ఉద్యోగులను మభ్యపెట్టడం సరికాదుమ్యానిఫెస్టో లోని హామీలను అమలు చేయాలి
టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి
నేటిధాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలో రాంబాబు అధ్యక్షతన టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ సమావేశంలో చావా రవి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ
ఐదు వాయిదాలకు గాను ఒక్క డిఎ ప్రకటించి రెండువాయిదాలు విడుదల చేసినట్లు ప్రకటించటం ఉద్యోగులను మభ్యపెట్టడమేనని ఆరు నెలల తర్వాత ఇస్తామని ఇప్పుడే వెల్లడించటం విడ్డూరంగా ఉందని.
ఆరు నెలలు గడిచేటప్పటికి మరో రెండు వాయిదాలు బకాయి పడుతుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి బకాయి పడిన మూడు వాయిదాల డిఎ ను పదిహేను రోజుల్లో విడుదల చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా హామీని నిలుపుకోలేక పోయిందని విమర్శించారు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని యాజమాన్యాల ఉద్యోగులకు వర్తింపజేయాలని పీఆర్సీ ఇప్పటికే 23 నెలలు ఆలస్యమైనందున వెంటనే నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యా శాఖలో పర్యవేక్షణ అధికారులు డిఈఒ డిప్యూటీ ఇఒ ఎంఈఒ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరారు వేసవి సెలవులు ముగిసేలోగా ఖాళీగా ఉన్న 700 హైస్కూలు ప్రధానోపాధ్యాయుల పోస్టులకు ఇంకా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలని రవి డిమాండ్ చేశారు.
రాష్ట్ర కార్యదర్శి బి రాజు మాట్లాడుతూ బడిబాట ముగిసేవరకు ఉపాధ్యాయుల సర్దుబాటును వాయిదా వేయాలని మెమో 1267 ను సవరించాలని డిమాండ్ చేశారు .
టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి మురళీ మోహన్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని తరగతికొక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు.
టిఎస్ టిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు నంది కృష్ణ జిల్లా కార్యదర్శి సోడె విజయ్ కుమార్ గిరిజన సంక్షేమ విభాగం కన్వీనర్ తేజావత్ బాలు మండల ప్రధాన కార్యదర్శి ఉయిక బాలకృష్ణ శ్యామల సావిత్రి ఎమ్ యాడమరాజు హిమగిరిబాబు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.