సమానత్వం కోసం కృషి చేసిన విప్లవ జ్యోతి పూలే.

సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన విప్లవ జ్యోతి పూలే.

ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే
198 వ జయంతి* వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఆ మహానీయుని చిత్ర పటానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ లు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పూలే 11 ఏప్రిల్ 1827 న జన్మించాడని, మరియు షనవంబర్ 28, 1890 న మరణించారని* తెలిపారు . ఆయన బ్రతికినంత కాలం సామాజిక సమానత్వం కోసం పోరాడారని, బాల్యంలో అనుభవించిన దుర్బర జీవితం 19 వ శతాబ్దపు చీకటి రోజుల్లో బ్రాహ్మణీయ కులతత్వపు కోరల్లో చిక్కి శల్యమై పోతున్నా అణగారిన వర్గాలలో కుల నిర్మూలన దృక్పథాన్ని బోధించి అగ్రకులాల దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాల ప్రజలను సామాజిక విప్లవం దిశగా మేల్కొలిపిన తొలి సామాజిక విప్లవ చైతన్య స్ఫూర్తి మహాత్మా జ్యోతి రావు పూలే అని కొనియాడారు. మన భారత దేశంలో స్త్రీల విద్యాభివృద్ధికి* మొదటగా అంకురార్పణ చేసిన మహానీయుడు జ్యోతి రావు పూలేని తెలిపారు. మొట్టమొదటి సారి స్త్రీలకు పాఠశాలలను నెలకొల్పి తప బార్య అయిన సావిత్రి భాయి ఫూలే ను మొదటి ఉపాధ్యాయురాలిగా మార్చాడన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల బానీస బ్రతుకుల నుంచి విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త అన్నారు . కరుడుగట్టిన సామాజిక కట్టుబాట్లను తీవ్రంగా వ్యతిరేకించి వాటి నిర్మూలనకు జీవితమంతా పరితపించాడని చెప్పారు. మన భారత దేశానికి ఆ మహానీయుడు చేసిన సేవలు మరువలేనివని గ్రామ స్థాయి నుంచి నేటి యువత మహాత్మా జ్యోతి రావు పూలేను ఆదర్శంగా*తీసుకోవాలని అన్నారు ,ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కార్యదర్శి పుల్ల ప్రతాప్ నవాబ్ పేట మాజీ సర్పంచ్ రత్నాకర్ రెడ్డి అంబేద్కర్ వాది అంబాల అనిల్ అంబేద్కర్ యువజన సంఘం మండల కోశాధికారి కనకం తిరుపతి ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు నాయకులు గుర్రం తిరుపతి పాముకుంట్ల చందర్ తదితరులు పాల్గొన్నారు.

“కొండా” జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్.

“కొండా” జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్..

మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్‌లో మెగా జాబ్ మేళా..

నిరుద్యోగులతో కిక్కిరిసిన హోటల్ ప్రాంగణం

వరంగల్ తూర్పు, నేటిధాత్రి:

 

వరంగల్ తూర్పు నియోజక వర్గ పరిధిలోని ఏం.కే నాయుడు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ ( సీతక్క) తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ. వరంగల్‌లో మెగా జాబ్‌మేళా ప్రారంభించిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క లు మాట్లాడుతూ, 60 కంపెనీల ద్వారా 11 వేల మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం చేశాం అని అన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం అని, ఎవరి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు దక్కుతాయి అని అన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్‌ హయాంలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అని విమర్శించారు. మా ప్రభుత్వంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం అని మంత్రులు కొండా సురేఖ, సీతక్క లు అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అప్జల్ బియాబాని, ఖుస్రో పాషా, అదనపు కలెక్టర్ సంధ్య రాణి, తూర్పు కార్పొరేటర్లు, జిడబ్ల్యూఎంసీ ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగులతో కిక్కిరిసిన హోటల్ ప్రాంగణం

మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించిన జాబ్ మేళా నిరుద్యోగుల విశేష స్పందనతో కిక్కిరిసిపోయింది. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ మేళాకు ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. దీంతో ప్రాంగణం నిండిపోవడంతో, పరిస్థితిని సమర్థంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాలో దాదాపు 100 కంపెనీలు పాల్గొన్నాయి. వివిధ రంగాల్లో మొత్తం 8,000కి పైగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

జాబ్ మేళాలో తొక్కిసలాట, పలువురికి గాయాలు

భారీగా సంఖ్యలో చేరుకున్న నిరుద్యోగులు.

హోటల్ ప్రధాన ద్వారం అద్దం పగిలి ముగ్గురు మహిళ నిరుద్యోగులకు గాయాలు.

వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎంకే నాయుడు హోటల్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో పలువురు ఉద్యోగార్థులకు గాయాలయ్యాయి. ఎక్కువ మంది నిరుద్యోగులు హాజరు కావడంతో హోటల్ ప్రధాన ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో అద్దం పగిలి పలువురికి గాయాలయ్యాయి. ఈ జాబ్ మేళాకు సుమారు 10వేల మంది వరకు హాజరైనా, కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని, హాలు సరిపోలేదని నిరుద్యోగులు విమర్శించారు. వీరితో పాటు పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులు హాజరవడం వల్లే తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు.

జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు.!

బహుజన సంఘర్షణ సమితి అధ్వర్యం లో జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు…పాల్గొన్న నాయకులు అధికారులు…

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండల కేంద్రం లో జరిగిన మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా మహాత్మా జ్యోతి రావు పూలె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన బహుజన, సంఘర్షణ నాయకులు ఈ సందర్బంగా ఝరాసంగం ఎంపిడిఓ సుధాకర్ బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతల్ గట్టు శివరాజ్ మాట్లాడుతూ, స్వాతంత్రానికి పూర్వం వంద ఏబై ఏండ్ల క్రితమే జ్యోతి రావు పూలె బహుజనులకు సామాజిక న్యాయం కోసం స్త్రీ విద్య మరియు సమానత్వం కోసం అగ్రకులాల వారి తో పోరాటం చేసి బహుజన వర్గాల సామాజిక హక్కులు కాపాడిన మహనీయుడు జ్యోతి రావు పూలె అన్నారు. ఆయన ఆశయాల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు బడ్జెట్ కేటాయింపులలో, సామాజిక న్యాయం కోసం బహుజనుల విద్య ఉపాధి అవకాశల కోసం బడ్జెట్ లో అధిక నిధులు కేటాయింపులు చేసి రాజ్యాంగ ఫలాలు, చట్ట బద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చుడాలని అన్నారు. ఇట్టి కార్యక్రమం లో ఎంపీడీఓ సుదాకర్, సమత సైకిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్,మాజీ ఎంపీటీసీ సి. హెచ్ రాజ్‌కుమార్,అడ్వాకేట్ షకీల్, పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతలగట్టు శివరాజ్, బహుజన నాయకులు జాగృతి అధ్యక్షులు ముదిరాజ్ పాండు, సి హెచ్ దత్తు, కొల్లూర్ గ్రామ అధ్యక్షులు డప్పుర్ సంగమేష్,బోజ్యానాయక్ తండా అధ్యక్షులు సుబాష్,సామాజికవేత్త దన్‌రాజ్ గౌడ్, 24 న్యూస్ మీడియా దిగంబర్,నాయకులు అమృత్, ప్రవీణ్,రవి విద్యాసాగర్,ఉపేందర్ మరియు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది మరియు వివిధ పార్టీ నాయకులు,వివిధ సంఘనాయకులు తధితరులు పాల్గోని మహాత్మ జ్యోతి రావు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం వద్ద అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జ్యోతిరావు పూలే ఫోటో కు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

