ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం చేసిన మల్లయ్య స్వామి ఈశ్వరప్ప
జహీరాబాద్ నేటి ధాత్రి:
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతా కి సంగమేశ్వర స్వామి దేవాలయములో ఈరోజు ధర్మకర్తలుగా ప్రమాణస్వీకారం కే మల్లయ్య స్వామి ఈశ్వరప్ప లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, ఆలయ ఈవో శివ రుద్రప్ప స్వామి గ్రామ పెద్దలు భక్తులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణ లో ఒక ముస్లిం కూడా లేరు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండోసారి ముస్లింలను చేర్చుకోకపోవడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాషాయ ముఖం బయటపడిందని సూచిస్తుంది.ఈ సందర్భంగా, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు షేక్ సోహెల్ ఝరాసంగం మండల తుమ్మలపల్లి గ్రామ యువ నాయకుడు విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముస్లింలు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపడం ఇదే మొదటిసారి అని అన్నారు. గతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరుగుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మరియు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి సామాజిక న్యాయం జరగడం లేదని ఖాళీ వాగ్దానాలు చేస్తున్నారని వారు అన్నారు.ముస్లింలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇదేనా సామాజిక న్యాయం? వారు కొన్ని రోజుల క్రితం బిజెపిలో చేరుతారు. ఈరోజు వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరియు వారు విజయం సాధించేవారు. ఈరోజు వారిని రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చారు మరియు మంత్రిని చేశారు – దేశమంతా ఇదేనా: దేశమంతా పెద్ద కాంగ్రెస్ పార్టీయేనా! లౌకికవాదం వారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణలో ప్రజల విశ్వాసం కోల్పోతున్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది మరియు అందరికీ న్యాయం చేసింది.
సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎంపిక
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలం, రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో ఎంపికై, తన వినూత్న బోధనా పద్ధతులతో అందరి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో,సఫియా సుల్తానా తన పాఠశాలలో అమలు చేసిన సృజనాత్మక బోధనా పద్ధతులు, భవిష్యత్తులో చేపట్టబోయే నూతన కార్యక్రమాలు, మరియు వీటి ద్వారా పాఠశాలలో సాధించిన గణనీయమైన ప్రగతిని అత్యంత ఆకర్షణీయమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ జి. రమేష్, ఆర్.జె.డి. విజయలక్ష్మి, మల్టీ జోన్-2కు చెందిన 350 మందికి పైగా మండల విద్యాధికారులు హాజరయ్యారు. శ్రీమతి సఫియా సుల్తానా గారి అద్భుతమైన ప్రదర్శనను తిలకించిన ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ రమేష్ మరియు ఆర్.జె.డి. విజయలక్ష్మి గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే, ఎస్.సి.ఈ.ఆర్.టి.సురేష్ బాబు, శ్రీ సురేందర్, మరియు న్యాల్కల్ మండల విద్యాధికారి శ్రీ మారుతి రాథోడ్ కూడా ఆమె కృషిని అభినందించారు.
ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుర్తించండి..
◆ తెలంగాణ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ…..
◆ ఆరోపించిన ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని……
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని మాట్లాడుతూ అయ్యో, కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు … ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు, అందులో ముగ్గురు కొత్త మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక ముస్లింను చేర్చుకుంటారని తెలంగాణ ముస్లింలు ఆశించారు. మంత్రివర్గంలో ఒక్క ముస్లింను కూడా చేర్చకపోవడం విచారకరం. తెలంగాణలో ముస్లింల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముస్లింల ఓట్లు అందుకు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు. ముస్లింలు అసూయపడే మంత్రి లేరు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ. అవును,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు,కానీ బిజెపి మరియు మోడీ ప్రభుత్వాల మాదిరిగానే సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పాలిస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డికి అందరూ మంచి గుణపాఠం నేర్పించాలని కోరారు. ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు వచ్చే గ్రామ పంచాయతీ జడ్పిటిసి ఎంపిటిసి ఎలక్షన్లలో ముస్లింలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గుణపాఠం నేర్పించాలని కోరారు.
