తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి కట్టలే…

తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి కట్టలే…
– పీవీ బ్రిడ్జికి రిపేరు చేయించలేని దుస్థితి ఎమ్యెల్యేది
– 16నెలలైనా ఓడేడ్‌ వంతెనకు తట్టెడు మట్టి తీయలే
– అవసరం లేని చోట రూ.300కోట్లతో బ్రిడ్జి మంజూరు
– ఐదేండ్లలో మంథని అభివృద్ది ప్రణాళిక చెప్పని మంత్రి
– ప్రజల అవసరాలను గుర్తించని మంథని ఎమ్మెల్యే
– అడవిసోమన్‌పల్లి బ్రిడ్జి రిపేర్లు పూర్తి చేయాలి
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

మంథని :- నేటి ధాత్రి

 

 

40ఏండ్లు నియోజకవర్గాన్ని పరిపాలన చేసిన తండ్రి కొడుకుల హాయాంలో ఒక్క బ్రిడ్జి నిర్మాణం చేయలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని మండలం అడవిసోమన్‌పల్లి సమీపంలోని మానేరు బ్రిడ్జి మరమ్మత్తు పనులను ఆయన పరిశీలించారు. ఆనాడు స్వర్గీయ పీవీ నర్సింహరావు మంథని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అడవిసోమన్‌పల్లి మానేరుపై వంతెన నిర్మించారని అన్నారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తండ్రి కొడుకులు ఒక్క వంతెనను తీసుకురాలేదన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ నాయకత్వంలో తాను ఎమ్మెల్యేగా రెండు బ్రిడ్జిలుమంజూరు చేయించామని, ఒక్కటి ఖమ్మంపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాగా మరొకటి ఓడేడ్‌ వద్ద నిర్మాణంలో ఉందన్నారు. తాను అనేక మార్లు తండ్రి కొడుకుల పాలనలో ఒక్క బ్రిడ్జి కట్టలేదంటే పేరుకోసం తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి రియల్‌ ఎస్టేట్‌ కోసం రూ.300కోట్లతో అవసరం లేనిచోట బ్రిడ్జిని తీసుకువచ్చారని అన్నారు. ఆ రూ.300కోట్ల నిధులతో మంథని మండలం ఆరెంద మానేరు లేకపోతే అడవిసోమన్‌పల్లి వద్ద మరో బ్రిడ్జి నిర్మిస్తే అద్బుతంగా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మంథని ఎమ్మెల్యే మంత్రిగా అయి 16నెలలు గడుస్తున్న సోమన్‌పల్లి బ్రిడ్జి దయనీయ స్థితిలో ఉండటం విడ్డూరమని, కనీసం మరమ్మత్తులు చేయించలేని దుస్థితిలో మంత్రి ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల అవసరాలు తీర్చకుండా ఇంత పెద్ద పదవిలో ఉండి ఏ ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సింగపూర్‌, జర్మనీ తరహాలో అభివృధ్ది చేస్తామని, ఏఐ ద్వారా అనేక మార్పులు వస్తాయని ముఖ్యమంత్రి, మంత్రి ప్రగల్బాలు చెబుతున్నారని, మార్పు, అభివృధ్ది ఏమో కానీ ఈ బ్రిడ్జి మాత్రం రిపేరుకు నోచుకోవడం లేదన్నారు. గత 25రోజుల క్రితం మరమ్మత్తు పనులు ప్రారంభించి మధ్యలోనే అపివేయడంతో వాహనదారులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ఎమ్మెల్యే, ఆయన సోదరులు ఈ బ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తుంటారని, కనీసం ప్రజల ఇబ్బందులను కూడా పట్టించుకోరా అని ఆయన అన్నారు. మంత్రి పదవి వస్తే ఎంతో అబివృద్ది జరుగుతుందని, అనేక ప్రయోజనాలు ఉంటాయనుకుంటే చీకట్లోకే నెట్టివేస్తున్నారని ఆయన అన్నారు. సోమన్‌పల్లి బ్రిడ్జికి రిపేరు చేయకపోగా ఓడేడు బ్రిడ్జి వద్దకు వెళ్లి పనుల్లో నాణ్యతపై విచారణ చేయిస్తామని, బాధ్యులతపై చర్యలు తీసుకుంటామని మాట్లాడిన మంత్రి 16 నెలలు గడుస్తున్న తట్టెడు మట్టి తీయలేదని ఆయన విమర్శించారు. ఇక్కడ మరమ్మత్తులు పూర్తి చేయకపోగా ఓడేడుబ్రిడ్జి పనులు మొదలు పెట్టకుండా అవసరం లేనిచోట రూ.300కోట్ల నిధులు వృధా చేస్తున్నారని ఆయన అన్నారు. మంథని నియోజకవర్గంలో మానేరు, గోదావరి, ఆలయాలు, అడవులు, భూములు ఉన్న ఈ నియోజకవర్గ అభివృధ్దిపై ఇప్పటి వరకు ప్రణాళిక చెప్పలేదని, ఐదేండ్లలో అభివృద్ది గురించి చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు ఎక్కడ ఏం అవసరం ఉంటుందనే విషయంపై మంత్రికి అవగాహణ లేదని అర్థం అవుతోందని, కేవలం ప్రజలను గొర్రెల్లా ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, నోట్ల కట్టలతో ఓట్లు వేయించుకోవచ్చనే ఆలోచన ఉన్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా మంథని ఎమ్మెల్యే అడవిసోమన్‌పల్లి బ్రిడ్జి మరమ్మత్తు పనులను పూర్తిచేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వనపర్తిలో చేయూత అనాధాశ్రమంలో అన్నదానం.