రాజేందర్ మాట్లాడుతూ సుప్రసిద్ధ భారతీయ సామాజిక కార్యకర్త ఆలోచనపరుడు కుల వ్యతిరేక సంఘసంస్కర్త అని అన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహిళలు అనగారిన కులాల ప్రజలలో విద్య వ్యాప్తికి కృషిని కొనసాగించారని వారి సేవలను గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తిక్క సంపత్,కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఓరుగంటి కృష్ణ,నాయకులు దూడపాక శ్రీనివాస్,రజనీకాంత్,సంపత్,శివకుమార్ యూత్ నాయకులు పాల్గొన్నారు._

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎస్సై ఆర్ అశోక్.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎస్సై ఆర్ అశోక్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 26న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని గణపురం ఎస్సై ఆర్ అశోక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని గాంధీనగర్,మైలారం గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 15 లోపు గూగుల్ ఫామ్,క్యూఆర్ కోడ్ ద్వారా పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు. ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని ఎస్సై ఆర్ అశోక్ తెలిపారు._

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి.

ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

మహాత్మా జ్యోతిబా పూలే గారి జన్మదిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలా మాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త, సామాజిక సంఘ సంస్కర్త,సమాజంలోని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం మరియు విద్య కోసం జీవితాంతం కృషి చేసిన సంఘసేవకుడైన మహాత్మా జ్యోతీరావు ఫూలే జయంతి సందర్బంగా వారి సేవలను స్మరిస్తూ.వారికి నా ఘన నివాళులు తెలిపారు .ఈ కార్యక్రమంలో మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల, జాగృతి అధ్యక్షురాలు అనుషమ్మ ,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప, వార్డ్ అధ్యక్షులు దత్తాత్రేయ,అలి,వెంకట్,విశ్వేశ్వర్,
బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు రాకేష్,నాయకులు తులసి దాస్ గుప్తా,రాజ రమేష్ ,జగదీశ్వర్,ఆనందం,ప్రవీణ్ పాటిల్,ఎజాస్ బాబా,గణేష్ ,నర్సింహ రెడ్డి,దీపక్,లక్ష్మీకాంత్,మోహన్ తదితరులు పాల్గొన్నారు

నూతన రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం చేయాలి.

నూతన రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం చేయాలి

కందుకూరి నరేష్ టిడిపి పరకాల నియోజకవర్గ బాధ్యులు

పరకాల నేటిధాత్రి

రేషన్ కార్డుల అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ ప్రక్రియ చేసిన తర్వాత కూడా జిల్లా కలెక్టర్లు గాని స్థానిక తహశీల్దార్లు గాని రేషన్ కార్డుల పై క్లారిటీ ఇవ్వకపోవడం దురదృష్టకరమని గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఫోన్లు చేసి,కొత్త రేషన్ కార్డుకు అప్లికేషన్ చేసుకున్న వారికి సమాచారం ఇస్తూ,మీకు ఇదివరకు మీ తల్లిదండ్రులతో కార్డు ఉందా ఉంటే మీరు అందులో నుండి మీ పేరును డిలీట్ చేసుకుంటేనే మీకు కొత్త రేషన్ కార్డు ఎంట్రీ అవుతుంది చెప్పడం జరుగుతుందని ఏ అధికారి కూడా సరైన వివరణ ఇవ్వడం లేదన్నారు.దీనిపై పూర్తి సమీక్ష సమావేశం నిర్వహించి కలెక్టర్ తో లేదా పౌరసరపరల శాఖ మంత్రితో చర్చించి దీనికి ఒక సులభమైన మార్గాన్ని తీసుకురావాలని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కోరారు.

లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్ర ఆవిష్కరణ.

లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్ర ఆవిష్కరణ

జిల్లా ప్రధాన కార్యదర్శి కండి రవి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మసమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రను ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ లో జరగబోయే సభకు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నుండి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల ప్రజాస్వామిక ప్రజలు వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, మేధావులు పెద్ద ఎత్తున తరలిరావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గణపురం మండల కన్వీనర్ కుర్రి స్వామినాథన్, గాంధీనగర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇంజిపెల్లి విక్రం, సాగర్, పవన్, సాంబయ్య  పాల్గొన్నారు

పంతిని నాలా ఆక్రమణ వివాదానికి ముగింపు ఎన్నడు??

పంతిని నాలా ఆక్రమణ వివాదానికి ముగింపు ఎన్నడు??
కంటికి కనిపిస్తున్న కాలువను నక్షాలో లేదంటున్న అధికారులు.
భూ వివాదం ప్రయివేట్ వ్యక్తులదే కావచ్చు
కానీ, నాలా ఆక్రమణకు గురైతే ఇబ్బంది పడేది ప్రజలే..
మళ్ళీ వరదలు వస్తేనే చర్యలు చేపడుతారేమో??
జన జీవనానికి ఆటంకం కలుగుతుందంటే ఏ ప్రాపర్టీ ఐన ప్రభుత్వం స్వాదీనపర్చుకోవచ్చు కధ!!
వివాద పరిష్కారంలో సమన్వయం లేని రెవెన్యూ,ఇరిగేషన్, పోలీస్ శాఖలు
పాత ఆర్& బి రోడ్డుకు అడ్డంగా మట్టి పోసి ఇబ్బందులు పెడుతున్నారు.
ప్రశ్నిస్తే దాడులు చేసి బెదిరిస్తున్నారని బాధితుడు మేరుగు రమేష్ ఆరోపణ..
సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ చేసిన సి ఐ. ఎస్సై లు

నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ :-

అయినవోలు మండలం పంతిని గ్రామంలో గత కొంతకాలంగా జరుగుతున్న నాలా (వర్షం నీళ్లు పోయే కాలువ)ఆక్రమణ వివాదం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. రెండు సర్వే నెంబర్ల మధ్య ఉన్న ఈ కాలువ (వరద నీళ్లు వెళ్ళే దారి) ఆక్రమణకు గురి కావడంతో మొదలైన ఈ వివాదం ముదిరి ముదిరి దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. తన పక్కనే ఉన్న ఓ భూస్వామి తనకున్న ఎకరా భూమికి బదులుగా పక్కనే ఉన్న కాలువను కూడా ఆక్రమించి వర్షపు నీరు వెళ్లే దారిని మళ్లించి తన భూమిలోకి వరద నీరు వచ్చేలా చేస్తున్నాడని, ఇదేంటని అడిగితే దాడులు చేస్తున్నారని కాలువ పక్కన ఉన్న తన భూమిలో నూతనంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తున్న మేరుగు రమేష్ ఆరోపించారు. అంతేకాకుండా సదరు నాలా ఆక్రమించిన వ్యక్తి తన పలుకుబడితో అధికారులను తప్పుదోవ పట్టించి తన భూమిని భఫర్ జోన్ గా చూపించి అన్యాయంగా తన నిర్మాణాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సైతం ఆ వ్యక్తికే పరోక్షంగా మద్దతుగా వ్యవహారిస్తునట్లు అనుమానం వ్యక్తం చేశాడు.

కొనసా…..గుతున్న వివాదం

 

పంతిని గ్రామం నుంచి వచ్చే వర్షపు నీరు పంతిని గ్రామం నుండి ఖమ్మం వైపు వెళ్లే హైవేపై ఉన్న బ్రిడ్జి కింద నుంచి ఈ ఆక్రమిత కాలువ ద్వారా దిగువన ఉన్న పంట పొలాల గుండా ప్రవహిస్తుంది. అయితే ఈ కాలువను కొందరు ఆక్రమించడం ద్వారా వర్షపు నీరు రోడ్డు మీదికి ప్రవహించి వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. గత సంవత్సరం కూడా వర్షాలు పడినప్పుడు ఇదే పరిస్థితి తలెత్తింది. అప్పుడు పరిస్థితిని సమీక్షించిన రెవెన్యూ పోలీసు ఇరిగేషన్ అధికారులు కంటితుడుపు చర్యగా జెసిబి ల సహాయంతో కాలువకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి ఆక్రమిత రైతును కూడా తన భూమి వద్ద కాలువను వెడల్పు చేపించాలని సూచించారు. కానీ సదరు రైతు గ్రామంలో పలుకుబడి ఉన్న పెద్దమనిషి కావడంతో పైపై మెరుగులు దిద్ది పూర్తిగా వెడల్పు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

సమన్వయం లేని అధికారుల తీరు

 

Pantini Nala

రెండు సర్వే నెంబర్ల మధ్య ఉన్న ఈ కాల్వ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలన్న గ్రామస్తుల కోరిక మేరకు సర్వే చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి పరిష్కారం చూపలేదు. ఏ డి స్థాయి అధికారులు సైతం వచ్చి సర్వే చేసిన ఫలితం శూన్యంగానే ఉంది. రెవెన్యూ అధికారుల సర్వే ప్రకారం రెవెన్యూ నక్షలో అసలు కాలువ ప్రవాహ తీరు పూర్తిగా స్పష్టంగా లేదని కాలువ ఉన్నది లేనిదీ ఇరిగేషన్ అధికారులు తేల్చాలని చెప్పి తప్పించుకోగా, వివాద స్థలము అంతా పట్ట భూమి కావడం వల్ల కాలువను వెడల్పు చేయడంలో లీగల్ ఇబ్బందులు వస్తాయని ఇరిగేషన్ అధికారులు జాప్యం చేస్తున్నారు. అయితే వివాదం కాస్త ముదిరి పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి వెళ్లడంతో శాంతి భద్రతలకు భంగం కలుగుతున్న… ఇరువర్గాలు సమాజంలో పలుకుబడిలో ఉన్నవారు కావడం చేత తామ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుందని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. ఇలా ఈ మూడు శాఖల అధికారులు రాజకీయ ఆర్థిక ఒత్తిళ్లకు తలోగ్గి వివాదాన్ని ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారో వేచి చూడాలి.

దాడిపై విచారణ జరిపిన సి. ఐ ఎస్సై..

 

హనుమకొండ జిల్లా అయినవోలు మండలం పంతిని గ్రామంలో గతం లో ఆర్ అండ్ బి రోడ్డుగా ఉన్న బాటను ఆక్రమించి రోడ్డుకు అడ్డంగా మట్టి పోయించి పంట పొలాలు చెల్కల కాడికి పోకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పంతిని గ్రామస్తులు, పక్కన నూతనంగా ఫంక్షన్ హాల్ నిర్మాణం చేస్తున్న మెరుగు రమేష్ ఆరోపించారు. గత 20 రోజుల క్రితం ఫంక్షన్ హాల్ నూతన నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో నిర్మాణం అడ్డుకోవడానికి పంతిని గ్రామానికి చెందిన ఓ భూస్వామి అక్కడ పనిచేస్తున్న కూలీలను మేస్త్రీలను అక్కడున్న వాచ్మెన్ ను అతని భార్యను బెదిరిస్తూ అక్కడున్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని మెరుగు రమేష్ ఆరోపించారు. గతంలో ఇట్టి విషయమై సమాచారం కోసం వెళ్లిన పాత్రికేయులపై దాడి చేసి, వారి వాహనాలను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విషయంపై మెరుగు రమేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేసిన స్థానిక పోలీసులు దౌర్జన్యం చేసిన వారిపై కేసు నమోదు చేసినట్టు అయినవోలు పోలీసులు తెలిపారు. ఇందులోభాగంగానే గురువారం పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్, ఐనవోలు ఎస్సై సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను విచారణ చేశారు. విచారణ అనంతరం దోషులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని అన్నారు..

కుల వివక్ష నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే పోరాటం.

కుల వివక్ష నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే పోరాటం….

కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

కుల వివక్ష నిర్మూలన కోసం మహాత్మా జ్యోతిరావు పూలే అలుపెరుగని పోరాటం చేశారని కాంగ్రెస్ నాయకులు పలిగిరి కనకరాజు అన్నారు.శుక్రవారంక్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, టీపిసిసి నాయకులు రఘునాథ్ రెడ్డి,సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, వొడ్నాల శ్రీనివాస్, అబ్దుల్ అజీజ్ లు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూలే సేవలను కొనియాడారు.