డాక్టర్ హారిక ఆధ్వర్యంలో హాస్టల్స్ లో దోమల మందు స్ప్రే నిర్వహణ
నేటి ధాత్రి చర్ల:
కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ హారిక ఆధ్వర్యంలో చర్ల మండల కేంద్రంలోని హాస్టల్స్ లో పర్యటించి హాస్టల్ పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని పిల్లలకు నాణ్యమైన మంచి పోషకాహారాన్ని అందించాలని వార్డెన్ కు సూచించారు వర్షాకాలం దోమలు అధికముగా వచ్చే ప్రమాదం ఉన్నది దోమలు మనలను కుట్ట కుండ జాగర్తలు తీసుకోవాలని విద్యార్థులకు జ్వరం వచ్చినట్లయితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకురావాలని అక్కడ మంచి వైద్యం అందుతుందని తెలియజేశారు
హాస్టల్ చుట్టూ ప్రక్కలా నీరు నిలవకుండా చూసుకోవాలని పరిసర ప్రాంతాల్లో పంచాయతీ కార్మికులతో బ్లీచింగ్ చల్లిస్తూ ఉండాలని పిచ్చి మొక్కలు చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలని తెలియజేశారు
Mosquito
ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ ధర్మారావు హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్ మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ రామకృష్ణ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ తులసి హెల్త్ అసిస్టెంట్ ధర్మారావు నరసింహారావు స్వరూప ఆశా కార్యకర్తలు రంగమ్మ కృష్ణవేణి ఉషారాణి పాల్గొన్నారు
ఉద్యోగులను మభ్యపెట్టడం సరికాదుమ్యానిఫెస్టో లోని హామీలను అమలు చేయాలి టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి
నేటిధాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలో రాంబాబు అధ్యక్షతన టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ సమావేశంలో చావా రవి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఐదు వాయిదాలకు గాను ఒక్క డిఎ ప్రకటించి రెండువాయిదాలు విడుదల చేసినట్లు ప్రకటించటం ఉద్యోగులను మభ్యపెట్టడమేనని ఆరు నెలల తర్వాత ఇస్తామని ఇప్పుడే వెల్లడించటం విడ్డూరంగా ఉందని.
ఆరు నెలలు గడిచేటప్పటికి మరో రెండు వాయిదాలు బకాయి పడుతుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి బకాయి పడిన మూడు వాయిదాల డిఎ ను పదిహేను రోజుల్లో విడుదల చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా హామీని నిలుపుకోలేక పోయిందని విమర్శించారు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని యాజమాన్యాల ఉద్యోగులకు వర్తింపజేయాలని పీఆర్సీ ఇప్పటికే 23 నెలలు ఆలస్యమైనందున వెంటనే నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యా శాఖలో పర్యవేక్షణ అధికారులు డిఈఒ డిప్యూటీ ఇఒ ఎంఈఒ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరారు వేసవి సెలవులు ముగిసేలోగా ఖాళీగా ఉన్న 700 హైస్కూలు ప్రధానోపాధ్యాయుల పోస్టులకు ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలని రవి డిమాండ్ చేశారు.
రాష్ట్ర కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ బడిబాట ముగిసేవరకు ఉపాధ్యాయుల సర్దుబాటును వాయిదా వేయాలని మెమో 1267 ను సవరించాలని డిమాండ్ చేశారు .
టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి మురళీ మోహన్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని తరగతికొక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు.