వనపర్తిలో చేయూత అనాధాశ్రమంలో అన్నదానం

వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రం చిట్యాల రోడ్ లో కల్వ సత్యనారాయణ శెట్టి జ్ఞాపకార్థం శనివారం నాడు శ్ చేయుత అనాధాశ్రమంలో విద్యార్థులకు అన్నదానం చేశామని ఆర్యవైశ్య యూవజన సంగం ప్రచారకార్యదర్శి కల్వ కుమార్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు . అన్నదానం సేవలో గిరీష్ ఆర్యవైశ్య అధ్యక్షులు బచ్చు వెంకటేష్ దివంగత కల్వ సత్యనారాయణ సతీమణి శ్రీమతి కల్వ అరుణ సౌమ్య. పాల్గొన్నారు ఆలుగడ్డ శంకరయ్య కల్వ భూపేష్ మిత్రులు బంధువులు దివంగత కిరాణం వ్యాపారి కల్వ సత్యనారాయణ శెట్టికి శ్రద్ధాంజలి ఘటించారు

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.!

వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం రాయిపల్లి తాండా లో జరిగిన వివాహ విందు లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,జనరల్ సెక్రటరీ గోపాల్,మిథున్ రాజ్ ,అశోక్ రెడ్డి,ప్రవీణ్ మెస్సీ, రతన్ సింగ్, కీరు,బుక్కు,చందర్ పవార్ తదితరులు.

రెవెన్యూ డివిజన్ కొరకు పోరాటాలు చేసి అలసిపోయిన.

చేర్యాల రెవెన్యూ డివిజన్ కొరకు పోరాటాలు చేసి అలసిపోయిన నాయకులు

ముచ్చటగా మూడు జేఏసీలు ఏర్పాటు చేసి ముందుకు పోనీయని నాయకులు

మూడు ముక్కలాట లెక్క చేసిన రెవెన్యూ డివిజన్ అంశం

చేర్యాల నేటిధాత్రి

 

 

 

చేర్యాల కొమురవెల్లి మద్దూరు దుల్మిట్ట మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ అంశాన్ని ఏర్పాటు చేయాలని చాలా రోజులుగా ఇక్కడి ప్రజల చిరకాల కోరిక అయినను గత పాలకులు పట్టించుకోలేదు ఇగో తీసుకొని వస్తాము అగో తీసుకొని వస్తాము అని మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించారు ప్రభుత్వాలు మారాయి అయినను రెవెన్యూ డివిజన్ అంశం ప్రభుత్వం పట్టించుకున్నట్టే కనబడుతూనే గత ప్రభుత్వం మాదిరి మభ్యపెడుతున్నారు చేర్యాల ప్రాంత ఇక్కడి నాయకులు కు ఒంటెద్దు పోకడలు రెవెన్యూ డివిజన్ అంశం వచ్చేసరికి మూడు జేఏసీలు 60 మంది నాయకులు అన్నట్టు సమస్యపై పోరాడకుండా జేఏసీలుగా ఏర్పడి కీచులు ఆడుకుంటున్నారు సమస్య తీవ్రతను పాలకులకు దృష్టికి తీసుకుపోవడంలో విఫలమయ్యారు ఇక్కడి ప్రాంత ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారన్న సంగతి మరిచి వ్యవహరిస్తున్నారు మీ వ్యక్తిగత తగాదాలు రెవెన్యూ డివిజన్ అంశానికి ముడిపెడుతూ మూడు జేఏసీలు ఏర్పాటు చేశారు వారేమో వారి నిత్య కార్యక్రమాలు వ్యాపారాలలో మునిగితేలుతూ విలాసాలు చేస్తూ పక్కన పెట్టిన రెవెన్యూ డివిజన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల ఇబ్బందులు నాయకులకు పట్టనట్టు వ్యవహరిస్తూన్నారని ఇక్కడి ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికైనా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని మీ నేటిధాత్రి జర్నలిస్ట్ కాసుల కుమార్

