కోటి ఎకరాల మాగాణం చేసినందుకు నోటీసులా.

కోటి ఎకరాల మాగాణం చేసినందుకు నోటీసులా.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగరెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ పౌర్ణమి సందర్భంగా గానుగాపూర్ దత్తాత్రేయుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ తొలీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి .అధికార కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నోటీస్ పంపడాన్ని నిరసిస్తూ.అట్టి కమీషన్ ఎదుట ఈరోజు హాజరు కావాల్సిందిగా కోరడం వల్ల కెసిఆర్ గారికి హా దేవ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకొని మనోధైర్యం ప్రసాదించాలని కోరుకున్న నన్నారు రైతులకోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రపంచం లోనే ఎంతో పెద్ద ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ ను కోటి ఎకరాల మాగాణం చేసిన ఆయనకు నోటీసులా అని ఈసందర్భంగా బావోదెవ్గానికి గురై .తొలి ముఖ్య ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి హ దత్తాత్రేయుని ఆశీర్వాదం ఉండాలని కోరారు .ఎలాంటి మచ్చ లేకుండా ఎదుర్కొని బయట పడతారన్నారు.ఇట్టి పూజ కార్య క్రమంలో .యువకులు శ్రీనివాస్ సంగమేశ్వర్ తమ్మలి దశరథ్ పాల్గొన్నారు.

పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు…

పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు…

వ్యాధుల కాలం- జరఫైలం..

అన్ని రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించాలి…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి…

ఆసుపత్రి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి…

వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా కావలసిన అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి…

పారిశుద్ధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టాలి…

డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి…

మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ ప్రక్రియ నిర్వహించాలి…

మీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయాలి…

దోమలు రాకుండా ఫాగింగ్ చేయించాలి…

వైద్య సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి…

పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి…

బిపి, హెచ్ఐవి,షుగర్ రోగుల పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్య సేవనందించాలి…

స్కానింగ్ మిషన్లు,ఫ్యాన్లు, జనరేటర్లు అందుబాటులో ఉంచాలి…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి…

 

 

 

 

 

