ముందు నుయ్యి..వెనుక గొయ్యి తవ్వుకున్నారు!

-పార్టీ మారి కాంగ్రెస్‌ లో ఇమడలేకపోతున్నారు

-సముద్రంలో కలిసి ప్రయాణం చేయలేకపోతున్నారు

 

-మేమొస్తాం…తలుపులు తీస్తారా? అని వేడుకుంటున్నారు

-క్షమించి మమ్మల్ని రమ్మంటారా?

-వెళ్ళి తప్పు చేశాం…క్షమించలేరా!

-రమ్మంటే పరుగెత్తుకొస్తాం

-మేమక్కడ నెగలలేకపోతున్నాం…

-కాంగ్రెస్‌ నేతలతో కలవలేకపోతున్నాం

-ఎంత చొచ్చుకొని వెళ్లినా ఆదరించడం లేదు

-ఎమ్మెల్యే అనే అభిమానం కనిపించడం లేదు

-మమ్మల్ని అక్కున చేర్చుకోవడం లేదు

-ప్రజల ముందు చులకనయ్యాం

-ఇప్పటి దాక వున్న అనుచరులకు లోకువౌతున్నాం

-కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేకపోతున్నాం

-పార్టీ మారిన ఎమ్మెల్యేలు పడరాని పాట్లు పడుతున్నారు

-ముందు నుయ్యి, వెనుక గొయ్యి తొవ్వుకున్నారు

-ఎమ్మెల్యేలను ఆదరించకపోవడంలో కాంగ్రెస్‌ నాయకుల తప్పేం లేదు

-పదేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులను వేధించింది వీళ్లే

-పదేళ్లు పడరాని పాట్లు పడి కాంగ్రెస్‌ కోసం పనిచేశారు

-అనేక కేసులు ఎదుర్కొన్నారు

-నిర్భంధాలు చూశారు…పోలీసు దెబ్బలు తిన్నారు

-పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెత్తనం లేక కాంగ్రెస్‌ నాయకులు సలసల కాగుతున్నారు

-పార్టీ మారిన ఎమ్మెల్యే లకు సలాం కొట్టలేకపోతున్నారు

-కాంగ్రెస్‌ నాయకులు పాత బకాయిలు తీర్చుకునే సమయంలో వచ్చి చేయందుకున్నారు

-ఇది కాంగ్రెస్‌ నేతలకు సుతారం ఇష్టం లేదు

-అప్పుడు అదే ఎమ్మెల్యే పెత్తనం.. ఇప్పుడు అదే ఆధిపత్యం

-కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు

-ఎమ్మెల్యేలైనా సరే లెక్క చేయడం లేదు

-ఓడిపోయిన కాంగ్రెస్‌ నాయకుల వెంటనే కార్యకర్తలుంటున్నారు

-పార్టీ మారిన ఎమ్మెల్యేలు ద్వితీయ శ్రేణి పౌరులైపోయారు

-కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కుబిక్కుమంటున్నారు

-రాజకీయంగా భవిష్యత్తు అంధకారం చేసుకున్నని మధనపడుతున్నారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తొందర పాటు గ్రహపాటైంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి చేజేతులా తవ్వుకున్నట్లైంది. అత్యాశ దురాశగా, పేరాశా మిగిలిపోయింది. సముద్రం లాంటి కాంగ్రెస్‌లో అందరూ కలవలేరు. ఒక్కసారి ఆ పార్టీలో కలిస్తే మాత్రం పార్టీని వదులుకోలేరు. అందువల్ల మొదటి నుంచి కాంగ్రెస్‌లోవున్న వారికి ఆ పార్టీ ఎంతో గొప్పది. కాంగ్రెస్‌ పార్టీలో వున్నంత అంతర్గత ప్రజాస్వామ్యమం మరే పార్టీలో వుండదు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో అసలే వుండదు. కాని తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేకు అక్కడా దక్కలేదు. ఇక్కడా విలువలేకుండాపోయింది. కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పుకున్నా, కాంగ్రెస్‌ నాయకులమని చెప్పుకోలేకపోతున్నారు. అటు బిఆర్‌ఎస్‌ పార్టీని తిట్టలేకపోతున్నారు. అటు కాకుండా, ఇటు కాకుండా పోయి, రాజకీయ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసుకున్నారు. ఇప్పుడు మధనపడినా వచ్చేది లేదు. ఒరిగేది లేదు. అంతో ఇంత కాంగ్రెస్‌లోనే ఏదైనా ఆదరణ దొరకాలే గాని, తిరిగి ఘర్‌ వాపసీ అంటే మాత్రం అక్కడ ఇసుమంతైనా గౌరవం దక్కకపోవచ్చు. ప్రాదాన్యత పెద్దగా వుండకపోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్దితుల్లో టికెట్‌ దక్కకపోవచ్చు. కాంగ్రెస్‌లో కొనసాగినా అదే జరగొచ్చు. రెంటికీ చెడిన రేవడిగా మారింది ఎమ్మెల్యేల పరిస్దితి. పార్టీ మారేముందు కొంచె ఆలోచిస్తే ఇంత దూరం వచ్చి వుండేది కాదు. కాంగ్రెస్‌పార్టీ పదేళ్ల కాలం పాటు అధికారం కోల్పోయింది. కాంగ్రెస్‌నుంచి బిఆర్‌ఎస్‌లో నాయకులు చేరుతూ వుండడంతో చతికిలపడిపోయింది. ఒక దశలో చితికిపోతుందనుకున్నారు. కాని ఆ పార్టీకి వున్న నాయకులు, కార్యకర్తల మూలంగా, కాంగ్రెస్‌ పార్టీ నిలబడిరది. ఆ పార్టీకి ఇప్పటికీ చెక్కు చెదరని కార్యకర్తలున్నారు. నాయకులు నాడు బిఆర్‌ఎస్‌కు వెళ్లినా అప్పటి ద్వితీయ శ్రేణి నాయకులు ముందు వరసలోకి వచ్చారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చారు. బిఆర్‌ఎస్‌ పాలనలో నానా ఇబ్బందులు పడ్డారు. కేసులు ఎదుర్కొన్నారు. నిర్భందాలను కూడా చూశారు. పోలీసుల దెబ్బలుతిన్నారు. అనేక ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు. పార్టీ మారాలని పెట్టిన నిర్భంధాలను కూడా లెక్క చేయకుండా పార్టీ కోసం నిలబడ్డారు. అలాంటి నాయకులున్న కాంగ్రెస్‌పార్టీలోకి అవకాశవాద రాజకీయాలను చేయానుకున్నవారు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఇమలేక, కాంగ్రెస్‌లో నెగలేకపోతున్నారు. ఏదో జరుగుతుందని ఆశపడితే ఏదో అయ్యిందన్నట్లు మారింది. కాంగ్రెస్‌లోవిలువ లేదు. గుర్తింపు అసలే లేదు. కార్యకర్తలు అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు గౌరవమే ఇవ్వడం లేదు. అసలు ఎమ్మెల్యేలుగా వారిని పార్టీ శ్రేణులే గుర్తించడం లేదు. అటు కాంగ్రెస్‌ పట్టించుకోకపోవడమే కాదు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకోవాల్సిన సమయంలో కాంగ్రెస్‌ నాయకులే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రావొద్దంటున్నారు. దాంతో దిక్కు తోచని పరిస్ధితిలో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ మారితే బిఆర్‌ఎస్‌ నుంచి సమస్యలు ఎదురౌతాయి. బిఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకుంటాయి. అధికారం చేతిలో వుంటుంది. బిఆర్‌ఎస్‌ను అణచివేయొచ్చు. బిఆర్‌ఎస్‌ను తమ తమ నియోజకవర్గాలలో ఖాళీ చేయొచ్చు. కాంగ్రెస్‌ పార్టీ మెప్పు పొందొచ్చు. ఇతర పదవులు, నిధులు తెచ్చుకోవచ్చనుకున్నారు. కాని కాంగ్రెస్‌ పార్టీ నాయకులే రాజకీయం చేస్తారని అనుకోలేదు. కాని కాంగ్రెస్‌ పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేక ఏర్పడుతుందని ఊహించలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ కార్యకర్తలను బెదిరించలేరు. వారితో కలిసి సఖ్యతను పొందలేకపోతున్నారు. మేమిక్కడ నెగలలేకపోతున్నామంటూ ఆంతరంగికుల వద్ద బోరు మంటున్నారు. వెళ్లి తప్పు చేశామంటూ మధనపడుతున్నారట. కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆదరిస్తారనుకుంటే దూరం కొడుతున్నారు. కాంగ్రెస్‌లో కలిసినా, నాయకులతో కలవలేకపోతున్నామంటున్నారు. తాము ఎంత చొచ్చుకెళ్లినా, కాంగ్రెస్‌ నాయకులను ఎంత భుజ్జగించినా వినడం లేదంటున్నారు. ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదురౌతోంది. ఎమ్మెల్యేలమన్న గౌరవం కనీసం కాంగ్రెస్‌ కార్యకర్తలే ఇవ్వడం లేదు. దాంతో బిఆర్‌ఎస్‌ శ్రేణులు చూసి సంబరపడుతున్నారు. తమకు మొత్తం మీద గుర్తింపు లేకుండాపోతోందంటున్నారు. ప్రజల ముందు ఎలాగూ చులకనయ్యాం. కాని కాంగ్రెస్‌ శ్రేణులతోనైనా కలిసిపోదామనుకుంటే ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిసినా ఎవరూ వెళ్లడం లేదట. అటు అనుచరులకు కూడా లోకువయ్యే పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్‌ కార్యకర్తలతో కనీసం మాట్లాడలేని పరిస్ధితుల్లో ఎలా కొనసాగాలో అర్ధం కాకుండా వుందంటున్నారు. పార్టీ మారి పడరాని పాట్లు పడుతున్నామంటూ బిఆర్‌ఎస్‌ నాయకులకు గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఎదుకంటే పదేళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులును వేదించింది ఈ ఏ ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అప్పుడు అధికారం చెలాంయించి ఇబ్బందులకు గురి చేసింది వీళ్లే. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరి పెత్తనం చేయాలని చూస్తున్నది వీల్లే. దాంతో కాంగ్రెస్‌ నాయకులకు సుతారం నచ్చడం లేదు. పై నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, ఆదేశాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది కాంగ్రెస్‌లో ఎప్పుడూ వుండే సంస్కృతే. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను వేధించిన ఎమ్మెల్యేపై రివెంజ్‌ తీర్చుకుందామనుకున్నారు. కాని వాళ్లే ఇప్పుడుకాంగ్రెస్‌లో చేరడంతో వాళ్లంతా విస్తుపోతున్నారు. పాత బకాయిలు తీర్చుకోలేకపోతున్నామని కాంగ్రెస్‌ నాయకులు మధనపడుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ద్వితీయ శ్రేణి నాయకులయ్యారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆదరించకపోవడంతో బిక్కు బిక్కు మంటున్నారు. రాజకీయం అందకారం చేసుకున్నామంటూ చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఎలాగూ ఇమడలేకపోతున్నాం. కనీసం సొంత గూటికి చేరుకుందామా? అని కొంత మంది ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. బిఆర్‌ఎస్‌ ఛీప్‌తో కలవాలని ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నారట. తప్పయ్యింది. మేమొస్తాం తలుపులు తీస్తారా? అని కేటిఆర్‌, హరీష్‌రావులను వేడుకుంటున్నారట. క్షమించి మమ్మల్ని రమ్మని చెప్పండంటూ సందేశాలు పంపుతున్నారా? కొంత మంది కాంగ్రెస్‌ నాయకులతో గొడవలు పడుతూ తమలో గులాబీ రక్తమే వుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. క్షమించి రమ్మనండి? అని వెడుకుంటున్నారట. రమ్మంటే పరుగెత్తుకొస్తామంటూ నాయకులతో కబురు పంపిస్తున్నారట. ఈ ఎమ్మెల్యేలకు కారులో చోటు వుండదని తెలుసు. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్‌ టికెట్‌ ఇవ్వడని తెలుసు. అయినా కాంగ్రెస్‌లో వుండి చేసేదేమీ లేదు. రోజు తలనొప్పి తప్ప మరేం లేదనుకుంటున్నారట. నిదులొస్తాయని అనుకుంటే మిగతా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పోల్చితే వస్తున్న నిధులేమీ లేవు. అసలైన కాంగ్రెస్‌ నాయకులకు వున్న విలువ, గౌరవం ఎలాగూ దక్కడం లేదు. నిధులు మంజూరు తమ వల్ల కావడం లేదు. కాంగ్రెస్‌ నాయకులు కోరిన నిధులు ఇస్తున్నారు. పాత కాంగ్రెస్‌ నాయకుల చేతనే అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి చేతనే కొబ్బరి కాయలు కొట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలను కనీసం దగ్గరకుకూడా రానివ్వడం లేదు. ఇలాంటి పరిస్ధితి ఒక వైపు వుంటే మరో వైపు సుప్రింకోర్టులో కేసు తీర్పు ఎలా వుంటుందన్న భయం మరో వైపు వెంటాడుతోంది. తాజాగా మార్చి 4న సుప్రింకోర్టు మరిన్ని సీరియస్‌ వ్యాఖ్యలు చేసింది. గడువు కోరిన ప్రభుత్వ తరుపు న్యాయవాదుల పేరుతో ఎమ్మెల్యేల పదవీ గడువు పూర్తయ్యే వరకు కావాలా? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇలాగైతే ప్రజాస్వామ్యం విలువలు పడిపోతాయని సుప్రిం కోర్టు ఘాటుగా హెచ్చరించింది. అంతే కాదు మార్చి 23 వరకు ఏ విషయమైన కోర్టుకు తెలపాలని ప్రభుత్వ తరుపు లాయర్లకు సుప్రింకోర్టు సూచించింది. ఇక మార్చి 23 లోగా స్పీకర్‌ ఏదో ఒక నిర్ణయం ప్రకటించే పరిస్దితి ఎదురైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను స్పీకర్‌ సస్పెండ్‌ చేయకపోతే సుప్రింకోర్టు వారిపై వేటు వేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అందుకే ఈలోపే బిఆర్‌ఎస్‌ గూటికి తిరిగి వెళ్లడం ఎంతో ఉత్తమమని కొంత మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఒక వేళ వెళ్లినా కనీసం తమను గడప కూడా తొక్కనీయరని కొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ వేటు పడినా మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తుందా? ఇచ్చినా గెలిచే పరిస్థితి వుందా? అనుకుంటున్నారట. తొందరపడ్డామా..చేజేతులా చెడగొట్టుకున్నామా? అన్నది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారట.

చిత్రపురి కార్మిక లోకానికి ఊపిరి తమ్మినేని.

`చిత్రపురి అక్షర పోరాటంలో ఎప్పుడూ ముందుంది నేటిధాత్రి.

`జౌర్‌ ఏక్‌ దక్కా చిత్రపురి కార్మికుల గెలుపు పక్కా!

`కార్మికపక్షాన పోరాటంలో తమ్మినేని.

`కార్మికుల పోరులో అక్షర సహకారం నేటిధాత్రి.

`పోరాడితే పోయేదేమీ లేదంటున్న తమ్మినేని.

`ఉద్యమానికి నిరంతర చేయూతనందిస్తున్న నేటిధాత్రి.

`అటు పోరు జెండాలు, ఇటు అక్షర గాండీవాలు తోడుగా వున్నాయి.

`కార్మికులు మరింత గట్టిగా గళం వినిపించాలి.

`చిత్రపురిలో జరిగిన అన్యాయన్ని ధైర్యంగా ఎదిరించాలి.