టిఎస్ టిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు నంది కృష్ణ జిల్లా కార్యదర్శి సోడె విజయ్ కుమార్ గిరిజన సంక్షేమ విభాగం కన్వీనర్ తేజావత్ బాలు మండల ప్రధాన కార్యదర్శి ఉయిక బాలకృష్ణ శ్యామల సావిత్రి ఎమ్ యాడమరాజు హిమగిరిబాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలోని మహ్మదాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004 – 2005 లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారివారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.ఆనాటి గురువులైన గుండా శ్రీనివాస్, ఉమాశంకర్, సాయిలు ఆహ్వానించి ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పెంచాల సతీష్,నన్న నరేష్, పొన్నం అశోక్, ఇనుముల కిషోర్, రేగుల శివ, ఎలకంటి మహేష్, మోటం మహేందర్, పలకల మధుసూదన్ రెడ్డి,వంగ ప్రకాష్, గాజు నాగరాజ్, ఎద్దు రంజిత్, మురారి మహేందర్, రావులకోల రాణి, రంపిస సంగీత, మర్రి స్రవంతి, ఎలకంటి స్వప్న,బరిగల కోమల, చల్ల శ్రీలత, చొప్పరి శ్రీలత, అంబీర్ లతా, పుష్పనీల, యమునా, రాధా, మంజుల తోపాటు స్కూల్ చైర్మన్ చింత సాంబయ్య పాల్గొన్నారు.
గ్రామాల్లోకి అధికారులు • భూభారతిని సద్వినియోగం చేసుకోండి
• తహశీల్దార్ శ్రీనివాస్
నిజాంపేట: నేటి ధాత్రి :
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి పథకంలో భాగంగా గ్రామాల్లోకి అధికారులు వచ్చి భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని నిజాంపేట తాహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని కల్వకుంట గ్రామం లో సోమవారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 3 నుండి 12 వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని గ్రామాల్లోకి అధికారులు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రమ్యశ్రీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి, ఇమద్, సీనియర్ అసిస్టెంట్ రమేష్, సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.
సంక్షేమ పథకాలు అందించడంలో పేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదు ఇందిరమ్మ ఇండ్లు,రాజీవ్ యువ వికాసం పథకంలో కాంగ్రెస్ పార్టీ జోక్యం తగదు చిగురుమామిడి ఎంపీడీవో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించడం సిగ్గుచేటు
సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్.
ఎంపీడీవో కార్యాలయం ముట్టడికి సీపీఐ నాయకుల యత్నం అరెస్టు చేసిన పోలీసులు.
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక, రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీడీవో వైఖరిపై జిల్లా స్థాయి అధికారులు సమగ్రమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ముట్టడి కి యత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారని సిపిఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈముట్టడికి సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదలకు అందించే క్రమంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం చేస్తే సహించేది లేదని,ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగాప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారుల ఎంపికలో జిల్లా వ్యాప్తంగా అనేక అవతకవలు చోటు చేసుకున్నాయని శ్రీనివాస్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పూర్తిగా అధికార పార్టీ కాంగ్రెస్ కనుసన్నల్లోనే లబ్దిదారుల ఎంపిక జరగడంతో అర్హులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, అర్హులైన వారిని ఎంపిక చేయాల్సిన చిగురుమామిడి ఎంపిడీవో తన చాంబర్ లో అర్దరాత్రి వరకు కాంగ్రెస్ నాయకులను కూర్చోబెట్టుకుని లబ్దిదారులను ఎంపిక చేయడం వివాదాస్పదమైందని, ఎంపిడీవో స్థాయి అధికారి ఓకాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరించడం సిగ్గుచేటని, లబ్దిదారుల ఎంపికలో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసినా అధికారులు కూడా వారి విధులు సక్రమంగా నిర్వహించలేదని, ప్రత్యేక అధికారి ఉన్నప్పటికీ లబ్దిదారుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ నాయకుల మితిమీరిన జోక్యంతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు అంతటా నెలకొన్నాయని శ్రీనివాస్ ఆరోపించారు. లబ్ధిదారుల ఎంపికలో చిగురుమామిడి ఎంపిడివోపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటూనే అర్హులైన లబ్దిదారులను