Congress

బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేశారని నాయకులు అన్నారు. ఆ మహానీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం పూలే అలుపెరుగని పోరాటం చేశారని అన్నారు. స్త్రీ విద్య కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని ఉద్ఘాటించారు. సమసమాజ నిర్మాణంలో జ్యోతిరావు పూలే కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు.పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం అర్పించే ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జంగం కళ, బత్తుల వేణు, కుర్మ సురేందర్, ఎల్పుల సత్యం, గోపు రాజం, శివ కిరణ్, మహిళా నాయకురాల్లు సునీత, సృజన, రాజేశ్వరి, శారద, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇల్లందకుంట లో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి.

ఇల్లందకుంట లో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో
ఇల్లందకుంట: నేటిధాత్రి

 

కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది కుమార్ గారు మాట్లాడుతూ దేశానికి జ్యోతిబాపులే అందించిన సేవలను స్మరించుకున్నారు. వర్ణవివక్షను రూపుమాపడం కోసం దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం ,మహాత్మా జ్యోతిరావు పూలే ఆచరించిన కార్యచరణ మహోన్నతమైందని తెలిపారు. భారతదేశంలో అట్టడుగు వర్గాల పై జరుగుతున్న దాస్టికాలపై పోరాటం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. తన జీవితాన్ని భార్య సావిత్రిబాయి సహకారంతో పోరాటం ప్రతిఘటన సంస్కరణకు అంకితం చేసిన మహోన్నతుడాయన.కుల లింగ వివక్షతకు తావు లేకుండా విద్యా సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయని పూలే ఆలోచన విధానాన్ని తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం జ్యోతి బాపులే ను స్మరించుకుంటూ ప్రగతి భవన్ కు మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా నామకరణం చేసుకున్నామని గుర్తు చేశారు. జ్యోతిబాపూలే విద్యా కు ఇచ్చిన ప్రధాన్యత తో వెనబడిన తరగతుల గురుకులాలకు మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులాలుగా ముందుకు వెళ్తున్నాయి. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం దేశానికే దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేసుకున్నామని వెల్లడించారు. బీసీలకు 42% రాజకీయ విద్య ఉద్యోగాలు రిజర్వేషన్లు పెంచడానికి చట్టం చేసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోతూ సామాజిక న్యాయం ఆర్థిక అభివృద్ధి తదితర అంశాలతో ముందుకు పోతున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కనుమల్ల సంపత్, పెద్ది శివకుమార్, గోలి కిరణ్ , గుడిశాల పరమేశ్వర్ , బొమ్మ శీను , మారపల్లి ప్రశాంత్ , కారింగుల రాజేందర్,మీస రాజయ్య, గంగారపు మహేష్ ,కోడం శ్రీనివాస్, తోడేటి కిషన్ ,గురుకుంట్ల స్వామి , అన్నారపు సాయి, బండి మల్లయ్య ,మ్యాడిద తిరుపతిరెడ్డి, కారెట్ల పెళ్లి మణి, మోటపోతుల రాము, దారా నరేష్, జక్కు కుమార్ ,మంకు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు..

జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త.

జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త

కల్వకుర్తి/నేటి ధాత్రి

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం మహాత్మ జ్యోతిరావు ఫూలే 198వ జయంతి వేడుకలను.. బిసి సబ్ ప్లాన్ సాధన కమిటీ.. ఆధ్వర్యంలో ఘనంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త అని, పేద పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. నిరుపేద పిల్లల విద్యా దేశ భవిష్యత్తుకు పునాది అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, నాయకులు రాంభూపాల్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ జిల్లా సురేందర్ గౌడ కార్యవర్గ సభ్యులు నరేడ్ల శేఖర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు బాబీ దేవ్, రూరల్ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్, యువ మోర్చ జిల్లా కార్యదర్శి ధన్నోజు నరేష్ చారి, రాజశేఖర్ పాల్గొన్నారు.

జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళి.

జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘన నివాళి

పరకాల నేటిధాత్రి

మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పట్టణ సీనియర్ నాయకులు శనిగరపు నవీన్, గొర్రె రాజు,పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి దుప్పటి సుజయ్ రణదేవ్,సీనియర్ నాయకులు మార్క రఘుపతి,మొలుగూరి శ్రీనివాస్,మక్సుద్,పెర్వల రమేష్ పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ

ఆధునిక యుగంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన సామాజిక విప్లవ యోధుడు,సత్య శోధక సమాజ్ వ్యవస్థాపకుడు,ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను పెంపొందించిన దార్శనికుడు అని అన్నారు.జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు.

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో.

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి)

 

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సిరిసిల్ల సాహితి సమితి కార్యనిర్వాహణలో ఘనంగా వేడుకలు జరిగినది. సాహితి సమితి అధ్యక్షులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన జ్యోతిరావు పూలే అని జ్యోతిరావు పూలే భావితరాలకు ఆశ కిరణం అనిజ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సాహితీ సమితి కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, కవి రచయిత జుకంటి జగన్నాధం, మాజీ గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సిరిసిల్ల సీనియర్ సిటిజన్ అధ్యక్షులు చేపురి బుచ్చయ్య, గుండెల్లి వంశీ, ఎండి ఆఫీజ్, గజ్జెల్లి సత్యనారాయణ, అంకారపు రవి,కవులు రచయితలు పాల్గొన్నారు.

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ ఘన నివాళి.

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ ఘన నివాళి
సిరిసిల్ల, ఏప్రిల్ -11(నేటి ధాత్రి):

 

మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, డీపీఆర్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

నియంత్రణలేని ప్రైవేటు విద్య అనర్థాలకు హేతువు

హన్మకొండలో ఒక విద్యాసంస్థలో గిరిజన విద్యార్థిని ఆత్మహత్య గొప్ప ఉదాహరణ

 ఒత్తిడిని పెంచే విద్య వికాసానికి దోహదం చేయదు

 పోటీ పరీక్షల కోచింగ్‌ పేరుతో వేలం వెర్రి పోకడలు

 చెడ్డు చెడే కాలానికి కుక్కమూతి పిందెల చందం

 మన విద్య ఎటువైపు పోతున్నది?