`హక్కుల సాధన కోసం పరిశ్రమించాలి.

`విశ్రమించకుండా కల సాకారం చేసుకోవాలి.

`దిక్కులన్నీ ఏకమయ్యేలా దీక్షలు చేయాలి.

`కార్మిక వాణి ప్రపంచానికంతటికీ తెలియాలి.

`ప్రభుత్వ దిగివచ్చి న్యాయం చేయాలి.

`ఇప్పటికీ మించి పోయింది లేదు.

`చిత్రపురిలో జొచ్చిన పాములను తరిమేయాలి.

`విషనాగుల కోరలు పీకేయాలి.

`సినిమా గద్దల పని పట్టాలి.

`ఇప్పుటి దాకా వేడుకున్నది చాలు.

`వేడుకోలుతోనే ఒక తరం చీకట్లో కలిసిపోతోంది.

`మలితరానికైనా వెలుగులు నిండాలంటే కార్మికులు పోరుబాట పట్టాలి.

`మీ ఇల్లు మీరు సొంతం చేసుకోవాలి.

`చిత్రపురి స్థలం మీది..

`సొసైటీ సొమ్ము మీది..

`ఆ ఇండ్లు మీవి.

`మీ ఆకలి కేకలేకాదు…ఆగ్రహం కూడా చూపించండి.

`అప్పుడు గాని పేదవాడి కోపం కనిపించదు.

`చిత్రపురిలోని గద్దలు పారిపోవు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఇంత కాలం అడిగింది చాలు..అడుక్నున్నదిచాలు. వేడుకున్నది చాలు. కన్నీళ్లతో కాలం గడిపింది చాలు. ఏడ్చిన కాలం తుడిచేయండి. ఏడ్చి ఏడ్చి ఎర్రగా మారిన కండ్లను తెరవండి. ఎరుపెక్కిన కళ్లతో నిలదీయండి. ప్రశ్నించండి. మా భూమి మాకేనంటే నినదించండి. చిత్రపురి మాదే అని గర్జించండి. చిత్రపురి మాది. స్ధలం మాది. సొసైటీ మాది. సొమ్ము మాది. అని తేల్చి చెప్పండి. ఇంకెంత కాలం మోసం చేస్తారని ఎదిరించండి. మీ స్ఠలాలు మీకు సొంతమయ్యేదాకా పోరాటంచేయండి. పోరాడితే పోయేదేమీ లేదన్నది తెలుసుకోండి. చేతులెత్తి మొక్కిన చేతులతో జెండాలు పట్టుకోండి. ఎవరో చెప్పిన జెండాలు, ఇప్పటిదాకా అనుసరించి ఎజెండాలు పక్కన పెట్టండి. పోరాటం చేసేవారు కార్మికులకోసం వున్నారు. పోరాటాలలో విజయాలుసాధించిన సిపిఎం. అగ్ర నాయకుడు తమ్మినేతి వీరభద్రం లాంటి వారు అండగా వున్నారు. నిరంతరం కార్మికుల హక్కుల కోసం అక్షర పోరు సాగిస్తున్న నేటిదాత్రి అండగావుంది. కార్మికులకు న్యాయం జరిగేదాక వుంటుంది. ప్రతి కార్మికుడికి ఇల్లు వచ్చేదాకా అక్షర గాండీవాలను ఎక్కు పెడుతూనే వుంటుంది. కార్మికుల పొట్టగొట్టిన వారిని కడిగేస్తూనే వుంటుంది. కార్మికుల గూడులో చేరిన వారి బైట ప్రపంచానికి చూపిస్తూనే వుంటుంది. ఇంకా మీకెందుకు అలసట. ఇంకెందుకు మీకు ఆవేదన. ఏడ్చే కన్నీళ్లను ఎవరూ తూడ్వలేరు. ఎరుపెక్కిన కళ్లనే అందరూ చూస్తారు. చిత్ర పురి మీది. చిత్రపురిలో హక్కు మీద. సినిమా చాన్స్‌ల కోసం పడిన మీ తపన మీ గూడు కోసం కూడా చూపించండి. చిత్రపురిలో ఇంటి కోసం కొట్లాడితే అవకాశాలు రావనే భయంలో బతక్కండి. సినిమాలో పని దొరకక్కదన్న అభద్రతలో వుండకండి. కార్మికులు లేకుండా సినిమా లేదు. కార్మికులులేకుండా సినిమా ఒక్క అడుగు ముందుకు పడదు. అసలు సినిమా నిర్మాణమే జరగదు. సినీ కార్మికులను కాదని సినిమా తీస్తే అడ్డు పడండి. అడ్డుకోండి. ఇతర ప్రాంతాల కార్మికులను తెచ్చుకొని సినిమా తీస్తామంటే తరిమేయండి. లేకుంటే మీకు ఇల్లు రాదు. సినిమా అవకాశాలు రావు. అర్ధించినంత కాలం మీరు బానిసలే..సనీ గద్దలకు బానిసలే. మీ కష్టం దోచుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు. మీ కష్టాన్ని ఇటుకలు చేసుకొని ఇండ్లు లాక్కుంటున్నారు. ప్రతి మనిషికి కూడు, గూడు,గుడ్డ అవసరం. అవి తీరాలంటే పనులు కావాలి. ఆ బలహీనతే కార్మికులను రోడ్డున పడేస్తుంది. సినిమా పెద్దల చేతుల్లో కీలుబొమ్మలను చేస్తోంది. కార్మికులకు ఆకలే కాదు. ఆవేశం కూడ వుండాలి. ఆందోళన చేసి సాధించుకోవాలి. ప్రశ్నించి నిలదీయాలి. ఎదిరించి హక్కులు సాధించుకోవాలి. దేశ స్వాతంత్య్రం కూడా కొట్లాడితేనే వచ్చింది. పోరాటం చేస్తేనే వచ్చింది. అలుపెరగని ఉద్యమం సాగిస్తేనే వచ్చింది. ఒక్కసారి విశ్రమిస్తే ఇక ఎప్పుడైనా వెనుకడుగే..అప్పుడప్పుడూ చేసేది ఉద్యమం కాదు. విరామాలు ఇచ్చుకుంటూ పోరాడితే న్యాయం జరగదు. పోరాటమే కాదు ఆరాటం కూడా వుండాలి. అందుకు ఆచరణ కావాలి. ముందడుగు వేసే ధైర్యం కావాలి. ఆ శక్తి ప్రతి కార్మికుడిలోనూ వుండాలి. అప్పుడే చిత్రపురి కార్మికుల సొంతమౌతుంది. ఎవరో వస్తారని , ఏదో చేస్తారని ఎదురుచూడడం మానుకోండి. మీ కోసం కలిసి వచ్చే వారితో కలిసి పోరు బాట ఎంచుకోండి. సిపిఎం. అగ్రనేత ఎప్పటి నుంచో చెబుతున్నారు. మీకు అండగా కలిసి సాగారు. మీ కోసం ఉద్యమాలు చేశారు. కాని కార్మికులలో ఐక్యత ఇంకా పూర్తిగా లేదు. ప్రతి సమాజంలోనూ అవకాశవాదులుంటారు. అలాంటి వారు మీ సమూహంలోనే వుంటారు. అలాంటి అవకాశవాదులను గుర్తించండి. మీ కోసం కలిసి రాని కార్మికులను పక్కన పెట్టండి. ఎందుకంటే అవకాశవాదులు కలిసి రాదు. కార్మికులందరనీ ఏకం కానివ్వరు. సినీ పెద్దల జేబులుగా పనిచేసే వారు మీ పక్కనే వుంటారు. మీకు ఎప్పటికిప్పుడు వెన్ను పోటు పొడుస్తూనే వుంటారు. వెళ్లకున్న ఎంగిలి మెతుకులు మీకు విసిరేసి వడ్డించిన విస్తరి సుష్టుగా సినీ పెద్దలు బోంచేస్తున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన భూములు సినీ గద్దలు సొంతం చేసుకొని కార్మికులకు పని కల్పిస్తున్నారు. ఎంగిలి మెతుకుల కార్మికుల మొహాన కొడుతున్నారు. ఇప్పటికైనా కార్మికులు కళ్లు తెరవండి. అమాయకపు ఆలోచనల నుంచి దూరంగా జరగడండి. కార్మికుల్లో వుండే కలతలు పక్కనపెట్టుకోండి. అంతా ఏకమైతే వేల కోట్ల రూపాయల విలువైన భూమిని సొంతం చేసుకోండి. చిత్రపురి సొసైటీలో సినీ పెద్దలెందుకు? కార్మికులకు చేతగాదా? కార్మికులు సొసైటీని నడుపుకోలేరా? చిత్రపురిలో కార్మికులకు చోటు లేకుండాపోవడానికి కారణమేమిటి? నటులందరికీ ఆస్ధులున్నాయి. నిర్మాతలకు, దర్శకులకు ఆస్దులున్నాయి. భూములున్నాయి. మీ భూముల మీదకు వస్తుంటే ఏం చేస్తున్నారు. కార్మికులకు మాయ మాటలు చెప్పి, ఎప్పుడో మోసం చేశారు. ఇంకా చేస్తూనే వున్నారు. అసలు చిత్ర పురిలో జరిగిన స్కామ్‌ అంత ఇంతా కాదు. 67 ఎకరాల భూమి విలువ వేల కోట్లు. సుమారు 3వేల కోట్ల విలువైన స్ధలం. ఆ స్థలమే మీ సొంతమైమతే ప్రతి కార్మికుడు ఒకసినిమా తీయొచ్చు. కార్మికులే నిర్మాతలు కావొచ్చు. లారీ డ్రైవర్లు ఓనర్లు కాలేదా? కార్మికులు నిర్మాతలు కాలేరా? ఇతర రంగాలలో రాణించలేరా? మీరే దర్శకులు కాలేరా? మీరే నటులై పాత్రలు పోషించలేరా? తరం మారుతోంది. నిన్నటి తరం హీరోల వారసులే హీరోలా…కార్మికులలో కళలేదా? కళాకారులు కాలేదు. ఇతర రంగాలలో వారికి ప్రతిభ లేదా? ముందు మీరు మేలుకోండి. చిత్రపురి సొంతం చేసుకొని, సొసైటీ పేరుతో సినిమాలు తీయండి. మీ ఇల్లు మీ సొంతం చేసుకొని గూడు సమకూర్చుకోండి. కార్మికులలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. కార్మికుల సలహాలు తీసుకుంటూ సినిమాలు తీస్తున్నవారున్నారు. కార్మికులు చెప్పే కథలను సినిమాలకు అలులతున్నవారున్నారు. మొత్తం సినిమా అంతా కార్మికులచుట్టే తిరుగుతుంది. ఒక్కసారి ఇప్పుడున్న సినీ గద్దల సినిమాకు దూరంగా వుండండి. అప్పుడు సినీ లోకమంతా విలవిలలాడుతుంది. కాని ఎక్కడ కడుపు కాలుతుందో…ఆకలి దహిస్తుందో..అని వాళ్లకన్నాముందే కార్మికులు తమ అచేతనం చూపిస్తున్నారు. నిర్మాతులు లేకుంటే బతకలేమనుకుంటున్నారు. సినిమాలు రాకపోతే బువ్వ తినలేమనుకుంటున్నారు. అందుకే కార్మికులంతా గొడుగు పట్టుకోవడంతోనే ఆగిపోతున్నారు. కార్యవాన్‌ల తలుపులు తెరిచేందుకే పనికొస్తున్నారు. సినిమాలో ఓ మూలన నిలబడి ఒక్కసారి తెరమీద కనిపిస్తే చాలనుకుంటుకుంటున్నారు. తెలంగాణలో ఎంతో మంది స్వతహసిద్దితో కళాకారులౌతున్నవాళ్లున్నారు. తెలంగాణ మట్టిలో పాట వుంది. సంగీతంవుంది. తెలంగాణ జీవితమే ఒక కథలా వుంటుంది. వాటిని పట్టుకొని సినిమా తెరకెక్కించండి. అంతే కాని ఎవరి కాళ్లో పట్టుకుంటేనే బతుకుతామన్న భావన నుంచి బైటకు రండి. సమాజంలో ఏ రంగంలో చూసినా ఎదుగూ బొదుగూ వుంటుంది. కాని సినీ కార్మికుల జీవితాలు ఎందుకు అక్కడే వుంటున్నాయి. ఒక బట్టలషాపులో పనిచేసే వ్యక్తి కొంత కాలం తర్వాత చిన్నగా బట్టల దుకాణం పెట్టుకుంటాడు. కొంత కాలం టైలరింగ్‌ నేర్చుకున్నవ్యక్తి సొంతంగా టైలరింగ్‌ షాపు పెట్టుకుంటాడు. కాని ఒక్క సినీ రంగంలోనే జీవితాంతంకార్మికుడిగానే వుంటాడు. వయసైపోయిన తర్వాత ఎవరు సాయం చేస్తారా? అని ఎదురు చూస్తుంటాడు. అసంఘటిత కార్మికులకు వున్న వెసులుబాటు సినీ కార్మికులకు లేదు. అందువల్ల మీ చిత్రపురిని మీరు సొంతం చేసుకోవడమే అందుకు పరిష్కారం. కార్మికులకు చిత్రపురి విషయంలో తీరని అన్యాయం జరిగిందని అన్ని వర్గాలలో సానుభూతి వుంది. కాని కార్మికుల పోరాటంలోకొంత అలసత్వం వుంది. నిర్లక్ష్యం కూడా కనిపిస్తోందని చెప్పడంలో సందేహం లేదు. చిత్ర పురి విషయంలో నేటిధాత్రి లాంటి మీడియా ఎంతో ఆది నుంచి సపోర్టు చేస్తున్నప్పటికీ కార్మికుల విడతల వారీ పోరాటం వల్ల ప్రతిసారి మళ్లీ మొదటికొస్తోంది. ఇప్పటికైనా సరే కార్మికులు అందరూ ఒక్కతాటి మీదకు రావాల్సిన అవసరం వుంది. పాలకులు మారినప్పుడల్లా, ఎన్నికలు వచ్చినప్పుడల్లా మాత్రమే కార్మికులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. తర్వాత మర్చిపోతున్నారు. పూర్తి స్దాయి చిత్తశుద్దితో కూడా కార్మికులు పోరాటంచేయాల్సిన అవసరం వుందన్నది కూడా అంగీకరించాలి. విరామం లేని ఉద్యమం సాగిస్తే తప్ప సమస్య పరిష్కారం కాదన్నది తెలుసుకోవాలి.

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం..

ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయం

చికిత్స పొందుతున్న వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ కుటుంబానికి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. శ్రీరాంపూర్ పట్టణంలో ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో సూపర్వైజర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ కుమారుడు శ్రీకాంత్ చదువులో గొప్పగా రాణించి ప్రిపేర్ అయ్యే సమయంలో విపరీతంగా తలనొప్పి రావడంతో జిల్లాలోని హాస్పటల్ కి తరలించగా వైద్యులు పరీక్షలు చేసి హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి పంపించారు.వారిది నిరుపేద కుటుంబం కావడంతో డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో ఉండగా కొందరు గ్రామస్తులు ఆత్మీయ చారిటబుల్ ట్రస్టు ను సంప్రదించండి సహాయమందిస్తారని తెలియజేయడంతో హుటాహుటిన ట్రస్ట్ సభ్యులను సంప్రదించడంతో వెంటనే వారు హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సభ్యులు డి.ప్రేమ్ కుమార్,కె. మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఘనంగా పిజేపిఎస్ 8 వ వార్షికోత్సవం..

ఘనంగా పిజేపిఎస్ 8 వ వార్షికోత్సవం.

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక..