గుర్తించి న్యాయం చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో డబుల్ బెడ్ రూం పథకం పేరిట ఊరించినప్పటికీ ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. జిల్లాలో కొన్ని చోట్ల డబుల్ బెడ్ రూంలు ఇండ్లు నిర్మించినా పేదలకు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. పదేళ్ల పాటు పేదల సొంతింటి కల నెరవేలేక పోయిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతింటి కళ నెరవేరుతుందనుకుంటే అర్హులకు అందకపోవడం బాధాకరమని, ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో స్నేహపూర్వకంగా కొనసాగుతున్నప్పటికీ పేద ప్రజలకు అన్యాయం జరిగితే సిపిఐ చూస్తూ ఊరుకోదని,పేదల పక్షాన అండగా నిలిచి సర్కారు మెడలు వంచేలా మిలిటెంట్ పోరాటాలకు సీపీఐ సిద్దమవుతుందని శ్రీనివాస్ తెలిపారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, బోయిని అశోక్,గూడెం లక్ష్మి,మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి,అందె చిన్న స్వామి, మావురపు రాజు, తేరాల సత్యనారాయణ,బామండ్ల పెల్లి యుగేందర్,సీపీఐ మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ,పైడిపల్లి వెంకటేష్, మాజీ సర్పంచులు గోలి బాపురెడ్డి కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి, గ్రామ శాఖ కార్యదర్శిలు ఎలగందుల రాజు,కయ్యం తిరుపతి,మంద ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
గణపురం మండల కేంద్రంలో ఇటీవల కాలంలో పసునూటి వెంకటేష్ గుండెపోటుతో అకాల మరణంచెందడం తన స్నేహితులు వెంకటేష్ మరణాన్ని ప్రతి క్షణం వెంకటేష్ ఉన్నాడని భావించి వెంకటేష్ తమ వెంటే ఉన్నాడని తెలియజేయడంలో ముందడుగులో ఉన్నారు దానికి వెంకటేష్ దశ దినకర్మ నిర్వహించడం వారి యొక్క వెంకటేష్ పట్ల ఉన్న ప్రేమ స్నేహానికి ఇచ్చే గౌరవం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే పసునూటి వెంకటేష్ భౌతికంగా తమతో లేకున్నా ప్రతి విషయంలో మాకు తోడునీడగా ఉంటాడని భావించి వారు వెంకటేశు దశదినకర్మను నిర్వహించిన ఆటపాటలు, దశదిన కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమా లు వారి స్నేహాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం ఇలాంటి స్నేహితులను దక్కించుకోవడంవెంకటేష్ ఏ లోకంలో ఉన్న ఆత్మకు శాంతి కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఈరోజు నిర్వహించిన దశదిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వెంకటేష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా నిజాంపేట రైతు వేదికలో సోమవారం 4 విడత సామాజిక తనిఖీ సమావేశం ఏపీడీ రంగాచారి, డీవీఓ శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పనులకు కూలీలకు వచ్చిన వేతనాలు, గ్రామాల్లో జరిగిన పనుల గూర్చి సామాజిక తనిఖీ బృందం వివరాలను సేకరించడం జరిగిందన్నారు. వాటిపై మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజీరెడ్డి , ఏపీఓ శ్రీనివాస్, వివిధ గ్రామాల కార్యదర్శిలు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు.
పని కోసం వెళితే… ప్రాణాన్ని సైతం వదులుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం కొండాపూర్ గ్రామానికి చెందిన జెల్ల రమేష్ -లక్ష్మి కుమారుడు వేసవికాలం సెలవులు ఉండడంతో తమకున్న నాలుగు మేకలు మేపేందుకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నాడు ఈ నేపథ్యంలో కోలా కొమరమ్మ అనే మహిళ ఒక మేకను కోయటానికి జెల్ల శ్రీకాంత్ (14) పత్రి అశోక్ లను పిలవగా మేకను కోసిన తర్వాత శ్రీకాంత్ అతని చేతులకు అంటిన రక్తాన్ని నీళ్ల తొట్టిలోని నీటితో శుభ్రపరుస్తుండగా తొట్టిలోని నీటితో చేతులను ఎందుకు కడుగుతున్నావని ఆగ్రహించిన కొమురమ్మ కులం పేరుతో దూషిస్తూ విచక్షణ రహితంగా కర్రతో కొట్టడంతో బాధ భరించలేక మనస్థాపం చెంది సమీపాన ఉన్న గుర్తుతెలియని క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలో ఉండడంతో ఇది గమనించిన స్థానికులు నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు బాలుడు మృతి చెందడంతో గ్రామంలోని విషాద ఛాయల అలుముకున్నాయి. మృతి చెందిన బాలుడి చిరుప్రాయంలోనే తండ్రి మృతి చెందాడు. మృతునికి తల్లి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. మృతుడి తల్లి జెల్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు కోల కొమరమ్మపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై గోవర్ధన్ పేర్కొన్నారు.
