజీ కౌన్సిలర్.. చితక్కొట్టిన భార్య, బంధువులు.

నేటిధాత్రి, మహబూబాబాద్.

 

 

 

మహబాబాబాద్ జిల్లాకు చెందిన జాతీయ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ గోగుల రాజు, మరో మాజీ కౌన్సిలర్ తో ఓయో రూంలో ఉండగా, భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సంఘటన కలకలం సృష్టించింది.

గోగుల రాజు భార్య కూడా 28వ వార్డుకు కౌన్సిలర్ గా పనిచేసింది.

అయితే రాజు ఇటీవల మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్నాడు.

ఆమెతోనే ఎక్కువగా తిరుగుతున్నాడు.

దీంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి.

ఇదిలా ఉండగానే శుక్రవారం రోజు ఆమె కోసం ఓయో రూమ్ బుక్ చేసుకున్నాడు.

అక్కడ ఇద్దరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న భార్య ఓయోలోకి ఎంటరైంది.

తన బంధువులు, మిత్రులతో కలిసి ఓయో రూమ్ గది తలుపు తట్టింది.

హోటల్ సిబ్బంది అనుకోని రాజు తలుపు తీయగానే సీన్ రివర్స్ అయింది.

ఓయో రూములో యువతితో రాసలీలల్లో మునిగిన గోగుల రాజును, భార్య అనురాధ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

తనను పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ మరో మహిళతో ఎంజాయ్ చేస్తావా అంటూ గళ్లపట్టి చితకబాదింది.

ఆమెతో పాటు వచ్చిన వాళ్లంతా ఆ ఇద్దరినీ చితక బాదారు అయినా వదలకుండా కొట్టడంతో పాటు ఇద్దరినీ గదిలోనే ఉంచి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు వస్తే మరింత పరువు పోతుందని బయపడిన రాజు, వారి నుంచి విడిపించుకుని పారిపోయాడు.

మాజీ కౌన్సిలర్ అనురాధ ఫిర్యాదు మేరకు..

గోగుల రాజుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.

యువతిని అదుపులోకి తీసుకున్నారు.

రాజు కోసం గాలిస్తున్నారు.

పార్టీ ఏదైనా, పార్టీ కార్యకర్తలను సొంతవారికంటే ఎక్కువగా చూసుకోవాలి.

ముఖ్యంగా కిందిస్థాయి క్యాడర్ కు నాయకుడు అంటే మనోడు అనేలా ఉండాలి.

అయితే రోజులు మారాయి.

చాలామంది లీడర్లు కాలు జారుతున్నారు.

అదే పార్టీ లోని మహిళలతో అక్రమ సంబంధాలు నెరపడం, లేదా ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం చేస్తున్నారు.

అది ఎప్పుడో ఒకసారి బయటకు రాకమానదు.

అలా ఒకసారి దొరికితే ఇక కెరీర్ నాశనం అయినట్టే.

పరువు పోవడంతో పాటు పవర్లో ఉన్నా ఎవరు దేకరు అని గుర్తు పెట్టుకోవాలి.

అలాంటిదే మహబాబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి.

రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖలను సద్వినియోగం చేసుకోవాలని న్యాల్కల్ రెవెన్యూ అధికారులు కోరారు. న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ ఈ సదస్సులో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ఆకాశాన్ని తాకుతున్న అమ్మడి రెమ్యునరేషన్.

ఆకాశాన్ని తాకుతున్న అమ్మడి రెమ్యునరేషన్

Rukmini Vasanth:నేటి ధాత్రి:

 

 

 

ఇటు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తున్న రుక్మిణీ వసంత్ కు బన్నీ – అట్లీ మూవీలో సైతం ఛాన్స్ దొరికిందని వార్తలు వస్తున్నాయి. అందుకే కాబోలు అమ్మడు ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట.