నర్సంపేట:నేటిధాత్రి

పాకాల పత్రిక విలేకరుల పరస్పర సహకార సంఘం 8 వ వార్షికోత్సవం నర్సంపేట పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో సంఘం అధ్యక్షుడు కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సోమవారం ఘనంగా నిర్వహించారు.నర్సంపేట ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టుల అభివృద్దే లక్ష్యంగా గత 8 సంవత్సరాలు జర్నలిస్టుల పరపతి సహకార సంఘం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ తెలిపారు.ఒకరికొరకు పరస్పరం సహకారం చేసుకుంటూ ముందుపోవాలని ఈ సందర్భంగా సూచించారు.అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక..

పాకాల పత్రిక విలేకరుల పరస్పర సహకార సంఘం నూతన కమిటీని ఎన్నికల అధికారులుగా పోడేటి అశోక్, కాసర్ల నరసింహరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహింఛారు. నూతన అధ్యక్షులుగా కోదాటి గోపాలకృష్ణ,కార్యదర్శిగా రడం శ్రీనివాస్ గౌడ్,ఉపాధ్యక్షులుగా పాలంచ సత్యనారాయణ,
కోశాధికారిగా సామల అనిల్ కుమార్,సహాయ కార్యదర్శిగా కందుల శ్రీనివాస్ గౌడ్,గౌరవ అధ్యక్షులుగా వేములపల్లి వెంకటరామయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పిట్టల కుమారస్వామి,శీలం రమేష్,వడ్లకొండ పవిత్రన్ గౌడ్,తాళ్లపల్లి చంద్రమౌళి గౌడ్,కర్ల వెంకటరెడ్డి, మచ్చిక రమేష్ గౌడ్, పెండెం శివానంద్,జూలూరి హరిప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టి పి సి సి వెంకటేష్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన టి పి సి సి సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్

వనపర్తి:నేటిదాత్రి 

రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి కి వచ్చిన సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టి పి సి సి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ కలిశారు .తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తి నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలకు వచ్చారు ఈ . సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి టి పి సి సి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ వారికి ఒకప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి..

జాతీయ మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి…

మిర్చి క్వింటాల్ కి రూ” ఇరువై వేలు కనీస మద్దతు ధర ప్రకటించండి…

త్వరలో మిర్చి రైతుల సమస్యలపై గవర్నర్ సీయం మరియు రాష్ట్ర కేంద్ర మంత్రులను కలుస్తా…

*జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

మంగపేట:నేటిధాత్రి

దేశవ్యాప్తంగా మిర్చి రైతులను ఆదుకునేందుకు “జాతీయ మిర్చి బోర్డు” ఏర్పాటు చేసి క్వింటాల్ ఎండు మిర్చి రూ” ఇరువై వేలు కనీస మద్దతు ధర నిర్ణయించి నేరుగా రైతుల వద్ద నుండి ప్రభుత్వమే మిర్చి కొనుగోలు చేయాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడచిన పది రోజులుగా మిర్చి ధర భారీగా పతనం కావడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో మిర్చి రైతుల సమస్యలు తెలుసుకుని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు స్పైసెస్ బోర్డు అధికారులతో మాట్లాడానని ప్రస్తుతం మార్చి మాసంలో మిర్చి ధర పెరగవచ్చునని కేంద్ర వాణిజ్య శాఖ అంచనా వేస్తోందన్నారు ఎకరా మిర్చి సాగుకు సుమారు రూ” మూడు లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతుందని మార్కెట్లో క్వింటాలుకు పధమూడు వేల లోపు మాత్రమే ధర లభించడం వల్ల ఆర్థికంగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో మిర్చిని పెద్ద ఎత్తున సాగు చేస్తున్నందున కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటుచేసిన జాతీయ పసుపు బోర్డు తరహాలో వరంగల్ కేంద్రంగా “జాతీయ మిర్చి బోర్డు” మంజూరు చేయాలని మిర్చి బోర్డు ద్వారా మిర్చి సాగు కి అవసరమైన అనేక రకాల రాయితీ పథకాలను అమలు చేయడంతో పాటు క్వింటాల్ ఎండుమిర్చి రూ” ఇరువై వేలు గా నిర్ణయించి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా నేరుగా ప్రభుత్వమే మిర్చి బోర్డు నుండి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సాంబశివరెడ్డి కోరారు ప్రస్తుత సీజన్ లో మార్కెట్ పరంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నర్ మరియు రాష్ట్ర కేంద్ర మంత్రులను కలిసి వారి దృష్టికి తీసుకు వెళ్తానని సాంబశివరెడ్డి తెలిపారు మిర్చి రైతుల సమస్యలు మార్కెట్ ఒడిదుడుకులపై ఇప్పటికే జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మూడు పర్యాయాలు తన నివేదికను భారత ప్రభుత్వం కామర్స్ మరియు ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖకు అందజేసిన విషయాన్ని సాంబశివరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు

ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు..

ఫర్టిలైజర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగుర్ల వెంకటేశ్వర్లు

శాలువాతో సత్కరించిన అరుణ ఫర్టిలైజర్ యాజమాని వెంకన్న

పరకాల:నేటిధాత్రి
వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగూర్ల వెంకన్న మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనారు.ఈ సందర్బంగా అరుణ ఫర్టీలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ సీడ్స్ ప్రొప్రైటర్ గందే వెంకటేశ్వర్లు హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.గత 35 సంవత్సరాలుగా ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్అండ్ సీడ్స్ రంగంలో వరంగల్ హనుమకొండ జిల్లా ఫర్టిలైజర్ అసోసియేషన్ కి ఎనలేని సేవలు అందిస్తూ ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తూ ఎరువుల పురుగుమందులు విత్తనంపై దుకాణాల యజమానుల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి అనునిత్యం కృషి చేస్తూ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు గందే వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం..

ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం లో పాల్గోని అనంతరం ఆర్యవైశ్య భవనం ప్రారంభించారు యంపి, మాజీ మంత్రి. టి జి ఐ డి సి మాజీ చైర్మన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహిరాబాద్ పట్టణం: జహిరాబాద్ పట్టణం లో ఆర్యవైశ్య సంఘం వారు నిర్వహించిన ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణం లో పాల్గోని స్వామి వారిని దర్శించుకుని అనంతరం ఆర్యవైశ్య భవనం ప్రారంభించారు.నిర్వహకులు ఈ సందర్భంగా జ్ఞాపికను అందచేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు ,మంకల్ సుభాష్ గారు,శుక్లవర్దన్ రెడ్డి, అశోక్,రాకేష్ గుప్త,ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఈ టార్చర్‌ మేం భరించలేం!

`సబ్‌ రిజిస్ట్రార్ల ఆందోళన, ఆవేదన.

`మంత్రి పొంగులేటికి, ఉన్నతాధికారులకు రిజిస్ట్రార్ల లేఖ.

`మీడియా ముసుగులో వచ్చే వారిని తట్టుకోలేం!

`ఎవరు అసలో..ఎవరు నకిలో తెలియడం లేదు.

`మీడియా పేరు చెప్పి వచ్చే ప్రతి ఒక్కరినీ గుర్తించలేం.

`సమయమంతా వారికి కేటాయించడంతోనే సరిపోతోంది.

`సమాధానం చెప్పడంతోనే సగం సమయం వృధా అవుతోంది.

`వివరణలు ఇవ్వడానికే గంటలు కరిగిపోతున్నాయి.

`అసత్య వార్తలన్నింటికీ జవాబుదారీలం కాలేము.

`జవాబులు చెప్పుకుంటూ కూర్చుంటే కొలువులు చేయలేము.

`సోషల్‌ మీడియాకు నియంత్రణ లేకపోతే వారిని కంట్రోల్‌ చేయలేము.

`రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే వారు పది మంది!

`లేని పోని వార్తలతో వచ్బే జర్నలిస్టులు పదుల సంఖ్యలు.

`గాలి వార్తలు..వసూల్‌ రాజాలు!

`లేని పోని వార్తలు సృష్టిస్తున్నారు.

`ప్రజల్లో రిజిస్ట్రార్లను మరింత చులకన చేస్తున్నారు.

`రిజిస్ట్రేషన్‌కు వచ్చే వాళ్లంతా అనుమానంగా చూస్తున్నారు

`డాక్యుమెంట్‌ రైటర్లు, సోషల్‌ మీడియా జర్నలిస్టులు కలిసి భ్రష్టు పట్టిస్తున్నారు

`డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి లేని సమాచారం సేకరించి అభూత కల్పనలు రాస్తున్నారు

`రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతున్నారని వార్తలు రాస్తున్నారు

`నిజాలకన్నా అబద్దాలకే విలువెక్కువైంది

`మా జీవితాలు అనుమానాలతో సతమతమౌతున్నాయి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అని సామెత. కానీ అసలు దర్జా, దర్పం వెలగబెట్టే వారికి కూడా కష్టాలుంటాయా? వస్తాయా? ఇబ్బంది పెడతాయా? ఊపిరి సలపకుండా చేస్తాయా? అంటే అవునని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ ఎవరూ వినని సందర్భం, సందేహం కావడంతో ఒకింత ఆశ్చర్యమే అనిపిస్తుంది. కాకపోతే అది నిజం. ఈ మధ్య తెలంగాణలోని సబ్‌ రిజిస్ట్రార్లు ఈ టార్చర్‌ మేం భరించలేం! బాబోయ్‌ అంటున్నారు. నిజంగానే రిజిస్ట్రార్లు ఈ మాటలు అంటున్నారా? అని ఆరా తీస్తే అవుననే అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సబ్‌ రిజిస్ట్రార్లు తీవ్ర అందోళన చెందుతున్నారు. ఆవేదనకు గురౌతున్నారు. మేము ఈ కొలువు చేయలేకపోతున్నామని గొల్లు మంటున్నారు. ఉద్యోగం చేయలేమని చెబుతున్నారు. దాంతో కొంతమంది సబ్‌ రిజిస్ట్రార్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కి, ఇతర ఉన్నతాధికారులకు ఓ లేఖ రాసినట్లుగా సమాచారం అందుతోంది. నిత్యం కార్యాలయాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఆ లేఖలో గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయం నేటిధాత్రి దృష్టికి వచ్చింది. ఆ లేఖ సారాంశం అందింది. తెలంగాణ వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి నిత్యం వచ్చే జర్నలిస్టులతో వేగలేకపోతున్నామన్నది ఆ లేఖ సారాంశం. ప్రతి రోజు పదుల సంఖ్యలో వచ్చే జర్నలిస్టులలో అసలు జర్నలిస్టులు ఎవరు? జర్నలిస్టుల ముసుగులో వచ్చిందెవరో తేల్చుకోలేక రిజిస్ట్రార్లు సతమతమౌతున్నారట. మీడియా ముసుగులో వచ్చే వారిని తట్టుకోలేకపోతున్నామని సబ్‌ రిజిస్ట్రార్లు లేఖ రాశారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చే జర్నలిస్టులలో ఎవరు అసలో..ఎవరు నకిలో తెలియడం లేదు. మీడియా పేరు చెప్పి వచ్చే ప్రతి ఒక్కరినీ గుర్తించలేమంటున్నారు. పదుల సంఖ్యలో జర్నలిస్టులు రావడం సమయం కోరడం, వారు ప్రశ్నల మీద ప్రస్నలు అడగడం జరుగుతోంది. తమకు సంబంధం లేని అంశాలను, వారి ఊహలను మా నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఏ వార్త ఎందుకు రాస్తున్నారో, ఎవరిని అడిగి రాస్తున్నారో అర్థం కావడం లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియా జర్నలిస్టులు రాసే ప్రతి విషయానికి సమాధానం చెబుతూ వెళ్తే కొలువు చేయడానికి సమయం సరిపోవడం లేదు. ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ఒక రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయన్న పూర్తి సమాచారం నెట్‌లో దొరుకుతుంది. అయినా అర్థం పర్థం లేని వార్తలు రాస్తున్నారు. కట్టు కథలు అల్లి వీడియోలు తయారు చేస్తున్నారు. ఆరోపణలు చేస్తూ వండి వారుస్తున్నారు. ఆ వార్తలకు తలా తోక వుండడం లేదు. నిజంగానే ఏదైనా పొరపాటు జరిగితే జర్నలిస్టులకు రాసే హక్కు వుంది. కానీ జరగనవి జరిగినట్లు కల్పిత కథలు సృష్టించి మా మనోభావాలను దెబ్బ తీస్తున్నారని రిజిస్ట్రార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్తలపై అటు ఇతర జర్నలిస్టులకు సమాధానం చెప్పుకోవడమే కాదు, పై స్థాయి అధికారులకు కూడా వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. వచ్చే వార్తలలో ఏవి నిజమో..ఏవి అబద్ధమో అర్థం కాక ఉన్నతాధికారులు వివరణలు అడుగుతున్నారు. ఇలా రోజంతా ఆ తలనొప్పితోనే గడిచిపోతోంది. దాంతో మా రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్ని సార్లు తిరగాలంటూ ప్రజలు కూడా నిలదీస్తున్నారు. ఏదో ఆశించే రిజిస్ట్రార్లు కాలయాపన చేస్తున్నారని అనుమానపడుతున్నారు. మేం ఎదురుకుంటున్న ఈ సమస్యలు అధికారులు పట్టించుకోవడం లేదు. మీడియా అర్థం చేసుకోవడం లేదు. రోజుల్లో సగానికి పైగా సమయమంతా వారికి కేటాయించడంతోనే సరిపోతోంది. మా బాధ ఎవరూ పట్టించుకోవడం లేదు. వినిపించుకోవడం లేదు. జర్నలిస్టులను రానివ్వకపోతే ఏదో జరుగుందని మళ్ళీ వార్తలు రాస్తారు. సమాధానం చెప్పడంతోనే సగం సమయం వృధా అవుతోంది. జర్నలిస్టులకు వివరణలు ఇవ్వడానికే గంటలు కరిగిపోతున్నాయి. జర్నలిస్టులు రాసే ప్రతి వార్తకు,అసత్య వార్తలన్నింటికీ జవాబుదారీలం కాలేము. ఇలా నిరంతరం జవాబులు చెప్పుకుంటూ కూర్చుంటే కొలువులు చేయలేము. నిజంగానే ఏదైనా అవకతవకలు జరిగితే రుజువులతో సహా వార్తలు రాయండి. నిందారోపణలే లక్ష్యంగా వార్తలు రాసి మనో భావాలు దెబ్బ తీయొద్దని సూచిస్తున్నారు. సోషల్‌ మీడియాకు నియంత్రణ లేకపోతే వారిని కంట్రోల్‌ చేయలేము. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే వారు పది మంది! లేని పోని వార్తలతో వచ్బే జర్నలిస్టులు పదుల సంఖ్యలుగా వుంటున్నారు. గాలి వార్తలు..వసూల్‌ రాజాలు!గా మారిన వాళ్లంతా తెల్లారి లేస్తే రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలలోనే వుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారి పనులు తొందరగా ముగించాలా? లేక జర్నలిస్టులకు సమాధానాలు చెప్పుకుంటూనే కూర్చోవాలో అర్థం కావడం లేదు. వీళ్ల పరిస్థితి ఇలా వుంటే డాక్యుమెంట్‌ రైటర్ల ఆగడాలు మరో రకంగా వుంటున్నాయి. కొత్తగా వచ్చిన రిజిస్ట్రార్లకు చుక్కలు చూపిస్తున్నారు. లేని పోని వార్తలు సృష్టించి, కొంత మంది జర్నలిస్టులకు సమాచారం అందిస్తున్నారు. అది నిజమనుకొని ఎలాంటి ఆధారాలు కూడా అడక్కుండానే కొంత మంది జర్నలిస్టులు వార్తలు రాసేస్తున్నారు. ప్రజల్లో రిజిస్ట్రార్లను మరింత చులకన చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు వచ్చే వాళ్లంతా అనుమానంగా చూస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటర్లు, సోషల్‌ మీడియా జర్నలిస్టులు కలిసి భ్రష్టు పట్టిస్తున్నారు. డాక్యుమెంట్‌ రైటర్ల నుంచి లేని సమాచారం సేకరించి అభూత కల్పనలు రాస్తున్నారు. రిజిస్ట్రార్లు అవినీతికి పాల్పడుతున్నారని వార్తలు రాస్తున్నారు. నిజాలకన్నా అబద్దాలకే విలువెక్కువైంది. మా జీవితాలు అనుమానాలతో సతమతమౌతున్నాయి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని సబ్‌ రిజిస్ట్రార్లు కోరుతున్నారు.