గణపురం మండల కేంద్రంలో రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ సత్యనారాయణ స్వామి పేర్కొన్నారు సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గోన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సాగు చేసుకునే ప్రతి రైతుకు హక్కులు కల్పించి పట్టాలిస్తామన్నారు. రైతులు ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పట్టాలు జారీ చేస్తామని తెలిపారు. ప్రజలు రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఐ దేవేందర్ సర్వేయర్ నిరంజన్. సిబ్బంది గుడాల తిరుపతి. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ గిరిజనులను అవమానపరుస్తుందని బాలానగర్ మండల బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్ సోమవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి గిరిజనుల ఆస్తులను కొల్లగొట్టి, ప్రశ్నించే బంజారా బిడ్డలను, బంజారా రైతులను, బంజారా ఉద్యోగులను జైల్లో పెడుతున్నారన్నారు. లంబాడ సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం లంబాడ సామాజిక వర్గంకు అవమానం చేసినట్టే అని అన్నారు. ఈ విషయంపై గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో గిరిజనులను తృతీయ శ్రేణి నాయకులుగా పరిగణిస్తున్నారని విమర్శించారు.
సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు భద్రాద్రి జిల్లా అవసరాలకు వినియోగించాలి
చర్ల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా మెమోరాండం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
నేటి ధాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలో భద్రాద్రి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు సీతారామ ప్రాజెక్ట్ జలాల కోసం జిల్లా ప్రజల సాగునీటి కోసం చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్నటువంటి తాసిల్దార్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం నిర్వహించి మెమొరండం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును నిర్మించగా ఖమ్మం జిల్లాకు నీళ్లను చక్కగా తరలించబోతున్నారని ఖమ్మం జిల్లాకు సాగునీరు ఇవ్వడం సరైనదే కానీ భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రైతాంగానికి సాగునీటి ఇవ్వకపోవడం మాత్రం దుర్మార్గం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని భద్రాద్రి జిల్లాకు సాగునీరు అందించవలసిందిగా రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిన అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డుల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు కాకపోగా సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నది ఇకనైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఆరు గ్యారెంటీలలోని 420 హామీలు తక్షణమే అమలు చేయవలసిందిగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము 6 గ్యారంటీలు అమలు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ సామాన్య ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని అన్నారు
ఈ కార్యక్రమంలో చర్ల మాజీ మండల అధ్యక్షులు సోయాం రాజారావు మాజీ ఎంపీపీ గీద కోదండ రామయ్య మండల సీనియర్ నాయకులు సయ్యాద్ అజీజ్ ఎడ్ల రామదాసు డివిజన్ యువజన నాయకులు కాకి అనిల్ బీసీ సెల్ అధ్యక్షులు గోరంట్ల వేంకటేశ్వరరావు ఎస్టీ సెల్ కార్యదర్శి కారం కన్నారావ్ ఎస్సి సెల్ అధ్యక్షులు కొంబత్తిని రాము యూత్ మండల అధ్యక్ష కార్యదర్శులు అంబోజి సతీష్ కుప్పల నిరంజన్ మహిళా విభాగం ఉపాద్యక్షురాలు కుప్పల సౌజన్య యూత్ నాయకులు కట్టాం కన్నారావు తడికల బుల్లెబ్బయ్ మెడబత్తిని గోవర్ధన్ తోటపల్లి సాయి కోటి శ్రీకాంత్ బట్ట కొమరయ్య మునిగేలా సాంబ తడికల చంద్రశేఖర్ గట్టుపల్లి రాజు కారం రామారావు గట్టుపల్లీ రామయ్య మైపా వెంకటేశ్వర్లు తదితర యువజన నాయకులు పాల్గొన్నారు
బాల్ బ్యాడ్మింటన్ జూన్ 15 నుండి ప్రతి ఆదివారం కోచింగ్
జిల్లా స్పోర్ట్స్ చిర్రా రఘు
గణపురం నేటి ధాత్రి :