Lurking seasonal diseases

నేటి ధాత్రి -మహబూబాబాద్, గార్ల:- వర్షాకాలం ప్రారంభంలో మండల వ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం లోపించి రోడ్లపైనే మురికి నీరు నిలబడడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. గ్రామస్థాయి అధికారులు, వైద్య సిబ్బంది ముందు నుండే జాగ్రత్త పడి జ్వరాలను నియంత్రించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా డెంగ్యూ, చికున్ గున్య, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. వర్షాకాలం కారణంగా వీధులు, రహదారులు, ఇళ్ల నడుమ మురుగునీరు నిలిచి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతి ఏటా వానాకాలంలో వ్యాధుల ముప్పు పెరిగి పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగ్యూ,చికున్ గున్య,మెదడువాపు, ఫైలేరియా,అతిసారం, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులు గ్రామీణ ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించాలి. ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలి. ఆసుపత్రి చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించుకోవాలి. పల్లె ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు వచ్చే రోగులకు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారితో స్నేహపూర్వకంగా మెలిగి వైద్యం అందించాలి. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా కావలసిన అత్యవసర మందులు, వైద్యం అందుబాటులో ఉంచాలి. అత్యవసర మందులు ఆసుపత్రుల్లో సమయానికి లేకపోతే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ, గ్రామపంచాయతీ, మున్సిపల్, విద్యాశాఖ, సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్ల అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్ వ్యాధులను అరికట్టాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను సక్రమంగా చేపట్టి ప్రజలు డెంగ్యూ,మలేరియా,చీకున్ గున్య లాంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. డ్రైనేజీలు మురుగు నీటితో, చెత్తాచెదారం తో నిండిపోయి ఉన్నాయి. తక్షణమే డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. వర్షాకాలంలో మంచినీటి బావులలో చెత్తాచెదారం, దుమ్ము ధూళితో నీళ్లు కలుషితం అయ్యే ప్రమాదం ఉన్నందున ఎప్పటికప్పుడు మంచినీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి. నీరు నిల్వ ఉండే చోట ఆయిల్ బాల్స్ వేయించి దోమలు రాకుండా ఫాగింగ్ చేయించాలి. వారానికి రెండు రోజులు డ్రైడే పాటించేలా అధికారులు కిందిస్తాయి అధికారులను ఆదేశించాలి. వర్షాకాలంలో వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. మలేరియా, చీకున్ గున్య, డెంగ్యూ వంటివి పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించడం, దోమలు, ఈగలు వ్యాప్తి చెందడం కారణంగా వ్యాధులు ప్రభలే ఆస్కారం ఉంటుంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం పట్ల ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. అన్ని రకాల మందులతోపాటు నీడిల్స్ కొరత రానివ్వకుండా చర్యలు చేపట్టాలి. బిపి, హెచ్ఐవి, షుగర్ రోగుల పట్ల వైద్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన సేవలందించాలి. ప్రభుత్వ వైద్య సిబ్బంది స్థానికంగా ఉండి వైద్య సేవలు అందించడంలో విఫలం చెందటంతో ప్రజలు ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. స్తోమత లేకపోయినా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలో నిర్లక్ష్యం మూలంగా, సకాలంలో వైద్యం అందించకపోవడంతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో, వసతి గృహాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి.మలేరియా, చీకున్ గున్య, ఫైలేరియా, డెంగ్యూ, జ్వరాలు మరియు కలుషిత నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అతిసారా, కలరా, రక్త విరోచనాలు, టైఫాయిడ్, వ్యాధులు రాకుండా గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. పాము తేలు కాటు మందులను అందుబాటులో ఉంచాలి. పాము తేలు కాటుకు గురైన ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో మంత్రాలు, నాటు వైద్యులను సంప్రదించి ఆలస్యం చేయడం మూలంగా మరణాలు సంభవిస్తున్నాయి. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత పాటించి రోగాల బారి నుండి ప్రజలను కాపాడే విధంగా వైద్య సిబ్బంది చొరవ చూపాలి. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టాలి. అన్ని సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఓఆర్ఎస్ పొట్లాలు అందుబాటులో ఉంచాలి. గ్రామపంచాయతీలు, పురపాలికల్లో నీటి క్లోరినేషన్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులపై నిరంతర పర్యవేక్షణ చేయాలి. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో ప్రజల వద్దకు ప్రతి ఇంటింటికి వెళ్లి జాగ్రత్తలు తెలియజేయాలి. ఇళ్లలోని కుండీలు, కూలర్లు వంటి వాటిలో ఉన్న నీటిని పారబోసేలా చైతన్యం చేయాలి. గ్రామాలు కాలనీల్లో ని ఖాళీ స్థలాల్లో నీటి నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలి. కానీ ప్రస్తుతం ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగా, వైద్యులు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించడంతో గ్రామాల్లో ఇవేమీ అమలు కావడం లేదు. సీజనల్ వ్యాధులు ముంచుకొస్తున్న వేళ ముందస్తు చర్యలు చేపట్టి గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి, పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ వైద్యులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని ప్రజలు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష పార్టీలు కోరుతున్నారు.

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి!

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి!

◆ అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చర్చించాలి.

◆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.

◆ ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ మాట్లాడుతు నవంబర్ 11న మన దేశ తొలి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని, భారత ప్రభుత్వం 2008 నుండే జాతీయ విద్యా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగాన్ని ఆధునికీకరించడంలో, ఐఐటీల స్థాపనలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటులో ఆయన అపారమైన కృషి చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.

ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు:

విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం

సమాన విద్యావకాశాలపై చర్చ జరగడం

విద్యా రంగ పురోగతిపై చైతన్యం కలిగించడం

ప్రతి సంవత్సరం ఈ రోజున పాఠశాలలు, కళాశాలలల్లో:

వ్యాసరచన పోటీలు

చర్చా వేదికలు, సదస్సులు

విద్య ప్రదర్శనలు

విద్యా అభివృద్ధిపై చర్చలు

వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.
అలాంటి ముఖ్యమైన, విద్యావ్యవస్థకు మూలస్తంభంగా నిలిచే రోజు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం, బాధాకరం కూడా.విద్యార్థుల ఎదుగుదలలో అలాంటి స్ఫూర్తిదాయకమైన దినోత్సవాలను ప్రోత్సహించాలి గానీ విస్మరించకూడదు.అందుకే, జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11 తేదీకి తగిన ప్రాధాన్యంతో తిరిగి అకడమిక్ క్యాలెండర్‌లో చేర్చాలి అనే డిమాండ్‌ను విద్యాభిమానులందరం గళమెత్తి కోరుతున్నామన్నారు.75 ఏళ్లుగా దేశాన్ని తప్పుదోవ పట్టించడంతో తృప్తి చెందనట్లుగా, జాతీయవాద పార్టీలు అని పిలవబడే పార్టీలు మరియు వారి అనుయాయులు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారికి ఈరోజు కూడ జేజేలు పలుకుతున్నారు. నిస్సందేహంగా “అతను జన్మతః భారతీయుడు కాదు. అతను ఏ పాఠశాలకు వెళ్లలేదు! ‘హిందూ ముస్లిం ఐక్యత’ యొక్క చిహ్నాలలో ఒకరైన, గాంధీతో సమానంగా కీర్తించబడిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్రం తర్వాత దేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యాడు.భారతదేశంలో విద్యకు పునాదులు వేసిన మహనీయుడు, దృఢమైన జాతీయవాది, గంగా జమునీ తహజీబ్ యొక్క ప్రతీకగా నివాళులర్పించుకున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం?…అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి
అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చేర్చాలని
ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
డిమాండ్ చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి.

గీతాంజలి కేంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నూతన విద్యా శిఖరం.

భద్రాద్రి కొత్తగూడెం/హైదారాబాద్,నేటిధాత్రి:*

నేటి ఆధునిక యుగంలో విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో గీతాంజలి పబ్లిక్ స్కూల్ అత్యాధునిక హంగులతో, కేం బ్రిడ్జి సిలబస్ తో కూడిన పాఠశాలను ఏర్పాటు చేయగ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.

 

Provide quality education to students

అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఇంటర్నేషనల్ (ఐజిసిఎస్ఈ), కేం బ్రిడ్జ్ సెలబస్ తో ప్రారంభించడం భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు.ఇంత మంచి ఇంటర్నేషనల్ హంగులతో కూడినటువంటి పాఠశాలను ప్రారంభించిన గీతాంజలి స్కూల్ ఆఫ్ చైర్మన్, డైరెక్టర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.గీతాంజలి పబ్లిక్ స్కూల్ ప్రారంభంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నాణ్యతతో కూడిన విద్యా సౌకర్యాలు ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా నాణ్యతతో కూడిన విద్య తమకందుబాటులో ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబ్బీర్ పాషా మాట్లాడుతూ సకలహంగులతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ భద్రాద్రి కొత్తగూడెం రావడం ఇదే మొదటిది అని ఏసీ గదులు, ఏసి బస్సులతో, డిజిటల్ బోర్డులతోఇంత మంచి స్కూల్ రావడానికి సహకరించిన సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చొరవతో నాణ్యతతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుందని ఇంత మంచి ఆలోచన చేసిన గీతాంజలి గ్రూప్ ఆఫ్ చైర్మన్స్ వేములపల్లి సుబ్బారావు , డైరెక్టర్స్, ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యా వ్యాపారంగా కొనసాగుతుందని విద్యను వ్యాపారం చేయకుండా విద్యను ఒక సేవ దృక్పథంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్, కేంమ్ బ్రిడ్జి సిలబస్ తో గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని పాఠశాలలోని సౌకర్యాలను చూసి ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో స్దానిక సిపిఐ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా గొల్లపల్లి సత్య పీరీలు(దర్గా) యాత్రకు

వైభవంగా గొల్లపల్లి సత్య పీరీలు(దర్గా) యాత్రకు *సిరిసిల్ల విద్యానగర్ అడ్డా ఆటో యూనియన్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని విద్యానగర్ అడ్డ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ యూనియన్ సంఘం వారు
ఈరోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం గొల్లపల్లి దర్గా సత్య పీరీలు యాత్రకు అంగరంగ వైభవంగా యాత్ర చేపట్టడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల విద్యానగర్ అడ్డా టాటా యూనియన్ ప్యాసింజర్ అధ్యక్షులు అధ్యక్షులు మహమ్మద్ షఫీవుద్దీన్,ప్రధాన కార్యదర్శి నడిగోట్టు సుమన్, కోశాధికారి పేరుమల సత్తయ్య, కార్యదర్శి. కూతూరి బాలకృష్ణారెడ్డి, తదితర ఆటో యూనియన్ సభ్యులు పాల్గొనడం జరిగినది.

ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం

ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం

సిపిఎం పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్

పరకాల నేటిధాత్రి

 

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్ విమర్శించారు.ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు అందిస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందని,చాలామంది పేదలకు ఇండ్లు వస్తాయని ఆశించినప్పటికీ నిరాశ ఎదురయిందని,ఇందిరమ్మ కమిటీలు నియమించినప్పటికీ అందులో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి ఇండ్లు కూడా వారికే ఇచ్చారని,గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్ రూమ్ లు బిఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయించినట్లుగానే,కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చి పేదలకు అన్యాయం చేసిందని,పట్టణంలోని రెండో వార్డులో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండానే,కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని తెలిపారు.కార్యకర్తల కొరకు లబ్ధి చేకూర్చడం కోసమే తీసుకొచ్చిన పథకాలను ప్రజల లబ్ధి కోసమే ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజాప్రతిని స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్ట్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న టి యు డబ్ల్యూ.

జర్నలిస్ట్ అక్రమ అరెస్టును ఖండిస్తున్న టి యు డబ్ల్యూ( ఐ జే యు)

కేసముద్రం/ నేటి దాత్రి

 

 

 

సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు అక్రమ అరెస్టు, ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ మంగళ వారం మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో టి యు డబ్ల్యూ (ఐ జేయూ), వివిధ పార్టీల, సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐజేయూ రాష్ట్ర నాయకులు బండి సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో సాక్షి కార్యాలయాలపై దాడి చేయడం, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు.

కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు నిరసన

కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు నిరసన

కొమ్మినేని శ్రీనివాస్ రిపోర్టర్ అరెస్టుకు నిరసన

భూపాలపల్లి నేటిధాత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే విధంగా సాక్షి సీనియర్ రిపోర్టర్
కొమ్మినేని శ్రీనివాస్ రావు అరెస్ట్ ను నిరసిస్తూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నల్ల బ్యాడ్జిలు ధరించి ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ లో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి కి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన జర్నలిస్టులు. సాక్షి ఛానల్ పత్రిక కార్యాలయాలపై దాడులను ఖండిస్తున్నామని అక్రమంగా అరెస్టు చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులు.

మద్యం మత్తులో వ్యక్తి మృతి

మద్యం మత్తులో వ్యక్తి మృతి

నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండల కేంద్రంలోని హైస్కూల్ ప్రాంతంలో ఒక వ్యక్తి మధ్యమధ్య మృతి చెందాడు ఎస్ఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం, నల్లబెల్లి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన బద్య 38 సంవత్సరాలు, గల వ్యక్తి మద్యానికి బానిసై ఇల్లు వదిలి నెక్కొండ పట్టణ కేంద్రంలో చిత్తు కాగితాలు ఏరుకుంటూ అమ్ముకొని జీవిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించి ఐస్క్రీం ప్రాంతంలో రోడ్డు పక్కన పడి చనిపోయినట్టు మృతుడి భార్య వంకుడోత్ శాంతి ఫిర్యాదు చేసినట్టు ఎస్సై మహేందర్ తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం

-ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

-కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

-మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

-గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

-పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

-మొగుళ్ళపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, లబ్దిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

మొగులపల్లి నేటి ధాత్రి

 

 

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొర్కిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వోలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.

కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు. గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు.

మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.

గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ మొగుళ్ళపల్లి మాజీ చైర్మన్ ఫోలీనేని లింగారావు, పీఏసీస్ మొగుళ్ళపల్లి వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంద సాంబయ్య, కేతిపల్లి తిరుపతిరెడ్డి, రొంటాల సంపత్, చర్లపల్లి శ్రీధర్ గౌడ్, క్యాతరాజు లింగమూర్తి, పొన్నాల విజయేందర్ రెడ్డి, ఎలేటి శివారెడ్డి, పడిదల ప్రకాష్ రావు, మల్సాని రాజేశ్వర్ రావు తదితరులున్నారు.