ప్రకంపనలు సృష్టిస్తున్న సీపీఎం ముసాయిదా

మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్‌ లేదా నియోఫాసిస్ట్‌ కాదన్న సీపీఎం

భగ్గుమన్న కాంగ్రెస్‌, సీపీఐ

కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న సీపీఎం మారిన వైఖరి

ఎల్‌డీఎఫ్‌పై ఎదురుదాడిని పెంచిన కాంగ్రెస్‌

సీపీఎం వ్యూహాన్ని విపక్షాలు అర్థం చేసుకోవడంలేదా?

వచ్చే ఏడాదిలో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు

చాపకింద నీరులా వ్యవహరిస్తున్న బీజేపీ

హైదరాబాద్‌,నేటిధాత్రి:

భారత రాజకీయాల్లో కమ్యూనిస్టులు, భారతీయ జనతాపార్టీ`ఆర్‌ఎస్‌ఎస్‌లు పరస్పర విరుద్ధ భావజాలాలు కలిగినవన్న సంగతి మనకు తెలిసిందే. నిజం చెప్పాలంటే కమ్యూనిస్టు సిద్ధాంతానికి, భాజపా అనుసరించే జాతీయవాద సిద్ధాంతానికి ఉప్పు`నిప్పు సంబంధమంటే అతిశయోక్తి కాదు. అటువంటిది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) వచ్చే ఏప్రిల్‌ నెలలో పార్టీ కాంగ్రెస్‌ జరుగనున్న నేపథ్యంలో ఒక ముసాయిదాను విడుదల చేసింది. భాజపాను ఫాసిస్ట్‌, నియో`ఫాసిస్ట్‌ పార్టీగా ఎప్పుడూ తనదైన శైలిలో విమర్శించే సీపీఐ(ఎం) ఈసారి ముసాయిదాలో నరేంద్రమోదీ ప్రభుత్వం ‘నియో`పాసిస్ట్‌’ లేదా ‘ఫాసిస్ట్‌’గా పిలవడానికి అవసరమైన అర్హతలు లేవని పేర్కొనడం దేశంలో ఒక్కసారి రాజకీయ ప్రకంపనలు రేకెత్తించింది. ఈ ముసాయిదా విడుదల కాగానే కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ)లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నిజం చెప్పా లంటే ఈ ముసాయిదా విపక్షపార్టీల మధ్య కొత్త విభేదాలను సృష్టించడమే కాదు, వాటిల్లో నెల కొన్న నిలకడలేని రాజకీయాలను మరోసారి బట్టబయలు చేసింది.

విషయమేంటంటే వచ్చే ఏప్రిల్‌ నెలలో సీపీఐ(ఎం) పార్టీ 24వ కాంగ్రెస్‌ మీటింగ్‌ జరుగనుంది. పార్టీ రాజకీయ తీర్మానానికి సంబంధించి ముసాయిదా నోట్‌ను రూపొందించి తన రాష్ట్ర శాఖలకు పంపింది. ఇటువంటి ప్రతి పార్టీ కాంగ్రెస్‌ సమావేశానికి ముందు ఇటువంటి ముసాయిదానుపంపడం రివాజు. అయితే ఇప్పటివరకు బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌పై పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై సీపీఎం యూటర్న్‌ తీసుకోవడమే ఈ ముసాయిదాలోని ఆశ్చర్యం కలిగించే విశేషం! నిజానికి బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌లను ఫాసిస్ట్‌ అజెండాతో ముందుకెళ్లేవిగా సీపీఎం ఎప్పుడూ విమర్శిస్తూ రావడం కద్దు. మాజీ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో మోదీ ప్రభుత్వాన్ని, ఫాసిజాన్ని సమాంతర రేఖలుగా వివరించడానికి ప్రయత్నించారు. ఇదిలావుండగా సీపీఎం తన అభిప్రాయాన్ని సమర్థించుకోగా, సహచర సీపీఐ మాత్రం ఈ ‘తప్పిదాన్ని’ సరిదిద్దుకోవాలని డిమాండ్‌ చేసింది. 1964లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా సీపీఎం మరియు సీపీఐలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌ ఒక అడుగు ముందుకేసి సీపీఎం కేవలం తన ఉనికికోసమే ఈవిధంగా మాటమార్చిందంటూ విరుచుకుపడిరది.

సీపీఎం, సీపీఐ మరియు కాంగ్రెస్‌లు జాతీయస్థాయిలో ఒకే కూటమిలో వుండగా, కేరళలో మా త్రం సీపీఎం, సీపీఐల కూటమితో ఏర్పడిన ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం అధికారంలో వుంది. ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలోని యు.డి.ఎఫ్‌. ఈ రాష్ట్రంలో విపక్షంలో వుంది. సీపీఎం తాజా వైఖరి నేపథ్యంలో ప్రముఖ రచయిత తుషార్‌ గాంధీ ‘ఎక్స్‌’వేదికలో ఈవిధంగా పోస్ట్‌ చేశారు. ‘‘కేరళ సీపీఎం మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా అంగీకరించడంలేదు. అంటే ఇప్పుడు సీపీఎం తన ఎర్ర జెండానుమడతపెట్టి, ఆర్‌ఎస్‌ఎస్‌ను కేరళలోకి ‘రెడ్‌ కార్పెట్‌’ వేసి మరీ ఆహ్వానించాలని చూస్తున్నదనుకోవాలా? ఇప్పుడు ‘లాల్‌’ కాస్తా ‘భగ్వా’గా మారిపోయిందా?’’ అంటూ ప్రశ్నించారు.
మోదీ ప్రభుత్వం ‘నియో`ఫాసిస్ట్‌’ లక్షణాలను ప్రదర్శిస్తున్నప్పటికీ, దాన్ని ‘ఫాసిస్ట్‌ లేదా నియో` ఫాసిస్ట్‌’గా పిలిచేందుకు అవసరమైన యోగ్యతలు దానికి లేవని సీపీఎం ముసాయిదా స్పష్టం చేసింది. ‘మేం మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌ లేదా నియో`ఫాసిస్ట్‌ అని ఎప్పుడూ పేర్కొనలేదు. ఇదేసమయంలో భారత్‌ను నియో`ఫాసిస్ట్‌ రాజ్యంగా పరిగణించడంలేదు. మేం చెప్పేదల్లా ఒక్కటే. ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగమైన బీజేపీ పదేళ్లుగా దేశాన్ని పాలిస్తోంది. ఈ కాలంలో బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలో రాజకీయ సుసంఘటితను సాధించాయి. దీని ఫలితంగా నియో`ఫాసిస్ట్‌ లక్షణాలు వ్యక్తమవడం మొదలైంది’ అని సీపీఎం ముసాయిదా తీర్మానం పేర్కొంది. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బాలన్‌ పార్టీ అభిప్రాయాన్ని గట్టిగా సమర్థించారు. ‘‘మేం ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా వ్యవహరించలేదు. ఫాసిజం మళ్లీ పురుడుపోసుకుందన్న మాట కూడా మేం ఎప్పుడూ అనలేదు. నిజంగా ఫాసిజం దేశంలోని ప్రవేశిస్తే రాజకీయ నిర్మాణం ఒక్కసారిగా మారిపోతుంది.’ అని బాలన్‌ పేర్కొన్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌)లు తమ అభిప్రాయానికి భిన్నంగా దేశంలోకి ఫాసిజం వచ్చేసిందని భావిస్తున్నాయి, అని కూడా బాలన్‌ పేర్కొ న్నారు. నిజానికి దేశంలోకి ఫాసిజం వచ్చిందని భావిస్తే అందుకు రుజువులు చూపండి అని బాలన్‌ కోరినట్టు మళయాల న్యూస్‌ పోర్టల్‌ ‘మాధ్యమం’ పేర్కొంది.

మధ్యంతరాసామ్రాజ్యయుగంలో పురుడుపోసుకున్న క్లాసికల్‌ాఫాసిజానికి మరియు నియోాఫాసిజానికి మధ్య వున్న తేడాను తాము గుర్తించామని, ఇది కేవలం నియోాలిబరలిజంలో చోటుచేసుఉన్న సంక్షోభం నుంచి పుట్టుకొచ్చింది మాత్రమేనని సీపీఎం పేర్కొంది. నియోాఫాసిజం నిజా నికి ప్రజాస్వామ్య చట్రంలో నిరంకుశ లక్షణాలు కలిగివుంటుందని, క్లాసికల్‌ాఫాసిజం మాదిరిగా కాకుండా ఇది పూర్తిగా ఎన్నికల వ్యవస్థనే తిరస్కరిస్తుందని వివరించింది.
కేరళ అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుత సీపీఎం వైఖరిని, కేరళ కాంగ్రెస్‌ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి యత్నాలు మొదలుపెట్టింది. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కాంగ్రెస్‌ ‘ప్రస్తుత సీపీఎం వైఖరి పూర్తిగా దాని వ్యాపారధోరణికి నిదర్శనం’ అని విమర్శించింది. కేరళలో సీపీఎంను ఇకనుంచి ‘కమ్యూనిస్ట్‌ జనతా పార్టీ’ (సీజేపీ)గా పిలవాలంటూ ఎద్దేవా చేసింది. సీపీఎంకు, బీజేపీకి మధ్య అంతర్గతంగా ‘అంగీకారం’ కుదిరిందా? అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఫాసిస్ట్‌ బీజేపీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌ కాదనడమంటే ఆపార్టీకి సీపీఎం కోవర్ట్‌గా వ్యవహరిస్తోందా? అన్న అనుమానం వ్యక్తం చేసింది.
‘సీపీఎం ఉన్నతస్థాయిలో తీసుకొచ్చిన కొత్త సిద్ధాంతం నేపథ్యంలో ఇప్పటివరకు సెక్యూలర్‌ విలువలకోసం పోరాడే పార్టీగా భావించేవారు, నేటివరకు వామపక్షంగా పరిగణిస్తూ తప్పుచేశామన్న భావనకు గురవుతారు. గత అసెంబ్లీ, లోక్‌సభ మరియు ఇతర ఉప`ఎన్నికల్లో క్రమంగా రైట్‌ వింగ్‌వైపుకు మారుతున్న పరిణామాలు, సీపీఎంను దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా స్థానం లేకుండా చేస్తున్నాయి. అంతేకాదు ఈ పార్టీ ప్రస్థానం ముగింపు దశలో ఉన్నదన్న సత్యాన్ని వెల్లడిస్తున్నాయి’ అని కేరళ కాంగ్రెస్‌ పేర్కొంది.

కేరళ అసెంబ్లీలో విపక్ష నేత వి.డి. సతీశన్‌ మాట్లాడుతూ ప్రస్తుత సీపీఎం వైఖరి, బీజేపీతో దానికున్న రహస్య ఒప్పందాన్ని వెల్లడిస్తోందని ఆరోపించారు. ‘కేరళలో సీపీఎం ఎప్పుడూ ఫాసిజంతోశాంతిగానే వ్యవహరిస్తోంది. సంఫ్‌ుపరివార్‌తో అది ఒక అంగీకారానికి వచ్చింది. ఈ సంబంధాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఫాసిస్ట్‌ కాదంటూ కొత్త ముసాయిదాను ముందుకు తెచ్చింది. మోదీతో చేతులు కలపడానికి, సంఘపరివార్‌తో శాంతి ఒప్పందం ద్వారా వారికి లంగిపోవడానికి సీపీఎం సిద్ధపడిరది’’ అని సతీశన్‌ ఆరోపించారు.
కేవలం కాంగ్రెస్‌ మాత్రమే కాదు సీపీఐ కూడా సీపీఎం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేరళప్రభుత్వంలో సీపీఎంకు జూనియర్‌ భాగస్వామిగా కొనసాగుతున్న సీపీఐ, ‘సీపీఎం ముసాయిదా లో చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకోవాలి’ అని డిమాండ్‌ చేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అంటేనే ఒక ఫాసిస్ట్‌ సంస్థ. ఆర్‌ఎస్‌ఎస్‌ కింద పనిచేసే మోదీ నేతృత్వంలోని బీజేపీ కూడా ఫాసిస్ట్‌ ప్రభుత్వమే. ఈ నేపథ్యంలో సీపీఎం తన పంథాను సరిదిద్దుకోవాలని కేరళ సీపీఐ ప్రధాన కార్యదర్శి బినోయ్‌ విశ్వం డిమాండ్‌ చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.
విషయాన్ని పరిశీలిస్తే కేరళలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో సీపీఎం, వ్యవహారజ్ఞానంతో సమ తుల్య వైఖరితో అడుగులు ముందుకేస్తుంటే, సీపీఐ మాత్రం తన వైఖరిలో ఏవిధమైన మార్పులే కుండా పూర్వపు పంథాతోనే ముందుకెళుతుండటం వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ఇక కాంగ్రెస్‌ కేరళలో ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకమే కనుక, అధికారంలోకి రావడానికి సీపీఎం వైఖరిని ఒక అవకాశంగా తీసుకొని మరింత దూకుడుగా ముందుకెళ్లే వైఖరిని అనుసరిస్తోంది. ఏది ఏమైనా సీపీఎం తాజాగా మారిన తన వైఖరితో విపక్షాలను ఒక్క కుదుపునకు లోను చేసిందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు.
ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేరళలో క్రమంగా బీజేపీ ఓటింగ్‌ శాతం పెరుగుతున్న నేపథ్యంలో, ఇది ఇలాగే వచ్చే ఎన్నికల్లో కూడా జరిగితే తాము నష్టపోక తప్పదన్న అభిప్రాయానికి సీపీఎం వచ్చి వుండాలి. అందుకనే రాష్ట్రంలోని హిందువుల్లో పెరుగుతున్న జా గృతి పవనాలను గుర్తించే తాను బీజేపీకి వ్యతిరేకం కాదన్న ముద్రను సుస్థిరం చేసుకుంటే, వచ్చే అసెంబ్లీ హిందూ ఓట్లను కాపాడుకోవచ్చన్నది సీపీఎం వ్యూహం కావచ్చు. ఓట్లశాతం పెరుగు తున్నా కేరళలో బీజేపీ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకునే స్థాయికి ఇంకా ఎదగలేదు. కానీ పెరుగుతున్న బీజేపీ అనుకూల ఓటింగ్‌ అధికార ఎల్‌డీఎఫ్‌ను దెబ్బతీస్తుంది. ఈ వ్యూహంతోనే తాను బీజేపీకి వ్యతిరేకం కానన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే, బీజేపీ ఎట్లాగూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక, ఆ పార్టీకి అనుకూల ఓట్లను తమవైపుకు తిప్పుకోవచ్చన్న సీపీఎం వ్యూహం నిజమైతే సహచర పార్టీలు తొందరపడి సీపీఎంను విమర్శిస్తున్నాయనుకోవాలి. ఇదే సమయంలో భాజపా కూడా ఈ ట్రాప్‌లో పడకుండా తన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకుంటూనే మరింత చొచ్చుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించాల్సి వుంటుంది.