గణపురం మండలంలో మే ఒకటో తారీకు నుండి మొదలుకొని జూన్ ఆరో తారీకు వరకు సమ్మర్ క్యాంప్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. తదుపరి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ చిర్రా రఘు అనుమతితో తేదీ 15 .6 .1925 నుండి ప్రతి ఆదివారం గణపురం ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో బాల్ బ్యాట్మెంటన్ కోచింగ్ ఇవ్వబడును కోచింగ్ మాస్టర్ మామిడి శెట్టి రవీందర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ తెలియజేయడం జరిగింది
రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి, ప్రజావాణి విజయవంతం: శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
సోమవారం శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఐఏఎస్ శ్రీ హేమంత్ భోర్ఖడేతో నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. నేను కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను” అని జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్య పనులకు సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని, అధికారులు డివిజన్లలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని, ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీచర్ ఉద్యోగం సాధించిన మహిళ కానిస్టేబుల్ కు సన్మానం..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో మహిళ కానిస్టేబుల్ గా పనిచేసి విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించిన సూత్రపు లావణ్యను సన్మానించారు.పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో పోలీసు నుండి టీచర్ గా ఎంపికైన లావణ్యను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దీకొండ రమేష్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం లో పని చేస్తూ టీచర్ గా ఉద్యోగం సాధించడం ఎంతో గొప్పతనమని మహిళా పోలీస్ కానిస్టేబుల్ గా స్థానిక స్టేషన్లో విధులు నిర్వహించిన లావణ్య ఎంతో నమ్మకంతో పేరు ప్రతిష్టలు సంపాదిస్తూ అందరి మన్ననలు పొందడం అభినందియమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందితోపాటు లావణ్య మిత్ర బృందం పాల్గొన్నారు.
ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రెవెన్యూ శాఖకు 51, హౌసింగ్ 32, ఏడీ ఎస్ఎల్ ఏ, డీఈఓ కు 7 చొప్పున, డిఆర్డీఓకు 6, జిల్లా సంక్షేమ అధికారి 5, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఎస్సీ కార్పొరేషన్, ఉపాధి కల్పన శాఖకు మూడు చొప్పున, సిరిసిల్ల మున్సిపల్, ఎంపీడీఓ బోయినపల్లి కి రెండు చొప్పున ఎస్పీ, ఎస్డీసీ, నీటి పారుదల శాఖ, సెస్, ఎక్సైజ్ శాఖ, మిషన్ భగీరథ, ఎల్డీఎం, ఏడీ హ్యాండ్ లూమ్స్, సీపీఓ కి ఒకటి చొప్పున దరఖాస్తులు మొత్తం 134 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Collector Sandeep Kumar.
అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ లో రోడ్లు, విధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు ముఖ్యంగా రోడ్లను ఆక్రమించడం వల్ల అంబులెన్స్ మరియు వాహనాలు పోయే పరిస్థితి అక్కడే లేవు మరియు అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారాని బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ కంటెస్టడ్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ చందనగర్ జీహెచ్ఎంసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి వినతి పత్రం అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ హఫీజ్ పేట్ డివిజన్ మొత్తం సమస్యలమైయం అయ్యింది అన్ని అన్నారు.ఈ యొక్క సమస్యలను అధికారులుగాని,నాయకులు గాని పట్టించుకోవడం లేదని అన్నారు.ఇకనైనా నాయకులు,అధికారులు మేలుకొని ప్రజల సమస్యలను పరిష్కరించే విదంగా పనిచైయండి అన్ని అన్నారు.లేని పక్షంలో ప్రజా పోరాటం తప్పదు అన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పవన్,నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.