 నరకానికి దారితీస్తున్న ప్రైవేటు విద్య

 కట్టడిలేకపోతే పుట్టుకొచ్చేది చేవలేని తరం మాత్రమే

 సామాజిక అవగాహన లేని విద్య అనర్థం

 ర్యాంకు తాత్కాలికం, వికాసం శాశ్వతం

ప్రైవేటు విద్యాసంస్థలపై నియంత్రణ లేకపోవడం వల్ల జరిగే అనర్థాలకు ఉదాహరణగా హన్మ కొండలోని ఏకశిల జూనియర్‌ కళాశాలలో ఒక గిరిజన విద్యార్థిని మృతి నిలిచింది. ఆత్మహత్మ గా యాజమాన్యం చెబుతోంది. అయితే యువమోర్చా సభ్యులు మాత్రం కళాశాల యాజమాన్యం పెట్టిన టార్చర్‌ భరించలేకే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. నిజంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, పోలీసులు ఏవిధ మైన పంచనామా జరుపకుండా ఏకంగా ఎం.జి.ఎం. మార్చురీకి ఏవిధంగా చేర్చారని వారు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారు? నిజానికి ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల రూపంలో కోట్లాది రూపాయలు పిల్లల తల్లి దండ్రులనుంచి ముక్కుపిండి వసూలు చేయడమే కాకుండా, ర్యాంకుల పేరుతో విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడిని కలుగజేస్తున్నాయన్నది మాత్రం సత్యం. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం జరుగుతున్న తంతే ఇది. కానీ విద్య కా ర్పొరేటీకరణ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా కిమ్మనడంలేదు. విద్యాసంస్థల యజమానులు ఒక దశకు చేరుకొని వివిధ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత తమ సంస్థల్లో జరుగుతున్న కార్యకలాపాలను బయటకురాకుండా వుండేందుకు, మీడియా, అధికార్లు, పోలీసులను గుప్పిట్లో పెట్టు కొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. మీడియా ప్రధాన ఆదాయ వనరు ప్రకటనలు. ఈ నేపథ్యంలో ప్రధాన స్రవంతి మీడియాకు కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలను ఏటా ఇస్తూ, తమ సంస్థల్లో జరిగే అవకవకలు ప్రచురణ లేదా ప్రసారం కాకుండా జాగ్రత్త పడుతున్నాయి. అంతేకాదు పోలీసుల్లో అవినీతి అధికారులకు, ఇతర సంబంధిత ప్రభుత్వ అధికార్లకు కూడా తగినంత ముట్టజెప్పి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడమే కాదు, విద్యార్థులపై చదువు పేరుతో విపరీతమైన ఒత్తిడి పెంచడం వల్ల దీన్ని తట్టుకోలేని విద్యార్థులు అఘాయిత్యాలకు పాల్పడు తున్నారన్నది ప్రధానంగా వస్తున్న అభియోగం. 

ఈ విద్యాసంస్థలు దోపిడీ ఒకరకంగా వుండదు! ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ దోపిడీ అనాలి. అడ్మిషన్ల దగ్గరినుంచి, పుస్తకాలు, స్పెషల్‌ ఫీజులు, యూనిఫామ్‌లు…ఈవిధంగా వివిధ రకాల పేర్లతో తల్లిదండ్రులనుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తాయి. అదేమంటే విద్యాసంస్థ నిర్వహణకు ఇవన్నీ అవసరమన్న ధోరణి బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ పాఠశాల విద్యపై తల్లిదండ్రులకు ఆసక్తి నశించి, తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలని, గొప్ప స్థాయికి చేరుకోవాలనే ఆశలతో ఉన్న ఆస్తులను కూడా ఖాతరు చేయకుండా తమ పిల్లల చదువుకోసం ఖర్చు చేయడానికి వెనుకాడటంలేదు. ప్రైవేటు విద్యావ్యాప్తికి ప్రధాన కారణం ఈవిధమైన తల్లిదండ్రుల బలహీనతే. గతంలోని తరాల్లో ప్రైవేటు స్కూళ్లు లేవు. అన్నీ ప్రభుత్వ పాఠశాలలే. మాతృభాషలో విద్యను అభ్యసించి, పైచదువులు చదివి గొప్ప స్థానాలు పొందినవారెందరు లేరు? కానీ నేడు ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్‌ టీచర్లున్నా నాణ్యమైన విద్య అందడంలేదన్న కారణంగా తల్లిదండ్రులు ప్రైవేటు విద్యను ఆశ్రయిస్తున్నారంటే ఇక్కడ ఎవరిని తప్పుపట్టాలి?

తల్లిదండ్రులకు తమ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారన్న విషయం కేవలం వారికి వచ్చే మా ర్కుల సరళిని బట్టే తెలుస్తుంది. చాలా ప్రైవేటు స్కూళలో విద్యార్థికి ఎక్కువ మార్కులు ఇవ్వడం ద్వారా తల్లిదండ్రులను బురిడీ కొట్టించడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే డిటెన్షన్‌ విధానం అమల్లో లేకపోవడంల్ల పదోతరగతికి వచ్చేవరకు ప్రశాంతంగా వెళ్లిపోతుంది. ఇక అక్కడి నుంచి విద్యార్థులపై వత్తిడి పెరుగుతుంది. ఇంటర్‌లో ఎంసెట్‌, ఈసెట్‌, జెఈఈ వంటి పోటీపరీక్షలకు హాజరు కావాల్సి వుండటంతో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. దీనికితోడు ఆయా ప్రైవేటు విద్యాసంస్థలు ర్యాంకులకోసం టార్చర్‌ పెట్టడం ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి.

విచిత్రమేమంటే, రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలు కలిగిన విద్యాసంస్థల యాజమాన్యాలు, రాజకీ యంగా, మీడియా, అవినీతి అధికార్లు, పోలీసులతో కుమ్మక్కయి అసలు తమ విద్యాసంస్థలో ఏం జరుగుతున్నదీ బయటకు వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతుంటాయి. గతంలో విద్యాసంస్థ యాజమాన్యాలు, ఏవైనా అవకతవకలు బయటపడినప్పుడో లేదా ఆత్మహత్యల వంటి సంఘటన జరిగినప్పుడో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికార్లకు ఏదోవిధంగా ముట్టజెప్పి బయటపడటం జరిగేది. వీరి పలుకుబడి నేపథ్యంలో నిరుపేదలైన తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని, పిల్లలను కోల్పోయి ప్రశ్నించలేని దుస్థితిని ఎదుర్కొనడాన్ని మించిన దురదృష్టం మరోటుండదు. మీడియాను ప్రకటనటల ద్వారా తమదారికి తెచ్చుకుంటున్న యాజమాన్యాలు, అవినీతి పోలీసులు, అధికార్లకు అవసరమైనంత ముట్టజెప్పడం సర్వసాధారణమైపోయింది. ఈ పాఠశాల యాజమాన్యాల్లో కొందరు వివిధ రాజకీయ పార్టీ లకు కొమ్ము కాయడం ద్వారా పబ్బం గడుపుకుంటుంటారు. మరికొందరు పార్టీలకు పార్టీఫండ్‌ లను సమకూర్చడం ద్వారా కూడా తమపై ఈగవాలకుండా జాగ్రత్తపడుతుంటారు. ఇంకా పై స్థాయికి చేరుకున్న వారు, ఏకంగా రాజకీయాల్లోకే ప్రవేశిస్తారు. ఆవిధంగా అధికారం చేతిలోవుంటే అన్నీ వాటికవే చక్కబడిపోతాయన్న సత్యం వారికి బాగా అవ గాహన అయినప్పటికీ, ఆ స్థాయికిచేరుకోవడానికి వారికి కొంత సమయం అవసరం. ఇప్పుడు వరంగల్‌ జిల్లాకు చెందిన ఒక వి ద్యాసంస్థల యజమాని ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తు న్నారు. ఎవరైనా ఏరంగంలోనైనా ఎదగాలనుకోవడంలో తప్పులేదు. కానీ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు రాజకీయాన్ని ఉపయోగించే విధానమే ఇక్కడ తప్పు!