తక్కువ ప్రీమియంతో పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేవిదంగా చూడాలి.

తక్కువ ప్రీమియంతో పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేవిదంగా చూడాలి

తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు

పరకాల నేటిధాత్రి
రాష్ట్ర సర్కారు పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు ఆర్డిఓ డాక్టర్, కె.నారాయణ కు వినతిపత్రం సమర్పించారు.రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో వరి పంట సాగులో ఉన్నదని,యాసంగి వరి పంటకు దోమ పోటు,అగ్గి తెగులు,వడగండ్ల వానలతో కోలుకోలేని విధంగా గతంలో రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని గుర్తు చేశారు.మామిడి పంట కూడా చాల సందర్భాలలో పంట కోసే ముందు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉన్నదని వెల్లడించారు.పంటల భీమా పథకం అమలులో ఉంటే, రైతు ప్రభుత్వం దయాదాక్షి ణ్యములపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదని,హక్కుగా పూర్తి స్థాయిలో నష్ట పరిహారం పొందే వీలుంటుందని చెప్పారు.లేనిచో ప్రభుత్వం ఇచ్చే అతి తక్కువ పరిహారం తో సరి పెట్టుకొని అప్పుల పాలై పెద్ద ఎత్తున వడ్డి సంవత్సర కాలం కడుతూ నష్టపోవలిసి ఉంటుందని వివరించారు.ఇప్పటికే పంటలు ఎండుతున్నట్టు,రైతు ఆత్మహత్యలు అక్కడక్కడ జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నవని,రాష్ట్రములో రుణ మాఫీ పూర్తి స్థాయి లో అమలు కాక,రైతు భరోసా కొరకు ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలో తెలువని పరిస్థితి లో రైతులు దిగులుతో ఉన్నారని స్పష్టం చేశారు.
ఇలాంటి పరిస్థితిలో ప్రకృతి వికటించి పెద్ద ఎత్తున నష్టం జరిగినచో రైతు తట్టుకోలేడని ఆవేదనతో తెలిపారు. ప్రస్తుతానికి ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన అమలు చేసే అవకాశం లేనందున భవిష్యత్తు లో పంట నష్టం పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్న వరి,మిరప మొక్కజొన్న మామిడి పంటల రైతులకు అండగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని పంటల భీమా పథకం అమలు పరిచే కంపెనీల తో చర్చలు జరిపి, వారిని ఒప్పించి అతి తక్కువ ప్రీమియం తొ ఇప్పటినుంచి పంటలు చేతి కి వచ్చే వరకు పంటల భీమా పథకం అమలు చెయ్య వలిసినదిగా విజ్ఞప్తి చేశారు.రైతును పూర్తి స్థాయిలో ఆదుకొనే చర్యలు వెంటనె చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు సురావు బాపూరావు,లోనే సతీష్,కోడెం రవీందర్ తదితరులు రైతులు పాల్గొన్నారు.

పవన్‌ ఒప్పుకున్నట్లే!

`లోకేష్‌ కు లైన్‌ క్లియరైనట్లే!!

`లోకేష్‌ కు సీఎం గా పట్టాభిషేకమే!

`త్వరలోనే లోకేష్‌ ముఖ్యమంత్రి అయినట్లే. 

`అందుకు పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు నిదర్శనమే

`పదిహేళ్ల పాటు కూటమి కొనసాగుతుందని పవన్‌ ఉవాఛ.

`అంటే లోకేష్‌ ను సీఎంగా ఒప్పుకున్నట్లే లెక్క.

`అయితే ఆలస్యం కూడా చేయొద్దు.

`నాయకులు మాట్లాడిన ప్రతి మాట నిజం కాదు.

`ప్రతి మాటకు కట్టుబడి వుంటారన్న నమ్మకం లేదు.

`పరిస్థితుల ప్రభావం అని మాట తప్ఫొచ్చు.

`పార్టీ శ్రేణుల ఒత్తిళ్లంటూ పవన్‌ మాట మార్చవచ్చు.

`రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఎక్కడా వుండరు.

`అవసరాల కోసం దారులు వెతుక్కునే పదవులే వుంటాయి.

`పదవి కాంక్ష లేకుండా రాజకీయాలు ఎవరూ చేయరు.

`పవన్‌ మాట మీద నిలబడతాడా? అన్నది డౌటే!

`లోకేష్‌ ను సీఎం చేయడానికి పవన్‌ను ఒప్పించే ప్రయత్నం.

`ఈ ఏడాదిలోనే లోకేష్‌ ను సీఎం చేయాలని టిడిపి పట్టు.

`సమయం కోరుతున్న పవన్‌?

`ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి అని పవన్‌ మెలిక?

`యూపిలో బిజేపి హాట్రిక్‌ సాధిస్తే లోకేష్‌ ఆశలు ఆవిరి?

`శాసనమండలి ఎన్నికలు కూడా ప్రభావం చూపొచ్చు.

`టీడీపీ విజయం సాధిస్తే లోకేష్‌ కు పట్టాభిషేకం వాయిదా పడొచ్చు!

`ఓడిపోతేనే లోకేష్‌ కు లైన్‌ క్లియర్‌ కావొచ్చు!

`ఇలాంటి పరిస్థితి చాలా విచిత్రమైనది.

`ఏ రకంగా చూసినా లోకేష్‌ సిఎం కావడానికి మార్గం పడేదే!

 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

తెలుగు దేశం పార్టీ శ్రేణులు సంతోషపడే వార్త. సంబరాలు చేసుకోవాల్సిన వార్త. చినబాబు మంత్రి లోకేష్‌ ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి మార్గం సుగమమౌతున్నదనే విషయం స్పష్టమౌతున్న వార్త. అవును..చాలా తొందరగానే లోకేష్‌ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం నిర్వహించే సమయం ఆసన్నమౌతోంది. అందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కూడా సై అంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. లోకేష్‌ ను ముఖ్యమంత్రిని చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సాక్షాత్తు పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కూడా పంచుకున్నట్లు తెలుస్తోంది. ఏపి రాజకీయాలలో నవ శకం రావాలంటే యువ తరం రాజకీయాలు పురుడు పోసుకోవాలని పవన్‌ కూడా అభిప్రాయపడుతున్నట్లు అర్థమౌతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ని, వైసిపిని మరో పదిహేళ్ల పాటు నిలువరించాలంటే కూటమి వుండాలని పవన్‌ బలంగా కోరుకుంటున్నట్లు స్వయంగా చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కూటమికి బీటలు రాకుండా చూసుకునే బాధ్యత నాది అని కూడా అసెంబ్లీలో పవన్‌ కళ్యాణ్‌ తేల్చి చెప్పారు. ఏపి బాగుపడాలన్నదే తన తపన అన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం ఎలాంటి త్యాగాలైనా చేయడానికి తాను సిద్దమని పవన్‌ చెప్పారు. ఎందుకంటే ఎన్ని రోజులైనా, ఇంకెంత కాలమైనా తెలుగు దేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు లోకేష్‌ మాత్రమే. ఆయనను కాదని మరెవరూ అధ్యక్షుడు కాలేరు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి ఇంకా ఎన్ని సార్లు వచ్చినా ముఖ్యమంత్రి కావాల్సింది లోకేష్‌ మాత్రమే. ఈ విషయం జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు స్పష్టంగా తెలుసు. పవన్‌ మొదటి నుంచి చెబుతూనే తన శ్రేణులను సమాయత్తం చేస్తూనే వున్నాడు. అయితే కొంత మంది జనసేన నాయకులు పవన్‌ వ్యాఖ్యలకు నొచ్చుకుంటున్నారు. పవన్‌ ఇలా నిర్ణయం తీసుకుంటే మా భవిష్యత్తు ఏం కావాలి? అనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. అయినా పార్టీ పచ్చగా వుంటేనే నాయకులు, కార్యకర్తలు వుంటారు. పార్టీ అధికారంలో వుంటే జిందాబాద్‌ లు కొడతారు. గతంలో వుండే పరిస్థితులు ఇప్పుడు లేదు. ప్రతిపక్షంలో వుంటే నాయకులు, శ్రేణులు ఎంత కాలమైనా పార్టీని కాపాడుకునే వారు. ఇప్పుడు ఆ రోజులు లేవు. తనేమిటో తన పార్టీ పరిస్థితి ఏమిటో పవన్‌ కళ్యాణ్‌ కు బాగా తెలుసు. కలలు కొన్ని నిజాలు కాకపోవచ్చు. అందువల్ల పవన్‌ కళ్యాణ్‌ చాలా దూరదృష్టితోనే కూటమి ఎల్లకాలం కొనసాగుతుందని చెప్పి వుండొచ్చు. అంటే లోకేష్‌ సిఎం కావడానికి పవన్‌ ఒప్పుకున్నట్లే! అనే మాటలు వినిపిస్తున్నాయి. సిఎం కావడానికి లోకేష్‌ కు లైన్‌ క్లియరైనట్లే!!అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. లోకేష్‌ కు సిఎం గా పట్టాభిషేకమే! అని పార్టీలో వినిపిస్తోంది. అయితే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం కూడా చేయొద్దు. నాయకులు మాట్లాడిన ప్రతి మాట నిజం కాదు. వాళ్లు మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి వుంటారన్న నమ్మకం లేదు. అందుకు పవన్‌ కళ్యాణ్‌ అతీతుడు కాదు. ఆయనలోనూ మార్పు రాదనే హామీ ఎవరూ ఇవ్వలేరు. ఎందుకంటే రాజకీయమే అవకాశవాదానికి చిహ్నం. రాజకీయాలలో ఆశావాదమే కాదు, అవకాశ వాదం లేకపోతే ముందుకు వెళ్ళలేదు. పదవులు కావాలనుకున్నప్పుడు గాలి ఎటు వీస్తే అటు మళ్లితేనే అందుతాయి. ఎలాంటి నాయకుడైనా తాను అందరికంటే ఎత్తులో వుండాలనే కోరుకుంటారు. నేను మరో నాయకుడి పల్లకి ఎల్ల కాలం మోస్తానని చెబితే అబద్దమే అవుతుంది. రాజకీయాలలో నీతి, నిజాయితీ అనే పదాలకు చోటు ఎప్పుడూ వుండదు. పైకి సిద్దాంతాలు, రాద్దాంతాలు ఎన్ని మాట్లాడినా అవకాశ వాదాన్ని మించిన రాజకీయం ఎప్పుడూ ముందు పడదు. అందువల్ల పరిస్థితుల ప్రభావం అని పవన్‌ ఎప్పుడైనా మాట తప్ఫొచ్చు. నాకు ప్రాధాన్యత తగ్గుతుందని అలక చెందొచ్చు. పక్కనుండే నాయకులు కలత చెందవచ్చు. మిమ్మల్ని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తారా? ప్రశ్నించొచ్చు. మీ నాయకత్వం కోసం పని చేస్తామే కానీ మరో పార్టీ కండువా కప్పుకోమని జనసేన నాయకులు అనవచ్చు. అప్పుడు పవన్‌ కళ్యాణ్‌ కు తప్పకపోవచ్చు. పార్టీ శ్రేణుల ఒత్తిళ్లంటూ పవన్‌ మాట మార్చవచ్చు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఎక్కడా వుండరు. పవన్‌ ఇప్పటి వరకు పెట్టుకున్న పొత్తులను చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. గతంలో తెలుగు దేశం తో సాగారు. తర్వాత వామపక్షాలతో కూడారు. మరి కొంత కాలం తర్వాత బిఎస్పీ అధినేత మాయావతి కాళ్లకు దండం పెట్టారు. పొత్తుకు సై అన్నారు. వాస్తవ రాజకీయాలను బాగా గమనించి మళ్ళీ కూటమికి సై అన్నారు. సామ్యవాద రాజకీయం నుంచి సనాతన ధర్మం వైపు దారి మార్చుకున్నాడు. తెలుగు దేశం పొత్తు తో తొలిసారిగా అసెంబ్లీ లో అడుగుపెట్టారు. ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవి అలంకరించారు. ఎందుకంటే అవసరాల కోసం దారులు వెతుక్కునే పదవులే వుంటాయి. పదవి కాంక్ష లేకుండా రాజకీయాలు పవన్‌ కళ్యాణే కాదు ఎవరూ చేయరు. కాలం గడిస్తే పవన్‌ మాట మీద నిలబడతాడా? అన్నది డౌటే! అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత తొందరపడితే అంత మంచిది. ఆలస్యం అమృతం విషం. లోకేష్‌ ను సిఎం చేయడానికి పవన్‌ను ఒప్పించే ప్రయత్నం పెద్దగా చేయాల్సిన అవసరం కూడా లేదు. లోకేష్‌ ను సిఎం చేయొద్దనే హక్కు పవన్‌కు లేదు. లోకేష్‌ ను సిఎం చేయొద్దు అనేది పొత్తు ధర్మంలో లేదు. అందుకే ఈ ఏడాదిలోనే లోకేష్‌ ను సిఎం చేయాలని టిడిపి పట్టు పడుతోంది. అయితే పవన్‌ కొంత సమయం కోరుతున్నారా? అనేది తేలాల్సి వుంది. అయితే యుపి ఎన్నికలయ్యేదాకా సాగ దీయాలని పవన్‌ చూస్తున్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు. దేశంలో బిజేపి అప్రతిహతంగా రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ వెళ్తోంది. మూడోసారి ఉత్తర ప్రదేశ్‌ ను బిజేపి గెలుచుకుంటే ఇక దేశంలో ఆ పార్టీకి తిరుగుండదు. అప్పుడు పవన్‌కు కూడా బలం పెరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. యూపిలో బిజేపి హాట్రిక్‌ సాధిస్తే లోకేష్‌ ఆశలు ఆవిరౌతాయని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. అంతే కాకుండా శాసనమండలి ఎన్నికలు కూడా ప్రభావం చూపొచ్చు. కాకపోతే ఇక్కడ రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. మండలి ఎన్నికలలో టిడిపి విజయం సాధిస్తే లోకేష్‌ కు పట్టాభిషేకం వాయిదా పడొచ్చు! ఒకవేళ టిడిపి ఓడిపోతేనే లోకేష్‌ కు లైన్‌ క్లియర్‌ కావొచ్చు! గెలిస్తే ప్రజల మద్దతు మనకే వుందని చంద్రబాబు నాయుడే కొంత ఆలస్యం చేయొచ్చు. ఇలాంటి పరిస్థితి చాలా విచిత్రమైనది. కానీ ఏ రకంగా చూసినా లోకేష్‌ సిఎం కావడానికి మార్గం పడేదే!అది ఎప్పుడు అనేది చంద్రబాబు నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి వుంది.