విడిపోయిన తండ్రి కొడుకులను కలిపిన నెక్కొండ ఎస్సై

విడిపోయిన తండ్రి కొడుకులను కలిపిన నెక్కొండ ఎస్సై

నెక్కొండ, నేటి ధాత్రి:

 

నెక్కొండ మండలంలోని తొపనపల్లి గ్రామంలో కందికొండ మల్లయ్య, అతని కుమారుడు కుమారుడు ప్రభాకర్, కోడలు రజిత లతో గొడవపడి రెండు సంవత్సరాల క్రితం విడిపోయి గ్రామంలోని పాడుబడిన పాత పాఠశాల బిల్డింగ్ లో మల్లయ్య భార్య వీరి లక్ష్మితో ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న నెక్కొండ ఎస్ఐ మహేందర్ తల్లి తండ్రి కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి తల్లి తండ్రి కొడుకులను కలిపిన ఎస్ఐ మహేందర్ దీంతో పోలీసుల విధానాన్ని ఎస్సై చోరవకు పలు వర్గాల ప్రజలు అభినందనలు తెలిపారు.

బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు

బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, రిజర్వేషన్ల పెంపు కోసం సీఎం నేతృత్వంలో అఖిలపక్షం నేతలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఢిల్లీకి వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి త్వరలోనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపడతామని ప్రకటించడం అభినందనీయమన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వాన్ని బీసీలు విశ్వసిస్తారన్నారు.

డాక్టర్ భూoరెడ్డి పార్టీవదేహానికి నివాళులర్పించిన.

డాక్టర్ భూoరెడ్డి పార్టీవదేహానికి నివాళులర్పించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

ఉత్తర తెలంగాణ జిల్లాల పేదలకు వైద్యసేవలందించిన ప్రముఖ వైద్యులు డాక్టర్ భూoరెడ్డి మరణం బాధాకరమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

మంగళవారం కరీంనగర్ లోని భూంరెడ్డి పార్థివ దేహానికి చాడ వెంకటరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.

భూంరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

డాక్టర్ భూంరెడ్డి వరంగల్ జిల్లాలో పుట్టి వైద్య విద్యనభ్యసించి కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో సర్జన్ గా వైద్య సేవలు అందించడానికి వచ్చి ఇక్కడే స్థిరపడి ఎంతోమంది పేదలకు వైద్య సేవలు అందించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, వైద్య వృత్తిలోకి వచ్చే ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడని, వైద్య పరంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలలో పాలుపంచుకొని వైద్య వృత్తిపై, రోగులకు సేవలందించే విధానంపై అందరికీ వివరించేవాడని, వృతి పరంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారని, ఐఎంఏను బలోపేతం చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పనిచేశారని,ఆయన ఎనబై ఏళ్ల వయస్సు దాటేంత వరకు కూడా వైద్య సేవలందించిన గొప్ప వైద్యులు భూoరెడ్డి అని అలాంటి డాక్టర్ మృతి చెందడం బాధాకరమని వెంకటరెడ్డి అన్నారు. మృతదేహానికి నివాళ్లర్పించిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బ్రామాండ్లపెల్లి యుగేందర్, బూడిద సదాశివ, నాయకులు చెంచల మురళి, తదితరులున్నారు.

పండగ వాతావరణంలో పాఠశాలల పునః ప్రారంభం

పండగ వాతావరణంలో పాఠశాలల పునః ప్రారంభం చేయాలి

మండల పరిషత్ అబివృద్ది అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు,పంచాయతీ కార్యదర్శులు సమన్వయం చేసుకుని పాఠశాలను అందంగా తీర్చిదిద్ది పండుగ వాతావరణంలో పునః ప్రారంభం చేయాలని ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ప్రదానోపాద్యాయులు,గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి,అంగన్వాడీ టీచర్ ఆశా,పేరెంట్స్ కమిటీ సభ్యులు,విఓ,లైన్ మెన్ లతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని,ప్రధానోపాధ్యాయులు మద్యాహ్న బోజనానికి సంబంధించి బియ్యం ఇతర దినుసులు సరిగా ఉండేలా చూడాలని సూచించారు.అలాగే స్కూల్ యూనిఫాం నోట్ బుక్స్ పంపిణీ కొరకు సిద్ధంగా ఉంచుకోవాలని మరుగుదొడ్లు మరియు నీటి సరఫరా ఎలక్ట్రిసిటీ మొత్తం సరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

పాకాల ఎకో టూరిజంగా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి.