ఇదిలావుండగా ప్రైవేటు విద్యాసంస్థల్లో కేవలం ర్యాంకులపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల విద్యా ర్థులకు వారివారి స్థాయికి తగిన సాధారణ పరిజ్ఞానం కొరవడుతోంది. జ్ఞాపకశక్తిపైనే దృష్టి తప్ప సృజనాత్మకతకు చోటుండటంలేదు. ఒకప్పుడు ఇంటర్మీడియట్‌ స్థాయిలో పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్‌లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏకంగా పాఠశాల స్థాయినుంచే సివిల్‌ సర్వీస్‌ వంటి అత్యుతన్న పోటీపరీక్షలకు అవసరమైన ప్రమాణాలతో విద్యాబోధన అంటూ కొత్త ప్రచారాలు మొదలయ్యాయి. అసలు ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో విద్యార్థుల అవగాహనా శక్తి ఎంత? అనేది పట్టించుకునే దిక్కే లేదు. వేలంవెర్రిగా కోర్సులు పెట్టడం, తల్లిదండ్రులు అనుసరించడం. ఈవిధంగా విద్య వ్యాపార స్థాయినుంచి, కార్పొరేట్‌ స్థాయిని కూడా దాటిపోయిందనుకోవాలి. ఇక పిల్లల భవిష్యత్తేమిటి? వారి జీవితంలో చదువు, ర్యాంకులు, పోటీలు తప్ప ఆటలు, వినోద కార్యక్రమాలకు అవకాశమే లేని జైలు జీవితాన్ని ప్రైవేటు విద్యావిధానం వారికి అందిస్తోంది. నిజంగా ఇది చాలా దారుణం. జీవితంలో అత్యంత ఆనందమయంగా పరిగణించే బాల్యం, చదువును బోధన పేరుతో ఒక పెద్ద ‘సంకెల’గా మార్చివేశారు. ఇక్కడ తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెట్టి మరీ తమ పిల్లలకు జైలు జీవితానికి పరిమితం చేస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో శారీరక స మతుల్యాభివృద్ధి దెబ్బతింటోంది. వత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడితే బైటికి రాకుండా డబ్బుతో అందరినీ కట్టిపడేస్తున్నారు. అందమైన భవిష్యత్తంటూ రంగురంగుల మాయా ప్రపంచాన్ని చూపుతూ పిల్లల్ని చదువు చట్రంలో విద్యార్థులను బిగించి ప్రైవేటు విద్యాసంస్థలు ఊపిరాడ కుండా చేస్తున్నాయి. 

ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏ చిన్న పొరపాటు లేదా సంఘటన జరిగినా మీడియా, వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా వాలిపోతారు. నానా యాగీ చేస్తారు. ఇదే ప్రైవేటు సంస్థల విషయానికి వస్తే ఒక్కరు మాట్లాడరు!! ఇదెక్కడి దారుణం! అంతేకాదు తమ విద్యా వ్యాపారాన్ని పెంచుకోవడానికి, ప్రభుత్వ విద్యపై ఎన్నిరకాలుగా దుష్ప్రచారం చేయాలో అన్నిర రకాలుగా చేస్తారు. కారణం ప్రభుత్వ విద్యాసంస్థలు ఖాళీ అయితేనే కదా, ప్రవేటు సంస్థలు కళకళలాడేది!! ఇందులో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్రకూడా విస్మరించలేం. వీరిలో కొందరు ప్రవేటు విద్యాసంస్థలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. చిన్నపిల్లల్లో మనోవికాసం పెరగకపోవడానికి ప్రైవేటు విద్యే ప్రధాన కారణం! విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధికి పాఠశాల, కళాశాలల వాతావరణం దోహదం చేయాలి తప్ప, ఒక మూస విధా నంతో విపరీతమైన ఒత్తిడిని పెంచుతూ, చివరకు వారి ఆత్మహత్యలకు దోహదం చేసిదిగా విద్య వుండకూడదు!

నిమిషాలలో రిజిస్ట్రేషన్‌..’’న్యూ రెవల్యూషన్‌’’.

`అమల్లోకి నూతన విధానం

`రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో నూతన ఒరవడికి శ్రీకారం

`ఇకపై పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు

`ఒత్తిళ్లకు, అక్రమాలకు తావు లేకుండా వెసులుబాటు

`ఎవరికి వారే దస్తావేజులు పూర్తి చేసుకునేందుకు మార్గం

`మధ్య వర్తుల జోక్యం లేకుండా ప్రక్రియ పూర్తికి మార్గ నిర్దేశనం

`అవకతవకలు జరగకుండా పూర్తి భరోసాతో ఆస్థులు భద్రం

`స్థిరాస్తుల మీద ప్రజలకు ఎలాంటి భయం లేకుండా కొత్త నిర్ణయం

`ఏడాది క్రితమే చెప్పిన నేటిధాత్రి

`ఇలాంటి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ రాబోతోందని చెప్పిన నేటిధాత్రి

`ప్రజలకు మేలు జరగాలన్నదే మంత్రి ‘‘పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి’’ ఆలోచన

`ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వెనుకడుగు వేయకుండా అమలు చేస్తున్న ‘‘మంత్రి’’

`అవాంతరాలు ఎన్ని ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతున్న ‘‘మంత్రి పొంగులేటి’’

`సరికొత్త రిజిస్ట్రేషన్‌ విధానంపై ప్రజల ప్రశంసలు

`మంత్రి ‘‘పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి’’ కి జనం నుంచి అందుతున్న అభినందనలు

`రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో సమూల మార్పులకు మంత్రి ఆదేశం

`త్వరలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు సొంత భవనాలు

`రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే ప్రజలకు అందుబాటులోకి మరిన్ని సేవలు