ముగిసిన మహా కుంభమేళా

తర్వాతి మహాకుంభమేళా 20157లో

66.21కోట్ల మంది స్నానాలతో ఆల్‌ టైమ్‌ రికార్డ్‌

ముగింపు సందర్భంగా మహా హారతి

మహాశివరాత్రి రోజునే 1.53కోట్ల మంది స్నానాలు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక మేళా

ప్రపంచ వ్యాప్తంగా గూగూల్‌, వీకీపీడియాల్లో రికార్డు స్థాయిలో సెర్చ్‌లు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

‘యద్భావం తద్భవతి’ అన్న నానుడిని నిజం చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కుంభమేళా ఫిబ్రవరి 26తో ముగిసింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా తర్వాతి మహోత్సవం 2157లో జరుగనుంది. ప్రతి పన్నెండు సంవత్సరాలకోమారు వచ్చే కుంభమేళాలు 12 ముగిసిన తర్వాత 144 సంవత్సరాలకు వచ్చేదే మహా కుంభమేళా. ఇది కేవలం ప్రయాగ్‌ రాజ్‌లో మాత్రమే జరుగుతుంది. కుంభమేళాలు నాలుగు రకాలు. నాలుగేళ్లకోమారు జరిగేది కుంభమేళా, ఆరేళ్లకోమారు వచ్చేది అర్థ కుంభమేళా, 12 ఏళ్లకోమారు వచ్చేది పూర్ణ కుంభమేళా అదేవిధంగా 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది మహా కుంభమేళా. ఇప్పుడు ప్రయాగ్‌ రాజ్‌ లో జరిగింది మహా కుంభమేళా. మొత్తం 45రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ మహా ఆధ్యాత్మిక ఉత్సవంలో ఫిబ్రవరి 26 వరకు 66.21 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఖ్య దేశంలోని మొత్తం హిందూ జనాభాలో సగం కంటే ఎక్కువ కావడం గమనార్హం. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, భూటాన్‌ రాజు సైతం ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాటలో 30 మంది మరణించడం, ఢల్లీి రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాటలో మరో 18మంది దుర్మరణం వంటివి మనసుకు బాధకలిగించేవే. ఇక్కడ విపక్షాలు ఆరోపిస్తున్న విధంగా ప్రభుత్వ వైఫల్యం కాదు, ప్రజల్లో క్రమశిక్షణా రాహిత్యం ఇటువంటి అనుకోని దుర్ఘటనలకు కారణమవు తున్నాయన్నది పరిస్థితులను గమనిస్తే తెలుస్తుంది. జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగిసిన కుంభమేళాలో మహాశివరాత్రి సందర్భంగా త్రివేణి సంగమం వద్ద ఇచ్చిన మహా హారతితో 144 సంవత్సరాలకోమారు వచ్చే ఈ మహా క్రతువు ముగిసింది. మహాశివరాత్రి రోజున కేవలం ఒక్కరోజునే 1.53కోట్ల మంది త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు. 

మే 2న తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ ఆలయం

ఈసారి మహాకుంభమేళా ముగింపు రోజైన మహాశివరాత్రి పర్వదినాన కేదార్‌నాథ్‌ దేవాలయాన్నితెరిచే రోజును ప్రకటించారు. వచ్చే మే 2వ తేదీన ఉదయం ఏడుగంటలకు వృషభ లగ్నంలో కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు తెరచుకుంటాయి. దీంతో చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్‌ దేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. గుజరాత్‌లోని సోమనాథ్‌, నాగేశ్వర్‌ ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైల మల్లికార్జున క్షేత్రం, మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర, ఓంకారేశ్వర ఆలయం, ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయం, మహారాష్ట్రలోని భీమశంకర, త్రయంబకేశ్వర ఆలయం, ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ ఆలయం, జార్ఖండ్‌లోని వైద్యనాథస్వామి ఆల యం, తమిళనాడులోని రామేశ్వరం, మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వర్‌ ఆలయం…వీటిని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా వ్యవహరిస్తారు.

తొలిసారి కుంభమేళా ప్రస్తావన

క్రీ.శ.629ా645 మధ్యకాలంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్‌ లేదా జియాంజంగ్‌ రచనల్లో తొలిసారి చారిత్రకంగా కుంభమేళా ప్రస్తావన కనిపిస్తుంది. ఇంపీరియర్‌ గెజిట్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం 1892లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సంద ర్భంగా పెద్దఎత్తున కలరా సోకింది. అప్పటి అధికార్లు పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలు అమ లచేసారు. ఇందులో భాగంగా హరిద్వార్‌ పునరుద్ధరణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. 1903 కుంభమేళాకు సుమారు నాలుగు లక్షలమంది హాజరుకాగా, 1954 కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1998 ఏప్రిల్‌ 14న హరిద్వార్‌లో జరిగినకుంభమేళాకు పదిమిలియన్ల మంది ప్రజలు హాజరయ్యారు. 2001లో అలహాబాద్‌ (ప్రయాగ్‌ రాజ్‌) కుంభమేళాకు ఆరవై మిలియన్ల మంది హాజరుకాగా వీరిలో ఒక మిలియన్‌ ప్రజలు విదేశాలవారు కావడం విశేషం. 

పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ ప్రకారం 1892లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా ఆయన గురువు యుక్తేశ్వర్‌ మహరాజ్‌ తొలిసారి మహావతార్‌ బాబాను కలుసుకున్నారు. 1989లో కుంభమేళా సందర్భంగా ఫిబ్రవరి 6న ప్రయాగ్‌ రాజ్‌లో 1.5కోట్ల మంది హాజరు కావడంతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో నమోదైంది. 

సినిమాలు, డాక్యుమెంటరీలు

1982లో దిలీప్‌రాయ్‌ తీసిన ‘అమ్రిత కుంభేర్‌ సంథానే’ చిత్రంలో కుంభమేళాను చూపించారు. 2001లో మెరీజియో బెనజో, నిక్‌డేలు కుంభమేళాపై ‘‘ది గ్రేటెస్ట్‌ షో ఆన్‌ ది ఎర్త్‌’’ పేరుతో ఒక డాక్యుమెంటరీ తీశారు. దీనితో పాటు నదీముద్దీన్‌ 2004లో ‘‘సాంగ్స్‌ ఆఫ్‌ ది రివర్‌’’, ‘‘ఇన్వొకే షన్‌’’, ‘‘కుంభమేళా’’ పేరుతో తీసిన డాక్యుమెంటరీలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. సి.బి.ఎస్‌.సండే మార్నింగ్‌ అనే ప్రముఖ అమెరికన్‌ మార్నింగ్‌ షో 2010 ఏప్రిల్‌లో 18న ప్రసారం చేసిన కార్యక్రమంలో హరిద్వార్‌ కుంభమేళాను ప్రపంచంలోనే అత్యధిక ప్రజలు పాల్గనే మతకార్యక్రమంగా వర్ణించింది. 

అఖాడాల నిర్వహణలో

మన దేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పరిపాలన ప్రారంభమయ్యే వరకు ఈ కుంభమేళాలను ‘అఖాడా’లు నిర్వహించేవి. కుంభ స్నానాల సందర్భంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు, ఇతరత్రా సదుపాయాలు కల్పించేవారు. అంతేకాదు హిందువులకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపేవారుగా ఈ అఖాడాలకు చెందిన సాధువులను పరిగణించేవారు. 17వ శతాబ్ద కాలంలో ఈ అఖాడాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగేదని కూడా ఈస్ట్‌ ఇండియా కంపెనీ రికార్డులను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా 1760లో హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో శైవ సాధువులైన గోసాయిన్లు, వైష్ణ వ సాధువులైన బైరాగుల మధ్య ఘర్షణ జరిగినట్టు ఈస్ట్‌ ఇండియా కంపెనీ రికార్డుల్లో నమోదైంది. మరాఠా పీష్వా ముద్రించిన రాగి శాసనంలో 1789లో నాసిక్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా శైవ సన్యాసులు, వైష్ణవ బైరాగి సాధువుల మధ్య గొడవలు జరిగినట్లు పేర్కొనివుంది. ఈవిధంగా అఖాడాల మధ్య నిరంతరం గొడవలు జరుగుతున్న నేపథ్యంలో 18వ శతాబ్దంలో ఈస్ట్‌ఇండియా కంపెనీ కలుగ జేసుకొని ఈ కుంభమేళాల సందర్భంగా క్యాంపులను ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టింది. అంతేకాదు కంపెనీ అధికార్లు ఏ అఖాడా ఎప్పుడు స్నానం చేయాలన్న నియమనిబంధనలను అమలుచేసింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఈ కుంభ మేళాకు వచ్చేవారిపై ‘యాత్రపన్ను’ విధించడం ద్వారా ఆదాయం పొందే కోణంలోనే ఆలోచిం చింది. చివరకు 1870 నాటికి కుంభమేళా నాటి బ్రిటిష్‌ ప్రభుత్వ పర్యవేక్షణలో జరిగింది. బ్రిటిష్‌ ప్రభుత్వం విధిస్తున్న పన్నులను ప్రయాగ్‌వాల్‌ పండాలు (ప్రయాగ్‌రాజ్‌లోని బ్రాహ్మణులు) తీ వ్రంగా వ్యతిరేకించారు. పన్నులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం సదుపాయాల గురించి పట్టించుకునేది కాదు. చివరకు 1938లో లార్డ్‌ ఆక్‌లాండ్‌ ఈ యాత్రపన్నును రద్దు చేయడంతో కుంభ మేళాకు హాజరయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇదిలావుండగా 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో, బ్రిటిష్‌ ప్రభుత్వం ఈకుంభమేళాలను తిరుగుబాటును ప్రోత్సహించే కేం ద్రాలుగా పరిగణించి తగిన జాగ్రత్తలు తీసుకునేది. కాగా 1895లో అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత, వ్యాసకర్త మార్క్‌ ట్వైన్‌ ( అసలు పేరు సామ్యూల్‌ లాంఘోర్న్‌ క్లీమెన్స్‌) ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాను సందర్శించాడు. ‘‘ఈ కుంభమేళా సమాజానికి ఆధ్యాత్మితను, ఐకమత్యాన్ని, భక్తిని, విలువలను ప్రభోదిస్తాయి’’ అని ఆయన తన రచనల్లో పేర్కొన్నాడు. అంతేకాదు కుంభమేళా సందర్భంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు కూడా జరిగేవి. బుఖారా, కాబూల్‌, తుర్కిస్తాన్‌, అరబ్‌లు, పర్షియన్లు హరిద్వార్‌ కుంభమేళాలో పాల్గని తమ వ్యాపారాలను నిర్వహించేవారు. ఆహారధాన్యాలు, నిత్యావసరాలు, బమ్మలు వంటివి వ్యాపారులు అమ్మ కాలు జరిపేవారు. రెండో ప్ర పంచ యుద్ధ కాలంలో బ్రిటిష్‌ ప్రభుత్వం కుంభమేళాను నిషేధించింది. ఇంధన కొరత ఏర్పడు తుందన్న భయమే ఇందుకు కారణం. ఇదేసమయంలో జపాన్‌ కుంభమేళా జరిగే ప్రాంతంపై బాంబు వేస్తుందన్న ప్రచారం జరగడంతో 1942 కుంభమేళాకు చాలా తక్కువమంది ప్రజలు హజరయ్యారు.1947 దేశ స్వాతంత్య్రం తర్వాత అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు కుంభమేళా నిర్వహణ బాధ్యతలను నిర్వహించడం మొదలుపెట్టాయి. 

తొక్కిసలాటలు, తప్పిదాలు

1820లో హరిద్వార్‌ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 485 మంది మరణించారు. తర్వాత కంపెనీ ప్రభుత్వం తొక్కిసలాటలను నివారించేందుకు ఘాట్లను అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు తీసుకుంది. 19`20 శతాబ్దాల్లో తొక్కిసలాటలు అడపాదడపాచోటుచేసుకున్నాయి. ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పెంపును అప్పటి ప్రభుత్వాలు చేపట్టాయి. ఇదిలావుండగా 1885లో ఒక హుస్సేన్‌ అనే అధికారిని కుంభమేళా మేనేజర్‌గా నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించడం వివాదానికి దారితీ సింది. ఇతను యూరోపియన్‌ పురుషులు, మహిళలకోసం విలాసవంతమైన బోట్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వీటిల్లో యువతులతో నృత్యాలు, మద్యం, బీఫ్‌ను ఏర్పాటు చేయడంతో, వారు విలాసంగా వీటిల్లో ప్రయాణిస్తూ, స్నానం చేస్తున్న భక్తులను వీక్షిస్తూ ‘ఎంజాయ్‌’ చే శారని అప్పటి దినపత్రికల్లో వార్తలు ప్రచురితం కావడంతో ప్రభుత్వ చర్య రచ్చకు దారితీసింది.

వివాదాల మధ్య భారీ కలెక్షన్లతో దూసుకెళుతున్న ‘ఛావా’

ట్రైలర్‌ రిలీజ్‌ నుంచీ వివాదాలే

తాజాగా వందకోట్ల పరువు నష్టం వేస్తామంటూ హెచ్చరికలు

అయితే కలెక్షన్లలో తగ్గేదే లే అంటున్న చిత్రం

వివాదాలే చిత్రాలకు ప్రచారంగా మారుతున్న వైనం

మార్కెటింగ్‌కి ట్రెండ్‌గా మారిన వివాదాలు

వివాదాల్లో చిక్కినా నష్టపోయిన సినిమాలు అసలు లేవనే చెప్పాలి

నిర్మాతకు శుభసూచికంగా మారుతున్న వివాదం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఒక చిత్రం విడుదలకు ముందే వివాదల్లో ఇరుక్కుంటే దానికొచ్చే కలెక్షన్లే వేరు. ఇది ప్రస్తుతం మనదేశంలోని అన్ని భాషా చిత్రాలకు వర్తిస్తుంది. మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీని దేశవ్యా ప్తంగా హిందువులు ఎంతగానో ఆరాధిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణకోసం నాటి మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌ విస్తరణ కాంక్షను గణనీయంగా దెబ్బతీసిన మరాఠావీరుడు ఆయన. ఆయన తదనంతరం శివాజీ కుమారుడు శంభాజీ కూడా తండ్రిబాటలోనే పయనించి చివరకు ఔరంగజేబ్‌చేతికి చిక్కి చిత్రహింసలకు గురై మరణించాడన్నది చారిత్రక కథనం. ఈ కథనంపై ఆధారపడి తీసిన చిత్రమే ‘ఛావా’. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాకముందే గత నెలలో నిర్వాహకు లు విడుదల చేసిన ట్రైలర్‌ చూపిన ఒక నృత్యంపై వివాదం రేగింది. ఎట్టకేలకు ఆ వివాదం ముగిసిందనుకుంటే ఇప్పుడు నిర్మాతలకు పరువునష్టం దావా కేసు రూపంలో మరో కష్టం వచ్చిపడిరది. చిత్రంలో గనోజీ, చెన్హోజీ షిర్కేలను నెగెటివ్‌గా చూపించారంటూ వారి వారసులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, ఏకంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌పై వందకోట్ల రూపాయల పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించడం తాజా పరిణామం. ఇంత వివాదంలోనూ చిత్రం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.450కోట్లు వసూళ్లు రాబట్టడం విశేషం. 

ఈ రెండు పాత్రలను మరాఠీ నటులు సువ్రత్‌ జోషి, సారంగ్‌ సతాయేలు పోషించారు. మొఘల్స్‌కు శంభాజీ ఎక్కడ వున్నదీ వీరు తెలియజేసినట్టు చిత్రంలో చూపించారు. గనోజీ, చెన్హోజీ షిర్కే లు, శంభాజీ అనుపానులు చెప్పడంవల్లనే మొఘల్‌ సైన్యాలు ఆయన్ను పట్టుకోవడం తర్వాత ఔరం గజేబ్‌ చిత్రహింసలకు గురిచేసి చంపేసినట్టు చిత్రంలో చూపించారు. ఈ నేపథ్యంలో షిర్కే కుటుంబ వారసులు చిత్ర నిర్వాహకులకు ఫిబ్రవరి 20న ఒక లీగల్‌ నోటీసు పంపారు. చిత్రం లో చరిత్రను తప్పుగా చూపించడంవల్ల తమ కుటుంబం ప్రతిష్ట బాగా దెబ్బతిన్నదని, వారు తమ లీగల్‌ నోటీసులో పేర్కొన్నారు. 