ఛలో వరంగల్ సభను విజయవంతం చేద్దాం..

ఛలో వరంగల్ సభను విజయవంతం చేద్దాం
ఐనవోలు మండల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తంపుల మోహన్

 

బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఐనవోలు మండలంలోని బిఆర్ఎస్ సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలనీ ఐనవోలు మండల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ తంపుల మోహన్ పిలుపునిచ్చారు.ఈ సభ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుందని
ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న వరంగల్ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని అభివర్ణించాడు.రామాయణంలో రాముని కోసం రామదండు లంకకు ఏవిధంగా బయలుదేరిందొ అదేవిధంగా మన అధినేత కెసిఆర్ కోసం మన గులాబీదండు అలాగే బయలుదేరాలని మోహన్ పిలుపునిచ్చారు.ఆదివారం జరగబోయే సభలో మన అధినేత కెసిఆర్ సందేశం కోసం యావత్ తెలంగాణ సమాజం ఎదురుచూస్తుందనారు.
420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు ఈసభతో వెన్నులో వణుకు పుట్టా లనని అన్నారు.
జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేమిలేదని
తెలంగాణ కోసం పుట్టిన మన పార్టీతోనే తెలంగాణకు అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
మన రాష్ట్రం- మన పార్టీ అనే నినాదంతో ముందుకు సాగాలని మోహన్ పిలుపునిచ్చారు.

బి. ఆర్. ఎస్. రజతోత్సవ సభను విజయవంతం.!

బి. ఆర్. ఎస్. రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
బిఆర్ఎస్ అయినవోలు మండల పార్టీ పిలుపు
నేటి ధాత్రి అయినవోలు హనుమకొండ:-

బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతొత్సవ సభను విజయవంతం చేయాలని బిఆర్ఎస్ అయినవోలు మండల కన్వీనర్ తక్కలపల్లి చందర్రావు వర్కింగ్ ప్రెసిడెంట్ తంపుల మోహన్ పిలుపునిచ్చారు. శనివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఐనవోలు మండలంలోని ప్రతి గ్రామం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ సభను తరలి వెళ్లి విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం నరకావస్తున్నా ఇంతవరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అందుకే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కోసం యువత మరియు రైతన్నలు ప్రతి ఒకరు రజతోత్సవ సభకు తండోపతండాలుగా రావడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు హాజరై మన సత్తా చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు జడ్పి కో.ఆప్షన్ నెంబర్ ఉస్మాన్ అలీ మాజీ సర్పంచులు పల్లకొండ సురేష్ కావటి స్వామి బరిగల సదానందం కంజర్ల రమేష్ మండల నాయకులు మర్పట్ల దేవదాస్ తీగల లక్ష్మణ్ గౌడ్, పఠాపురం ఎల్ల గౌడ్ దుపెళ్లి కొమురయ్య గడ్డం రఘు వంశీ గ్రామ పార్టీ అధ్యక్షులు తాటికాయల కుమారస్వామి ప్రధాన కార్యదర్శి కాటబోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.