పాకాల ఎకో టూరిజంగా అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

డీఎఫ్ఓ అనుజ్ అగర్వాల్ తో కలిసి పాకాల సరస్సు,పరిసర ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

వరంగల్ జిల్లా పాకాలను ఎకో టూరిజంగా మరింత అభివృద్ధి చేయుట కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా అటవీ శాఖ అధికారి అనూజ్ అగర్వాల్ తో కలిసి క్షేత్రస్థాయిలో నర్సంపేట రేంజ్ లోని పాఖాలలో గ్రీన్ హెరిటేజ్ క్రింద అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కును, బట్టర్, ట్రిక్కింగ్, సైక్లింగ్, పగోడాలను పరిశీలించిన అనంతరం కలెక్టర్ పాకాల సరస్సులో బోటింగ్ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటకులకు ఆకర్షించే విధంగా పాకాల సరస్సు పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయుటకు పటిష్టమైన ప్రణాళికలు రచించాలని డీఎఫ్ఓకు సూచించారు.

 

Collector Dr. Satya Sarada.

 

 

అందులో భాగంగా బయోడైవర్శిటీ పార్క్ ను మరింత అభివృద్ధి పరచడం, పర్యావరణ పర్యాటక అభివృద్ధి చేయాలని, సఫారీ ట్రాక్ ఏర్పాటు, మూలికల తోట పునరుద్ధరణ, సందర్శకులకు రాత్రి బస సౌకర్యాల అభివృద్ధి, చెరకు ప్యాచ్ అభివృద్ధి, పర్యావరణ పర్యాటక సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ ఓ రవికిరణ్, డిప్యూటీ ఎఫ్ఆర్ఓ,అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు.

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి :

భూపాలపల్లి:: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ ని అరికట్టాలని అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని అనుమతులు లేని పాఠశాలలను విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల పర్మిషన్ రద్దు చేయాలని అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో పేద వారి దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్ పై వెంటనే విచారణ జరిపి స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని దాంతోపాటు అనుమతులు లేని పాఠశాలలకు వెంటనే మూసివేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా విద్యా సంవత్సరం మొదలు కాకముందే ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యం గ్రామీణ స్థాయి వరకు వెళ్లి అడ్మిషన్స్ చేస్తున్నారు తక్షణమే వారి పైన చర్యలు తీసుకోవాలి దాంతోపాటు స్కూల్స్ ఓపెన్ కాకముందే లక్షల లక్షల బుక్స్ బినామీన పేర్లతో రూమ్స్ ఏర్పాటు చేసి పుస్తకాలు అమ్ముతున్నారు.. తక్షణమే ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకొని జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా వారిని కలిసి కోరడం జరిగింది లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా వారు అన్నారు

ఇల్లు లేని గరీబోళ్ల కల నెరవేరింది.

ఇల్లు లేని గరీబోళ్ల కల నెరవేరింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశంసలు కురిపిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు

కేసముద్రం/ నేతి ధాత్రి

 

 

 

 

 

కేసముద్రం మండలం
కాట్రపల్లి గ్రామంలోని సంబంధిత హౌసింగ్ ఏఈ అభినయ్ మరియు పంచాయతీ సెక్రటరీ చీకటి రమ్య ఆధ్వర్యంలో. మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు హక్కు పత్రాలు అందజేసి ముగ్గులు పోయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొని ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సందేపాక సంధ్య భర్త ప్రభాకర్ కు ఇందిరమ్మ ఇండ్ల హక్కు పత్రాన్ని అందజేసి గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలోని నీరు పేద ప్రజలకు కనీసం ఉండటానికి ఇల్లు లేక సొంత ఇంటి కల నెరవేర్చక పోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడుతుండగా ఈ రాష్ట్ర ప్రజల స్థితిగతులు చూసిన,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ము ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చిందని వారు కొనియాడారు.