దీంతో డైరెక్టర్‌ లక్ష్మణ్‌ ఉటేకర్‌, గనోజీ, చెన్హోజీ షిర్కే వారసులైన భూషన్‌ షిర్కే ఇంటికి వెళ్లి మరీక్షమాపణలు చెప్పారు. ‘‘షిర్కే కుటుంబం భావోద్వేగాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదు. ఒకవేళ మీరు బాధపడివుంటే అందుకు క్షమాపణలు కోరుతున్నాను. అదీకాకుండా చిత్రంలో వారి ఇంటిపేరు లేదా గ్రామం పేరు ప్రస్తావించలేదు. కేవలం వారిపేర్లు గనోజీ, చెన్హోజీ షిర్కేలుగా మాత్రమే పేర్కొన్నాం’’ అని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ భూషన్‌ షిర్కే అందుకు సంతృప్తి చెందలేదు. చిత్రంలోని అభ్యంతరకర భాగాలను తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

నిజానికి గత నెలలో చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసినప్పుడు అందులో షంభాజీ మహరాజ్‌, రాణియశూబాయ్‌తో కలిసి నృత్యం చేస్తున్నట్టు చూపడం దుమారం రేపింది. రాజ్యసభ సభ్యుడు శం భాజీ రాజే ఛత్రపతి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఒక చరిత్రను చిత్రంగా మలచే సమయంలో నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిత్రాన్ని విడుదల చేయడానికి ముందు నిర్వాహకులు చరిత్రకారులకు చూపించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరారు. ఈయనశంభాజీ మహరాజ్‌ కుటుంబ వారసుడు కావడం గమనార్హం. చిత్రంలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశన్‌, రాణి యశూబాయ్‌గా రష్మికా మండన్న నటించారు. ఒక మహారాజు చరిత్రను చూపుతున్నప్పుడు, వారిపై ఇటువంటి నృత్యాల సీన్లు చిత్రీకరించడం సముచితం కాదని తీవ్రంగా విమర్శలు వచ్చాయి.  

చిత్ర దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ ‘నృత్యం’పై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో సమర్థించుకున్నారు. శంభాజీ మహరాజ్‌ జీవితం పోరాటాలతోనే గడిచిపోయింది. అటువంటప్పుడు రాజు, రాణి కి మధ్య రొమాన్స్‌ జరిగే అవకాశం ఎక్కడుంటుందనేది ప్రతి ఒక్కరికీ సహజంగా వచ్చే సందే హం. కానీ కథను చెబుతున్నప్పుడు సృజనాత్మక కళను జోడిరచడం కొన్ని సందర్భాల్లో తప్పదు. వీక్షకులు ఎంతో తెలివైనవారు. వారెప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే ఒక పోరాట యోధుడి జీవితాన్ని వాస్తవిక రీతిలో ఆవిష్కరిస్తున్నప్పుడు వీక్షకులు ఈ నృత్యాన్ని తప్పక ఆమోదిస్తారు. ఛావా విషయంలో మా అంచనా ఇదేనన్నారు. 

ఈ నృత్యం అంశం చినికి చినికి గాలివానగా మారడంతో దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌, ఎం.ఎన్‌.ఎస్‌.పార్టీ అధినేత రాజ్‌థాకరేను కలిసి, తాము ప్రవేశపెట్టిన లెంజీ నృత్యం మహారాష్ట్ర సంప్రదా యిక నృత్యం. అయిప్పుటికీ దీనిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నృత్యాన్ని తొలగిస్తామని చెప్పారు. తర్వాత మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మరియు శివసేన నాయకుడు ఉదయ్‌ సామంత్‌ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చివరకు నృత్యాన్ని తొలగించి వివాదానికి శు భం పలికారు. విచిత్రమేమంటే లెంజీ తమ సంప్రదాయిక నృత్యమన్న సంగతిని శంభాజీ మహరాజ్‌ వంశానికి చెందిన వారసులు అంగీకరిస్తున్నారు. కాకపోతే ఈ చిత్రంలో నృత్యం పెట్టిన సందర్భాన్ని వారు ప్రశ్నించడం గమనార్హం.

ప్రముఖ బాలీవుడ్‌ నటి స్వరభాస్కర్‌ ఈ చిత్రంపై ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌ మరో వివాదానికి కారణమైంది. ‘‘కుంభమేళా సందర్భంగా ఎంతో మంది మరణిస్తే, వారి శవాలను బుల్డోజర్లతో తొల గించే సన్నివేశాలకు ఎంతమాత్రం స్పందించని ఈ సమాజం ఐదువందల ఏళ్ల క్రితం హిందువులను హింసించారంటూ ఎక్కువచేసిన చూపిన మరియు పాక్షిక కల్పనతో కూడిన ఈ చిత్రాన్ని చూసిన సమాజం ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా వుంది. ఇదొక మెదడు, ఆత్మ చనిపోయినసమాజం’’ అనేది ఈ పోస్ట్‌ సారంశం. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. ఇదేసమయంలో ఆమె సమర్థకులూ రంగంలోకి దిగారు. ‘‘శంభాజీ మహరాజ్‌ హిందువులకో సం చేసిన నిరుపమాన త్యాగాన్ని కేవలం కల్పన అని చెప్పడానికి నీకెంత ధైర్యం.’’ అంటూ ఆ మెపై నెటిజెన్లు ఎదురుదాడికి దిగారు. ‘చరిత్రతో నాటకాలాడొద్దు’ అని మరొకరు ఆమెను హెచ్చరించారు. విచిత్రమేమంటే ఆమె పెళ్లిచేసుకున్న వ్యక్తి ఫహద్‌ అహ్మద్‌! అయితే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఆమెకు కొత్తేం కాదు. వివాదం సృష్టించడం, చీవాట్లు తినడం ఆమెకు బాగా అలవాటైపోయింది. 

వివాదాల్లో చిక్కుకున్న కొన్ని బాలీవుడ్‌ చిత్రాలు

మద్రాస్‌ కేఫ్‌:

 ఇది శ్రీలంక అంతర్యుద్ధం నేపథ్యంలో తీసిన చిత్రం. భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యోదంతాన్ని కూడా ఇందులో చూపారు. అయితే ఎల్‌టీటీఈని దోషిగా చూపారం టూ తమిళనాడులో ఆ సంస్థ అనుకూలురు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంతో తమిళనాడులో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. 

విశ్వరూప్‌:

 తమిళనాడులోని ముస్లిం గ్రూపులు ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చినా, ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేయలేదు. తమిళనా డులో కంటే అధిక ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఈ చిత్రం బాగా ఆడిరది.

ఓ మై గాడ్‌ (ఓ.ఎం.జి):

 తరతరాలుగా వస్తున్న హిందూ సంప్రదాయాలను, హిందూ దేవుళ్లను అపహాస్యం చేసారంటూ ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని విశ్వహిందూ పరిషద్‌, హిందూ జన జాగృతి సమితి వంటి సంస్థలు ఆందోళన చేశాయి. అయినప్పటికీ ఎటువంటి కోతలు లేకుండా ఈ చిత్రాన్ని 2012లో విడుదల చేశారు. కలెక్షన్లలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది.

స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌:

 ఇందులో చిత్రీకరించిన ఒక నృత్యంలో రాధను సెక్సీగా చూపారన్న కారణంగా ఇండోర్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ సినీ నిర్వాహకులపై కేసు పెట్టింది. అయినప్పటికీ ఈ చిత్రంలో ఆ పాటను తొలగించలేదు. 

రాక్‌స్టార్‌: ఈ చిత్రంలో ‘సాదా హక్‌’ అనే పాటలో వెనుక ‘స్వతంత్ర టిబెట్‌ పతాకాన్ని’ చూపడంతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌, ఇంతియాజ్‌ అలీ మధ్య వివాదం రేగింది. ఆ పతాకా న్ని బ్లర్‌ చేయమని ఆయన్ను కోరింది. కానీ దర్శకుడు అందుకు అంగీకరించలేదు. అయితే వీడియో నుంచి ఈ సీక్వెన్స్‌ను తొలగించక తప్పలేదు.

అరక్షణ్‌: 

ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ ఒక దళిత యువకుడిగా నటించారు. రాచకుటుంబానికి చెందిన సైఫ్‌ అలీఖాన్‌ ఆవిధంగా నటించడాన్ని వ్యతిరేకిస్తూ కాన్పూర్‌లో కొన్ని దళిత అనుకూల గ్రూపులు ఆందోళన జరిపాయి. దీంతో ఈ చిత్రాన్ని ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ల్లో ని షేధించారు. ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్‌లు పంజాబ్‌లోని కొన్ని వర్గాలకు ఇబ్బంది కలిగించేవి గా వున్నాయని అక్కడి ప్రభుత్వం బ్యాన్‌ చేస్తే, యు.పి.లో అధికారంలో ఉన్న అప్పటి మాయావతి ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని రెండు నెలలపాటు నిషేధించింది.

మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌:

 పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ సభ్యులను ఇక్కడి ఐపీఎల్‌కు పోటీపడుతున్న క్లబ్‌లు పిలవడంలేదని బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ విమర్శించారు. అయితే దీన్ని శివసేన ఖండిరచింది. ఈ సినిమాను విడుదల చేయరాదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అయితే షారూక్‌ ఖాన్‌ క్షమాపణలు చెప్పడానికి అంగీకరించలేదు. అవసరమైతే బాల్‌ థాకరేతో ఈవిష యంపై మాట్లాడతానన్నారు. 

బిల్లు: 

ఈ సినిమా అసలు పేరు ‘బిల్లు బార్బర్‌’. అయితే ‘బార్బర్‌’ పేరు తమను కించపరచేదిగా వున్నదంటూ సెలూన్‌, బ్యూటీపార్లర్ల యజమానులు ఆందోళనకు దిగడంతో షారూక్‌ ఖాన్‌ ‘బా ర్బర్‌’ పేరు తొలగించి ‘బిల్లు’ పేరుతో విడుదల చేశారు.

4 సీట్లకు 40 మంది!

-ఎమ్మెల్సీ ఎన్ని’’కల’’ నెరవేరేది ఎవరికి.

-నాలుగు సీట్లలో సామాజిక న్యాయం సాధ్యమేనా!

-ఎమ్మెల్సీలెవరికి దక్కేనో!

-అద్దంకికి అడ్డంకులు తొలిగేనా?

-మరో వాయిదా పడదన్న గ్యారెంటీ వచ్చేనా?

-సీనియర్లు అడ్డుపడితే మొదటికే మోసం వచ్చేనా?

-ఆశావహులు చాలా మంది వున్నారు.

-చాలా మంది నేతలు కాచుకొని కూర్చున్నారు.

-పార్టీ కోసం త్యాగాలు చేసిన వారు వున్నారు

-పార్టీ అధికారంలోకి రావడంలో పాత్ర వున్న వారున్నారు.

-వారిని కాదని సామాజిక సమీకరణాలంటే సాధ్యపడేనా!

-పదుల సంఖ్యలో క్యూలో వున్నారు.

-అందరూ మాకే కావాలంటున్నారు!

-ఎవరికిచ్చినా మరొకరు నొచ్చుకుంటారు!

-అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు.

-అభ్యర్థుల ఎంపిక కొత్తి మీద సామే!

-నలుగురి ఎంపిక నలభై మంది అలక సహజమే.

-భవిష్యత్తు పేరు చెప్పి వాయిదా వేయడమే!

-మీడియా అత్యుత్సాహం కూడా ఆశవహుల్లో కలవరమే.

-లేని లీకులతో మీడియా చేసేది గందరగోళమే!

-పార్టీకి లేని దురద మీడియాకు ఎక్కువే.

-రేటింగ్‌ కోసం పాకులాటలో లేని ఆశలు రేపడం అలవాటే.

-గందరగోళం సృష్టించి వార్తలు వండిరచడమే!

-అభ్యర్థుల పేర్లు కూడా డిసైడ్‌ చేసేది మీడియానే.

-వాళ్లకు టికెట్‌ రాకపోతే అన్యాయం జరిగిందని లొల్లి చేసేది మీడియానే.

-నాయకులంతా నిమిత్త మాత్రులే.

-ఈసారి టికెట్‌ వచ్చిన వాళ్లు మాత్రం అదృష్టవంతులే!

 