గణపురం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్

దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు

వరి ధాన్యం తెచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాటు చేయాలి

వరి ధాన్యం కొనే సెంటర్లో వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండలంలోని బస్వరాజుపల్లి, పరశురాంపల్లి, ధర్మారావుపేట, నగరంపల్లి, మైలారం, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాలల్లో కన్య బోయిన కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్, ఐకేపీ, ఓడిసిఎంఎస్, మ్యాక్స్ సొసైటీ ల ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తపడాలని రైతులకు సూచించారు. ధాన్యం తీసుకురాబోతున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అక్కడున్న వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, గణపురం మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఎండి చోట మియా మొలంగూరి రాజు అశోక్ రెడ్డి వివిధ శాఖల అధికారులు, ఎమ్మార్వో ఎంపీడీవో కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు ఉన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
.. పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం. .

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్)

 

 

 

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాబి చంద్రం అన్నారు. శనివారం రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం దళారుపాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుస్తీ స్వామి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సన్న రకానికి 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయిస్తే రైతులకు తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల శివప్రసాదరావు, మాజీ ఉపసర్పంచ్లు కుస్తీ సిద్ధిరాములు, దండు రమేష్ తో పాటు మెట్టు ప్రకాష్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ స్కూలు వద్దు అంగన్వాడి ముద్దు.

ప్రైవేట్ స్కూలు వద్దు అంగన్వాడి ముద్దు.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

 

చిట్యాల మూడవ కేంద్రంలో అన్యువల్ డే ప్రోగ్రాం అరుణ భాగ్యమ్మ టీచర్స్ఏర్పాటు చేయడం జరిగింది జయప్రద సూపర్వైజర్ హాజరై జూన్24 నుండి ఏప్రిల్ 25 వరకు 11 నెలలలో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో నేర్చుకున్న ప్రీస్కూల్ కార్యక్రమాలన్నింటినీ తల్లులకు చేయించి చూపించడం జరిగింది ఆటలు పాటలు కథలు ఇంగ్లీష్ తెలుగు బోధనా అక్షరాలు అంకెలు వయసుల వారీగా పిల్లల బరువు ఎత్తులు ఏ స్థాయిలో ఉన్నవని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చేసి చూపించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ప్రైవేట్ స్కూల్లువద్దు అంగన్వాడీ ముద్దు అనే నినాదంతో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రంలో చేర్పించినట్లయితే పిల్లల శారీరక మానసిక కండరాల అభివృద్ధి ఆలోచన శక్తి మేధాశక్తి అభివృద్ధి చెంది నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదుగుతూ ఆరు సంవత్సరాలురాగానే ఏ స్కూళ్లకు పంపించిన పిల్లలందరు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకుంటారు ప్రైవేట్ స్కూల్ కి పంపడం వల్ల చిన్న వయసులో ఆడి పాడి సంతోషంగా గడపాల్సిన వయసులో ప్రైవేట్ స్కూల్ బందికానలో బంధించకండి ప్రస్తుతం శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు మినిస్టర్ జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి పరుచుట కొరకు పిల్లలు సంతోషంగా ఉత్సాహంగా ఉండుట కొరకు భవనాలను రిపేర్ చేయించడం రకరకాల పెయింటింగ్ వేయించడం యూనిఫామ్ ఇవ్వడం పిల్లలు కూర్చోవడానికి మ్యాట్స్ ఎన్నో రకాల ఆట వస్తువులను కూడా పంపిచ్చుచున్నారు అలాగే పిల్లలకు ముఖ్యంగా రుచికరమైన భోజనాన్ని వేడిగా అందించడం జరుగుతున్నది అందరూ అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వివరించడం జరిగింది. ఈ ప్రోగ్రాం లో అరుణ భాగ్యమ్మ జ్యోతి భాగ్యలక్ష్మి సంధ్యారాణి సుజాత మహిళలు హాజరైనారు తల్లులందరికి పిల్లల గ్రోత్ కార్డ్స్ అభివృద్ధి పరిశీలన పత్రాలు అందివ్వడం జరిగింది.

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.!

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
.. పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం. .

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్):

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాబి చంద్రం అన్నారు. శనివారం రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధాన్యం దళారుపాలు కాకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుస్తీ స్వామి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సన్న రకానికి 500 బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయిస్తే రైతులకు తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల శివప్రసాదరావు, మాజీ ఉపసర్పంచ్లు కుస్తీ సిద్ధిరాములు, దండు రమేష్ తో పాటు మెట్టు ప్రకాష్, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.