`కార్యాలయాలలో గౌరవంగా ప్రజలకు సౌకర్యాలు

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రాష్ట్రప్రభుత్వం విప్లవాత్మకమైన ఆవిష్కరణను తీసుకొచ్చింది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిరచి, కొత్త తరహా రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టింది. గతంలో ఎదురైన అనుభవాలు,సవాళ్లు, ఇబ్బందులు అదిగమించి, ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురుకాకుండా కొత్త తరహా విధానాన్ని తీసుకొచ్చింది. అందు కోసం రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పట్టుదల, కృషి ఫలించింది. ప్రజలకు రిజిస్ట్రేషన్‌ విషయంలో ఎలాంటి బాధలు భవిష్యత్తులో ఎదురుకావొద్దన్న మంచి ఉద్దేశ్యంతో ఈ తరహా విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగాత్మకమైన విధానం మూలంగా ఎవరికీ ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ప్రజల స్ధిరాస్ధుల విషయంలో గందరగోళానికి తావుండదు. పైగా ఒకరి భూములు, మరొకరు ఎట్టిపరిస్ధితుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఆస్కారం లేదు. వీలు అసలే కాదు. ఇకపై భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో చిన్న చిన్న పొరపాట్లకు కూడా తావులేని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిరచి రిజిస్ట్రేషన్లు చేయడం గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు. ఈ విధానం త్వరలో వస్తుందని నేటిధాత్రి ఏడాది క్రితమే చెప్పింది. సమీప భవిష్యత్తుల సులభతరమై, పకడ్భంధీ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన నూతన విధానం అందుబాటులోకి రానున్నదని నేటిధాత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చింది. గతంలో రిజిస్ట్రేషన్ల విషయంలో నిత్యం వివాదాలు ఎదురౌతూ వుండేవి. ఇకపై అలాంటి సమస్యలన్నింటికీ చెక్‌ పడనున్నది. అక్రమాలకు తావులేకుండా, సజావుగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుంది. అంతే కాదు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొన్ని నిమిషాల్లోనే పూర్తికానున్నది. రోజుల తరబడి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అదికారులను బ్రతిమిలాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా, మళ్లీ మళ్లీ ప్రజలు పదే పదే కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోవాల్సి వుండదు. అధికారులకు ఇబ్బంది లేకుండా,ప్రజలకు సమస్యలు తలెత్తకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. ఇదంతా ఇంత త్వరగా పూర్తి కావడానికి అమలులోకి రావడానికి మంత్రి పొంగులేటి కృషిని ప్రభుత్వ వర్గాలు కొనియాడుతున్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ కొత్త టెక్నాలజీ ఎంతో దోహడపడుతుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా వేగవంతమౌతుంది. నేటి నుంచి ఈ స్లాట్‌ బుకింగ్‌ అమలలోకి వచ్చింది. మొదటి దశలో 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ కొత్త తరహా ఆవిష్కరణ జరిగింది. దశలవారిగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలులోకి రానున్నది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అతి వేగంగా కావడమే కాకుంగా, అవినీతి ఆస్కారం లేకుండా వుంటుంది. ఇప్పుడున్న విమర్శలకు భవిష్యత్తులో వినేఅవకాశం వుండదు. ప్రజలకు లంచాల బెడద కూడా వుండదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే ఇకపై దస్తావేజుల తయారీ కోసం ప్రజలు ఎవరి మీద ఆధాపడాల్సిన పని వుండదు. మధ్యవర్తులైన దళారుల చేతుల్లో మోస పోవడం అసలే వుండదు. ఎవరికి వారు స్వంతంగా దస్తావేజులుతయారు చేసుకునేందుకు వెబ్‌సైట్‌ ఏర్పాటుచేశారు. అందుకోసం ఒక మాడ్యూల్‌ ప్రవేశపెట్టారు. ఇది కూడా ఐచ్చికంగానే వుంటుంది. ఎందుకంటే గతంలో దస్తావేజుపైన అమ్మిన, కొన్న వాళ్ల సంతాకాలు, రిజిస్ట్రార్‌ సంతకాల కోసం ఇలా కార్యాలయం చుట్టూ తిరగడానికే సమయం చాల పట్టేది. ఇకపై ఆ గందరగోళం అంతా వుండదు. రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి జాప్యానికి తావుండదు. ఒక్కసారి దస్తావేజులు పూరణ పూర్తి చేసి, స్లాట్‌ బుక్‌ చేస్తే ఇచ్చిన సమయానికి కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. పదినిమిషాల్లోపు రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో కూడా ఆదార్‌ ఇ` సంతకం ప్రవేశపెడుతున్నారు. ఈనెల చివరి లోగా ఈ సైన్‌ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. గతంలో రెండు రెండుసార్లు రిజిస్ట్రేషన్ల వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఆ భూములు ఎవరివో తెల్చుకోలేక సతమతమయ్యేవారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇకపై భవిష్యత్తులో అలాంటిసమస్యలు వుండకపోవచ్చు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే డబుల్‌ రిజిస్ట్రేషన్‌ గోల ప్రతి రోజూ ఎక్కడో అక్కడ వుంటూనే వుంటుంది. అసలైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతూ వచ్చేది. భూమిని నమ్ముకొని తరతరాలుగా ఆధారపడుతున్న వారే కాదు, రియలెస్టేట్‌లో స్ధలాలు కొన్న వారికి ఈ డబుల్‌ రిజిస్ట్రేషన్ల వల్ల కేసులు, ఘర్షణలు జరుగుతుండేవి. ఆ కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయేవి. రూపాయి రూపాయి కూడబెట్టుకున్నవారి భూములను ఇతరులు అసలు యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని తెలిసి ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా వున్నారు. కుటుంబాలు వీధినపడ్డ వారున్నారు. ఇకపై అలాంటి సమస్యలు ఏ కుటుంబం ఎదుర్కొకుండా కొత్త చట్టం తీసుకొచ్చేందుక ప్రభుత్వం సిద్దమౌతోంది. ఈ విషయంలో చాలా రాష్ట్రాలు కొన్ని ప్రత్యేకమైనచట్టాలను అమలు చేస్తున్నాయి. వాటిన్నింటినీ అధ్యయం చేసి, అందుల్లో ఉత్తమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమౌతోంది. తెలంగాణలో కూడా త్వరలో ఈ చట్ట సవరణ చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో కసరత్తు జరగుతోంది. అధికారుల అద్యయనం సాగుతోంది. రిజిస్ట్రేషన్‌ చట్టంలో వున్న సెక్షన్‌ 22కు అదనంగా 22`బి తీసుకురానున్నారు. దీని వల్ల ఇకపై డబుల్‌ రిజిస్ట్రేషన్‌ అనేదానికి ఆస్కారం లేకుండా వుంటుంది. అవసరమైనంత సిబ్బంది లేకుండా ఇబ్బందులుపడుతున్న కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని కూడా నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. దాంతో స్టాట్‌విధానంలో జరిగే వేగవంతమైన రిజిస్ట్రేషన్‌ కోసం అదనపు ఉద్యోగుల వల్ల ఏక కాలంలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒకే రోజు, ఒకే సమయంలోఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ కోసం సమర్పించడం వల్ల జరిగే జాప్యాన్ని సునాయాసంగా అధిగమించేందుకు వీలౌతుంది. అదనపు ఉద్యోగుల నియామకం కూడా తొలుత మేడ్చల్‌`మల్కాజిగిరి, కుత్భుల్లాపూర్‌లో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లతోపాటు, ఇతర సిబ్బందిని నియమించనున్నారు. దీని వల్ల కుత్భుల్లాపూర్‌లో 144 స్టాట్స్‌ ఏకకాలంలో అందుబాటులోకి వస్తాయి. తెలంగాణలోని 22 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోవున్న 144 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు త్వరలోఈ విధానాన్ని విస్తరిస్తే ఇక రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చాల వేగవంతమౌతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వున్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటి వరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే ఎక్కువగా వున్నాయి. చాలీ చాలని సౌకర్యాలతో వుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఇన్ని సంవత్సరాలైనా సొంత భవానాలు లేకపోవడం గమనార్హం. అద్దె ఇళ్లలో కార్యాలయాలు వుండడం వల్ల ప్రజలు అనేకు సమస్యలు ఎదుర్కొనే వారు. కార్యాలయంలో నిలుచులేక, కార్యాలయం సమీపంలో వున్న చెట్ల నీడన ఎదురుచూస్తూ వుండేవారు. వానొచ్చినా, ఎండ కాచినా రోజలు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్దితులు కూడా వుండేవి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరే రిజిస్ట్రేషన్లు. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం సమకూర్చే ప్రజలు కార్యాలయంలో కనీసం నిలబడే పరిస్దితి వుండదు. మంచి నీటి సౌకర్యం వుండదు. ఉద్యోగులు రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన ప్రజలను కసురుకుంటూ, చీదరించుకంటూ వుండే విధానానికి త్వరలో స్వస్తి పలుకనున్నారు. కొత్త కార్యాయాలను నిర్మాణం చేసుకొని, రిజిస్ట్రేషన్లకోసం వచ్చే ప్రజలకు కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించనున్నారు. అంతే కాదు అక్కడికి వచ్చిన ఉద్యోగులు ప్రజలను గౌరవంగా చూసుకునే విధానం తీసుకురానున్నారు. ఇప్పుడు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కనీసం మాట్లాడుకునే వీలు కూడా వుండదు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రజలకు స్వేచ్చాయుత వాతావరణం కూడా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వుండేలా చూస్తున్నారు. ప్రజలకు గౌరవం కల్పించనున్నారు. కొత్త విధానం వల్ల అవినీతి తగ్గుతుంది. కొత్త కార్యాలయాల వల్ల ప్రజలకు గౌరవం దక్కుతుంది. రిజిస్ట్రేషన్ల ప్రకియ చాలా వేగంగా మారుతుంది.