తెలంగాణలో శాసన మండలి ఎన్నికకు మరో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎంతో మంది కాంగ్రెస్‌ నాయకులు ఎవరి ప్రయత్నాలలో వారు గత ఎడాది కాలంగా బిజీబిజీగానే వున్నారు. అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర నాయకత్వం ప్రసన్నం కోసం ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీ తమకే ఇవ్వాలంటూ అభ్యర్థనలు పంపుతూనే వున్నారు. వీలు చిక్కినపుడుల్లా ఎక్కే ఫ్లైట్‌ దిగే ఫ్లైట్‌ అన్నట్లు డిల్లీ వెళ్లి తమ గోడు చెప్పుకుంటూనే వున్నారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వాలంటూ వేడుకుంటూనే వున్నారు. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఐదు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ రానే వచ్చింది. అందులో నాలుగు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ వచ్చే అవకాశం వుంది. రోజు రోజుకూ ఆశావహుల సంఖ్య పెరిగిపోతూనే వుంది. మొదట్లో వున్న లిస్ట్‌కు ఇప్పుడు వినిపిస్తున్న లిస్ట్‌కు పొంతనే లేదు. ఒకింత చాంతాడంత పెరిగిపోయింది. అయినా ఎమ్మెల్సీలెవరికి దక్కేనో! అన్నది ఉత్కంఠగా మారిపోయింది. ఇక ముందుగా చెప్పాల్సి వస్తే కరీంనగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. గత ఎన్నికలలో పట్టభద్రుల ఎన్నికలలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన జీవన్‌ రెడ్డికి ఆ అవకాశం పార్టీ ఇవ్వలేదు. ఆయనే వద్దన్నారన్న ప్రచారం కూడా వుంది. పైగా ఆయన సొంత నియోజకవర్గమైన జగిత్యాలలో బిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వినయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీ దరి చేరారు. ఇది జీవన్‌ రెడ్డికి సుతారం ఇష్టం లేదు. అయినా కాంగ్రెస్‌ పార్టీ జీవన్‌ రెడ్డి అలకను పట్టించుకోలేదు. కానీ ఆయనకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ అధిష్టానం అనుకుంటే తప్ప ఎమ్మెల్సీ వచ్చే అవకాశం లేదు. ఇక మొదటి నుంచి అన్యాయం జరుగున్న నాయకుడు అద్దంకి దయాకర్‌. ఈసారైనా అద్దంకికి అడ్డంకులు తొలిగేనా? అనే ప్రశ్న వుండనే వుంది. ఆయన పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భరోసా మీదనే ఆధారపడి వున్నారు. అయినా ఎక్కడో ఏదో అనుమానం ఆయన వ్యక్తం చేయకపోయినా లోలోన గుబులు వుండనే వుంది. తుంగతుర్తి నియోజకవర్గం తనదే అన్న ధీమాతో ఆది నుంచి వున్నారు. 2019 ఎన్నికలలో అద్దంకి దయాకర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. ఒక దశలో అద్దంకి దయాకర్‌ గెలిచినట్లే వార్తలు వచ్చాయి. ఆఖరు క్షణంలో ఫలితం తారుమారైంది. అప్పటి నుంచి ఆయన తుంగతుర్తిని వీడలేదు. ఆ నియోజకవర్గం ఎప్పటికైనా నాదే అని పనులు చేసుకుంటూ వెళ్లారు. చివరి నిమిషంలో ఎమ్మెల్యే మందుల సామేల్‌ పేరు తెరమీదకు వచ్చింది. ఆయనకే టికెట్‌ అధిష్టానం ఇచ్చింది. ఇందులో ఏం జరిగిందనేది అద్దంకికి తెలుసు. పార్టీకి తెలుసు. ప్రజలకు కూడా తెలుసు. తర్వాత పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా అద్దంకికి టికెట్‌ వచ్చినట్లే అనుకున్నారు. వరంగల్‌ సీటు వస్తుందని ఆయన కూడా భరోసాతోనే వున్నారు. ఆఖరు నిమిషంలో కడియం కావ్యకు టికెట్‌ వెళ్లింది. అద్దంకి అలా మరో సారి అన్యాయం జరిగింది. ఇప్పుడైనా అద్దంకి ఎమ్మెల్సీ అవుతారా లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొనే వుంది. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డికి పాద నమస్కారం కూడా చేసిన సందర్భం వుంది. ఇక ఇప్పుడు ఆయన భవిష్యం తేలకపోతే భవిష్యత్తు రాజకీయం కష్టమే. కాంగ్రెస్‌కు వచ్చేవే నాలుగు స్థానాలు. బిసి నినాదం బలంగా వినిపిస్తోంది. ఆ నాలుగు మాకే కావాలని బిసిలు కోరుతున్నారు. అందులో కనీసం రెండు సీట్లైనా బిసిలకు పోతే అద్దంకి పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నగా మిగులుతోంది. పైగా మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ కూడా రేస్‌లో వున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి సీట్లు ఎక్కువ ఇచ్చారన్న వాదన వుండనే వుంది. వరంగల్‌ పార్లమెంటు విషయం అన్యాయం జరిగిన దొమ్మాటి సాంబయ్య కూడా సీటు నాకే ఇవ్వాలంటూ కోరుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన అద్దంకికి ఇప్పుడు ఎమ్మెల్సీ రాకపోతే ఇక ఆయన నిర్ణయం ఎలా వుంటుందో చూడాలి. ఒకవేళ అద్దంకి అదృష్టం బాగుండి, ఎమ్మెల్సీ అయితే మాత్రం మంత్రి కావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అందువల్ల అద్దంకిని అడ్డుకోవడానికి ఆయన సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు కూడా తమ వంతు రాజకీయం సాగిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అద్దంకి ఎమ్మెల్సీ అయితే మంత్రి వర్గ విస్తరణలో ఆ ఇద్దరు నేతలు ఆశలు వదులుకోవాల్సి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. నాలుగు స్థానాలలో సామాజిక న్యాయం సాధ్యమయ్యేనా! అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా మైనారిటీ వర్గం నుంచి మంత్రులు ఎవరూ లేరు. మాజీ మంత్రి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌ అలీ ఎమ్మెల్సీ రేసులో వున్నారు. ఈసారి అవకాశం వస్తే మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు. పైగా నిజామాబాదు ఉమ్మడి జిల్లాకు మంత్రి వర్గంలో చోటు దక్కాల్సి వుంది. కానీ త్వరలో జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరగాల్సి వుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. బిఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సొంత గూటికి వచ్చేశారు. అయినా ఆయన అంత సంతోషంగా లేరు. సుప్రీంకోర్టు లో వున్న కేసులో తీర్పు ఎలా వుంటుందో చెప్పలేనిది. అందువల్ల హైదరాబాద్‌ కు మంత్రి వర్గంలో చోటు కల్పించడం కోసం ఎమ్మెల్సీ ఎవరికైనా ఇస్తారనే అంటున్నారు. ముఖ్యంగా ఫిరోజ్‌ ఖాన్‌ ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు. అంతే కాకుండా మాజీ టీం ఇండియా క్రికెట్‌ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ కూడా ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్‌ లో కొనసాగుతున్నారు. యూపి లోని ఫిరోజాబాద్‌ నుంచి రెండు సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ అనుభవంతో పాటు అధిష్టానం వద్ద అజహరుద్దీన్‌కు మంచి వెయిట్‌ వుంది. ఇక సీనియర్లలో ఎక్కువగా బిసిలు వున్నారు. వారిలో ఇప్పటికీ ఆక్టవ్‌గా వున్న వి. హనుమంత రావు ఫ్లీజ్‌ అంటున్నారు. నిజామాబాద్‌ మాజీ ఎంపి. మధుయాష్కీ గౌడ్‌ నాకేం తక్కువ అంటున్నాడు. పైగా రాహుల్‌ గాంధీకి సన్నిహితుడు అనే గుర్తింపు వుంది. వీళ్లతో పాటు సికింద్రాబాద్‌ మాజీ ఎంపి. అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పోటీ పడుతున్నాడు. సీనియర్లు అడ్డుపడితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక మొదటికే మోసం వచ్చేనా? ఎందుకంటే ఆశావహులు చాలా మంది వున్నారు. సీటు మాకంటే మాకే అంటూ కాచుకొని కూర్చున్నారు. పార్టీ కోసం ఇంత కాలం త్యాగాలు చేసిన వారు వున్నారు. అంతే కాకుండా ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో కృషి చేసిన వాళ్లు వున్నారు. వారిలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు నాయకులు వున్నారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌ రెడ్డి, మరొకరు ఖైరతాబాద్‌ నియోజకవర్గం పార్టీ ప్రెసిడెంట్‌ రోహిన్‌ రెడ్డి. ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఎమ్మెల్సీ వస్తుందని కూడా అంటున్నారు. ఇకపోతే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని శక్తిగా మారి పూర్తి సీట్లు సాధించడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి పాత్ర ఎంతో కీలకమైంది. గత పార్లమెంటు ఎన్నికలలోనే ఖమ్మం సీటు ప్రసాద్‌ రెడ్డికి వస్తుందనుకున్నారు. కానీ రాలేదు. అప్పుడే ఎమ్మెల్సీ హామీ పార్టీ ఇచ్చిందనేది సమాచారం. ఇన్ని చిక్కు ముడుల మధ్య సామాజిక సమీకరణాలంటే సాధ్యపడతాయా! అధికారంలో వున్నప్పుడు సామాజిక సమీకరణాలతో అన్యాయం జరిగితే నాయకుడు ఊరుకుంటారా? తెలంగాణ మొత్తం మీద కాంగ్రెస్‌ పార్టీ లో పదుల సంఖ్యలో క్యూలో వున్నారు. అందరూ మాకే కావాలంటున్నారు! ఎవరికిచ్చినా మరొకరు నొచ్చుకుంటారు! అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు. అభ్యర్థుల ఎంపిక కొత్తి మీద సామే! అన్న మాటలే వినిపిస్తున్నాయి. నలుగురి ఎంపిక నలభై మంది అలక సహజమే అని అంటున్నారు. భవిష్యత్తు పేరు చెప్పి వాయిదా వేస్తామంటే నాయకులు సంతృప్తి చెందుతారా? ఇక సందిట్లో సడే మియా లాగా మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. మీడియా అత్యుత్సాహం కూడా ఆశవహుల్లో కలవరం నింపుతోంది. లేని లీకులతో మీడియా చేసేది గందరగోళం సృష్టిస్తోంది. పార్టీకి లేని దురద మీడియాకు ఎక్కువైపోయింది. నాయకులంతా నిమిత్త మాత్రులే. ఈసారి టికెట్‌ వచ్చిన వాళ్లు మాత్రం అదృష్టవంతులే!

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం.

యోగా గురువు శ్రీనివాస్ కు కాకతీయ పురస్కారం.

Kakatiya Puraskar

గత 25 సంవత్సరాలుగా యోగాలో పోశాల శ్రీనివాస్ చేస్తున్న విశేష సేవలను గుర్తించిన ఇండస్ ఫౌండేషన్ వారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో కాకతీయ పురస్కారాన్ని ముఖ్య అతిధి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి చేతుల మీదుగా అందించటం జరిగిందని పురస్కార గ్రహీత యోగ గురువు పోశాల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని భావించి, మానసిక మరియు శారీరక ప్రశాంతతకు యోగా దోహదపడుతుందని భావించి గత 25 సంవత్సరాలుగా భారతీయ సనాతన ధర్మంలోని యోగ విద్యను 150 గ్రామాలలో సుమారు రెండు లక్షల మందికి యోగాలో ఉచిత శిక్షణను అందించినందుకుగాను ఈ పురస్కారం లభించిందని తెలియజేస్తూ, యోగా శిక్షణతో పాటు అనేక దేశభక్తి, ఆధ్యాత్మిక,సామాజిక మరియు సాంఘిక కార్యక్రమాల్లో చేసిన విశేష సేవలను గుర్తించి ఇండస్ ఫౌండేషన్ అధినేత ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఈ పురస్కారానికి ఎంపిక చేయటం చాలా ఆనందంగా ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండస్ ఫౌండేషన్ అధినేత ఏనుగుల రాకేష్ రెడ్డి, శ్రీ సి ఎస్ రంగరాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, స్వామి ప్రణవానంద దాస్ , జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సమ్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి.దయాకర్ రావు, తాటికొండ.రాజయ్య, వొడితల.సతీష్ బాబు పాల్గొన్నారు.

మెరుగైన వైద్యం అందించాలి.

వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి.

ఎం ఎం ఆర్ ఐ, సిటీ స్కానింగ్ ఏర్పాటు చేయాలని ఎం ఎస్ ఎఫ్ డిమాండ్.

చిట్యాల:నేటి ధాత్రి 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యగ ఈ సమావేశంలో పాల్గొన్న అంబాల అనిల్ కుమార్ మాదిగ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్బండ వర్గాల ప్రజలకు పేద వర్గాల ప్రజలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు దళిత వర్గాల ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ బహుజన వర్గాల ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అడవి ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్న ఆదివాసులకు గోండు కోయ లంబాడి యానాది కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ బతుకుతున్న ప్రజలందరికీ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందుబాటులో లేక అనారోగ్య సమస్యలతో బాధపడే పేద వర్గాల ప్రజలకు సరైన మార్గం చూపాలని అంబాల అనిల్ కుమార్ అన్నారు భూపాలపల్లి జిల్లాలో ఉన్న వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందించకపోవడం సమస్యలకు అనుగుణంగా పరికరాలు లేకపోవడం చాలా బాధాకరమని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఇతర దూర ప్రాంతానుంచి కనీసం ఆసుపత్రికి రావడానికి కూడా ప్రజల దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రోగులను ఎంజీఎం కి తరలించడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఇతర ప్రాంతాల్లో నుంచి జిల్లా కేంద్రానికి రావడానికి ఆర్థికంగా డబ్బు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ప్రజలు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరియు ఇతర హైదరాబాదులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ వైద్యం కోసం సమస్యను బట్టి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు జిల్లా కేంద్రానికి రావడానికె తీవ్రమైన ఇబ్బంది పడుతున్న ప్రజలు భూపాలపల్లి జిల్లా వంద పడకల హాస్పిటల్ లో సరైన వైద్యం లేక సిటీ స్కానింగ్ ఎమ్మారై స్కానింగ్ మరియు సరైన ఆపరేషన్ థియేటర్ లేక అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపడానికి తక్షణమే జిల్లా కేంద్రంలో ఉన్నా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్మెంట్ చేయాలని ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉండే విధంగా ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్మెంట్ చేసి జిల్లాలో ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకున్న సమస్యలు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ని హాస్పటల్ సూపర్డెంట్ ని జిల్లా డిఎంహెచ్వో ని మరియు జిల్లాలో ఉన్న వైద్యాధికారులను కోరుతున్నాము, వారం పది రోజుల్లో సమస్యలకు పరిష్కార మార్గం చూపకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమస్యలను ఉద్దేశించి కలెక్టరేట్ ముందు సమస్యలు పరిష్కరించేదాకా ధర్నాలు చేపడతామని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని పిలుపునిస్తున్నాము అని అన్నారు, అనిల్ కుమార్ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు రాజేందర్ నాగరాజు రాజకుమార్ గణేష్ రాజు రణధీర్ రామంజు లక్ష్మీ సాయి మరియు తదితర మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.

మొగుడంపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..

మొగుడంపల్లి మండలంలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల, పట్టభద్రుల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే ఓటింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు 10 % శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ ముగింపు సమయానికి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. పోలీసు భద్రత మధ్య శాంతియుత వాతావరణంలో ఎన్నికల కొనసాగుతున్నాయి.

విద్యార్థిని ఆత్మహత్య..

విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్ :నేటిధాత్రి

వరంగల్ ములుగు రోడ్ లోని పైడిపల్లి వద్ద గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కళాశాలలోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంతకాలంగా ర్యాంగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్లు ర్యాంగింగ్కు పాల్పడుతున్నారని గతంలోనే విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పగా వారు నచ్చజెప్పి తిరిగి కాలేజీకి పంపినట్లు సమాచారం. ఈక్రమంలోనే ఇవాళ బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. మరోపక్క ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు కూడా కారణమని తెలుస్తుంది. ఏనుమాముల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మంథని అసెంబ్లీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి పిలుపు..

మేధావులారా.. ఉపాధ్యాయులారా
ఆలోచించండి..ఆదరించండి..

ఎమ్మెల్సీ ఓటర్లకు పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు ,మంథని అసెంబ్లీ ఇంచార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి పిలుపు.

మంథని :- నేటి ధాత్రి

మంథని నియోజకవర్గంలో టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య లకు మద్దతుగా పార్టీ నాయకులతో కలిసి మంథని పట్టణం లో సునీల్ రెడ్డి ఎంఎల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థులకు మీ ప్రాధ్యాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చాడు.నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి రావాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీనీ గెలిపించాలి చట్టసభల్లో మీ తరపున ప్రశ్నించే గొంతులు ఉండాలంటే బీజేపీ ఎంఎల్సీ అభ్యర్థులు గెలవాల్సిందే మోసం చేసిన కాంగ్రెస్ కు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఈ గెలుపు చాలా కీలకం మేదావులంతా తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను వల్ల భవిష్యత్ కోసం బీజేపీ నీ గెలిపించండి అంటూ 317 జీవో కి వ్యతిరేకంగా బిజెపి పోరాటం చేసింది నీరుద్యోగ సమస్యలపై బిజెపి చేసినా పోరాటాలను ఓటర్లు గమనించాలని అన్నారు
ఆదిశగా మేధవులంతా.. ఆలోచిస్తారని.. పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము రాబోయే రోజుల్లో బీజేపీ గెలుపు తధ్యం ఓటర్లుఅంతా మీ మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య లకు వేసి మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు చల్ల నారాయణ రెడ్డి ,బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి మంథని అసెంబ్లీ ఎంఎల్సీ ఎన్నికల ప్రభారీ నీలకంఠం పాండు ,ఎంఎల్సీ అసెంబ్లీ కన్వీనర్ బిరుదు గట్టయ్య ,అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్ ,మంథని పట్టణ ,మండల అధ్యక్షులు సంతోష్ ,రాజేందర్,జిల్లా కౌన్సిల్ సభ్యులు బోగోజు శ్రీనివాస్ ,మంథని మాజీ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్ ,కామన్పూర్ మండల ఇంచార్జి చిలువేరి సతీష్ సీనియర్ నాయకులు సామల అశోక్ ,నరమళ్ల కృష్ణ,లక్ష్మణ్, ఎడ్ల సాగర్ ,శ్రవణ్ ,సత్యం,అయింటి మల్లేష్ ,మహేష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version