అన్ని దారులు వరంగల్ వైపే…

అన్ని దారులు వరంగల్ వైపే

మాజీ మున్సిపల్ కో ఆప్షన్ ఫాతిమా హమీద్

పరకాల నేటిధాత్రి

 

 

రాతెలంగాణ ష్ట్ర ప్రజల కోసంభారత రాష్ట్ర సమితి 25 వసంతాల రజతోత్సవ సభ 27 ఏప్రిల్ నాడు వరంగల్ లోని ఎల్కతుర్తి లో ఆవిర్భవించి అంగరంగ వైభవంగా జరగనుంది.దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాదిగ జనం ఈ సభకు హాజరుకానున్నారు. ఉద్యమపందాతో అధికారంలోకి వచ్చి దశాబ్దం పాటు తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంచిందని కేవలం తెలంగాణా రాష్ట్ర ప్రయోజనార్థం పుట్టిన బీఆరెస్ పార్టీ రేపు 25 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది.ఈ సందర్భంగా ఉద్యమ సింహం కేసీఆర్ గారు ప్రజల సంక్షేమంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఏం మాట్లాడుతారో ,ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారో అని 4 కోట్ల రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.రేపు రాష్ట్రం మొత్తం టీవీలు మరియు మొబైల్ ఫోన్ల ద్వారా కేసీఆర్ సభను వీక్షించే అవకాశముంది.భను ఇలాంటి మహోతరమైన సబిఅరెస్ నాయకులు,కార్యకర్తలు, బిఅరెస్ సానుభూతి పరులు,ప్రజలు అత్యధికంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ కోరారు.

రసాభాసగా మారిన ప్రజాభిప్రాయ సేకరణ.!

రసాభాసగా మారిన ప్రజాభిప్రాయ సేకరణ..

.. 40 ఫీట్ల రోడ్డు ఒప్పుకోమంటున్న బాధితులు..

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్):

రామయంపేట మెదక్ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు మంజూరైన రోడ్డు 40 ఫీట్ల వెడల్పుతో వేయడం మానుకోవాలని బాధితులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని మహంకాళి దేవస్థానంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు వ్యాపారులు, ఇండ్లను కోల్పోతున్న బాధితులు పాల్గొన్నారు. 40 ఫీట్ల రోడ్డు కాకుండా అందరిని దృష్టిలో పెట్టుకొని వెడల్పు చేయాలని అన్నారు. తాము అభివృద్ధికి అడ్డుపడమని కానీ విచ్చలవిడిగా రోడ్డు వెడల్పు చేస్తే చాలామందిని నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.

Congress party

ఈ విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మైనoపల్లి రోహిత్ రావు కల్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేవలం కొంతమంది తమ స్వార్థం కోసం 40 ఫీట్ల రోడ్డు చేయాలని పట్టు పట్టడం సమంజసం కాదన్నారు. కొంతమంది లేనిపోని కారణాలు చెప్పి 40 ఫీట్ల రోడ్డు కోసం పట్టు పట్టడం జరుగుతుందని ఇది ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వచ్చే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని పట్టణానికి చెందిన వ్యాపారి ఎనిశెట్టి సంతోష్ అన్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంతమంది బాదితులకు వాగ్వాదం జరిగింది.

అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం మెట్ పల్లి.

అడ్మిషన్ల కోసం ఇంటింటి ప్రచారం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల “సిబ్బంది” ఆచారం

మెట్ పల్లి ఏప్రిల్ 26 నేటి దాత్రి

 

 

 

“దోస్ట్” ద్వారా మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ లు చేసుకోవాలని కోరుతూ ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున ఆ కళాశాల సిబ్బంది సంయుక్తంగా వెంకట్రావుపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు.

వెంకట్రావుపేట ప్రధాన రహదారి, గ్రామ పంచాయితీ కార్యాలయం, హనుమాన్ దేవాలయం తదితర ప్రాంతాల్లో గల ఇండ్లలోనికి నేరుగా వెళ్ళి,మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 -2026 విద్యా సంవత్సరంలో బీ ఏ; బీ కాం (కంప్యూటర్) ప్రథమ సంవత్సరం కోర్సులలో చేరాలని సిబ్బంది ప్రజలకు సూచించారు.

ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణులైన వారు,ఇంటర్మీడియెట్ డ్రాప్ అవుట్స్ వంటి విద్యార్థులు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే మాత్రం మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాలని సూచించారు.

