ఘనంగా మజీద్ ఏ కౌసర్లో బక్రీద్ వేడుకలు.
చిట్యాల,నేటి దాత్రి :
చిట్యాల మండల కేంద్రంలోని మజీద్ ఏ కౌసర్ ఆవరణలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు నమాజు చేసుకొని అనంతరం ఒకరికొకరు అలాయి బలాయి చేసుకొని ఈద్ ముబారక్ తెలపుకొని బక్రీద్ పండుగనుఆనందంగా జరుపుకున్నారు ఈ సమావేశానికి హాజరై న చిట్యాల పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగలలోముఖ్యమైనది బక్రీద్ పండుగ ఒకటి అని ఇది త్యాగ నిరతికి సౌబ్రాతృత్వానికిగుర్తుగా నిలిచిపోయే పండుగ అని చిట్యాల మండల కేంద్రంలోని ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకా ఈ సమావేశంలో చిట్యాల మండల మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మజీద్ కమిటీ సభ్యులు అధ్యక్షులు అజ్మత్ మియా కార్యదర్శి హైదర్ పాషా వైస్ ప్రెసిడెంట్ షఫీ పాషా జాయింట్ సెక్రెటరీ అక్బర్ ట్రెజరర్ హుస్సేన్ శంషుద్దీన్ అలీ పాషా సభ్యులు ఆటో అంకుసు యూసుఫ్ జలీల్ ఉమాఫ్ ఆరిఫ్ చుట్టుపక్కల గ్రామాలైన నవాబుపేట తిరుమలాపురం గ్రామ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.