ఆర్మీ ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth). ఆమె నటించిన కన్నడ చిత్రం ‘సప్త సాగరాలు దాటి’ (Saptha Sagaralu Daati) రెండు భాగాలుగా విడుదలైంది. ఈ హృద్యమైన ప్రేమకథా చిత్రం ఇతర భాషల్లోకీ డబ్ అయ్యింది. అలానే కొద్ది వారాల గ్యాప్ లోనే ‘సప్త సాగరాలు దాటి’ పార్ట్ వన్ అండ్ టు జనం ముందుకు వచ్చాయి. గాఢమైన ఈ ప్రేమకథా చిత్రంలో రుక్మిణీ వసంత్ తన పాత్ర కోసం ప్రాణం పెట్టేసింది. దాంతో ఈ సినిమా తర్వాత ఆమె డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. తెలుగుతో పాటు పాన్ ఇండియా మూవీస్ లోనూ రుక్మిణీ వసంత్ ను వెతుక్కుంటూ పాత్రలు వెళుతున్నాయి.

సినిమా టికెట్లు

‘సప్త సాగరాలు దాటి’ మూవీ టైమ్ లోనే తెలుగులో నిఖిల్ (Nikhil) సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీకి రుక్మిణీ సైన్ చేసింది. కాస్తంత ఆలస్యంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పెద్దంత ప్రమోషన్స్ లేకుండానే జనం ముందుకు తీసుకొచ్చారు. దాంతో అది కాస్తా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. చాలామందికి నిఖిల్ అలాంటి ఓ సినిమాలో నటించాడని కానీ కన్నడ హీరోయిన్ రుక్మిణి ఆ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అని కానీ తెలియదు. అయితే చిత్రంగా ప్రశాంత్ నీల్ (Prasanth Neel)… ఎన్టీఆర్ (NTR) తో తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో రుక్మిణీ వసంత్ కు చోటుదక్కింది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం చాలామంది ప్రయత్నాలు చేశారు కానీ చివరికి అదృష్టం రుక్మిణిని వరించింది. 

సినిమా టికెట్లు

అలానే అల్లు అర్జున్ తో అట్లీ తెరకెక్కించబోతున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీలోనూ రుక్మిణీ వసంత్ ను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని సమాచారం. అదే నిజమైతే… దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న రెండు బెస్ట్ మూవీస్ లో అమ్ముడు నటిస్తుండటం కెరీర్ పరంగా గ్రేట్ అఛీవ్ మెంట్. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తలంపుతో రుక్మిణీ వసంత్ ఇప్పుడు ఏకంగా సినిమాకు మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తోందట. మొన్నటి వరకూ సినిమాకు కోటి రూపాయలు మాత్రమే తీసుకున్న రుక్మీణీ ఇప్పుడు 3నుండి 4 కోట్ల వరకూ అడుగుతోందని అంటున్నారు. ఒకవేళ ఇటు ఎన్టీఆర్ మూవీ లేదా అల్లు అర్జున్ మూవీస్ లో ఒకటి హిట్ అయినా… రుక్మిణి కెరీర్ తారాజువ్వలా పైకి ఎగసిపోతుందని అంటున్నారు. ఇప్పటికే పరభాషా చిత్రాల నుండి వస్తున్న అవకాశాలతో కన్నడ చిత్రాలకు రుక్మిణీ ఎస్ చెప్పలేకపోతోందట. అమ్మడికి లభిస్తున్న డిమాండ్ చూస్తుంటే… అతి తక్కువ సమయంలోనే… నేషనల్ క్రష్ రష్మికా మందణ్ణ సరసన చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. చూద్దాం… ఏం జరుగుతుందో!!

మ‌ళ్లీ మూడేళ్లు మేమే ఉంటాం.. లేకుంటే ఆ ప‌నులు జ‌రుగవు

మ‌ళ్లీ మూడేళ్లు మేమే ఉంటాం.. లేకుంటే ఆ ప‌నులు జ‌రుగవు

Vishal:నేటి దాత్రి :

 

 

 

 

గ‌త కొంత‌కాలంగా పెండింగ్‌లో ఉన్న న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల‌పై ఆ సంఘం కార్య‌ద‌ర్శి, హీరో విశాల్‌ స్పందించారు.