ఈ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఎలాంటి ఫీజులు ఉండవని, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, క్రీడలు, ఉపకార వేతనాల మంజూరు,సాధారణ విజ్ఞాన పరీక్షల నిర్వహణ వంటి సౌకర్యాలతో పాటు అనుభవం మరియు నెట్ , సెట్, స్లెట్, పీ హెచ్ డి వంటి అధిక విద్యార్హతలు గల బోధకులు ఉన్నారని,

ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోధన మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది “దోస్త్” ద్వారా అడ్మిషన్ ల కోసం ఇంటింటి ప్రచారం చేయటం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య, వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న, కళాశాల కామర్స్ హెచ్ ఓ డి ఏ.మనోజ్ కుమార్, లెక్చరర్లు గట్టయ్య, అంజయ్య, సత్తయ్య, రికార్డు అసిస్టంట్ వై.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

వెంకట్రావు పేట గ్రామంలో “దోస్త్” ద్వారా అడ్మిషన్ల ల కోసం చేసిన ఇంటింటి ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని ప్రిన్సిపల్ కే వెంకయ్య తెలిపారు.

మృతుల కుటుంబాలకు ఘన నివాళులు..

మృతుల కుటుంబాలకు ఘన నివాళులు
మెట్ పల్లి ఏప్రిల్ 26 నేటిదాత్ర

 

 

 

 

శనివారం పట్టణంలోని టిపిసిసి డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నివాసములో కాశ్మీర్ పహల్ గావ్ లో భారతీయ పౌరులపై ఉగ్రవాదుల దాడిలో మరణించిన కుటుంబాలకు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో ప్రజలపై ఉగ్రవాదుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మతోన్మాదులు పర్యాటకులను కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు. ప్రపంచ దేశాలు భారతదేశంపై సంఘీభావం ప్రకటించడం పట్ల భారతదేశం శాంతి యుత వాతావరణంలో ప్రజలను. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులను గుర్తించి కఠినంగా శిక్షించి మరొక సారి ఇలాంటి దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతిచెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ పార్టీ ఫిషర్మేర్ స్టేట్ జనరల్ సెక్రెటరీ రుత్త నారాయణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ జనరల్ సెక్రెటరీ అందె మారుతి బాపూజీ,ఇబ్రహీపట్నం యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ నల్లూరి సాగర్, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జాఫర్, బైండ్ల శ్రీకాంత్, మామిడి రాజశేఖర్ రెడ్డి, ఇప్పపల్లి గణేష్ గౌడ్,తోగిటి నాగరాజ్, మొగలి రాజేందర్,కోరే రాజ్ కుమార్, చౌదరి తదిరితలు పాల్గొన్నారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.!

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో. ఈనెల 27న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్ళపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు తెలిపారు. శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ. మొగుళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు .ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న, చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని మోటె ధర్మారావు తెలిపారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

మాజీ సర్పంచ్ మోటి ధర్మారావు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో. ఈనెల 27న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మొగుళ్ళపల్లి తాజా మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు తెలిపారు. శుక్రవారం రోజున ఆయన మాట్లాడుతూ. మొగుళ్లపల్లి మండలంలోని అన్ని గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు . ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న, చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని మోటె ధర్మారావు తెలిపారు.

ప్రమాదం లో బుర్కపల్లి వాగు వంతెన.

ప్రమాదం లో బుర్కపల్లి వాగు వంతెన

బయందోళనలో ప్రయాణం సాగిస్తున్న ప్రజలు

కొత్తగూడ, నేటిధాత్రి :

 

 

 

 

మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం నుంచి గంగారం ఇల్లందు వెళ్లే దారిలో మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి బుర్కపల్లి వాగుపై వంతెన ఎప్పుడో తాతల కాలం నాటి నిర్మించినది.. అది కూడా వెడల్పు లేకుండా ఉండడంతో వర్షాకాలం వచ్చిందంటే బ్రిడ్జి పైన నుంచి నీళ్లు వెళ్లి రాకపోకలకు అంతరాయం జరుగుతూ ఉంటుంది.. వర్షాకాలంలో వాగు ఉప్పొంగి వరద ఉధృతికి బ్రిడ్జి పూర్తిగా దెబ్బతిని భారీ వాహనములు బ్రిడ్జిపై వెళ్తుండడంతో బ్రిడ్జ్ పిల్లర్లు రాళ్లు ఇసుక కంకర అన్ని కొట్టుకపోయాయి బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందని ప్రయాణికులు భయంకరమైన చెందుతున్నారు కావున ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి పాత బ్రిడ్జి స్థానంలో మరింత వెడల్పుగా కొత్త బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కొత్తగూడ గంగారం మండలాల ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు..,,

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్.!