 

Chief Minister Revanth Reddy.

 

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్వాయి వెంకట్ రెడ్డి, ,సిరికొండ మల్లయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు పుట్ట ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చాగంటి యాదగిరి, జల్లే యాకాంబరం, ఎస్సీ కాలనీ పెద్దమనిషి జల్లే జాన్సన్, కాలేపాక సహదేవ ,సునీల్ గ్రామపంచాయతీ సిబ్బంది, బాదావత్ బాల్య గుండెపాక మాణిక్యం తదితరులు పాల్గొని ఇందిరమ్మ ఇల్లులకు ముగ్గులు  పోయడం జరిగింది.

టిడబ్ల్యూజేఎప్ జిల్లా మహాసభల పోస్టర్ ల ఆవిష్కరణ

టిడబ్ల్యూజేఎప్ జిల్లా మహాసభల పోస్టర్ ల ఆవిష్కరణ

మహాసభలను విజయవంతం చేయండి

జిల్లా అద్యక్షులు తాడగోని రాజు

పరకాల నేటిధాత్రి

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫోరం హనుమకొండ జిల్లా తృతీయ మహాసభలు
ఈనెల 13 తేదీన హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరుగనున్నాయని జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయాలని టిడబ్ల్యూజేఎప్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు తడగోని రాజు పిలుపునిచ్చారు.మంగళవారం అమరాదామంలో మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా గూడెల్లి నాగేంద్ర అద్యక్షతన జరిగిన సమావేశంలో రాజు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో గత బిఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందన్నారు.అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా అక్రిడేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు.అదికారంలోకి వచ్చే ముందు జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడా ఊసే ఎత్తడం లేదంటు విమర్శించారు.రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయని అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు సైతం నెల కొంటున్నాయంటు ఆవేదన వ్యక్తం చేశారు‌.ఈలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునారావృతం కాకుండా సమర్దవంతంగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అందుకు జర్నలిస్టు సమాజం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరంఉందన్నారు.జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫోరం జిల్లా మహాసభలకు ప్రతి జర్నలిస్టు హాజరై విజయవంతం చేయాలని రాజు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజెఎఫ్ జిల్లా నాయకులు అంతడుపుల శ్రీనివాస్,దామెర రాజేందర్,కోగిల చంద్రమౌళి,ఏకు రవికుమార్,సిలువేరు రాజు,దేవు నాగరాజు,నాగెల్లి సంతోష్,చుక్క సతీష్, తదితరులు పాల్గొన్నారు.

రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ చేసిన.

రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ చేసిన సింగరేణి సంక్షేమ సంఘం నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

 

కాకతీయ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించిన సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం రీజన్ బెల్లంపల్లి రీజన్లో రోస్టర్ రిజిస్టర్స్ వెరిఫికేషన్ తనిఖీ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగరేణి చీఫ్ లైజన్ ఆఫీసర్, ఏరియా లైజన్ ఆఫీసర్, అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పర్సనల్ మేనేజర్, జనరల్ మేనేజర్ వారి బృందంతో పాటు సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు అధ్యక్షులు భాస్కర రావు జనరల్ సెక్రెటరీ భూక్య నాగేశ్వరరావు కార్యనిర్వాహక అధ్యక్షులు పంతుల ఏరియా అధ్యక్షులు సెక్రెటరీ పాల్గొని, ఆర్జి-1 ఏరియా, ఆర్జి-2 ఏరియా, బెల్లంపల్లి ఏరియా, మందమర్రి ఏరియా, శ్రీరాంపూర్ ఏరియా, ఎస్ టీ పీపీ ఈ 5 ఏరియాల్లో ఉన్నటువంటి రోస్టర్ రిజిస్టర్ పుస్తకాలను తనిఖీ చేయడం జరిగిందని వారు తెలిపారు
ఇప్పటివరకు క్యారీ ఫార్వర్డ్ అవుతున్న అన్ని పోస్టుల వివరాలను ఏరియా పర్సనల్ మేనేజర్ ద్వారా కాపీలను తీసుకోవడం జరిగింది ఏరియాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి,
ఆర్జి -1 ఏరియా, – 66 ఆర్జి-2 ఏరియా, – 31
ఆర్జి- 3 ఏరియా. -48
బెల్లంపల్లి ఏరియా – 11
మందమర్రి ఏరియా – 31
శ్రీరాంపూర్ ఏరియా. -92
ఎస్ టి పిపి- 03
భూపాలపల్లి ఏరియా – 33
ఎన్ సి డబ్ల్యూ ఏ
క్యాడర్లలో వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీలను పైన తెలిపిన విధంగా ఏరియాలో గిరిజనుల పోస్ట్లు భర్తీ కాకుండా ఉన్నాయని తెలియజేస్తున్నాము వాటిని భర్తీ చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ పర్సనల్ మేనేజర్ కి తెలియజేయడం జరిగింది వాటిని భర్తీ చేయడానికి మేనేజ్మెంట్ వారు అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది కావున ఏరియాలో ఉన్న జరిగిన ఉద్యోగస్తులు గమనించగలరు కోరుతున్నాము
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా అధ్యక్షులు మోహన్ సెక్రటరీ హేమ నాయక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి రాములు, జాయింట్ సెక్రెటరీ రాజు నాయక్ సిహెచ్ వెంకన్న జి అనిల్ లక్ష్మణ్ మోతిలాల్ పాల్గొన్నారు