మెట్ పల్లి ఏప్రిల్ 10.

మెట్ పల్లి ఏప్రిల్ 10.

నేటి దాత్రి.

మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మున్సిపల్ కార్యాలయంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా పథకం మరియు ప్రధానమంత్రి సురక్ష ప్రమాద బీమా పథకాన్ని మున్సిపల్ కార్మికులకు చేయించినారు కమిషనర్ మాట్లాడుతూ 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నవారు సంవత్సరానికి రూపాయలు 436 & 20 ప్రమాద బీమా చేయించుకున్నచో రెండు లక్షల ఇన్సూరెన్స్ పొందవచ్చును ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చుని తెలిపినారు మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటామని తెలిపినారు ప్రతి నెలకు ఒకసారి పారిశుద్ధ్య కార్మికులకుహెల్త్ చెకప్ చేయిస్తామని తెలిపినారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్ శ్రీకాంత్ ముజీబ్ సిఎస్పి బి గంగాజల నిజాం అశోక్ వీ నరేష్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన.!

*గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన సినీ నటుడు సప్తగిరి తల్లి చిట్టమ్మ..

*సినీ నటుడు సప్తగిరి నివాసానికి వెళ్లి పరామర్శించిన..

*ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళి మోహన్..

తిరుపతి(నేటి ధాత్రి) ఏప్రిల్ 11:

 

తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతికి చెందిన సినీ నటుడు సప్తగిరి తల్లి చిట్టమ్మ గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం నాడు సినీ నటుడు సప్తగిరి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళి మోహన్ అనంతరం సప్తగిరిని ఓదార్చి ధైర్యంగా ఉండాలని తెలిపిన ఎమ్మెల్యేలు.
ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

తల్లిదండ్రుల దాతృత్వం…

తల్లిదండ్రుల దాతృత్వం…

అంగన్ వాడీ కేంద్రానికి రూ.5 వేల విలువైన
కూలర్ అందజేత…

గర్భిణీ స్త్రీలు,పిల్లలకు రక్తహీనత గురించి అవగాహన..

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

వేసవి కాలం నేపథ్యంలో చిన్నారుల సౌకర్యార్థం కేసముద్రం మున్సిపల్ కేంద్రం, పాత బజారు లోని అంగన్ వాడీ కేంద్రానికి చెందిన పలువురు చిన్నారుల తల్లిదండ్రులు రూ.5 వేల విలువైన కూలర్ ను విరాళంగా అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా పోషణ్ పక్వాడ్ వారోత్సవాల్లో భాగంగా గురువారం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు,బాలింతలు, చిన్నారులకు రక్తహీనత, హ్యాండ్ వాష్ ,పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అంగన్ వాడీ కేంద్రానికి కూలర్ బహుకరించిన చిన్నారుల తల్లిదండ్రులకు అంగన్వాడీ టీచర్ ఈ.రాజమణి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ, అంగన్ వాడీ టీచర్ ఈ. రాజమణి, నాగనబోయిన సునితావెంకటేశ్వర్లు, ముత్యాల నాగమణి, ముల్క చంద్రకళ,వెలుగు సీఏ దొడ్డ అనసూర్య, వద్ది సౌమ్య, వద్ది ఉదయ, మహమ్మద్ నగ్మా, మహ్మద్ జహీరా,బి.శిరీష, ఆశా సుజాత, ఆయా అరుణ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version