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆదేశాల మేరకు శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని,ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వరి పంట ఎక్కువ దిగుబడి అవుతుందని అన్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతు పక్ష పాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందని తెలిపారు.సన్న వడ్ల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికె దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చల్ల సత్యనారాయణ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గుండు తిరుపతి,వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,గ్రామ రైతులు, సెంటర్ ఇన్చార్జి బల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

భూభారతిపై అవగాహన కార్యక్రమం.

భూభారతిపై అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమాన్ని.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్.నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి చట్టంలో వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకువచ్చిన భూభారతి నూతన ఆర్ ఓ ఆర్.చట్టంపై తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొని చట్టంలోని వివిధ అంశాలను ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా రైతులకు ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగిందని. అలాగే శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలోని గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూధార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూ అక్రమాలకు చెక్ పెట్టవచ్చునని పెండింగ్లో ఉన్న సాదా బైనామ పరిష్కారం కోసం భూభారతి. చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని పి ఓ టి. ఎల్.టి.ఆర్ సీలింగ్ చట్టాలు ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ 100 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని. హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాస్ బుక్ జారీ చేయడం జరుగుతుందని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఒకేరోజు ఉంటాయని కొనుగోలు తనక బదిలీ బాగా పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంకల్పిస్తే తాసిల్దార్ .రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులను మార్పు చేసి పట్టాదారు పాసుబుక్ జారీ చేస్తారని .స్లాట్ బుకింగ్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ న్యూట్రిసియేషన్ .ఫీజు చెల్లింపు అంటే నిర్ణీత తేదీల్లో చట్ట ప్రకారం సొంత దస్తావేజు రాసుకొని సమర్పించాల్సి ఉంటుందని దస్తావేజుతోపాటు ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి భూమి పట్టం సమర్పించాలని తెలియజేశారు చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలు పంపిణీ చేశామని ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు రైతులకు ఎటువంటి భూ సమస్యలు ఉన్న భూభారతిలో పరిష్కరించవచ్చని పేర్కొంటూ ప్రతి గ్రామానికి ఒక విలేజ్ రెవెన్యూ అధికారిని నియమించడం జరుగుతుందని తద్వారా రైతులకు భూభారతిలో ఎటువంటి సమస్యలు వచ్చిన పరిష్కరించడానికి చాలా సులువుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి అవగాహన కార్యక్రమానికి రైతులు ఆర్డీవో రాధాబాయి ఎమ్మార్వో జయంత్ కుమార్ గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్.నేరెళ్ల నరసింహం గౌడ్.ప్రభుత్వ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్లు.

మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ లు కుట్టి వేత…

రామాయంపేట ఏప్రిల్ 26 నేటి ధాత్రి (మెదక్)

 

 

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ లు కుట్టి అందించే బాధ్యత ప్రభుత్వం మెప్మ, ఐకెపి కి అప్పగించింది. దీంతో మహిళా సంఘాలను ప్రోత్సహించి ఈ యూనిఫాంలు కుట్టించే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించారు. ఇందుకు ఒక యూనిఫామ్ కు రూ. 75 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.

Students

 

ఒక రకంగా ఇది మహిళా సంఘం లో టైలరింగ్ వచ్చిన వారికి మంచి అవకాశం. గతంలో కూడా తాము విద్యార్థులకు యూనిఫామ్ లు కుట్టించి ఇచ్చామని, ఇప్పుడు కూడా తమకు యూనిఫాంలు కుట్టడానికి ఎంపిక చేసినట్లు మహిళా సంఘాల సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కు లావణ్య. ఆర్ లావణ్య. జి స్రవంతి. పి స్వాతి. సిహెచ్ కవిత. ఆర్ తరంగిణి. బి బాల్ లక్ష్మి. కె శ్రీలత. ఆర్ స్రవంతి. పి శ్రీలత. తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version