నడిగర్‌ సంఘానికి (Nadigar Sangam) ఎన్నికలు నిర్వహిస్తే సంఘ భవన నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందని, అందుకే నడిగర్‌ సంఘ సభ్యుల పదవీ కాలం మూడేళ్ళ పాటు పొడిగించినట్టు హీరో, ఆ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ (Vishal) మద్రాస్‌ హైకోర్టు (Madras High Court)కు తెలిపారు. నడిగర్‌ సంఘం బై లా ప్రకారం ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. ఆ ప్రకారంగా 2022లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాజర్‌, ప్రధాన కార్యదర్శిగా విశాల్‌, కోశాధికారిగా కార్తి, ఉపాధ్యక్షులుగా పూచ్చి మురుగన్‌, కరుణాస్‌ తదితరులు ఎన్నికయ్యారు. అయితే, వీరి పదవీకాలం గత మార్చితో పూర్తయింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత కమిటీ సభ్యుల పదవీకాలాన్ని మూడేళ్ళపాటు పొడగిస్తూ 2024, సెప్టెంబరు 8వ తేదీ జరిగిన నడిగర్‌ సంఘం సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ నటుడు నంబిరాజర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేయగా, దాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు (Madras High Court) నడిగర్‌ సంఘానికి నోటీసు జారీ చేసింది. దీంతో విశాల్‌ హైకోర్టులో ఒక అఫడవిట్‌ దాఖలు చేశారు.

‘నడిగర్‌ సంఘ (Nadiga Sangam) భవనాన్ని రూ.25 కోట్లతో నిర్మాణం చేపట్టి 60 శాతం మేరకు పనులు పూర్తి చేశాం. మా పదవీకాలం ముగిసినప్పటికీ 2025-28 సంవత్సరానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటే భవన నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుంది. అందువల్ల ఈ ప్రస్తుత కార్యవర్గాన్ని మరో మూడేళ్ళపాటు పొడిగిస్తూ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఈ పిటిషన్‌ దాఖలు వెనుక స్వార్థం ఉంది. అందువల్ల పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలు ఆలకించిన కోర్టు తదుపరి విచారణను జూన్‌ 9వ తేదీకి వాయిదా వేసింది.

మోగ్లీ 2025 యాక్షన్ షెడ్యూల్ పూర్తి.

మోగ్లీ 2025 యాక్షన్ షెడ్యూల్ పూర్తి

Roshan Kanakala:నేటి దాత్రి :

 

 

 

 

‘బబుల్ గమ్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ కనకాల, సుమ కొడుకు రోషన్ ఇప్పుడు యాక్షన్ మూవీ ‘మోగ్లీ 2025’ లో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా క్లయిమాక్స్ లోని యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేశారు.

 

శ్రీకాంత్, ఊహ తనయుడు రోషన్ నటించిన ‘నిర్మల కాన్వెంట్’ (Nirmala Convent) తో తెరంగేట్రమ్ చేసిన సుమ (Suma), రాజీవ్ కనకాల (Rajeev Kanakala) కుమారుడు రోషన్ (Roshan) ‘బబుల్ గమ్’ (Babbulgum) సినిమాతో హీరోగా మారాడు.

ఇప్పుడు మరోసారి ‘మోగ్లీ 2025’ (Mowgli 2025) మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

‘బబుల్ గమ్’లో లవర్ బాయ్ గా నటించి ఆకట్టుకున్న రోషన్ ఇప్పుడీ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చేస్తున్నాడు.

తాజాగా 15 రోజుల పాటు ఈ సినిమా భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ ను దర్శకుడు, ‘కలర్ ఫోటో’ (Color Photo) ఫేమ్ సందీప్ రాజ్ (Sandeep Raj) పూర్తి చేశాడు.

ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

 

ఈ షెడ్యూల్ విశేషాలను సందీప్ రాజ్ చెబుతూ, ‘తాజా షెడ్యూల్ ను మారేడుమిల్లిలో చేశాడు.
ఇదో మ్యాసీవ్ యాక్షన్ సీక్వెన్స్.
ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లో రోషన్ కనకాల చాలా రిస్క్ తీసుకుని యాక్షన్ స్టంట్స్ ను పెర్ఫార్మ్ చేశాడు.
ఈ సీన్స్ మూవీకి హైలైట్ గా ఉండబోతున్నాయి.
మరో షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది.
ఇదే నెలలో టీజర్ ను రిలీజ్ చేస్తాం.
ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ హైలెట్ గా ఉండబోతున్నాయి.
అలానే మ్యూజిక్ కూ చాలా ప్రాధాన్యం ఉంది.
‘మోగ్లీ’ ఆల్బమ్, బ్యాగ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్ ఉండబోతున్నాయి.
దీనిని కాలభైరవ అందిస్తున్నారు.
ఈ మూవీతో సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
అలానే బండి సరోజ్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ యేడాది చివరిలో మూవీని రిలీజ్ చేస్తాం” అని చెప్పారు.

ఘనంగా మజీద్ ఏ కౌసర్లో బక్రీద్ వేడుకలు.

ఘనంగా మజీద్ ఏ కౌసర్లో బక్రీద్ వేడుకలు.

చిట్యాల,నేటి దాత్రి :

 

 

 

చిట్యాల మండల కేంద్రంలోని మజీద్ ఏ కౌసర్ ఆవరణలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు నమాజు చేసుకొని అనంతరం ఒకరికొకరు అలాయి బలాయి చేసుకొని ఈద్ ముబారక్ తెలపుకొని బక్రీద్ పండుగనుఆనందంగా జరుపుకున్నారు ఈ సమావేశానికి హాజరై న చిట్యాల పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగలలోముఖ్యమైనది బక్రీద్ పండుగ ఒకటి అని ఇది త్యాగ నిరతికి సౌబ్రాతృత్వానికిగుర్తుగా నిలిచిపోయే పండుగ అని చిట్యాల మండల కేంద్రంలోని ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకా ఈ సమావేశంలో చిట్యాల మండల మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మజీద్ కమిటీ సభ్యులు అధ్యక్షులు అజ్మత్ మియా కార్యదర్శి హైదర్ పాషా వైస్ ప్రెసిడెంట్ షఫీ పాషా జాయింట్ సెక్రెటరీ అక్బర్ ట్రెజరర్ హుస్సేన్ శంషుద్దీన్ అలీ పాషా సభ్యులు ఆటో అంకుసు యూసుఫ్ జలీల్ ఉమాఫ్ ఆరిఫ్ చుట్టుపక్కల గ్రామాలైన నవాబుపేట తిరుమలాపురం గ్రామ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

22వ డివిజన్లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన..

22వ డివిజన్లో కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన..

నేటిధాత్రి, పోచంమైదాన్.

 

 

వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలో 22వ డివిజన్ ప్రజల అభ్యర్థన మేరకు స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి డివిజన్ ప్రజల సౌకర్యార్ధం, వారి సమస్యను కొన్ని సంవత్సరాల నుండి ఫంక్షన్స్ కు ఇతర కార్యక్రమాలు చేసుకోవాలనుకుంటే పేద మధ్యతరగతి ప్రజలు బాధపడుతున్న పరిస్థితిని గుర్తించి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన మంత్రి కమ్యూనిటీ హాల్ కు 50 లక్షల నిధులతో నిర్మాణం చేయించాలని కోరారు.

కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ.

 

Minister Konda Surekha

 

శుక్రవారం సాయంత్రం నగర మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి లు విచ్చేసి కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. నగర మేయర్ సైతం తనవంతు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, డివిజన్ నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version