అగ్ని ప్రమాదాల నివారణ గురించి అవగాహన కార్యక్రమం.

అగ్ని ప్రమాదాల నివారణ గురించి అవగాహన కార్యక్రమం

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మరియు వాటిని నియంత్రించేటువంటి పద్ధతులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని కల్నల్ ఆఫీసర్ ఏకే జయంతి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజు నాయక్, ఇతర అధికారులతో కలిసి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహింపబడుతున్నటువంటి ఎన్సిసి క్యాడెట్ల శిక్షణ శిబిరంలో భాగంగా అగ్నిమాపక శాఖ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించినటువంటి అగ్ని ప్రమాదాల నివారణ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలను నివారించవలసిన అవసరం ఎంతగానో ఉందని ముఖ్యంగా ప్రాణాలు కోల్పోవడమే కాకుండా పెద్ద నష్టం కలిగేటువంటి ప్రమాదాలను ఎప్పటికప్పుడు నియంత్రించాలని వారు చెప్పారు.

అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి, వాటిని ఎలా నియంత్రించవచ్చని విద్యార్థులకు తెలియజేయవలసిన అవసరం ఎంతగానో ఉందని, అగ్ని ప్రమాదాలు వివిధ రకాలుగా ఉంటాయని విద్యుత్ సంబంధిత ప్రమాదాలు, వంటగదిలో సంభవించే ప్రమాదాలు, ప్రమాదశాత్తుగా ఎగిసేటువంటి మంటలు, నిర్లక్ష్యం వలన జరిగేటువంటి ప్రమాదాలను విద్యార్థులకు తెలియజేయాలని వారు చెప్పారు.

వారు మాట్లాడుతూ ఎప్పుడైతే అగ్నిప్రమాదం సంభవిస్తుందో ఆసమయంలో అగ్నిమాపక సిబ్బంది యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలని మరియు అగ్నిప్రమాదం నివారణ పరికరాలను కొన్నింటిని అందుబాటులో పెట్టుకోవాలని వారు సూచించారు.

అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించినటువంటి అవసరం ఎంతగానో ఉందని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజు నాయక్ తెలిపారు.

ముఖ్యంగా హోం విధానం కార్బన్డయాక్సైడ్ పౌడర్ లిక్విడ్ వివిధ విభాగాల పద్ధతులను తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనే మాట చెప్పారు.

ప్రతి విద్యార్థి ఈవిలువైన సమాచారాన్ని అందించాలని మరియు ఇటువంటి విపత్తులు అకస్మాత్తుగా ఎదురైనప్పుడు ముందు వరుసలో ఉండి సేవా భావాన్ని వ్యక్తీకరించాలని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆఫీసర్ వి.కృష్ణ, సబ్ మేజర్ సాగర్ సింగ్, సిబ్బంది, కెడెట్లు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version